315 faith songs available. Lyrics in Roman and Telugu script.
ప్రార్ధన ప్రార్ధన / ప్రభునితో సంభాషణ / ప్రార్ధనే ఊపిరి / ప్రార్ధనే కాపరి ||ప్రార్ధన|| / కన్నీటి ఉపవాస ప్రార్ధన / సాతాను శక్తులపై విజయము (2) / విరిగి నలిగిన విజ్ఞాపన – ప్రార్ధన / జయము నొసగును జీవితములు ||ప్రార్ధన|| / ఒలీవ కొండల ప్రార్ధన / స్వస్థత నొసగును వ్యాధి బాధలకు (2) / ప్రభువు నేర్పిన గెత్సేమనే ప్రార్ధన / ఆత్మల నొసగును సేవలో ||ప్రార్ధన|| / సిలువలో నేర్పిన ప్రార్ధన / ప్రేమను నేర్పును బ్రతుకున (2) / సాతాను చొరను చోటు లేనిది / పాపమును దరి రానీయనిది ||ప్రార్ధన||
దైవ కుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం (2) / శాంతి సంతోషాలకు అది నిలయం / ఆప్యాయత అనురాగాలకు ఇక ఆరంభం (2) / విశ్వాసపు వాకిళ్ళు పరిశుద్ధత లోగిళ్ళు (2) / ఆతిథ్యమిచ్చే వంటిల్లు వర్ధిల్లు నూరేళ్ళు (2) / దైవ కుటుంబపు సంతోషం / కని విని ఎరుగని ఆనందం (4) ||దైవ కుటుంబం|| / రక్షణ పొందిన కుటుంబం మోక్ష పురికి సోపానం / క్రమశిక్షణ కలిగిన కుటుంబం వీక్షించు దైవ సాన్నిధ్యం (2) / అపార్ధాలు అంతరాలు లేనట్టి అన్యోన్యత / షడ్రుచుల ఘుమఘుమలు గుభాలించు మా ఇంట (2) / అష్టైశ్వర్యాలకు తూలతూగే కుటుంబం (2) / తరతరాలు వర్ధిల్లే కుటుంబం (2) ||దైవ కుటుంబపు|| / మమతలు కలిగిన కుటుంబం సంతృప్తినిచ్చే కుటుంబం / ధాన్య ధన వస్తు వాహనాలు కావు మా యింటి కంభాలు (2) / భయభక్తులు దేవోక్తులు మా అన్న పానాలు / మా యొక్క నట్టింట్లో వసియించును దేవుడు (2) / పెనవేసుకున్న బంధాలే ఈ కుటుంబం (2) ||దైవ కుటుంబపు||
నిను చేరగ నా మది ధన్యమైనది / నిను తలచి నా హృదయం నీలో చేరినది (2) / నీవలె పోలి నే జీవింతును / నీ కొరకై నా ప్రాణం అర్పింతును (2) / నీతోనే నా ప్రాణం – నీతోనే నా సర్వం (2) / నది లోతులో మునిగిన ఈ జీవితమును / తీరం చేర్చావు – నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావు / ఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా – (2) ||నిను చేరగ||
కొడవలిని చేత పట్టి కోత కోయుము / తెల్లబారిన పొలములన్నియు (2) / నశియించు ఆత్మల భారము కలిగి / ఆగక సాగుమా ప్రభు సేవలో ||కొడవలిని|| / సర్వ సృష్టికి సువార్త ప్రకటన / ప్రభువు మనకిచ్చ్చిన భారమే కదా (2) / ఎన్నడూ దున్నని భూములను చూడు (2) / కన్న తండ్రి యేసుని కాడిని మోయు (2) ||కొడవలిని|| / పిలిచిన వాడు నమ్మదగినవాడు / విడువడు నిన్ను ఎడబాయడు (2) / అరచేతులతో నిన్ను చెక్కుకున్నవాడు (2) / అనుక్షణము నిన్ను కాయుచున్నవాడు (2) ||కొడవలిని||
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే / చావైతే నాకు లాభము / నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే|| / నీ కృప నాకు చాలును ఇలలో / నీవు లేని బ్రతుకే శూన్యము నాలో (2) / నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే|| / నీవే నా గొప్ప కాపరివి / విడువను నను ఎడబాయనంటివి (2) / నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే||
దేవుని ప్రేమ ఇదిగో – జనులార – భావంబునం దెలియరే / కేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును ||దేవుని|| / సర్వలోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెను / సర్వోపకారుడుండే – మన మీద – జాలిపరుడై యుండెను ||దేవుని|| / మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెను / మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే ||దేవుని|| / యేసు క్రీస్తను పేరున – రక్షకుడు – వెలసి నాడిలలోపల / దోసకారి జనులతో – నెంతో సు – భాషలను బల్కినాడు ||దేవుని|| / పాప భారంబు తోడ – నే ప్రొద్దు – ప్రయాసముల బొందెడి / పాపులందరు నమ్మిన – విశ్రాంతి – పరిపూర్ణమిత్తు ననెను ||దేవుని|| / సతులైన పురుషులైనన్ – యా కర్త – సర్వ జనుల యెడలను / సత్ప్రేమగా నడిచెను – పరలోక – సద్బోధలిక జేసెను ||దేవుని|| / చావు నొందిన కొందరిన్ – యేసుండు – చక్కగా బ్రతికించెను / సకల వ్యాధుల రోగులు – ప్రభు నంటి – స్వస్థంబు తా మొందిరి ||దేవుని|| / గాలి సంద్రపు పొంగులన్ – సద్దణిపి – నీళ్లపై నడచినాడే / మేలు గల యద్భుతములు – ఈలాగు – వేల కొలదిగ జేసెను ||దేవుని|| / చేతుల కాళ్లలోను – రా రాజు – చేర మేకులు బొందెను / పాతకులు గొట్టినారే – పరిశుద్ధ – నీతి తా మోర్వలేకన్ ||దేవుని|| / ఒడలు రక్తము గారగ – దెబ్బలు – చెడుగు లందరు గొట్టిరి / వడిముళ్లు తల మీదను – బెట్టిరి – ఓర్చెనో రక్షకుండు ||దేవుని|| / ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు – చున్న పాప నరులను / మన్నించు మని తండ్రిని – యేసుండు – సన్నుతితో వేడెను ||దేవుని|| / రక్షకుడు శ్రమ బొందగా – దేశంబు – తక్షణము చీకటయ్యెన్ / రక్షకుడు మృతి నొందగ – తెర చినిగి – రాతి కొండలు పగిలెను ||దేవుని|| / రాతి సమాధిలోను – రక్షకుని – నీతిగల దేహంబును / పాతి పెట్టిరి భక్తులు – నమ్మిన – నాతు లందరు జూడగా ||దేవుని|| / మూడవ దినమందున – యేసుండు – మృతి గెల్చి లేచినాడు / నాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున్ ||దేవుని|| / పదునొకండు మారులు – వారలకు – బ్రత్యక్షు డాయె నేసు / పరలోకమున కేగెను – తన వార్త – బ్రకటించు మని పల్కెను ||దేవుని|| / నమ్మి బాప్తిస్మమొందు – నరులకు – రక్షణ మరి కల్గును / నమ్మ నొల్లక పోయెడు – నరులకు – నరకంబు సిద్ధమనెను ||దేవుని||
కావలెనా యేసయ్య బహుమానము / (మరి) చేయాలి విలువైన ఉపవాసము (2) / సిద్ధమౌ శ్రీ యేసుని ప్రియా సంఘమా / చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా (2) ||కావలెనా|| / నీనెవె పట్టణము యెహోవా దృష్టికి / ఘోరమాయెను – పాపముతో నిండిపోయెను / సృష్టికర్త యెహోవా యోనాను దర్శించి / నీనెవెకు పంపెను – కనికరము చూపించెను / ఘనులేమి అల్పులేమి – నీనెవె పట్టణపు రాజేమి / పిల్లలేమి పెద్దలేమి – ఉపవాసము చేయగా / ఆగింది యెహోవా శాపము / కురిసింది కరుణ వర్షము (2) ||కావలెనా|| / దేవుని ప్రజలను నశియింప చేయుటకు / దుష్టుడు తలచెను – కలవరము పుట్టించెను / మొర్దెకై వేదనతో రాజునొద్దకు పంపుట / దైవ చిత్తమని – ఎస్తేరును సిద్ధపరచెను / ఘనులేమి అల్పులేమి – షూషను కోటలో రాణి ఏమి / పిల్లలేమి పెద్దలేమి – ఉపవాసము చేయగా / అణిగింది హామాను గర్వము / జరిగింది దేవుని చిత్తము (2) ||కావలెనా||
నీ నిర్ణయం ఎంతో విలువైనది ఈ లోకంలో / అది నిర్దేశించును జీవిత గమ్యమును / ఈనాడే యేసుని చెంతకు చేరు (2) ||నీ నిర్ణయం|| / లోకం దాని ఆశలు గతించిపోవును / మన్నైన నీ దేహం మరల మన్నై పోవును (2) / మారుమనస్సు పొందినచో పరలోకం పొందెదవు / క్షయమైన నీ దేహం అక్షయముగా మారును (2) ||నీ నిర్ణయం|| / పాపం దాని ఫలము నిత్య నరకాగ్నియే / శాపంతో నీవుండిన తప్పదు మరణము (2) / భరియించె నీ శిక్ష సిలువలో ఆ ప్రభు యేసే / ఈనాడే యోచించి ప్రభు యేసుని నమ్ముకో (2) ||నీ నిర్ణయం||
రావయ్యా యేసయ్యా నా ఇంటికి / నీ రాకకై నే వేచియుంటిని… / రావయ్యా యేసయ్యా నా ఇంటికి / నీ రాకకై నే వేచియుంటిని (2) / కన్నులార నిన్ను చూడాలని (2) / కాచుకొని ఉన్నాను వేచి నే ఉన్నాను (2) ||రావయ్యా|| / యదార్థ హృదయముతో నడచుకొందును / ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను (2) / భక్తిహీనుల క్రియలు నాకంటనీయను / మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును (2) ||రావయ్యా|| / దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను / నా పొరుగు వారిని దూషింపను (2) / అహంకారము గర్వము నంటనీయను / నమ్మకస్థునిగా నే నడచుకొందును (2) ||రావయ్యా|| / నిర్దోష మార్గముల నడచుకొందును / మోసము నా ఇంట నిలువనీయను (2) / అబద్ధికులెవ్వరిని ఆదరింపను / భక్తిహీనుల మార్గము నే త్రొక్కను (2) ||రావయ్యా||
ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప / ఏమున్నదయ్యా భువిలో నీవు లేక (2) / నా యేసయ్యా హల్లెలూయా / నా యేసయ్యా హల్లెలూయా (2) / నా ఆశ్రయం నీవే – నా ఆశయం నీవే (2) / నా సర్వము యేసు నీవేగా (2) ||ఎవరున్నారయ్యా|| / ఈ భువికి దీపం నీవే – నా హృదిలో వెలుగు నీవే (2) / అన్నింటిని వెలిగించే దీపం నీవే (2) ||ఎవరున్నారయ్యా||
పోదాము పోదాము పయనమోదాము / సువార్త చెప్ప పోదాము (2) / అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము / సువార్త చాటింప సాగిపోదాము (2) / ఆ జాతి ఈ జాతి ఏ జాతండి / పరిశుద్దతే మన సొంత జాతండి (2) / ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి / కానాను దేశమే మన ఊరండి (2) / ఆ రక్తం ఈ రక్తం ఏ రక్తమండి / క్రీస్తు రక్తమే పాపం బాపునండి (2)
స్థిరపరచువాడవు బలపరచువాడవు / పడిపోయిన చోటే నిలబట్టువాడవు / ఘనపరచువాడవు హెచ్చించువాడవు / మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు (2) / ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు / నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు (2) / యేసయ్య యేసయ్య నీకే నీకే సాధ్యము (2) / సర్వకృపానిధి మా పరమ కుమ్మరి / నీ చేతిలోనే మా జీవమున్నది (2) / మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి / మా ఊహకు మించిన కార్యములెన్నో / జరిగించుచున్నవి (2) ||ఏమైనా|| / నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా / నీ కంచే దాటగ శత్రువుకు సాధ్యమా (2) / మా దేవా నీవే మాతొడుంటే అంతే చాలును / అపవాది తలచిన కీడులన్నీ / మేలైపోవును (2) ||ఏమైనా||