93 songs found

మన్నేగదయ్యా మన్నేగదయ్యా|Mannegadayyaa Mannegadayyaa

మన్నేగదయ్యా మన్నేగదయ్యా (2) / మహిలోని ఆత్మ జ్యోతియు తప్ప / మహిలోనిదంతా మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా|| / మంచిదంచు ఒకని యించు సంచిలోనే ఉంచినా / మించిన బంగారము మించిన నీ దేహము (2) / ఉంచుము ఎన్నాళ్ళకుండునో / మరణించగానే మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా|| / ఎన్ని నాళ్ళు లోకమందు ఉన్నతముగా నిలిచినా / నిన్ను చూచి లోకులంతా ధన్యుడవని పిలిచినా (2) / మెల్లని పుష్పంబు పోలినా / పుష్పంబుతోనే ఊడిపడినది (2) ||మన్నేగదయ్యా|| / మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము / ఒక్కనాడు ఆరిపోగా నీలో ఆత్మ దీపము (2) / కుక్క శవంతో సమమేగా / నిక్కముగనదియు మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా|| / మానవునికి మరణమింత ఎంచనంత మన్నిల / మరణమును జయించుచున్న కాలమింత మన్నిల (2) / మరణ విజయుడేసు క్రీస్తుడే / మది నమ్ము నిత్య జీవమిచ్చ్చును (2) ||మన్నేగదయ్యా||

మరణము నన్నేమి చేయలేదు|Maranamu nannemi cheyaledu

మరణము నన్నేమి చేయలేదు / పరిస్థితి నన్నేమి చేయగలదు (2) / నీ కృప సమృద్ధిగా / నాపై నిలిపి తోడైయున్నావు (2) ||మరణము|| / నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే / నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2) / నను సీయోనులో చేర్చుకొనుటే / నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| / నీ రూపమును పొంది జీవించుటే ఆశ / సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2) / విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే / నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| / నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము / పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము (2) / నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే / నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| / నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత / సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి (2) / దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే / నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||

మరువగలనా మరలా|Maruvagalanaa Maralaa

మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా / ఈలాంటి ప్రేమను కలిగినను / క్షమించు నింతటి నేరమును / జీవిత కాలమంతా – యేసు ధ్యానము చేసెదను / ఆశయు అక్కరయు పాపమై / చిక్కితి శత్రువు చేతులలో / మరణపు టంచున చేరితిని / ఇంతలోనే యేసు కరుణింప వచ్చి / క్షమియించి విడిపించెను / ఈలాంటి ప్రేమను కలిగినను / క్షమించు నింతటి నేరమును / నిందను పొందినను – ప్రభు చెంతకు చేరెదను / ఏ పాపికి కడు భాగ్యమే / యేసుని చేరగ ధన్యమే / యేసుని ప్రేమ అనంతమే / నీ పాపమంతా తొలగించి / యేసు ప్రేమించి దీవించును / నీ భారమంతయు భరియించును / కన్నీరు తుడిచి ఓదార్చును / శాశ్వత ప్రేమ చూపి – తన కౌగిట దాచుకొనున్ / మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా / ఆ సిల్వ ప్రేమను చూపెదను / నా క్రీస్తు వార్తను చాటెదను / జీవిత కాలమంత – యేసు ధ్యానము చేసెదను

మరువని నీదు ప్రేమతో|Maruvani Needu Prematho

మరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగా / విడువని స్నేహ బంధమై నడిచితివే నా తోడుగా (2) / ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా / పొందుకున్న మేలులన్ని నీదు ఎన్నిక ఫలితమేగా (2) ||మరువని|| / కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపె / వెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపె (2) / పాడెదను నూతన గీతములు ఎల్లవేళల స్తుతిగానములు / ఘనత మహిమ ఆరోపణము నాదు జీవితమే అర్పితము (2) ||మరువని|| / నిన్న నేడు ఎన్నడైనా మారిపోని మనసు నీది / తల్లి మరచినా మరచి పోక కాపు కాసే ప్రేమ నీది (2) / పొందుకున్న జన్మ దినము నీవు ఇచ్చే దయా కిరీటము / నీవు ఇచ్ఛే వాగ్ధానాలు చేయు అధికము బ్రతుకు దినములు (2) ||మరువని||

మల్లెలమ్మా మల్లెలు|Mallelammaa Mallelu

మల్లెలమ్మా మల్లెలు – తెల్ల తెల్లని మల్లెలు (2) / ఏ మల్లెలోన వస్తాడో – రానున్న యేసయ్యా (2) / నీవచ్చే రాకడలో జరిగే గుర్తులు తెలిసాయి (2) / జరుగుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| / అక్కడక్కడ కరువులు భూకంపాలే లేచాయి (2) / నీ రాకడ సమీపమయ్యింది – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| / రాజ్యము మీదికి రాజ్యములు జనముల మీదికి జనములు (2) / లేచుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| / పదవుల కొరకే ఈనాడు పార్టీలెన్నో పెరిగాయి (2) / పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| / పురుగులు పట్టి ఈనాడే పైరులు ఎన్నో పోయాయి (2) / రోజులు మారే రోజాన్నో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| / నీతి న్యాయం నివసించే పాపుల పరుగే గెలిచాయి (2) / పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||

మహాఘనుడవు మహోన్నతుడవు|Mahaa Ghanudavu Mahonnathudavu

మహాఘనుడవు మహోన్నతుడవు / పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2) / కృపా సత్య సంపూర్ణమై / మా మధ్యలో నివసించుట న్యాయమా / నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2) / వినయముగల వారిని / తగిన సమయములో హెచ్చించువాడవని (2) / నీవు వాడు పాత్రనై నేనుండుటకై / నిలిచియుందును పవిత్రతతో (2) / హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా|| / దీన మనస్సు గలవారికే / సమృద్ధిగా కృపను దయచేయువాడవని (2) / నీ సముఖములో సజీవ సాక్షినై / కాపాడుకొందును మెళకువతో (2) / హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా|| / శోధింపబడు వారికి / మార్గము చూపించి తప్పించువాడవని (2) / నా సిలువ మోయుచు నీ సిలువ నీడను / విశ్రమింతును అంతము వరకు (2) / హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా||