315 faith songs available. Lyrics in Roman and Telugu script.
నా తనువు నా మనసు / నా నైపుణ్యం నీ కొరకే / నా తలంపులు నా మాటలు / నా క్రియలు నీ కొరకే / నా ప్రయాసే కాదు / నీ కరుణతో నిలిచింది ఈ జీవితం / నీ నామం కీర్తించాలని / నీ బలం చూపించాలని / అందుకేగా నన్నిలలో నియమించితివి / నీ స్వరూపముగా / నీ శ్వాసతో నను సృజియించితివి / నీ మహిమగా నేనుండుటకు / నీతోనే జీవించుటకు (2) / అందుకేగా నన్నిలలో సృజియించితివి / అందుకేగా నన్నిలలో నియమించితివి ||నా తనువు|| / గర్భ వాసమున లేనప్పుడే / నన్ను ప్రతిష్టించితివి / నీ వెలుగునే ప్రకాశించుటకు / నీ ప్రేమనే పంచుటకు (2) / అందుకేగా నన్నిలలో ప్రతిష్టించితివి / అందుకేగా నన్నిలలో నియమించితివి ||నా తనువు||
ఇదిగో దేవా ఈ హృదయం / ఇదిగో దేవా ఈ మనసు / ఇదిగో దేవా ఈ దేహం / ఈ నీ అగ్నితో కాల్చుమా / పరిశుద్ధ అగ్నితో కాల్చుమా (2) / పనికిరాని తీగలున్నవి / ఫలమివ్వ అడ్డుచున్నవి (2) / ఫలియించే ఆశ నాకుంది ||ఈ నీ|| / ఓ నా తోటమాలి / ఇంకో ఏడాది గడువు కావాలి (2) / ఫలియించే ఆశ నాకుంది ||ఈ నీ||
తలవంచకు నేస్తమా (2) / తలవంచకు ఎప్పుడూ / తలవంచకు ఎన్నడూ / స్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలో / కుడి ఎడమలకు బేధం తెలియని లోకంలో / కన్నులు నెత్తికి వచ్చిన ఈ లోకంలో / ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో / నీవు కావాలి ఓ.. మాదిరి / నీవు ఇవ్వాలి ఓ.. ప్రేరణ / నీవు మండాలి ఓ.. జ్వాలగా / నీవు చేరాలి ఓ.. గమ్యము ||తలవంచకు|| / చీకటిని వెనుకకు త్రోసి – సాగిపో ముందుకే / క్రీస్తు బాటలో పయనిస్తే – ఎదురేమున్నది / రేపటి భయం నిందల భారం – ఇకపై లేవులే / క్రీస్తుని చేరు లోకాన్ని వీడు – విజయం నీదేలే (2) ||నీవు|| / పెకిలించు కొండలను – విశ్వాస బాటలో / గెలవాలి యుద్ధ రంగంలో – దైవిక బలంతో / యేసుని కృప నీతోనే ఉంది – సాధించు ప్రగతిని / మంచిని పెంచు ప్రేమను పంచు – నిలిచిపో జగతిలో (2) ||నీవు||
నీ సాక్ష్యము ఏది / నీ బలియర్పణ ఏది (2) / ప్రభు యేసునంగీకరించి – నిద్రించెదవేల / ప్రభు యేసునంగీకరించి – జాగు చేసెదవేళ / మేల్కో లెమ్ము (2) / రారమ్ము విశ్వాసి ||నీ సాక్ష్యము|| / అపోస్తుల కాలమందు / ఉపద్రవముల ఒత్తిడిలో (2) / అన్నింటి సహించుచు (2) / ఆత్మలాదాయము చేసిరి ||నీ సాక్ష్యము|| / కొరడాతో కొట్టబడిరి / చెరసాలయందుంచబడిరి (2) / చెరసాల సంకెళ్లును (2) / వారినాటంక పరచలేదు ||నీ సాక్ష్యము|| / కోత విస్తారమెంతో / కోత కోయువారు కొందరే (2) / యేసు నిన్ పిలచుచుండే (2) / త్రోసివేసెదవా ప్రభు పిలుపును ||నీ సాక్ష్యము||
నమ్మదగిన దేవుడా / నెమ్మదినిచ్చే యేసయ్యా (4) / నీవుంటే చాలయ్యా వేరేది వద్దయ్యా (2) / నీ తోడుంటే చాలయ్యా / భయమే నాకు లేదయ్యా (2) ||నీ తోడుంటే|| / శ్రమ అయినా బాధ అయినా / కరువైనా ఖడ్గమైనా (2) ||నీ తోడుంటే|| / కష్టమైనా కన్నీరైనా / కలతలైనా కలవరమైనా (2) ||నీ తోడుంటే|| / సాగరాలే ఎదురు నిలిచినా / శత్రువులంతా నన్ను తరిమినా (2) ||నీ తోడుంటే|| / భరువైనా భారమైనా / బాధ అయినా వేదనైనా (2) ||నీ తోడుంటే|| / ఎవరున్నా లేకున్నా / కలిమి అయినా లేమి అయినా (2) ||నీ తోడుంటే||
మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా / చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా (2) / నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2) / నిత్యము నీ కీర్తి నా నోట నుండును (2) ||మేలైనా|| / కలిమి చేజారి నను ముంచినా / స్థితిని తలక్రిందులే చేసినా (2) / రెండింతలుగా దయచేసెదవని (2) / నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా|| / పరుల ఎగతాళి శృతి మించినా / కలవరము పొంది నే కృంగినా (2) / నా మొర విని కృప చూపెదవని (2) / నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా|| / శ్రమలు చెలరేగి బెదిరించినా / ఎముకలకు చేటునే తెచ్చినా (2) / ఆపదలలో విడిపించెదవని (2) / నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా||
లోకమును విడచి వెళ్ళవలెనుగా (2) / సర్వమిచ్చటనే విడువవలెన్ – విడువవలెన్ ||లోకమును|| / యాత్రికులము ఈ దుష్ట లోకములో / పాడు లోకములో మనకేది లేదు (2) / ఏ విషయమందైన గర్వించలేము (2) గర్వించలేము / జాగ్రత్తగానే నడచుకొనెదము (2) ||లోకమును|| / మన ఈర్ష్య కపటా ద్వేషాలు విడచి / నిజ ప్రేమతోనే జీవించెదాము (2) / నిష్కళంకులమై శుద్ధులమై (2) శుద్ధులమై / పరిపూర్ణతను చేపట్టుదాము (2) ||లోకమును|| / ఆత్మీయ నేత్రాలతో చూచెదాము / ఎంతా అద్భుతమో సౌందర్య నగరం (2) / ప్రభువు చెంతకు వెళ్ళెదము (2) వెళ్ళెదము / విజయోత్సవముతో ప్రవేశించెదము (2) ||లోకమును||
నా కృప నీకు చాలని / నా దయ నీపై ఉన్నదని / నా అరచేత నిన్ను భద్రపరచుకున్నానని / నా ఆత్మ శక్తితో నింపి నడుపుచున్నానని / నాతో మాట్లాడిన మహోన్నతుడా / నన్నాదరించిన నజరేయ (2) ||నా కృప|| / నేను నీకు తోడైయున్నానని / పొంగే జలములు నిన్నేమి చేయలేవని (2) / నీ అరికాలు మోపు చోటు అలలన్ని అణిగిపోవును (2) / పొంగి పొర్లే దీవెనలను నీయందు ఉంచానని (2) ||నాతో|| / పరిశుద్ధాత్మను నాయందు ఉంచానని / ఆత్మ శక్తితో నన్ను వాడుచున్నాని (2) / నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని (2) / జనుల కాపరిగా నన్ను ఎన్నుకున్నానని (2) ||నాతో||
ఆధారం నాకు ఆధారం / నాకు తోడునీడై ఉన్న నీ కృపయే ఆధారం / ఆశ్రయమూ నాకు ఆశ్రయమూ / ఆపత్కాలమందు ఆశ్రయమూ నీ నామం ఆశ్రయమూ / తల్లితండ్రి లేకున్నా – బంధుజనులు రాకున్నా / లోకమంత ఒకటైనా – బాధలన్ని బంధువులైనా ||ఆధారం|| / భక్తిహీన బంధంలో నేనుండగా / శ్రమల సంద్రంలో పడియుండగా (2) / ఇరుకులో విశాలతనూ కలిగించిన దేవా (2) / నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం|| / దారిద్య్రపు సుడినుండి ఐశ్యర్యపు తీరానికి / నీ స్వరమె నా వరమై నడిపించిన యేసయ్యా (2) / విడువను ఎడబాయనని పలికిన నా దేవా (2) / నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం|| / దిగులుపడిన వేళలలో దరిచేరిన దేవా / అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా (2) / చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా (2) / నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||
బ్రతికెద నీ కోసమే / నా ఊపిరి నీ ధ్యానమే / నా జీవితమే నీకంకితమై – (2) / నీదు సేవ జేతు పుణ్యమాని భావింతు / నేను చివర శ్వాస వరకు ||బ్రతికెద|| / శ్రమయును బాధయు నాకు కలిగినా / వైరులు ఎల్లరు నన్ను చుట్టినా / నీదు న్యాయ శాసనమునే పాటింతు (2) / నాలోని బలము నన్ను విడిచినా / నా కన్ను దృష్టి తప్పిపోయినా (2) / నిన్ను చేరి నీదు శక్తి పొంద / నీదు ఆత్మ తోడ లోక రక్షకా ||బ్రతికెద|| / వాక్యమే మ్రోగుట విశ్వాసము వెల్లడి చేయుట / ఇహమందున యోగ్యమైన కార్యముగా నే తలచి (2) / నీదు రుధిరంబు చేత నేను / కడగబడిన నీదు సొత్తు కాదా (2) / నిన్ను జూప లోకంబులోన / నీదు వెలుగు దీపముగా నాథా ||బ్రతికెద||
ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా / ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా / దిగులేల ఓ సోదరా ప్రభువే మనకండగా / భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ (2) ||ఏ బాధ|| / ఎర్ర సంద్రం ఎదురొచ్చినా / యెరికో గోడలు అడ్డొచ్చినా / సాతాను శోధించినా / శత్రువులే శాసించినా / పడకు భయపడకు బలవంతుడే నీకుండగా / నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా ||దిగులేల|| / పర్వతాలు తొలగినా / మెట్టలు తత్తరిల్లినా / తుఫానులు చెలరేగినా / వరదలు ఉప్పొంగినా / కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్ఛుగా / నమ్ము ఇది నమ్ము యెహోవా యీరే కదా ||దిగులేల||
సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా / దినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా / నీకే వందనం నను ప్రేమించిన యేసయ్యా / నీకే స్తోత్రము నను రక్షించిన యేసయ్యా (2) ||సంవత్సరములు|| / గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు / నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు (2) / శత్రువల నుండి విడిపించినావు / సంవత్సరమంతా కాపాడినావు (2) ||నీకే|| / బ్రతుకు దినములన్ని ఏలియా వలె నీవు పోషించినావు / పాతవి గతియింప చేసి నూతన వస్త్రమును ధరియింపజేశావు (2) / నూతన క్రియలతో నను నింపినావు / సరి కొత్త తైలముతో నను అంటినావు (2) ||నీకే||