ప

109 songs found

ప్రియ యేసు రాజును నే చూచిన చాలు|Priya yesu raajunu ne choochina chaalu

ప్రియ యేసు రాజును నే చూచిన చాలు / మహిమలో నేనాయనతో ఉంటే చాలు (2) / నిత్యమైన మోక్షగృహము నందు చేరి / భక్తుల గుంపులో హర్షించిన చాలు (2) ||ప్రియ యేసు|| / యేసుని రక్తమందు కడుగబడి / వాక్యంచే నిత్యం భద్రపరచబడి (2) / నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను (2) / బంగారు వీదులలో తిరిగెదను (2) ||ప్రియ యేసు|| / ముండ్ల మకుటంబైన తలను జూచి / స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ (2) / కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి (2) / ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ (2) ||ప్రియ యేసు|| / హృదయము స్తుతులతో నింపబడెను / నా భాగ్య గృహమును స్మరించుచు (2) / హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (2) / వర్ణింప నా నాలుక చాలదయ్యా (2) ||ప్రియ యేసు|| / ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో / ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో (2) / తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో (2) / ఆశతో వేచియుండే నా హృదయం (2) ||ప్రియ యేసు||

ప్రియతమ బంధమా|Priyathama Bandhamaa

ప్రియతమ బంధమా – నా హృదయపు ఆశ్రయ దుర్గమా / అనుదినం అనుక్షణం – నీ ఒడిలో జీవితం ధన్యము / కృతజ్ఞతతో పాడెదను / నిరంతరము స్తుతించెదను ||ప్రియతమ|| / అంధకారపు సమయములోన – నీతి సూర్యుడై ఉదయించావు / గమ్యమెరుగని పయనములోన – సత్య సంధుడై నడిపించావు (2) / నా నిరీక్షణ ఆధారం నీవు / నమ్మదగిన దేవుడవు నీవు (2) / కరుణ చూపి రక్షించినావు / కరుణామూర్తి యేసు నాథా (2) / వందనం వందనం దేవా – వందనం వందనం / అనుదినం అనుక్షణం నీకే నా – వందనం వందనం ||కృతజ్ఞతతో|| / పరమ తండ్రివి నీవేనని – పూర్ణ మనసుతో ప్రణుతించెదను / పరిశుద్ధుడవు నీవేనని – ప్రాణాత్మలతో ప్రణమిల్లెదను (2) / విశ్వసించిన వారందరికి / నిత్య జీవము నొసగె దేవా (2) / కరుణ చూపి రక్షించినావు / కరుణామూర్తి యేసు నాథా (2) / వందనం వందనం దేవా – వందనం వందనం / అనుదినం అనుక్షణం నీకే నా – వందనం వందనం ||కృతజ్ఞతతో||

ప్రీతిగల మన యేసు|Preethigala Mana Yesu

ప్రీతిగల మన యేసు – డెంతో గొప్ప మిత్రుడు / మితిలేని దయచేత – హత్తుచు ప్రేమించును / క్రీస్తునొద్ద మన భార – మంత నప్పగించినన్ / శక్తిగల యేసు చేత – మోత లెల్ల వీడును / నీతిగల మన యేసు – ధృతిగల మిత్రుడు / మృతి బొంది కృపతో వి – శ్రాంతి కలిగించెను / భీతి నొందు బాపులైన – జింతా క్రాంతులైనను / క్రీస్తు యొక్క దీప్తి చేత – క్రొత్త గతి జూతురు / దయగల మన యేసు – ప్రియమైన మిత్రుడు / మాయలోకమందు నిజా – శ్రయుడై కాపాడును / భయ దుఃఖ శ్రమ లాది – మోయరాని బాధలన్ / జయ మొప్ప నేర్పి యేసు – స్థాయి వృద్ది చేయును / ధారుణిలో యేసుగాక – వేరు గొప్ప మిత్రుడా? / పరలోకమందు యేసే – వీరుడౌ రక్షకుడు / నారకుల! గావ వేగా – గ్రూర హింస బొందెను / కరుణించి నిచ్చి ప్రతి – ప్రార్థన నాలించును

ప్రేమ యేసయ్య ప్రేమా|Prema Yesayya Premaa

ప్రేమ యేసయ్య ప్రేమా (4) / మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2) ||ప్రేమ|| / తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ / తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2) / నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమా / తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2) ||ప్రేమ|| / నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ / నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2) / నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా / తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా (2) ||ప్రేమ|| / నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ / నేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ (2) / తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా / ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా (2) ||ప్రేమ||

ప్రేమ యేసుని ప్రేమ|Prema Yesuni Prema

ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది / నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది / ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ / ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ|| / తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును / కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు|| / భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము / వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు|| / బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము / నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు|| / ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును / క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు||

Telugu Songs Starting with "ప" — Page 8 | UEC Telugu Church