315 faith songs available. Lyrics in Roman and Telugu script.
నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా / నశింపజేయు దూత నన్ను దాటిపోయెను (2) ||నా సంకట|| / విలువైన గొర్రెపిల్ల రక్తము ద్వారా (2) / కలిగియున్న రక్షణలో దాగియుంటిని (2) ||నా సంకట|| / ఇంకా నేను ఫరోకు దాసుడను కాను (2) / ఇంకా నేను సీయోను కన్యుడను గాను (2) ||నా సంకట|| / మార్చబడు నాడు మారా మధురముగా (2) / పారు జలము బండనుండి త్రాగుచుండును (2) ||నా సంకట|| / సౌందర్యమయమగు పరమ కానాను (2) / నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పుజెందదు (2) ||నా సంకట|| / ఆనందమే పరమానందమే (2) / కానాను జీవితము నా కానందమే (2) ||నా సంకట|| / నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు (2) / నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును (2) ||నా సంకట|| / నా యేసు ప్రభువే నా బలము గానము (2) / నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా (2) ||నా సంకట||
దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము / మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును / అభయ మభయ మభయ మెప్పు / డానంద మానంద మానంద మౌగ ||దేవుడే|| / పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను / సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్ ||అభయ|| / దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును / ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు ||అభయ|| / రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన / పూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును ||అభయ|| / విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన / చెల్ల చెదర జేసి రిపుల – నెల్లద్రుంచు నాయనే ||అభయ|| / పిశాచి పూర్ణ బలము నాతో – బెనుగులాడ జడియును / నశించి శత్రు గణము దేవు – నాజ్ఞ వలన మడియును ||అభయ|| / కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగా / ఏటి కింక వెరవ వలయు – నెప్డు నాకు బండుగ ||అభయ||
దేవుడు మనకు ఎల్లప్పుడు (2) / తోడుగ నున్నాడు (3) / ఏదేనులో ఆదాముతో నుండెన్ (2) / హానోకు తోడనేగెను (2) / దీర్ఘ దర్శకులతో నుండెన్ (2) / ధన్యులు దేవుని గలవారు – తోడుగనున్నాడు / దైవాజ్ఞను శిరసావహించి (2) / దివ్యముగ నా బ్రాహాము (2) / కన్న కొమరుని ఖండించుటకు (2) / ఖడ్గము నెత్తిన యపుడు – తోడుగనున్నాడు / యోసేపు ద్వేషించ బడినపుడు (2) / గోతిలో త్రోయబడినపుడు (2) / శోధనలో చెరసాలయందు (2) / సింహాసనమెక్కిన యపుడు – తోడుగనున్నాడు / ఎర్ర సముద్రపు తీరమునందు (2) / ఫరో తరిమిన దినమందు (2) / యోర్దాను దాటిన దినమందు (2) / యెరికో కూలిన దినమందు – తోడుగనున్నాడు / దావీదు సింహము నెదిరించి (2) / ధైర్యాన చీల్చినయపుడు (2) / గొల్యాతును హతమార్చినయపుడు (2) / సౌలుచే తరుమబడినపుడు – తోడుగనున్నాడు / సింహపు బోనులో దానియేలు (2) / షద్రకు మేషా కబేద్నెగో (2) / అగ్ని గుండములో వేయబడెన్ (2) / నల్గురిగా కనబడినపుడు – తోడుగనున్నాడు / పౌలు బంధించబడినపుడు (2) / పేతురు చెరలో నున్నపుడు (2) / అపోస్తలులు విశ్వాసులు (2) / హింసించ బడినయపుడు – తోడుగనున్నాడు ||దేవుడు||
యెహోవ నా ఆశ్రయం / నా విమోచన దుర్గము (2) / నా ధ్యానం నా గానం / యెహోవ నా అతిశయం (2) ||యెహోవ|| / తన ఆలయాన నా మోర వినెను / భూమి కంపించేలా ఘర్జన చేసెను / మేఘాలు వంచి ఎగిరి వచ్చి / జలరాసులనుండి నన్ను లేపెను / ఆయనకు ఇష్టుడను – అందుకే నన్ను తప్పించెను / ఆయనలో నా స్వాస్థ్యము – ఎంత మహిమోన్నతమైనది / ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది (2) / హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4) ||యెహోవ|| / నా చేతి వేళ్ళకు సమరము నేర్పెను / నా గుండెకు శౌర్యము నేర్పెను / జయము నాకు జన్మ హక్కు / ఆత్మాభిషేకము నా అగ్ని స్వరము / శత్రువుల గుండెలలో – యేసు రక్తము సింహ స్వప్నము / ఏ యుద్ధ భూమైనాను – యేసు నామం సింహనాదం / ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది (2) / హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4) ||యెహోవ||
మాట్లాడే దేవుడవు నీవు / మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు (2) / మాట్లాడే దేవుడవు నీవు / యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||మాట్లాడే|| / నా ఇంటి వైద్యుడవు నీవు / నా మంచి ఔషధము నీవు (2) / నా వ్యాధి బలహీన సమయాలలోన (2) / నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా|| / నా కోసం వచ్చావు నీవు / కన్నీరు తుడిచావు నీవు (2) / అన్నీ ముగించి సీయోనులోన (2) / నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా||
జీవితంలో నీలా ఉండాలని / యేసు నాలో ఎంతో ఆశున్నది (2) / తీరునా నా కోరిక / చేరితి ప్రభు పాదాల చెంత (2) ||జీవితంలో|| / కూర్చుండుటలో నిలుచుండుటలో / మాట్లాడుటలో ప్రేమించుటలో (2) / నీలాగే నడవాలని / నీ చిత్తం నెరవేర్చని / నీలాగే నడవాలని.. యేసయ్యా / నీ చిత్తం నెరవేర్చని / నీలాగే నడిచి / నీ చిత్తం నెరవేర్చి / నీ దరికి చేరాలని (2) ||తీరునా|| / పరిశుద్ధతలో ప్రార్ధించుటలో / ఊపవాసములొ ఉపదేశములో (2) / నీలాగే బ్రతకాలని / నీ చిత్తం నెరవేర్చని / నీలాగే బ్రతకాలని.. యేసయ్యా / నీ చిత్తం నెరవేర్చని / నీలాగే బ్రతికి / నీ చిత్తం నెరవేర్చి / నీ దరికి చేరాలని (2) ||తీరునా||
నాకు బలము ఉన్నంత వరకు / నమ్మలేదు నా యేసుని (2) / బలమంతా పోయాక (2) / నమ్మాలని ఉంది ప్రభు యేసుని (2) / వినిపించుచున్నది / కేక నాకు – ఒక కేక నాకు (2) / నాకు స్వరము ఉన్నంత వరకు / పాడలేదు ప్రభు గీతముల్ (2) / స్వరమంతా పోయాక (2) / పాడాలని ఉంది ప్రభు గీతముల్ (2) / వినిపించుచున్నది / కేక నాకు – ఒక కేక నాకు (2) / నాకు ధనము ఉన్నంత వరకు / ఇవ్వలేదు ప్రభు సేవకు (2) / ధనమంతా పోయాక (2) / ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు (2) / వినిపించుచున్నది / కేక నాకు – ఒక కేక నాకు (2) / హృదయారణ్యములో / నే కృంగిన సమయములో / వినిపించుచున్నది / కేక నాకు – ఒక కేక నాకు (2)
మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా / మరల మంటిలో కలవవలయురా / తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా / ఇల సంపాదన వదలవలయురా (2) / దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో / ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో (2) / ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలి / ఆరిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి (2) / క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు / స్వర్గానికి ఆయనతో వారసులౌతారు (2) ||మనిషిగా|| / జన్మనిచ్చినవాడు యేసు క్రీస్తు దేవుడే / జన్మించకముందే నిన్నెరిగిన నాథుడే (2) / ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే / నీ జన్మకు నిజమైన అర్ధముందిలే (2) ||మనిషిగా|| / నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు / చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు (2) / నీలోని ఆత్మకు స్వర్గమో నరకమో / నిర్ణయించు సమయమిదే కళ్ళు తెరుచుకో (2) ||మనిషిగా||
సహోదరులారా ప్రతి మనుష్యుడు / ఏ స్థితిలో పిలువబడెనో / ఆ స్థితియందే దేవునితో సహవాసము / కలిగియుండుట మేలు (2) / సున్నతి లేకుండ పిలువబడితివా / సున్నతి పొంద నీవు ప్రయత్నించవద్దు (2) / సున్నతి పొంది నీవు పిలువబడితివా / సున్నతిని నీవు పోగొట్టుకొనవద్దు (2) / దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే / మనకెంతో ముఖ్యమైనది (2) ||సహోదరులారా|| / దాసుడవైయుండి పిలువబడితివా / స్వతంత్రుడవగుటకు ప్రయత్నించుము (2) / స్వతంత్రుడుగ నీవు పిలువబడితివా / క్రీస్తు యేసుకు నీవు దాసుడవు (2) / విలువ పెట్టి మనము కొనబడినవారము / మనుష్యులకెప్పుడూ దాసులుగా ఉండకూడదు (2) ||సహోదరులారా||
రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో / యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2) / రావయ్య యేసయ్య – వేగరావయ్యా / రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2) ||రాకడ|| / యేసయ్య రాకడ సమయంలో / ఎదురేగె రక్షణ నీకుందా? (2) / లోకాశలపై విజయం నీకుందా? (2) ||రావయ్య|| / ఇంపైన ధూపవేదికగా / ఏకాంత ప్రార్థన నీకుందా? (2) / యేసు ఆశించే దీన మనస్సుందా? (2) ||రావయ్య|| / దినమంతా దేవుని సన్నధిలో / వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2) / యేసునాథునితో సహవాసం నీకుందా? (2) ||రావయ్య|| / శ్రమలోన సహనం నీకుందా? / స్తుతియించే నాలుక నీకుందా? (2) / ఆత్మలకొరకైన భారం నీకుందా? (2) ||రావయ్య|| / నీ పాత రోత జీవితము / నీ పాప హృదయం మారిందా? (2) / నూతన హృదయంతో ఆరాధన నీకుందా? (2) ||రావయ్య|| / అన్నీటికన్నా మిన్నగను / కన్నీటి ప్రార్థన నీకుందా? (2) / ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా? (2) ||రావయ్య||
పోరాటం ఆత్మీయ పోరాటం (2) / చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదు / సాగిపోవుచున్నాను / సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2) / నా యేసుతో కలిసి పోరాడుచున్నాను / అపజయమే ఎరుగని జయశీలుడాయన (2) / నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2) / ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం|| / నా యేసు వెళ్ళిన మార్గము లేనని / అవమానములైనా ఆవేదనలైనా (2) / నా యేసు కృపనుండి దూరపరచలేవని (2) / ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం|| / ఆదియు అంతము లేనివాడు నా యేసు / ఆసీనుడయ్యాడు సింహాసనమందు (2) / ఆ సింహాసనం నా గమ్యస్థానం (2) / ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం||
నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగా / పరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువ / పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ.. / నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగా / నీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగా / అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను (2) / లోకాన చాటగా (4) ||నశియించు|| / ఈ లోక భోగము – నీకేల సోదరా / నీ పరుగు పందెమందు – గురి యేసుడే కదా / ప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా (2) / ప్రియ యేసు కోరెను (4) ||నశియించు||