340 songs found

నీ రక్తమే నీ రక్తమే|Nee Rakthame Nee Rakthame

నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్ / నీ రక్తమే నా బలము (2) / నీ రక్త ధారలే ఇల / పాపికాశ్రయంబిచ్చును (2) / పరిశుద్ధ తండ్రి పాపిని / కడిగి పవిత్ర పరచుము (2) ||నీ రక్తమే|| / నశించు వారికి నీ సిలువ / వెర్రితనముగ నున్నది (2) / రక్షింపబడుచున్న పాపికి / దేవుని శక్తియై యున్నది (2) ||నీ రక్తమే|| / నీ సిల్వలో కార్చినట్టి / విలువైన రక్తముచే (2) / పాప విముక్తి చేసితివి / పరిశుద్ధ దేవ తనయుడా (2) ||నీ రక్తమే|| / పంది వలె పొర్లిన నన్ను / కుక్క వలె తిరిగిన నన్ను (2) / ప్రేమతో చేర్చుకొంటివి / ప్రేమార్హ నీకే స్తోత్రము (2) ||నీ రక్తమే|| / నన్ను వెంబడించు సైతానున్ / నన్ను బెదరించు సైతానున్ (2) / దునుమాడేది నీ రక్తమే / దహించేది నీ రక్తమే (2) ||నీ రక్తమే|| / స్తుతి మహిమ ఘనతయు / యుగయుగంబులకును (2) / స్తుతి పాత్ర నీకే చెల్లును / స్తోత్రార్హుడా నీకే తగును (2) ||నీ రక్తమే||

నీ రూపం నాలోన|Nee Roopam Naalona

నీ రూపం నాలోన – ప్రతిబింబమై వెలుగనీ / నీ ప్రేమా నీ కరుణా – నా హృదిలోన ప్రవహించనీ (2) / రాజువు నీవే కదా – నీ దాసుడ నేనే కదా (2) / ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2) / నీ రూపము నాలో ముద్రించనీ (2) ||నీ రూపం|| / నా ముందు నీవు ఎడారులన్ని / నీటి ఊటలుగా మార్చెదవే (2) / దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2) / ఆశీర్వాదము నీవే రాజా (2) ||నీ రూపం|| / నా పాప స్వభావం తొలగించుమయ్యా / నీ మంచి ప్రేమ నాకీయుమా (2) / నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి (2) / హృదయాసీనుడా నా యేసయ్యా (2) ||నీ రూపం|| / అంధకారము వెలుగుగా మార్చి / శాంతి మార్గములో నడిపెదవే (2) / భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే (2) / భుజమును తట్టి నడిపెదవే (2) ||నీ రూపం||

నీ వాక్యమే నన్ను బ్రతికించెను|Nee vaakyame nannu brathikinchenu

నీ వాక్యమే నన్ను బ్రతికించెను / బాధలలో నెమ్మదినిచ్చెను (2) / కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా / వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2) ||నీ వాక్యమే|| / జిగటగల ఊభినుండి లేవనెత్తెను / సమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2) / నా పాదములకు దీపమాయెను (2) / సత్యమైన మార్గములో నడుపుచుండెను (2) ||నీ వాక్యమే|| / శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై / యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2) / అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2) / ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది (2) ||నీ వాక్యమే|| / పాలవంటిది జుంటి తేనె వంటిది / నా జిహ్వకు మహా మధురమైనది (2) / మేలిమి బంగారు కన్న మిన్న అయినది (2) / రత్న రాసులకన్నా కోరతగినది (2) ||నీ వాక్యమే||

నీ వాక్యమే నన్ను బ్రతికించెను|Nee Vaakyame Nannu Brathikinchenu

నీ వాక్యమే నన్ను బ్రతికించెను / బాధలలో నెమ్మదినిచ్చెను (2) / కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా / వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2) ||నీ వాక్యమే|| / జిగటగల ఊభినుండి లేవనెత్తెను / సమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2) / నా పాదములకు దీపమాయెను (2) / సత్యమైన మార్గములో నడుపుచుండెను (2) ||నీ వాక్యమే|| / శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై / యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2) / అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2) / ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది (2) ||నీ వాక్యమే|| / పాలవంటిది జుంటి తేనె వంటిది / నా జిహ్వకు మహా మధురమైనది (2) / మేలిమి బంగారు కన్న మిన్న అయినది (2) / రత్న రాసులకన్నా కోరతగినది (2) ||నీ వాక్యమే||

నీ వాక్యమే శ్రమ కొలిమిలో|Nee Vaakyame Shrama Kolimilo

నీ వాక్యమే శ్రమ కొలిమిలో / నను బ్రతికించుచున్నది (2) / నా బాధలో అది బహు నెమ్మది / కలిగించుచున్నది (2) ||నీ వాక్యమే|| / శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము / సంతోషమీయని యెడల (2) / బహు కాలము క్రితమే నేను – నశియించియుందునయ్యా / నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతున్ (2) ప్రభు ||నీ వాక్యమే|| / నీ శాసనములే ఆలోచన- / కర్తలై నన్ను నడుపుట వలన (2) / నా శత్రువుల మించిన జ్ఞానము – నాకిలను కలిగెనయ్యా / నీ ఆజ్ఞలను నేను తలదాల్తును (2) ప్రభు ||నీ వాక్యమే|| / వేలాది వెండి బంగారు నాణెముల / విస్తార ధన నిధి కన్నా (2) / నీ ధర్మశాస్త్రము యెంతో – విలువైన నిధి ప్రభువా / నీ ఆజ్ఞలను బట్టి నిను పొగడడం (2) ప్రభు ||నీ వాక్యమే||

నీ సన్నిధిలో నేనున్న|Nee Sannidhilo Nenunna

నీ సన్నిధిలో నేనున్న చాలు – చాలు / నీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలు / శ్రమ కాలమైనా తోడుగ నీవుండ / నీ నామ ధ్యానం నే చేతునయ్యా / నీతోనే నేను ఉంటానయ్యా (2) / నా జీవితాన నీవున్న చాలు – చాలయ్యా / నీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలయ్యా ||నీ సన్నిధిలో|| / అర్పించినావు నా కొరకు నీ ప్రాణం / నా పాప భారం తొలగింప గోరి / నాతోనే నీవు ఉండాలని (2) / ఆశించినది నా రక్షణేగా – నీవు / నీతోనే నేను ఉంటాను ప్రభువా – యేసు ||నీ సన్నిధిలో|| / నను చంపబోయి సాతాను రాగా / నీ చేతి గాయం రక్షించునయ్యా / నీ ప్రేమయే నన్ను బ్రతికించునయ్యా (2) / నమ్మాను ప్రభువా నీదైన లోకం – లోకం / నీతోనే ఉన్నా అది నాకు సొంతం – సొంతం ||నీ సన్నిధిలో||