109 songs found
పరలోకమందున్నమా తండ్రీ / నీ నామము – పరిశుద్ధ పరచబడుగాక (2) / నీ రాజ్యము వచ్చుగాక (3) / ఆహా ఆహ ఆహాహాహా – ఆహా ఆహ ఆహాహాహా (2) / నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు / భూమియందును నెరవేరునుగాక (2) / మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము (2) / మా ఋణస్తులను మేము క్షమించియున్న ప్రకారము / మా ఋణములు క్షమించుము (2) / మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము (2) / ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు / నిరంతరము నీవైయున్నావు తండ్రీ… ఆమెన్
పరలోకము నా దేశము / పరదేశి నేనిల మాయలోకమేగ / నేను యాత్రికుడను (2) / ఎంతో అందమైనది పరలోకము / అసమానమైనది నా దేశము (2) / ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును (2) ||పరలోకము|| / దూతలు పాడుచుందురు పరమందున / దీవా రాత్రమునందు పాడుచుందురు (2) / పావనుని చూచి నేను హర్షింతును నిత్యము (2) ||పరలోకము|| / రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్ / వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని (2) / కాంక్షించెద నా మదిలో ఆయన చెంతనుండ (2) ||పరలోకము|| / అద్దరికి ఎప్పుడు నేను వెళ్లెదన్ / అగుపడుచున్నది గమ్యస్థానము (2) / అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరిన్ (2) ||పరలోకము|| / నిత్యానందముండును పరమందున / నీతి సమాధానము ఉండునచ్చట (2) / పొందెదను విశ్రాంతిని శ్రమలన్నియు వీడి (2) ||పరలోకము||
పరలోకమే నా అంతఃపురం / చేరాలనే నా తాపత్రయం (2) / యేసుదేవరా – కనికరించవా – దారి చూపవా (2) ||పరలోకమే|| / స్వల్ప కాలమే ఈ లోక జీవితం / నా భవ్య జీవితం మహోజ్వలం (2) / మజిలీలు దాటే మనోబలం / నీ మహిమ చూసే మధుర క్షణం (2) / వీక్షించు కన్నులు – విశ్వాస జీవితం – నాకు ఈయవా (2) ||పరలోకమే|| / పాపము నెదిరించే శక్తిని నాకివ్వు / పరులను ప్రేమించే మనసే నాకివ్వు (2) / ఉద్రేక పరచే దురాత్మను / ఎదురించి పోరాడే శుద్ధాత్మను (2) / మోకాళ్ళ జీవితం – కన్నీటి అనుభవం – నాకు నేర్పవా (2) ||పరలోకమే||
పరవశించెద నీ వాక్యములో / పరవశించి నే పాడెద నీ సన్నిధిలో (2) / నీ వాక్యమే నన్ను బ్రతికించినది / నీ వాక్యమే నన్ను నడిపించినది (2) / ఆరాధన స్తుతి ఆరాధన / నా ప్రాణమైన దేవా నీకారాధన (2) / నీ పాద సన్నిధిలో నేనున్నపుడు / వాక్యమనే పాలతో నను పోషించితివి (2) / నీ వాక్యమే నాకు సత్యము జీవము / నీ వాక్యమే నా పాదములకు దీపము (2) ||ఆరాధన|| / ఈ లోక బంధాలు కృంగదీసినపుడు / వాక్యమనే నీ మాటతో నన్నాదరించితివి (2) / నీ వాక్యమే నను బలపరచినది / నీ వాక్యమే నీలో స్థిరపరచినది (2) ||ఆరాధన||
పరవాసిని నే జగమున ప్రభువా (2) / నడచుచున్నాను నీ దారిన్ / నా గురి నీవే నా ప్రభువా (2) / నీ దరినే జేరెదను / నేను.. నీ దరినే జేరెదను ||పరవాసిని|| / లోకమంతా నాదని యెంచి / బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2) / అంతయు మోసమేగా (2) / వ్యర్ధము సర్వమును / ఇలలో.. వ్యర్ధము సర్వమును ||పరవాసిని|| / ధన సంపదలు గౌరవములు / దహించిపోవు నీలోకమున (2) / పాపము నిండె జగములో (2) / శాపము చేకూర్చుకొనే / లోకము.. శాపము చేకూర్చుకొనే ||పరవాసిని|| / తెలుపుము నా అంతము నాకు / తెలుపుము నా ఆయువు యెంతో (2) / తెలుపుము ఎంత అల్పుడనో (2) / విరిగి నలిగియున్నాను / నేను.. విరిగి నలిగియున్నాను ||పరవాసిని|| / ఆ దినము ప్రభు గుర్తెరిగితిని / నీ రక్తముచే మార్చబడితిని (2) / క్షమాపణ పొందితివనగా (2) / మహానందము కలిగే / నాలో.. మహానందము కలిగే ||పరవాసిని|| / యాత్రికుడనై ఈ లోకములో / సిలువ మోయుచు సాగెదనిలలో (2) / అమూల్యమైన ధనముగా (2) / పొందితిని నేను / యేసునే.. పొందితిని నేను ||పరవాసిని|| / నా నేత్రములు మూయబడగా / నాదు యాత్ర ముగియునిలలో (2) / చేరుదున్ పరలోక దేశము (2) / నాదు గానము ఇదియే / నిత్యము.. నాదు గానము ఇదియే ||పరవాసిని||
పరిశుద్ధ గ్రంథము – వాగ్ధాన నిలయము / ప్రేమకు ప్రతిరూపము – నిరీక్షణకాధారము (2) / బాధలను తొలగించును / అనుదినము వాక్యమును ధ్యానించినా / ఆదరణ కలిగించును / అనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ|| / సరిచేసి బలపరచును / అనుదినము వాక్యమును ధ్యానించినా / క్షమియించుట నేర్పించును / అనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ|| / సహనమును దయచేయును / అనుదినము వాక్యమును ధ్యానించినా / ప్రభు రాకకై స్థిరపరచును / అనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ||
పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా (2) / వరదూతలైనా నిన్ – వర్ణింప గలరా / వరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరా / పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ (2) / నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావా / నిరుపమ బలబుద్ధి (3) నీతి ప్రభావా / పరిశుద్ధ తనయుడ – నర రూప ధారుడ (2) / నరులను రక్షించు – కరుణా నముద్రా / నరులను రక్షించు (3) కరుణా నముద్రా / పరిశుద్ధ మగు నాత్మ – వరము లిడు నాత్మ (2) / పరమానంద ప్రేమ – భక్తుల కిడుమా / పరమానంద ప్రేమ (3) భక్తుల కిడుమా / జనక కుమారాత్మ – లను నేక దేవ (2) / ఘన మహిమ చెల్లును – దనర నిత్యముగా / ఘన మహిమ చెల్లును (3) దనర నిత్యముగా
పరిశుద్ధాత్ముడా నీకే వందనం (4) / ఆదరణ కర్తా సమాధాన కర్త (2) / సర్వ సత్యములోనికి నడిపే / మా ప్రియా దైవమా (2) ||పరిశుద్ధాత్ముడా|| / స గ గ గ గ మ గ రి స ని ద ప / స గ గ గ గ మ గ ని గ మ / స గ గ గ గ మ గ రి స ని ద ప / ప ద ని రి స.. రి స / మాతోనే ఉండిన వేళ శక్తితో నింపబడుదుము / సర్వ లోకానికి మేము సాక్ష్యమిచ్చెదం (2) / శక్తి చేత కానే కాదు / బలముతోను కానే కాదు (2) / నీ ఆత్మ ద్వారా జరుగును కార్యములు / నీ వల్లే జరుగును మహిమలు (2) ||పరిశుద్ధాత్ముడా|| / దేవుని రాజ్యమనగా నీతియు సమాధానము / పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందము (2) / ఆత్మ గల వాడే దేవుని వాడు / ఆత్మ మూలముగా జీవించును (2) / విజ్ఞాపనమును చేయును మన పక్షముగా / సమస్తమును బోధించును (2) ||పరిశుద్ధాత్ముడా||
పరిశుద్ధుడవై – మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు / బలవంతుడవై – దీనుల పక్షమై కృప చూపు వాడవు (2) / దయాళుడవై – ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడా / ఆరాధన నీకే నా యేసయ్యా / స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడవై|| / నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిను సేవించుటకు / నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి (2) / శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి / నీ దాసుల ప్రార్ధనలు సఫలము చేసితివి ||ఆరాధన|| / నీ నిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు / నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి (2) / నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి / నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి ||ఆరాధన|| / ఆనందకరమైన దేశములో నేను నిను ఘనపరచుటకు / నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి (2) / మేఘ వాహనుడవై వచ్చుఁవరకు నే కనిపెట్టుచుందును నీ కోసము / నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదవు ||ఆరాధన||
పరిశుద్ధుడా నా యేసయ్యా – నిన్నే స్తోత్రింతును / మహోన్నతుడా నా తండ్రి – నిన్నే ఘనపరతును / ప్రభువా పూజార్హుడా – మహిమ సంపన్నుడా / యెహోవా విమోచకూడా – ఆశ్రయ దుర్గమా (2) / అభిషిక్తుడా ఆరాధ్యుడా – నిన్నే ప్రేమింతును / పదివేలలో అతిసుందరుడా – నీలోనే హర్షింతునూ / రాజా నా సర్వమా – నీకే స్తుతికీర్తనా / నీతో సహవాసము – నిత్యం సంతోషమే (2) ||పరిశుద్ధుడా||
పరిశుద్ధుడా పరిశుద్ధుడా / నీ సన్నిధిలో మోకరించెదా / ప్రాణాత్మతో శరీరముతో / జయమని పాడెదా / హోసన్నా జయమే – (8) / గొర్రెపిల్లా గొర్రెపిల్లా / నీవంటి వారు ఎవరున్నారయ్యా / లోక పాపం మోసుకున్న / దావీదు తనయుడా / హోసన్నా జయమే – (8) / ప్రతి రోజు ప్రతి నిమిషము / జయమని పాడెదా – (2) / ప్రతి చోట ప్రతి స్థలములో / జయమని చాటెదా – (2)
పరిశుద్ధుడా పావనుడా / అత్యున్నతుడా నీవే (2) / నీ నామమునే స్తుతియించెదా / నీ నామమునే ఘనపరచెదా (2) / నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణ / నీలోనే విజయము నీలోనే సంతోషం / ఆరాధన నీకే (6) / నా అడుగులో అడుగై – నా శ్వాసలో శ్వాసై / నే నడచిన వేళలో ప్రతి అడుగై (2) / నా ఊపిరి నా గానము / నా సర్వము నీవే నా యేసయ్యా / నీకేనయ్యా ఆరాధన ||ఆరాధన|| / నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా / నీ శక్తితో నను నింపు బలవంతుడా (2) ||ఆరాధన||