నిరీక్షణ | Hope Telugu Songs

318 hope songs available. Lyrics in Roman and Telugu script.

యేసయ్యా నా యేసయ్యా|Yesayyaa Naa Yesayyaa

యేసయ్యా నా యేసయ్యా ఎపుడయ్యా నీ రాకడ / రమ్ము రమ్ము యేసునాథ వేగమె రారమ్ము / ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ / చూచుటకెన్నో వింతలున్నవి ఈ భువిలోన / చూడగా ఎందరో ఘనులున్నారు ఈ ధరలోన / ఏమి చూచిన ఎవరిని చూచిన ఫలమేమి / నా కన్నులారా నిన్ను చూడాలి యేసయ్యా ||రమ్ము|| / నా రూపమే మారునంట నిన్ను చూచువేళ / నిన్ను పోలి ఉండెదనంట నీవు వచ్చు వేళ / అనంతమైన నీ రాజ్యమే నా స్వదేశమయ్యా / అందుండు సర్వ సంపదలన్నీ నా స్వంతమయ్యా ||రమ్ము|| / అమూల్యమైన రత్నములతో అలంకరించబడి / గొర్రెపిల్ల దీపకాంతితో ప్రకాశించుచున్న / అంధకారమే లేని ఆ దివ్యనగరమందు / అవధులు లేని ఆనందముతో నీతో నుండెదను ||రమ్ము||

రాకడనే రైలు బండి|Raakadane Railu Bandi

రాకడనే రైలు బండి వస్తున్నది / రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది (2) / పరిశుద్ధులకందులో చోటున్నది (2) / మంచి చోటున్నది – భలే చోటున్నది / చక్కని సీటున్నది ||రాకడనే|| / సత్యమనే చక్రములు దానికున్నవి / శాంతి అనెడి పైకప్పు దానికున్నది (2) / పాపములను క్షమియించే బ్రేకులున్నవి – బండికి బ్రేకులున్నవి / జీవమునకు మార్గమని కూయుచున్నది – కూత కూయుచున్నది ||రాకడనే|| / ప్రతి దినము బైబిలును పఠియించుము / ప్రార్దననెడి విజ్ఞాపన వివరించుము – ప్రభుకి వివరించుము / ఎదురు వీచే గాలులనెడి వ్యాధి బాధలన్ / సాతాను చిక్కులను యేసు రక్తమందు కడిగి / జయము పొందుము – పవిత్రుడవు కమ్ము ||రాకడనే|| / తండ్రి కుమారాత్మలనే రైలు బండిది / ఇంజను డ్రైవరు పేరు యెహోవాండి (2) / పరిశుద్ధ ఆత్మ అనెడి గార్డు ఉన్నాడు – బండికి గార్డు ఉన్నాడు / సిలువ జెండా ఎత్తి చూపి బండి నిలుపుము – నీవు ప్రవేశించుము ||రాకడనే|| / రక్షణనే టిక్కెట్టు దానికున్నది (2) / మారు మారుమనస్సు పొంది మీరు / ముందుకు రండి – టిక్కెట్టు కొనండి (2) ||రాకడనే|| / పాపులున్న స్టేషనులో బండి ఆగదు (2) / పరిశుద్ధుల స్టేషనులో / బండి ఆగును – రైలు బండి ఆగును (2) ||రాకడనే||

హల్లెలూయ పాట|Hallelooyaa Paata

హల్లెలూయ పాట – యేసయ్య పాట / పాడాలి ప్రతి చోట – పాడాలి ప్రతి నోట / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (4) ||హల్లెలూయ|| / కష్టాలుయే కలిగినా – కన్నీరుయే మిగిలినా (2) / స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| / చెరసాలలో వేసినా- సంకెళ్లు బిగియించినా (2) / స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| / నీ తల్లి నిను మరిచినా – మరువడు నీ దేవుడు (2) / స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| / శోధనలు నిను చుట్టినా – సంతోషమే తట్టినా (2) / స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| / సింహాల కెరవేసినా – అగ్నిలో పడవేసినా (2) / ధీరుడవై సాగుమా – ప్రభు సిల్వనే చాటుమా (2) ||హల్లెలూయ||

యేసు రాజుగా వచ్చుచున్నాడు|Yesu Raajugaa Vachchuchunnaadu

యేసు రాజుగా వచ్చుచున్నాడు / భూలోకమంతా తెలుసుకొంటారు (2) / రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2) / రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు|| / మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు / పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2) / లోకమంతా శ్రమకాలం (2) / విడువబడుట బహుఘోరం ||యేసు|| / ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది / ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2) / ఈ సువార్త మూయబడున్‌ (2) / వాక్యమే కరువగును ||యేసు|| / వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును / ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2) / నీతి శాంతి వర్ధిల్లును (2) / న్యాయమే కనబడును ||యేసు|| / ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర / సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2) / వంగని మోకాళ్ళన్నీ (2) / యేసయ్య యెదుట వంగిపోవును ||యేసు|| / క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ / కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2) / రెప్ప పాటున మారాలి (2) / యేసయ్య చెంతకు చేరాలి ||యేసు||

Hope Telugu Songs — Page 17 | UEC Telugu Church