126 songs found
స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా / పవిత్ర దూతగణ సేనాధిపతికి / ఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి|| / కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా (2) / ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను / మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా / ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని / యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి|| / రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా (2) / బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి / ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి / ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని / యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి||
స్తుతించెదను – నిన్ను నేను మనసారా / భజించెదను – నేను నిన్ను దినదినము / స్తోత్రార్హుడవు నీవే ప్రభు / సమస్తము నీ కర్పించెదను (2) ||స్తుతించెదను|| / పూజార్హుడవు పవిత్రుడవు / పాపిని క్షమియించె మిత్రుడవు (2) / పరము చేర్చి ఫలములిచ్చె / పావనుడగు మా ప్రభువు నీవే (2) ||స్తుతించెదను|| / కృపా కనికరములు గల దేవా / కరుణ జూపి కనికరించు (2) / కంటి రెప్ప వలె కాపాడు / కడవరకు మమ్ము కావుమయ్య (2) ||స్తుతించెదను|| / సర్వశక్తి గల మా ప్రభువా / సజీవ సాక్షిగా చేయుమయా (2) / స్థిరపరచి మమ్ము బలపరుచు / సదా నీకే స్తోత్రాలర్పింతును (2) ||స్తుతించెదను||
స్తుతించెదను స్తుతించెదను / నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము ||స్తుతించెదను|| / ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక (2) / ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని (2) / ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను (2) ||స్తుతించెదను|| / నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి (2) / నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప (2) / నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి (2) ||స్తుతించెదను|| / పాపము క్షమించి రోగము బాపి – భయమును దీర్చి (2) / పవిత్రదాయక పావన మూర్తి – పరిశుద్ధ మిచ్చిన (2) / పరమ పాదం శరణ్యం నాకు – పరమ రాజా పుణ్య దేవా (2) ||స్తుతించెదను|| / తల్లి గర్భమునకు ముందేర్పరచి – దేహము నమర్చియును (2) / దక్షిణ బాహుతో పట్టుకొనిన – దయా సంపూర్ణుడా (2) / దిక్కు జయము ఆదరణయు – దయతో అనుగ్రహించితివి (2) ||స్తుతించెదను|| / సిలువనెత్తి శ్రమలు సహించి – సేవకు పిలచిన (2) / స్నేహ దర్శక వీర యోధ – సంశయ హారకా (2) / శ్రమలు నింద ఆకలియైన – నీ స్నేహమునుండి ఎడబాపునా (2) ||స్తుతించెదను||
స్తుతికి పాత్రుడ యేసయ్యా / నా స్వాస్థ్య భాగము నీవయ్యా (2) / పూర్ణ హృదయముతో పాడి కొనియాడెద (2) / నీవే నా రక్షణ – నీవే నా స్వస్థత / నీవే నా విడుదల (2) ||స్తుతికి|| / పాప ఊభిలో నుండి – పైకి లేపితివి / మరణ ఛాయను తొలగించి – కరుణ చూపితివి (2) / నీ వైపే చూస్తూ – నీతోనే నడుస్తూ / నీ వెనకే చేరెద యేసూ (2) ||నీవే|| / జీవాహారము నీవే – జీవ జలము నీవే / నీదు నామమే శక్తి – లేదు ఇలలో సాటి (2) / ప్రతి మోకాలొంగును – ప్రతి నాలుక ఒప్పును / యేసు రాజా నీ యెదుట (2) ||నీవే||
స్తుతికి పాత్రుడా సత్య శీలుడా (2) / నిరతము నీలో సాగె కృపను ఇమ్మయ్యా / నిరతము నిన్ను సేవించే శక్తిని ఇమ్మయ్యా (2) / ప్రేమధ్వజమును సిలువలో నిలిపి / అనంతప్రేమను చూపితివి / పాపమునుండి విడిపించి / రక్షణవస్త్రం నొసగితివి (2) / నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం / వర్ణించలేనిది వివరించలేనిది (2) / యోగ్యతలేని మాకై నీ / పౌరసత్వాన్ని ఇచ్చితివి / పరిశుద్దాత్మను మాకొసగి / బలవంతులుగా చేసితివి (2) / ఎలాగు మరువను ఎలాగు విడువను / నీ స్నేహము నీ బంధము (2)
స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా / స్తుతులందుకో పూజార్హుడా (2) / ఆకాశమందు నీవు తప్ప / నాకెవరున్నారు నా ప్రభు (2) ||స్తుతి|| / నా శత్రువులు నను తరుముచుండగా / నా యాత్మ నాలో కృంగెనే ప్రభు (2) / నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనే / శత్రువుల చేతినుండి విడిపించినావు / కాపాడినావు (2) ||స్తుతి|| / నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి / దూరాన నిలిచేరు నా ప్రభూ (2) / నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగై / నను నిల్పెను నీ సన్నిధిలో / నీ సంఘములో (2) ||స్తుతి||
స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2) / నీవే నా ఆరాధన యేసయ్యా / నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా / నీవే నా ఆత్మలో ఆనందమయ్యా / నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి|| / గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా / అగాధ జలములలోన మార్గము చూపించినావా (2) / అనుదినము మన్నాను పంపి / ప్రజలను పోషించినావా (2) / నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి|| / అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు / సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2) / ప్రతి క్షణము నీవు తోడుగా నుండి / ప్రజలను రక్షించినావు (2) / నీ ప్రజలను రక్షించినావు ||స్తుతియించి|| / పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే / మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2) / అనుదినము మాతో నీవుండి / మమ్ము నడిపించు దేవా (2) / మము పరముకు నడిపించు దేవా ||స్తుతియించి||
స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం / స్తుతియించెదా నీ నామం – దేవా అనుక్షణం / దయతో కాపాడినావు / కృపనే చూపించినావు (2) / నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా|| / పాపినై యుండగ నేను / రక్షించి దరి చేర్చినావు (2) / నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా|| / సిలువే నాకు శరణం / నీవే నాకు మార్గం (2) / నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా||
స్తుతియింతుము స్తోత్రింతుము / పావనుడగు మా పరమ తండ్రిని (2) ||స్తుతియింతుము|| / నీ నామము రుజువాయే / నీ ప్రజలలో దేవా (2) / వర్ణింప మా తరమా / మహిమ కలిగిన నీ నామమును ||స్తుతియింతుము|| / మా ప్రభువా మా కొరకై / సిలువలో సమసితివి (2) / మాదు రక్షణ కొరకై / రక్తమును కార్చిన రక్షకుడా ||స్తుతియింతుము|| / పరిశుద్ధ జనముగా / నిర్దోష ప్రజలనుగా (2) / పరలోక తనయులుగా / పరమ కృపతో మార్చిన దేవా ||స్తుతియింతుము||
స్తుతియు మహిమ ఘనత నీకే / యుగ యుగములు కలుగును దేవా (2) / పరమందు దూతలతో / ఇహమందు శుద్ధులతో (2) / కొనియాడబడుచున్న దేవా (2) / ఆరాధన ఆరాధన (2) / పరిశుద్ధుడా పరిపూర్ణుడా / పరిశుద్ధ స్థలములలో వసియించువాడా (2) / ఆరాధన ఆరాధన (2) / ఆ.. ఆ.. ఆ.. హల్లెలూయా (4) / యుగ యుగములకు తర తరములకు / మహిమా నీకే / స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా / స్తుతుల మీద ఆసీనుడా (2) / ఆరాధన ఆరాధన (2) ||స్తుతియు|| / మహిమా నీకే మహోన్నతుడా / మనసారా నిన్నే స్తుతియింతుము (2) / ఆరాధన ఆరాధన (2) ||స్తుతియు||
స్తుతియు మహిమ ఘనత నీకే / యుగయుగముల వరకు / ఎంతో నమ్మదగిన దేవా (2) ||స్తుతియు|| / మా దేవుడవై మాకిచ్చితివి / ఎంతో గొప్ప శుభ దినము (2) / మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2) / కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2) ||స్తుతియు|| / నీవొక్కడవే గొప్ప దేవుడవు / ఘనకార్యములు చేయుదువు (2) / నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2) / నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2) ||స్తుతియు|| / నీవే మాకు పరమ ప్రభుడవై / నీ చిత్తము నెరవేర్చితివి (2) / జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా (2) / నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను (2) ||స్తుతియు|| / భరియించితివి శ్రమలు నిందలు / ఓర్చితివన్ని మా కొరకు (2) / మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ (2) / పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము (2) ||స్తుతియు||
స్తుతుల మీద ఆసీనుడా / స్తుతులందుకో నా యేసు రాజా (2) / ఆరాధన యేసు ఆరాధనా / ఆరాధన నీకే ఆరాధనా (2) / ప్రేమామయుడా మహోన్నతుడా / పూజించెదన్ నా యేసు రాజా (2) ||ఆరాధన|| / అల్ఫా ఒమేగా ఆదిసంభూతుడా / రానైయున్న నా యేసు రాజా (2) ||ఆరాధన||