కృప | Grace Telugu Songs

233 grace songs available. Lyrics in Roman and Telugu script.

దివినేలు స్తోత్రార్హుడా|Divinelu Sthothraarhudaa

దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా / దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా / మొదటివాడవు – కడపటివాడవు / యుగయుగములలో ఉన్నవాడవు (2) / మానక నా యెడల కృప చూపుచున్నావు / మారదు నీ ప్రేమ తరతరములకు (2) / మాట తప్పని మహనీయుడవు – మార్పులేని వాడవు / నీవు చెప్పిన మంచి మాటలు – నెరవేర్చువాడవు / నీ మాటలు జీవపు ఊటలు / నీ కృపలే బలమైన కోటలు (2) ||దివినేలు|| / దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు / దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు (2) / దాటి వెళ్లని కరుణామూర్తివై – మనవి ఆలకించావు / దీర్ఘ శాంతముగలవాడవై – దీవించువాడవు / నీ దీవెన పరిమళ సువాసన / నీ ఘనతే స్థిరమైన సంపద (2) ||దివినేలు|| / సీయోను శిఖరముపై నను నిలుపుటకే / జ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే (2) / దివ్యమైన ప్రత్యక్షతతో – నన్ను నింపియున్నావు / సుందరమైన నీ పోలికగా – రూపు దిద్దుచున్నావు / నీ రాజ్యము పరిశుద్ధ నగరము / ఆ రాజ్యమే నిత్య సంతోషము (2) ||దివినేలు||

నీవే నా సంతోషగానము|Neeve Naa Santhosha Gaanamu

నీవే నా సంతోషగానము / రక్షణశృంగము మహాశైలము (2) / బలశూరుడా యేసయ్యా నా తోడై / ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా|| / ఓ లార్డ్! యు బి ద సేవియర్ / షో మి సం మెర్సీ / బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్ / సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్ / ఐ విల్ సరెండర్ / యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్ / త్యాగము ఎరుగని స్నేహమందు / క్షేమము కరువై యుండగా / నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి / నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2) / నిరంతరం నిలుచును నాపై నీ కనికరం / శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవే నా|| / వేదన కలిగిన దేశమందు / వేకువ వెలుగై నిలిచినావు / విడువక తోడై అభివృద్ధిపరచి / ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2) / మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం / అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవే నా|| / నిర్జీవమైన ఈ లోయయందు / జీవాధిపతివై వెలసినావు / హీనశరీరం మహిమ శరీరముగ / నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2) / హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు / హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2) ||నీవే నా||

అవధులే లేనిది|Avadhule Lenidi

అవధులే లేనిది దివ్యమైన నీ కృప / అనంతమైనది ఆశ్చర్యమైనది (2) / యేసయ్యా నాపై నీవు చూపిన కృప / అమూల్యమైనది వర్ణించలేనిది (2) ||అవధులే|| / ఊహించలేని హృదయానందమును / దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు (2) / భారమెక్కువైనా తీరం కడుదూరమైనా / నీపై ఆనుకొందును / నేను గమ్యం చేరుకొందును (2) ||అవధులే|| / సరిపోల్చలేని మధురమైన అనుభవం / వింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు (2) / సౌందర్యమైన అతిపరిశుద్ధమైన / నీ రూపము తలచుకొందును / నేను నీ కోసమే వేచియుందును (2) ||అవధులే|| / లెక్కించలేని అగ్ని శోధనలో / ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు (2) / వాడబారని కిరీటము నే పొందుటకు / వెనుకున్నవి మరచి / నేను లక్ష్యము వైపు సాగెద (2) ||అవధులే||

సంగీత నాదముతో|Sangeetha Naadamutho

సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో / నీ ప్రేమ గీతం పాడెద / నీ గోప్ప కార్యం చాటెద / నా జీవితం మార్చిన యేసయ్యా / ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా ||సంగీత|| / నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి / కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2) / పాపములు క్షమియించి నను మార్చిన / దోషములు భరియించి దరిచేర్చిన ||నీ ప్రేమ|| / నా కష్ట సమయమున నా చెంతనే నిలచి / విడువక నడిపించిన విధమును వివరించెద (2) / క్షేమమును కలిగించి నను లేపిన / దీవెనలు కురిపించి కృపచూపిన ||నీ ప్రేమ|| / నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి / కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద (2) / వాక్యముతో దర్శించి బలపరిచిన / సత్యముతో సంధించి స్థిరపరిచిన ||నీ ప్రేమ||

ఉల్లాస జీవితం|Ullaasa Jeevitham

ఉల్లాస జీవితం అది ఊహకు అందనిది / ఉత్సాహమైనది అది నీతో నడచుటయే / కనుపాపే నీవయ్యా – కన్నీళ్లను భరియించి / కష్టాలలో కదిలొచ్చావా – నా కోసం యేసయ్యా (2) / నీవు నా కోసం దిగి వచ్చావా – నన్నూ ప్రేమించి / నా శిక్షను భరియించావా – నన్నూ బ్రతికించి / కరుణే లేని కఠినుల మధ్య నన్నూ / కరుణించేవానిగా చేసావయ్యా యేసయ్యా / కాపరి లేని జీవిత పయణంలోనా / నా కాపరి నీవై కాపాడావా యేసయ్యా / నా కోసం బలి అయ్యావా – నీవు నన్నూ ప్రేమించి / నా మార్గం స్థిరపరిచావా – నా కోసం దిగి వచ్చి / నీవు నా కోసం దిగి వచ్చావా – నన్నూ ప్రేమించి / నా శిక్షను భరియించావా – నన్నూ బ్రతికించి / నలిగిన నా జీవిత పయణంలోనా / నీ నవ్వును పుట్టించావా యేసయ్యా / నూతనమైన జీవిత మార్గంలోనా / నా పాదం నీతో నడిపించావా యేసయ్యా / నా కోసం ఏర్పరిచావా – పరలోకపు నివాసము / నా కోసం తిరిగొస్తావా – నీ కోసం వేచుంటా / నీవు నా కోసం తిరిగొస్తావా – నన్నూ ప్రేమించి / నా జీవిత పయనం – నీతోనే యేసయ్యా (2)