126 songs found

స్తుతులకు పాత్రుడా (ఆరాధన)|Sthuthulaku Paathrudaa Aaraadhana

స్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడా / నిరతము నిలచువాడా – నీకే స్తోత్రము / త్వరలో రానున్న – మా మెస్సయ్యా / మరణము గెలచిన మా విమోచకుడా / ఆరాధన చేసెదం / అజేయుడా మా ప్రభూ / అద్వితీయ సత్య దేవుడా / నీవే మా రాజువు (2) ||స్తుతులకు|| / నీతియు సమాధానము / ఆనందము నీ రాజ్యము / నీ సిలువయే మాకు శక్తి / నీ సిలువయే మాకు బలము (2) / ఆత్మానుసారమైన / నవీన జీవితమునిచ్చితివి / ఆత్మ నియమము ద్వారా / పాప మరణము నుండి విడిపించితివి (2) ||ఆరాధన|| / నీవే మా నిరీక్షణకర్తవు / నమ్మదగినవాడవు / నీలోనే మా అతిశయము / మమ్ము విలువ పెట్టి కొన్నావు (2) / ప్రభువా మీతో మేము / ఏకాత్మయై యున్నాము / అక్షయమగు కిరీటము / ధరియింపజేయువాడవు నీవే (2) ||ఆరాధన||

స్తుతులపై ఆసీనుడా|Sthuthulapai Aaseenudaa

స్తుతులపై ఆసీనుడా / అత్యున్నత నా దేవుడా (2) / నీ ప్రేమలో నీ ప్రేమలో / నను నేను మరిచాను నీ ప్రేమలో / నీ నీడలో నీ జాడలో / మైమరచిపోయాను నేను ||స్తుతులపై|| / నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులు / నీవు పొందిన గాయాలకు బదులు (2) / బంగారం వజ్రాలు – మకుటాలు కిరీటాలు / వెండినడుగలేదు నీవు / విరిగి నలిగి – కరిగి వెలిగే / హృదయాన్నే కోరావు నీవు (2) / ఓ మాట సెలవియ్యి దేవా / నీ పాద ధూళిని కానా ప్రభువా / నీ పాదం స్పర్శించగానే / నా సంతోషానికి హద్దుండునా ||స్తుతులపై|| / నీవు లేచిన పునరుథ్తానా దినము మొదలు / మా బ్రతుకులో విజయము మొదలు (2) / మరణం అనేటి ముల్లును విరచి / తిరిగి లేచావు నీవు / చీకటి నిండిన మాదు బ్రతుకులో / వెలుగులు నింపావు నీవు (2) / నీకోసం ఏదైనా దేవా / నే వెచ్చింప సంసిద్ధమయ్యా / ఆఖరికి నా ప్రాణమైనా / చిందులు వేస్తూ అర్పిస్తా ||స్తుతులపై||

స్తోత్ర గానం చేసింది ప్రాణం|Sthothra Gaanam Chesindi Praanam

స్తోత్ర గానం చేసింది ప్రాణం / క్రొత్త రాగం తీసింది హృదయం / నా యేసు ప్రేమ నా మదంతా నిండగా / ధన్యమే ఈ జీవితం / యేసుతో మరింత రమ్యమే / భూమిపై చిన్ని స్వర్గమే / యేసుతో నా ప్రయాణమే / నా తోడై నా నీడై నాతో ఉన్నాడులే ||ధన్యమే|| / నా గతం విషాదం – అనంతమైన ఓ అగాధం / కోరితి సహాయం – నా యేసు చేసెనే ఆశ్చర్యం / లేనిపోని నిందలన్ని పూలదండలై మారెనే / ఇన్నినాళ్ళు లేని సంతసాలు నా వెంటనే వచ్చెనే / యేసులో నిత్యమే ||స్తోత్ర|| / ఊహకే సుదూరం – నా యేసు చేసిన ప్రమాణం / నా జయం విశ్వాసం – కాదేది యేసుకు అసాధ్యం / లేనివన్ని ఉండునట్లు చేసే యేసుతో నా జీవితం / పాడలేను ఏ భాషలోనూ ఆనందమానందమే / యేసులో నిత్యమే ||స్తోత్ర||

స్తోత్రం చెల్లింతుము|Sthothram Chellinthumu

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము / యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| / దివారాత్రములు కంటిపాపవలె కాచి (2) / దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2) ||స్తోత్రం|| / గాడాంధకారములో కన్నీటి లోయలలో (2) / కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2) ||స్తోత్రం|| / సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2) / సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2) ||స్తోత్రం|| / సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2) / సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2) ||స్తోత్రం|| / సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2) / యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2) ||స్తోత్రం|| / పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2) / సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2) ||స్తోత్రం||

స్తోత్రబలి అర్పించెదము|Sthothrabali Arpinchedhamu

స్తోత్రబలి అర్పించెదము / మంచి యేసు మేలు చేసెన్ (2) / చేసెను మేలులెన్నో / పాడి పాడి పొగడెదన్ (2) / తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం (2) / ప్రాణమిచ్చి నను ప్రేమించి / పాపం తొలగించి కడిగితివే (2) / నీ కొరకు బ్రతుక వేరుపరచి / సేవ చేయ కృప ఇచ్చితివే (2) ||తండ్రీ|| / గొప్ప స్వరముతో మొరపెట్టి / సిలువ రక్తమును కార్చితివే (2) / రక్త కోటలో కాచుకొని / శత్రు రాకుండ కాచితివే (2) ||తండ్రీ|| / చూచే కన్నులు ఇచ్చితివి / పాడే పెదవులు ఇచ్చితివి (2) / కష్టించే చేతులు ఇచ్చితివి / పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి (2) ||తండ్రీ|| / మంచి ఇల్లును ఇచ్చావయ్యా / వసతులన్నియు ఇచ్చావయ్యా (2) / కష్టించి పనిచేయ కృప చూపి / అప్పు లేకుండ చేసితివే (2) ||తండ్రీ||

స్తోత్రబలి స్తోత్రబలి|Sthothrabali Sthothrabali

స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా / శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే (2) / నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2) / నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2) / కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| / రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2) / మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2) / కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| / నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2) / ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2) / కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| / వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు (2) / యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును (2) / కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||

స్తోత్రించెదము|Sthothrinchedamu Daivakumaaruni

స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో (2) / నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము (2) / యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు (2) / సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ (2) / భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి (2) / బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్ (2) ||యేసు|| / కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు (2) / తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము (2) ||యేసు|| / తల్లిదండ్రియు యెడబాసినను – విడువక కాయును (2) / ఎల్లప్పుడు నేను భజియించెదను – వల్లభుడేసు ప్రభున్ (2) ||యేసు|| / ఆత్మీయ పోరాటమునకు ప్రభువు – ఆత్మశక్తినిచ్చెన్ (2) / స్తుతియు నీకే ఘనతయు నీకే – యుగయుగములలోన (2) ||యేసు||

స్తోత్రింతుము నిను|Sthothrinthumu Ninu

స్తోత్రింతుము నిను మాదు తండ్రి / సత్యముతో ఆత్మతో నెప్పుడు (2) / పరిశుధ్ధాలంకారములతో / దర్శించెదము శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| / శ్రేష్ఠ యీవుల యూట నీవే / శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున (2) / త్రిత్వమై ఏకత్వమైన త్రి- / లోకనాథ శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| / దవలవర్ణుడ రత్నవర్ణుడ / సత్యరూపి యనబడువాడా (2) / నను రక్షించిన రక్షకుండవు / నాథ నీవే శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| / సంఘమునకు శిరస్సు నీవే / రాజా నీకే నమస్కారములు (2) / ముఖ్యమైన మూలరాయి / కోట్లకొలది శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| / నీదు సేవకుల పునాది / జ్ఞానమునకు మించిన తెలివి (2) / అందముగనూ కూడుకొనుచు / వేడుకొందుము శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| / రాజ నీకే స్తుతి స్తోత్రములు / గీతములు మంగళ ధ్వనులు (2) / శుభము శుభము శుభము నిత్యం / హల్లెలూయా ఆమెన్ ఆమెన్ (2) ||స్తోత్రింతుము||