93 songs found

మహిమగల తండ్రి|Mahimagala thandri

మహిమగల తండ్రి – మంచి వ్యవసాయకుడు / మహితోటలో నర మొక్కలు నాటించాడు (2) / తన పుత్రుని రక్తనీరు – తడి కట్టి పెంచాడు / తన పరిశుద్ధాత్మను – కాపుగా వుంచాడు (2) / కాయవే తోటా – కమ్మని కాయలు / పండవే చెట్టా – తియ్యని ఫలములు (2) ||మహిమ|| / నీతి పూత జాతి కర్త – ఆత్మ సుతా ఫలములు / నీ తండ్రి నిలువచేయు – నిత్య జీవ ఫలములు (2) / అనంతమైన ఆత్మ బంధ – అమర సుధా కాంతులు (2) / అనుకూల సమయమయ్యె – పూయు పరమ పూతలు (2) ||కాయవే|| / అపవాది కంటబడి – కుంటుబడి పోకు / కాపుకొచ్చి చేదు పండ్లు – గంపలుగా కాయకు (2) / అదిగో గొడ్డలి వేరు – పదును పెట్టియున్నది (2) / వెర్రిగా చుక్కలనంటి – ఎదిగి విర్రవీగకు (2) ||కాయవే|| / కలువరి కొండలో పుట్టి – పారిన కరుణా నిధి / కలుషమైన చీడ పీడ – కడిగిన ప్రేమానిధి (2) / నిజముగాను నీవు – నీ సొత్తు కావు (2) / యజమాని వస్తాడు – ఏమి ఫలములిస్తావు (2) ||కాయవే|| / ముద్దుగా పెంచాడు – మొద్దుగా నుండకు / మోదమెంతో ఉంచాడు – మోడుబారి పోకు (2) / ముండ్ల పొదలలో కృంగి – మెత్తబడి పోకు (2) / పండ్లు కోయ వచ్చువాడు – అగ్నివేసి పోతాడు (2) ||కాయవే||

మహోన్నతుడా నీ చాటున|Mahonnathuda Nee Chaatuna

మహోన్నతుడా నీ చాటున నే నివసించెదను / సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను / బలవంతుడా నీ సన్నిధినే / నే ఆశ్రయించెదా అనుదినము / యేసయ్యా యేసయ్యా / రాత్రివేళ కలుగు భయముకైనా / పగటిలో ఎగిరే బాణముకైనా / చీకటిలో సంచరించు తెగులుకైనా / దినమెల్లా వేధించు వ్యాధికైనా / నే భయపడను నే దిగులు చెందను / యెహోవా రాఫా నా తోడు నీవే / యేసయ్యా యేసయ్యా / వేయిమంది నా ప్రక్క పడిపోయినా / పదివేలు నా చుట్టు కాలినను / అంధకారమే నన్ను చుట్టుముట్టినా / మరణ భయమే నన్ను వేధించినా / నే భయపడను నే దిగులు చెందను / యెహోవా నిస్సి నా తోడు నీవే / యేసయ్యా యేసయ్యా / నిను ప్రేమించువారిని తప్పించువాడా / నిన్నెరిగిన వారిని ఘనపరచువాడా / నా యుద్ధము జయించి లేవనెత్తువాడా / కృప వెంబడి కృప చూపించువాడా / యేసయ్యా యేసయ్యా / నే భయపడను నే దిగులు చెందను / యెహోవా షాలోం నా తోడు నీవే

మా ఊహలు పుట్టక మునుపే|Maa oohalu puttaka munupe

మా ఊహలు పుట్టక మునుపే – మా సర్వమునెరిగిన దేవా (2) / ఇహపరములలో నీవే – మా కోర్కెలు తీర్చెడి ప్రభువా (2) / విశ్వాస నిరీక్షణతో – కనిపెట్టియున్నచో (2) / పొందెదము ఎన్నో మేలులూ – ప్రభువా నీ పాద సన్నిధిలో (2) ||మా ఊహలు|| / నిన్నడుగకుండగనే – మోషేను పిలచితివి / నిన్నడిగిన సొలోమోనుకు – జ్ఞాన సిరుల నొసగిన దేవా (2) / పలు సమయముల యందు – పలు వరముల నిచ్చితివి (2) / అడుగనేల ప్రభువా ఈ ధరలో – నీ దివ్య కృపయే చాలు ||మా ఊహలు|| / ప్రార్ధించుచుంటిమి – సమస్యలు తీర్చమని / నిన్నడుగుచున్నాము నీ – రాజ్యములో చోటిమ్మని (2) / ఊహించు వాటికంటె – అధికముగా నిచ్చెడి దేవా (2) / ఇంతకంటె మాకేమి వలదు – నీ తోడు నీడే చాలు ||మా ఊహలు||

మా గొప్ప దేవా|Maa Goppa Devaa

మా గొప్ప దేవా – మము కరుణించి / అత్యున్నత స్థానములో నను నిలిపావు / యోగ్యుడనే కాను ఆ ప్రేమకు / వెల కట్టలేను ఆ ప్రేమకు / ఆరాధించెదను… నా పూర్ణ హృదయముతో / నిన్నే కీర్తింతును – నా జీవితమంతా (2) / నెమ్మదే లేని బ్రతుకులో – పాపపు బంధకాలలో / చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు (2) / పాపంలో నుండి నను విమోచించుటకు / ఆ ఘోర సిలువలోన మరణించావు / దాస్యములోనుండి పడి ఉన్న నన్ను / నీ కుమారునిగా రక్షించావు ||మా గొప్ప|| / మార్పులేని బ్రతుకులో మలినమైన మనస్సుతో / నే తూలనాడి దూషించింది నిన్నేనేగా (2) / ఆ స్థితిలో కూడా నను ప్రేమించే గొప్ప / హృదయం నీదే యేసయ్యా / నాలాంటి ఘోరమైన పాపిని కూడా / క్షమియించి ప్రేమించింది నీవేనయ్యా ||మా గొప్ప||

Telugu Songs Starting with "మ" — Page 4 | UEC Telugu Church