ప

109 songs found

పసి బాలుడై|Pasi Baaludai

పసి బాలుడై ప్రేమా రూపుడై – ఇమ్మానుయేలు దైవమై / నీతి తేజమై సత్య రూపమై – బలమైన నా దుర్గమా / దీనుడవై పరమును విడిచి – నా కొరకు దిగి వచ్చావు / నా రక్షణ కొరకై నీవు – నర రూపము ధరించినావు / రండి రండి నేడు బెత్లహేము పురముకు / రండి రండి ఆ యేసు రాజునొద్దకు / రండి రండి పరిశుద్ధాత్ముని యొద్దకు / రండి రండి నేడు ఉత్సహించి పాడుటకు ||పసి బాలుడై|| / యేసు రాజు పుట్టేనని హల్లేలూయా / గంతులు వేసి పాడుదమా హల్లేలూయా / నిజ రక్షకుడు అని హల్లేలూయా / ఆరాధించెదము హల్లేలూయా ||రండి|| / ఆశ్చర్యకరుడని యేసు హల్లేలూయా / పరిశుద్ధుడు అని పాడుదమా హల్లేలూయా / రాజులకు రాజు హల్లేలూయా / ఘనపరచి కీర్తింతున్ హల్లేలూయా ||రండి||

పాడనా మౌనముగానే|Paadanaa Mounamugaane

పాడనా మౌనముగానే స్తుతి కీర్తన / చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2) / యేసయ్యా నీతో సహజీవనము / నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే (2) ||పాడనా|| / ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే / నీ రక్తాభిషేకము కడిగెనే / నా ప్రాణాత్మ శరీరమును (2) / నా విమోచన గానము నీవే / నా రక్షణ శృంగము నీవే (2) ||పాడనా|| / దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే / నీ ప్రశాంత పవనాలు అణచెనే / నా వ్యామోహపు పొంగులన్నియు (2) / నా ఓదార్పు నిధివి నీవే / నా ఆనంద క్షేత్రము నీవే (2) ||పాడనా|| / నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటిని / నీ తైలాభిషేకము నిండెనే / నా అంతరంగమంతయును (2) / నా మానస వీణవు నీవే / నా ఆరాధన పల్లకి నీవే (2) ||పాడనా||

పాడెద దేవా నీ కృపలన్|Paadeda Devaa Nee Krupalan

పాడెద దేవా – నీ కృపలన్ / నూతన గీతములన్ / స్తోత్రము చెల్లింతున్ – స్తుతి స్తోత్రము చెల్లింతున్ (2) / భూమి పునాదులు వేయకముందే / యేసులో చేసితివి (2) / ప్రేమ పునాదులు వేసితివి / దీనుని బ్రోచితివి – ఈ దీనుని బ్రోచితివి (2) ||పాడెద|| / ప్రవిమల రక్తము కలువరి సిలువలో / కలునకు నిచ్చితివి (2) / ప్రేమ కృపా మహదైశ్వర్యములతో / పాపము తుడిచితివి – నా పాపము తుడిచితివి (2) ||పాడెద|| / పాపము శాపము నరకపు వేదన / మరి తొలగించితివి (2) / అపరాధములచే చచ్చిన నన్ను / ధర బ్రతికించితివి – నన్ను బ్రతికించితివి (2) ||పాడెద|| / దేవుని రాజ్యపు వారసుడనుగా / క్రీస్తులో చేసితివి (2) / చీకటి రాజ్యపు శక్తుల నుండి / నను విడిపించితివి – చెర నను విడిపించితివి (2) ||పాడెద|| / ముద్రించితివి శుద్ధాత్మతో నను / భద్రము చేసితివి (2) / సత్యస్వరూప నిత్యనివాసి / సొత్తుగా చేసితివి – నీ సొత్తుగా చేసితివి (2) ||పాడెద|| / అన్యుడనై నిను ఎరుగక యున్నను / ధన్యుని చేసితివి (2) / ప్రియ పట్టణ పౌరుల సేవింపను / వరముల నొసగితివి – కృప వరముల నొసగితివి (2) ||పాడెద||

పాపానికి నాకు ఏ సంబంధం లేదు|Paapaaniki Naaku Ae Sambandham Ledu

పాపానికి నాకు ఏ సంబంధం లేదు / పాపానికి నాపై ఏ అధికారము లేదు / పాపానికి నాకు ఏ సంబంధం లేదు / పాపానికి నాపై ఏ అజమాయిషీ లేదు / నా పాపములు అన్ని – నా ప్రభువు ఏనాడో క్షమియించివేసాడుగా / మరి వాటినెన్నడును – జ్ఞాపకము చేసికొనెను / అని మాట ఇచ్చాడుగా / నేనున్నా నేనున్నా – నా యేసుని కృప క్రింద / నే లేను నే లేను – ధర్మశాస్త్రం క్రింద (2) ||పాపానికి|| / కృప ఉందని పాపం చెయ్యొచ్చా – అట్లనరాదు / కృప ఉందని నీతిని విడువోచ్చా (అట్లనరాదు) / కృప అంటే లైసెన్స్ కాదు / కృప అంటే ఫ్రీ పాస్ కాదు – పాపాన్ని చేసేందుకు / కృప అంటే దేవుని శక్తి / కృప అంటే దేవుని నీతి – పాపాన్ని గెలిచేందుకు / గ్రేస్ ఈస్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్ / ఇట్స్ ఎ పవర్ ఆఫ్ గాడ్ టు ఓవర్ కం (4) ||నేనున్నా|| / కృప ద్వారా ధర్మశాస్త్రముకు – మృతుడను అయ్యా / కృప వలన క్రీస్తులో స్వాతంత్య్రం (నే పొందితినయ్యా) / క్రియల మూలముగా కాదు / కృపయే నను రక్షించినది – నా భారం తొలగించినది / కృప నన్ను మార్చేసినది / నీతి సద్భక్తుల తోడ – బ్రతుకమని బోధించినది / గ్రేస్ టుక్ అవే బర్డెన్ ఫ్రమ్ మి / అండ్ టాట్ మి టు లివ్ రైటియస్లీ (4) ||నేనున్నా||

పాపిగ నను చూడలేక|Paapiga Nanu Choodaleka

పాపిగ నను చూడలేక – పాపముగా మారినావా / దోషిగ నను చూడలేక – నా శిక్ష నీవు పొందినావా (2) / నా తల యెత్తుటకు – నీవు తల వంచితివే / అర్హత నాకిచ్చుటకు – అవమాన-మొందితివే / తండ్రితో నను చేర్చుటకు – విడనాడబడితివే / జీవము నాకిచ్చుటకు – మరణము-నొందితివే / నీవే నీవే – నీవే దేవా / నీవే నీవే – నా యేసయ్యా (2) / పరమును వీడి ఈ భువికి / దిగి వచ్చిన రక్షకుడా / మహిమను వీడి నా వెలని / చెల్లించిన ప్రేమామయుడా / నే వెదకి రాలేనని సత్యమునెరిగి / నీవే నా దరికి పరుగెత్తితివి / దాసత్వము నుండి నను విడిపించి / తండ్రి అని పిలిచే భాగ్యము నిచ్చితివి ||నీవే|| / నా స్థానములో నీవే నిలిచి / నీ స్థానమే నాకిచ్చితివి / సౌందర్యవంతునిగా నన్నే చేసి / సొగసంతా కోల్పోయితివి / నీ బలమంతా నాకే ఇచ్చి / బలియాగముగా నీవు మారితివి / ఐశ్వర్యవంతునిగా నన్నే చేసి / దీనతనే హత్తుకొంటివి ||నీవే|| / నా బలమంతా నీవే – నా సౌందర్యము నీవే / నా ఐశ్వర్యము నీవే – నీవే నీవే / నా అతిశయము నీవే – నా ఆనందం నీవే / నా ఆధారం నీవే – నీవే నీవే (2) / యేసయ్యా యేసయ్యా యేసయ్యా / యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) ||పాపిగ||

పావురమా నీ ప్రేమ|Paavuramaa Nee Prema

పావురమా నీ ప్రేమ ఎంత మధురము / పావురమా నీ మనసు ఎంత నిర్మలము / జుంటి తేనె ధార కన్నా / మంచి గోధుమ పంట కన్నా (2) / ప్రేమ మధురము – నీ మనసు నిర్మలము (2) / నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము / నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము / కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను / ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2) / ఎటు చూసిననూ ఎం చేసిననూ / మదిలో నిన్నే తలంచుచున్నాను (2) / ఒకసారి కనిపించి / నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా|| / దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు / పది వేళ మంది పురుషుల్లోన పోల్చదగినవాడు (2) / నా వాడు నా ప్రియుడు / మదిలో నిన్నే తలంచుచున్నాడు (2) / ఒకసారి కనిపించి / నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా||

Telugu Songs Starting with "ప" — Page 3 | UEC Telugu Church