340 songs found

నన్ను నీవలె నిర్మించినను|Nannu Neevale Nirminchinanu

నన్ను నీవలె నిర్మించినను / కోల్పోతి దేవా నీ రూపమును / హేయ క్రియలతో సిలువేసినను / నాపై నీ కృపను తొలగించవెందుకు / నిను బాధించినా భరియించితివా / నా పాపం జ్ఞాపకమే రాలేదా (2) ||నన్ను నీవలె|| / ఎరిగి ఎరిగి చెడిపోతిని / తెలిసి తెలివిగా తప్పిపోతిని (2) / బ్రతికున్న శవమునై నేనుంటిని / అహము ముదిరి పది లేవలేకపోతిని (2) ||నన్ను నీవలె|| / భయభక్తులు లేని వెర్రివాడనై / కుంపటి ఒడిలో పెట్టుకుంటిని (2) / ఒక పూటకూటికై ఆశపడితిని / వ్యభిచారినై వెక్కివెక్కి ఏడ్చుచుంటిని (2) ||నన్ను నీవలె|| / సిల్వలో నీ శ్రమ చూడకుంటిని / కల్వరి ప్రేమను కానకుంటిని (2) / నిన్ను సిలువ వేయమని కేకలేసితి / అయినా క్షమించి కౌగిలించి ముద్దుపెట్టుకుంటివా (2) ||నన్ను నీవలె||

నన్ను పిలచిన దేవా|Nannu Pilachina Devaa

నన్ను పిలచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా / నీవు లేనిదే నేను లేనయ్యా (2) / నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప / హెచ్చించునది నీ కృప మాత్రమే (2) / నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును / నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా (2) యేసయ్యా … / ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు / తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు (2) / బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచె కృప (2) / నీ కృప లేకుంటేనే నేను లేను / నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే|| / నేనని చెప్పుటకు నాకేమి లేదు / సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు (2) / అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప (2) / నీ కృప లేకుంటేనే నేను లేను / నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||

నన్నెంతగా ప్రేమించితివో|Nannenthagaa Preminchithivo

నన్నెంతగా ప్రేమించితివో / నిన్నంతగా దూషించితినో / నన్నెంతగా నీవెరిగితివో / నిన్నంతగా నే మరచితినో / గలనా – నే చెప్పగలనా / దాయనా – నే దాయగలనా (2) / అయ్యా… నా యేసయ్యా / నాదం – తాళం – రాగం / ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2) / ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో / ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2) / ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో / ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2) ||గలనా|| / ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో / ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2) / ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో / ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2) ||గలనా||

నన్నెంతగానో ప్రేమించిన|Nannenthagaano Preminchina

నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా / నా దీన బ్రతుకునే దీవించిన దేవా (2) / నిన్నే ఆరాధింతును – నీలో ఆనందింతును (2) / నా యవ్వనమంతా… నా జీవితమంతా (2) ||నన్నెంతగానో|| / ధరలోని మన్నుతో సమమైన నన్ను / ఎన్నుకొని ఉన్నత స్థితికి చేర్చినావు (2) / అన్నీ నీవే నాకై సమకూర్చినావు / ఉన్నాను నీ తోడు భయపడకన్నావు (2) / వాక్యపు మన్నాతో పోషించిన నన్నే / ఎన్నడూ విడువని ఎడబాయని నిన్నే ||నిన్నే|| / దినమెల్ల నా కొరకే కనిపెట్టినావు / ఎల్లవేళలా నా తోడుగ నిలిచావు (2) / మెల్లని నీ స్వరముతో మాట్లాడినావు / చల్లని కరములతో నా కన్నీరు తుడిచావు (2) / పాపపు ముళ్ళును తొలగించుటకై నాలో / మరణపు విల్లును విరచిన దేవా నీలో ||నీలో||

నన్నెంతగానో ప్రేమించెను|Nannenthagaano Preminchenu

నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను / నా యేసుడు నా పాపము – నా శాపము / తొలగించెను నను కరుణించెను (2) ||నన్నెంత|| / సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2) / పడనీయక దరి చేరనీయక (2) / తన కృపలో నిరతంబు నను నిల్పెను (2) ||నన్నెంత|| / సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2) / నేర్పించెను నాకు చూపించెను (2) / వర్ణింపగా లేను ఆ ప్రభువును (2) ||నన్నెంత|| / కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2) / నా కోసమే యేసు శ్రమ పొందెను (2) / నా పాపమంతటిని క్షమియించెను (2) ||నన్నెంత|| / ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు (2) / ఏమిత్తును నేనేమిత్తును (2) / నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2) ||నన్నెంత||

నమ్మకమైన నా ప్రభు|Nammakamaina Naa Prabhu

నమ్మకమైన నా ప్రభు / నిన్ను నే స్తుతింతును – నిన్ను నే స్తుతింతును || నమ్మకమైన || / కరుణతోడ పిల్చియు – స్థిరపరచి కాపాడిన / స్థిరపరచి కాపాడిన / స్థిరపరచిన నా ప్రభున్ / పొగడి నే స్తుతింతును (2) || నమ్మకమైన || / ఎన్నో సార్లు నీ కృపన్ – విడచియుంటినో ప్రభు / విడచియుంటినో ప్రభు / మన్ననతోడ నీ దరిన్ / చేర్చి నన్ క్షమించితివి (2) || నమ్మకమైన || / కృంగియుండు వేళలో – పైకి లేవనెత్తితివి / పైకి లేవనెత్తితివి / భంగ పర్చు సైతానున్ / గెల్చి విజయమిచ్చితివి (2) || నమ్మకమైన || / నా కాశ్రయశైలమై – కోటగా నీవుంటివి / కోటగా నీవుంటివి / ప్రాకారంపు ఇంటివై / నన్ను దాచియుంటివి (2) || నమ్మకమైన || / సత్య సాక్షివై యుండి – నమ్మదగినవాడవై / నమ్మదగినవాడవై / నిత్యుడౌ మా దేవుడా / ఆమేనంచు పాడెద (2) || నమ్మకమైన ||

నమ్మకు ఇలలో|Nammaku Ilalo

నమ్మకు ఇలలో ఎవరిని / సాయం చేస్తారనుకొని (2) / నమ్ముకో రక్షకుడేసుని (2) / కార్యం చూడు నిలుచొని (2) ||నమ్మకు|| / సహాయము చేస్తామని వస్తారు ఎందరో నీ చెంతకు / చేయూతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుర్లు నీకు / అక్కరలడ్డం పెట్టుకొని లాభం పొందుతుంటారు (2) / శవాలపై కాసులేరాలని కాచుకొని చూస్తుంటారు (2) ||నమ్మకు|| / నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమౌతారు వెనువెంటనే / మేముండగా నీకేమని వెన్నంటి ఉంటారు నీ ఇంటనే / నీకున్న అవసరతలన్ని వారిపై వేసుకుంటారు (2) / దోచుకొని నీ సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు (2) ||నమ్మకు|| / నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి / జవాబును చూపిస్తామని పేలుస్తు ఉంటారులే కుంపటి / సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు (2) / రహస్యాలను బయటేసి నిను అల్లరి చేస్తుంటారు (2) ||నమ్మకు||

నమ్మకురా నమ్మకురా|Nammakuraa nammakuraa

నమ్మకురా నమ్మకురా ఈ లోకం నమ్మకురా / నమ్ముకోరా నమ్ముకోరా ప్రభుయేసుని నమ్ముకోరా (2) / మత్తును నమ్మకురా గమ్మత్తులు సేయకురా / ఆత్మను హత్తుకోరా ఆరోగ్యం పొందుకోరా ||నమ్మకురా|| / ధనము చదువు నేర్పునురా – సంస్కారం నేర్పదురా / ధనము మందులు కొనునురా – ఆరోగ్యం ఇవ్వదురా (2) / వస్తువాహనాల కాధారం / సుఖ సంతోషాలకు బహుదూరం (2) ||నమ్మకురా|| / ధనము పెళ్ళి చేయునురా – కాపురము కట్టదురా / ధనము సమాధి కట్టునురా – పరలోకం చేర్చదురా (2) / డబ్బును నమ్మకురా / గబ్బు పనులు చేయకురా (2) ||నమ్మకురా|| / ధనము ఆస్తిని పెంచునురా – అనురాగం తుంచునురా / ధనము పొగరు పెంచునురా – పరువు కాస్త తీయునురా (2) / ధనము కోరిక తీర్చునురా / నరకానికి చేర్చునురా (2) ||నమ్మకురా||

Telugu Songs Starting with "న" — Page 2 | UEC Telugu Church