340 songs found

నల్లా నల్లాని చీకటి|Nallaa Nallaani Cheekati

ఎర్రాటి సూరీడు పడమటికి పయణమైయ్యిండు / తెల్లాటి జాబిల్లి మల్లెవోలె వికసించింది / ఓరి ఐజాకు…. ఓఓ ఓఓ / లై లై లై .. లై లై లై / నల్లా నల్లాని చీకటి / ఓరి ఐజాకు.. తెల్లా తెల్లాని యెన్నెల (2) / నల్లా నల్లని నీ హృదయము / యేసుకిస్తే తెల్లగ మారును (2) / తూర్పున చుక్క బుట్టె పాకలో యేసు బుట్టె / దూతొచ్చి వార్త జెప్పె గొల్లాలు గంతులేసె / తూర్పున చుక్క బుట్టె పాకలో యేసు బుట్టె / దూతొచ్చి వార్త జెప్పె చేయి రా సందడి చేయి (2) / సీకట్ల సుక్క బుట్టెరో / ఓరి ఐజాకు.. బెత్లెహేము ఎలిగి పాయెరో (2) / నీ మనస్సులో యేసు బుడితే / నీ బతుకే ఎలిగి పొవును (2) ||తూర్పున చుక్క|| / చల్లా చల్లాని చలిరో / ఓరి ఐజాకు.. ఎచ్చా ఎచ్చాని మంటారో / చల్లగుంటే సల్లారి పొతవ్ / ఎచ్చగుంటే యేసుతో ఉంటవ్ (2) ||తూర్పున చుక్క|| / హోయి ల హోయి లా రే / హోయి ల హోయి లా రే / హోయి ల హోయి లా రే / హోయి ల హోయి లా రే (2) / నల్లా నల్లాని చీకటి / ఓరి ఐజాకు.. తెల్లా తెల్లాని యెన్నెల (2) / హోయి ల హోయి లా రే / హోయి ల హోయి లా రే / హోయి ల హోయి లా రే / హోయి ల హోయి లా రే (2)

నా ఆశల పల్లకి|Naa Aashala Pallaki

నా ఆశల పల్లకి నీవే / నా ఊహల ఊట నీవే / నాలో ప్రతిధ్వనించే ప్రతి పదము నీవే (2) / యేసయ్యా యేసయ్యా / యేసయ్యా నా ఆశ నీవయ్యా (2) / ఎడారిలో నీటి కొరకు – ఆశపడు బాటసారిలా / నీ కొరకు నా ప్రాణం – ఆశపడుచున్నది (2) / నా ఆశ నీవైపే – నా ధ్యాస నీవైపే / దాహము తీర్చావని (2) / దాహము తీర్చావని ||యేసయ్యా|| / దిక్కులేని పక్షిగా నేను – నిరాశతో ఉండగా / నా ఆశ తీర్చావే – నీ దరి చేర్చావే (2) / నా గమ్యం నీవైపే – నా గానం నీ కొరకే / తోడుగ ఉన్నావని (2) / తోడుగ ఉన్నావని ||యేసయ్యా|| / స్నేహితులు లేరని – తోడెవరు రారని / నా మనసు నాలోన – దుఃఖించు సమయాన (2) / నా స్నేహం నీవయ్యావు – దుఃఖము తీర్చావు / ఆదరించావయ్యా (2) / ఆదరించావయ్యా ||యేసయ్యా||

నా కనుచూపు మేర|Naa Kanuchoopu Mera

నా కనుచూపు మేర – యేసు నీ ప్రేమ / పొంగి పారెనే – పొంగి పారెనే (2) / నే ప్రేమింతును – నా యేసుని మనసారా (2) / ఆరిపోవు లోక ప్రేమల కన్నా / ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న (2) ||నా కనుచూపు|| / నా కన్నీటిని తుడిచినా ప్రేమ / నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ (2) / ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ / నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు|| / నా దీన స్థితిని చూచిన ప్రేమ / తన శాశ్వత ప్రేమతో (నను) పిలిచిన ప్రేమ (2) / ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ / నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు|| / నా భారంబును మోసిన ప్రేమ / సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ (2) / ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ / నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు||