315 faith songs available. Lyrics in Roman and Telugu script.
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు / నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2) ||సోలిపోవలదు|| / ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను / చుట్టుముట్టినా (2) / ప్రియుడు నిన్ను చేరదీసిన / ఆనందం కాదా (2) ||సోలిపోవలదు|| / శోధనలను జయించినచో / భాగ్యవంతుడవు (2) / జీవ కిరీటం మోయువేళ / ఎంతో సంతోషము (2) ||సోలిపోవలదు|| / వాక్కు ఇచ్చిన దేవుని నీవు / పాడి కొనియాడు (2) / తీర్చి దిద్దే ఆత్మ నిన్ను / చేరే ప్రార్ధించు (2) ||సోలిపోవలదు||
సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు / సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే (2) / సాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు ||సాక్ష్య|| / దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి (2) / మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో ||సాక్ష్య|| / పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు (2) / పిల్లలకును బెద్దలకును బ్రేమతో నా స్వానుభవము ||సాక్ష్య|| / బోధ చేయలేను వాద ములకు బోను నాక దేల (2) / నాధు డేసు ప్రభుని గూర్చి నాకు దెలసినంత వరకు ||సాక్ష్య|| / పాపులకును మిత్రుడంచు బ్రాణ మొసగి లేచెనంచు (2) / బాపముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించు డంచు ||సాక్ష్య|| / చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన (2) / ఘోరపాపు లైన క్రీస్తు కూర్మితో రక్షించు నంచు ||సాక్ష్య|| / పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల (2) / ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవు డంచు ||సాక్ష్య|| / ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక (2) / తల్లడిల్లు వారలకును తండ్రి కుమా రాత్మ పేర ||సాక్ష్య||
రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు / వాంఛతో తన కరము చాపి / రమ్మనుచున్నాడు (2) / ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని (2) / గ్రహించి నీవు యేసుని చూచిన / హద్దు లేని ఇంపు పొందెదవు (2) ||రమ్మను|| / కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ (2) / కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ / కనికరించి నిన్ను కాపాడును (2) ||రమ్మను|| / సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును (2) / ఆయన నీ వెలుగు రక్షణనై యుండును / ఆలసింపక త్వరపడి రమ్ము (2) ||రమ్మను|| / సకల వ్యాధులను స్వస్థత పరచుటకు (2) / శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో / అందరికి తన కృపలనిచ్చున్ (2) ||రమ్మను||
ప్రియ యేసు నిర్మించితివి / ప్రియమార నా హృదయం / ముదమార వసియించునా / హృదయాంతరంగమున / నీ రక్త ప్రభావమున / నా రోత హృదయంబును (2) / పవిత్రపరచుము తండ్రి / ప్రతి పాపమును కడిగి (2) ||ప్రియ యేసు|| / అజాగరూకుడనైతి / నిజాశ్రయమును విడచి (2) / కరుణారసముతో నాకై / కనిపెట్టితివి తండ్రి (2) ||ప్రియ యేసు|| / వికసించె విశ్వాసంబు / వాక్యంబును చదువగనే (2) / చేరితి నీదు దారి / కోరి నడిపించుము (2) ||ప్రియ యేసు|| / ప్రతి చోట నీ సాక్షిగా / ప్రభువా నేనుండునట్లు (2) / ఆత్మాభిషేకమునిమ్ము / ఆత్మీయ రూపుండా (2) ||ప్రియ యేసు||
నీవుంటే నాకు చాలు యేసయ్యా / నీవెంటే నేను ఉంటానేసయ్యా (2) / నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా / నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే|| / ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ / ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) ||నీ మాట|| / బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ / అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2) ||నీ మాట|| / ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా / ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట|| / నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము / నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2) ||నీ మాట||
నీ చేతితో నన్ను పట్టుకో / నీ ఆత్మతో నన్ను నడుపు / శిల్పి చేతిలో శిలను నేను / అనుక్షణము నన్ను చెక్కుము (2) / అంధకార లోయలోన / సంచరించినా భయములేదు / నీ వాక్యం శక్తిగలది / నా త్రోవకు నిత్యవెలుగు (2) / ఘోరపాపిని నేను తండ్రి / పాప ఊభిలో పడియుంటిని / లేవనెత్తుము శుద్దిచేయుము / పొందనిమ్ము నీదు ప్రేమను (2) / ఈ భువిలో రాజు నీవే / నా హృదిలో శాంతి నీవే / కుమ్మరించుము నీదు ఆత్మను / జీవితాంతము సేవ చేసెదన్ (2) ||నీ చేతితో||
నే సాగెద యేసునితో / నా జీవిత కాలమంతా (2) / యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2) / పరమును చేరగ నే వెళ్లెద (2) / హనోకు వలె సాగెదా ||నే సాగెద|| / వెనుక శత్రువులు వెంటాడిననూ (2) / ముందు సముద్రము ఎదురొచ్చినా (2) / మోషె వలె సాగెదా ||నే సాగెద|| / లోకపు శ్రమలు నన్నెదిరించినా (2) / కఠినులు రాళ్ళతో హింసించినా (2) / స్తెఫను వలె సాగెదా ||నే సాగెద|| / బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2) / క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2) / పౌలు వలె సాగెదా ||నే సాగెద|| / తల్లి మరచిన తండ్రి విడచిన (2) / బంధువులే నన్ను వెలివేసినా (2) / బలవంతుని వలె సాగెదా ||నే సాగెద||
మూడునాళ్ళ ముచ్చట కోసం / ఈ మనిషి పడే తపన చూడరా (2) / నీటిబుడగలాంటి జీవితం / ఏ నాడు సమసిపోవునో ఎరుగం (2) / మనిషికి తన మనసే చేరసాలరా / మమతలు మమకారాలే బంధాలురా (2) / వల్లకాటి వరకేరా భవబంధాలు / అవి కళ్లానికి చేరవురా అనుబంధాలు (2) / కల్లలైన కళలు మానుకో / ఎల్లవేళలా ప్రభువని వేడుకో (2) ||మూడునాళ్ళ|| / ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము / అది కనిపించీ మాయమయే రంగులవలయం (2) / గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం / అది పాపానికి జీతమురా మనిషికి మరణం (2) / నిత్యమైన సుఖము వెదకరా / నిరతము ఆ ప్రభుని వేడరా (2) ||మూడునాళ్ళ|| / తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు / అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా (2) / జిగటగల ఊభినుండి పైకి లేపి / నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు (2) / తీర్పు తీర్చబడకమునుపే / తప్పక ఆ ప్రభుని కోరరా (2) ||మూడునాళ్ళ||
మహోన్నతుడా / నీ కృపలో నేను నివసించుట / నా జీవిత ధన్యతై యున్నది / మహోన్నతుడా / నీ కృపలో నేను నివసించుట (2) ||మహోన్నతుడా|| / మోడుబారిన జీవితాలను / చిగురింప జేయగలవు నీవు (2) / మారా అనుభవం మధురముగా / మార్చగలవు నీవు (2) ||మహోన్నతుడా|| / ఆకు వాడక ఆత్మ ఫలములు / ఆనందముతో ఫలియించినా (2) / జీవ జలముల ఊట అయిన / నీ ఓరన నను నాటితివా (2) ||మహోన్నతుడా|| / వాడబారని స్వాస్థ్యము నాకై / పరమందు దాచి యుంచితివా (2) / వాగ్ధాన ఫలము అనుభవింప / నీ కృపలో నన్ను పిలచితివా (2) ||మహోన్నతుడా||
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి / జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా / ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా / పనికిరాని పాత్రనని – పారవేయకుమా / పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా (2) / సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ / సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి / ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి|| / విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు / వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి (2) / ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా / పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా / ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి|| / లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్ / మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని (2) / పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి / ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్ / ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||
Kraisthavamoka Mathamu Kaadidi / Yesunandu Thirigi Janmamu / Kreesthunandu Thirigi Janmamu (2) / Dharala Thalli Daanamosagunu / Thana Rakthamu Prathijanalamulo (2) / Andariki Jeevamosagenu / Kaluvarilo Yesu Rakthamu (2) / Kaluvarilo Yesu Rakthamu ||Kraisthavamoka|| / Oka Janmaku Rendu Chaavulu / Iru Janamalakokka Maraname (2) / Siluvyande Narakapu Chaavu / Pondenesu Andarikoraku (2) / Pondenesu Andarikoraku ||Kraisthavamoka|| / Bhuviki Moolamee Shareeramu / Divini Chera Aathma Moolamu (2) / Mathamu Maarga Gnaanamu Veedi / Marana Vijayudesu Cherumaa (2) / Marana Vijayudesu Cherumaa ||Kraisthavamoka||
ఇదిగో దేవా నా జీవితం / ఆపాదమస్తకం నీకంకితం (2) / శరణం నీ చరణం (4) ||ఇదిగో|| / పలుమార్లు వైదొలగినాను / పరలోక దర్శనమునుండి / విలువైన నీ దివ్య పిలుపుకు / నే తగినట్లు జీవించనైతి (2) / అయినా నీ ప్రేమతో / నన్ను దరిచేర్చినావు / అందుకే గైకొనుము దేవా / ఈ నా శేష జీవితం ||ఇదిగో|| / నీ పాదముల చెంత చేరి / నీ చిత్తంబు నేనెరుగ నేర్పు / నీ హృదయ భారంబు నొసగి / ప్రార్థించి పనిచేయనిమ్ము (2) / ఆగిపోక సాగిపోవు / ప్రియసుతునిగా పనిచేయనిమ్ము / ప్రతి చోట నీ సాక్షిగా / ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో|| / విస్తార పంట పొలము నుండి / కష్టించి పని చేయ నేర్పు / కన్నీటితో విత్తు మనసు / కలకాలం మరి నాకు నొసగు (2) / క్షేమ క్షామ కాలమైనా / నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా / నశియించే ఆత్మలన్ / నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా ||ఇదిగో||