340 songs found

నీ ప్రియ ప్రభుని సేవకై|Nee Priya Prabhuni Sevakai

నీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవే / పవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే (2) / అంధకార జీవితమునకు – వెలుగు తెచ్చెను తానే (2) / ఆ వెలుగు ద్వారానే – నూతన మార్గము కలిగె (2) / సజీవ బలిగా నర్పించు – నీ జీవితమాయనకే (2) ||నీ ప్రియ|| / తప్పిపోతివి గతమందు – తప్పు దారిని నడిచితివి (2) / తన ప్రేమా హస్తమే – నిన్ను కాపాడి తెచ్చెను (2) / యెంతైన స్మరియించు నీవు – వింతైన తన ప్రేమన్ (2) ||నీ ప్రియ|| / ఓ ప్రియుడా తలచితివా – నీ జన్మమే పాపమని (2) / ప్రభువే తన రక్తముతో – నీ పాపము క్షమియించె (2) / నీ యుల్లము ఆయన కాలయమే – జ్ఞాపకముంచుకొనుము (2) ||నీ ప్రియ|| / యెవరతని సేవించెదరో – ఫలమొందెదరంతమందు (2) / ఇతరులకు లేనట్టి – ఆ ఘనతను నీ కిచ్చె (2) / కృతజ్ఞుడవై కొనియాడు – ప్రభు పాద సన్నిధిని (2) ||నీ ప్రియ||

నీ ప్రేమ ఎంతో|Nee Prema Entho

నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం (2) యేసు / యేసయ్యా నీ ప్రేమ మధురం / యేసయ్యా మధురాతి మధురం (2) ||నీ ప్రేమ|| / మరచిపోనిది నీ ప్రేమా / నన్ను మార్చుకున్నది నీ ప్రేమా / కన్ను రెప్ప లాంటిది నీ ప్రేమా / జీవ కాలముండును నీ ప్రేమా (2) ||నీ ప్రేమ|| / సిలువకెక్కెను నీ ప్రేమా / నాకు విలువ నిచ్చెను నీ ప్రేమా / నాకై మరణించెను నీ ప్రేమా / నాకై తిరిగి లేచెను నీ ప్రేమా (2) ||నీ ప్రేమ|| / తల్లికుండునా నీ ప్రేమా / సొంత చెల్లికుండునా నీ ప్రేమా / అన్నకుండునా నీ ప్రేమా / కన్న తండ్రికుండునా నీ ప్రేమా (2) ||నీ ప్రేమ|| / త్యాగమున్నది నీ ప్రేమలో / దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో / బలమున్నది నీ ప్రేమలో / గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో (2) ||నీ ప్రేమ||

నీ ప్రేమ నా జీవితాన్ని|Nee Prema Naa Jeevithaanni

నీ ప్రేమ నా జీవితాన్ని – నీకై వెలిగించెనే యేసయ్యా / నీ కృప సెలయేరులా – నాలో ప్రవహించెనే (2) / నన్ను క్షమియించెనే – నన్ను కరుణించెనే / నన్ను స్థిరపరచెనే – నన్ను ఘనపరచెనే (2) / యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా / యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా (2) / నేను నిన్ను విడచిననూ – నీవు నన్ను విడువలేదయ్యా / దారి తప్పి తొలగిననూ – నీ దారిలో నను చేర్చినావయ్యా (2) / ఏమివ్వగలను నీ కృపకు నేను / వెలకట్టలేను నీ ప్రేమను (2) / జలములు నన్ను చుట్టిననూ – నీ చేతిలో నను దాచినావయ్యా / జ్వాలలు నాపై లేచిననూ – నీ ఆత్మతో నను కప్పినావయ్యా (2) / ఏమివ్వగలను నీ కృపకు నేను / వెలకట్టలేను నీ ఆత్మను (2)

నీ ప్రేమ నాలో మధురమైనది|Nee Prema Naalo Madhuramainadi

నీ ప్రేమ నాలో మధురమైనది / అది నా ఊహకందని క్షేమ శిఖరము (2) / ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను / పరవశించి నాలో మహిమపరతు నిన్నే / సర్వకృపానిధి నీవు – సర్వాధికారివి నీవు / సత్య స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే ||నీ ప్రేమ|| / చేరితి నిన్నే విరిగిన మనస్సుతో / కాదనలేదే నా మనవులు నీవు (2) / హృదయము నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం / నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం (2) / ఇది నీ బాహు బంధాల అనుబంధమా / తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే / నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ|| / నా ప్రతి పదములో జీవము నీవే / నా ప్రతి అడుగులో విజయము నీవే (2) / ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాదా / నీడగా నాతో నిలిచే – నీ కృపయే నాకు చాలును (2) / ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా / తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే / నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ|| / నీ సింహాసనము నను చేర్చుటకు / సిలువను మోయుట నేర్పించితివి (2) / కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు / దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు (2) / ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా / తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే / నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ||

నీ ప్రేమకు సాటి లేదయా|Nee Premaku Saati Ledayaa

నీ ప్రేమకు సాటి లేదయా / యేసయ్యా… నీ సన్నిధి నాకు మేలయ్యా (2) / నా కొరకై ప్రాణమిచ్చితివి / నా కొరకై సిలువనెక్కితివి (2) / కరుణించి కాపాడుమా నా యేసయ్యా / కన్నీటి ప్రార్దన ఆలకించుమా (2) ||నీ ప్రేమకు|| / అవిశ్వాసురాలై నేనుండగా అంధకారమందు రక్షించితివే / నా దీనస్థితిలో నా దరికి చేరి నీ వాక్యముతో బలపరచితివే (2) / మనోహరమైన నీ కృపనిచ్చి నన్నాదరించితివే (2) / నా బ్రతుకు దినములన్ని నిను వేడెదన్ నా యేసయ్యా (2) / నా యేసయ్యా…. ||నీ ప్రేమకు|| / ఏమివ్వగలను నీ ప్రేమకు నా సర్వము నీవేనయా / నా అతిశయము ఆధారము నాకన్నియు నీవేనయా (2) / విశ్వాసముతో నీటిపైన నన్ను నడువనిమ్ము (2) / నా అడుగులు తడబడగా నన్నెత్తుకో నా యేసయ్యా (2) / నా యేసయ్యా…. ||నీ ప్రేమకు||

నీ ప్రేమలో నుండి నన్ను|Nee Premalo Nundi Nannu

నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు (2) / శ్రమలైనను శత్రువైనను / నిన్ను నన్ను వేరు చేయలేవు / యేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యా / యేసయ్యా యేసయ్యా నిను విడువలేనయ్యా (2) / క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్యా (2) ||నీ ప్రేమలో|| / జీవించుచున్నది నేను కాదు / క్రీస్తే నాలో జీవిస్తున్నాడు (2) / ఏదేమైనా నాకు యేసే కావాలి / ఎవరేమన్నా నాకు యేసే కావాలి (2) ||యేసయ్యా|| / నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం / నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను (2) / ఏమిచ్చినా నీకు స్తోత్రాలే / ఏమివ్వక పోయినా వందనాలే (2) ||యేసయ్యా|| / ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను / నీ కోసమే నీ ప్రేమ కోసమే (2) / నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే / చావైననేమి అది లాభమే (2) ||యేసయ్యా||

నీ ప్రేమా నీ కరుణా|Nee Premaa Nee Karunaa

నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితాన / మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన / చాలయ్య చాలీ దీవెనలు చాలు / మేలయ్య మేలు నీ సన్నిధి మేలు (2) / గురిలేని నన్ను గుర్తించినావే / ఎనలేని ప్రేమను చూపించినావే / వెలలేని నాకు విలువిచ్చినావే / విలువైన పాత్రగా నను మార్చినావే ||నీ ప్రేమా|| / చేజారిన నాకై చేచాచినావే / చెదరిన నా బ్రతుకును చేరదీసినావే / చెరనుండి నన్ను విడిపించినావే / చెరగని నీ ప్రేమకు సాక్షిగ మార్చావే ||నీ ప్రేమా|| / నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే / కల్వరిలో ప్రాణమిచ్చి నను కొన్నావే / నీ ప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే / నీ కుమారునిగా నను మార్చినావే ||నీ ప్రేమా||

నీ మందిరమై నేనుండగా|Nee Mandiramai Nenundagaa

నీ మందిరమై నేనుండగా / నా యందుండి నడిపించవా (2) / నీవు తోడుండగా నాకు దిగులుండునా (2) / వెంబడిస్తాను నిను యేసువా (2) / నీవు కోరేటి దేవాలయం / నాదు దేహంబెగా నిశ్చయం (2) / నీదు ప్రత్యక్షత నాకు కలిగించవా (2) / నిత్యము నిన్ను స్తుతింతును (2) / నీ మందిరమై నేనుండగా... / నాడు నిర్మించే దేవాలయం / రాజు సొలొమోను బహుసుందరం (2) / అట్టి దేవాలయం నేను నిర్మించగా (2) / నీ కట్టడలో నను నిల్పుమా (2) / నీ మందిరమై నేనుండగా... / హన్న ప్రార్ధనను విన్నావుగా / నేనున్నానని అన్నావుగా (2) / నేడు సమూయెలుతో బహుగా మాట్లాడినా (2) / దేవా నాతోటి మాట్లాడవా (2) / నీ మందిరమై నేనుండగా... / ఆత్మసత్యముతో ఆరాధింప / ఆత్మదేవుండు నేర్పించుమా (2) / మహిమ రూపంబును నేను దర్సింపను (2) / నా నేత్రంబు వెలిగించుమా (2) / నీ మందిరమై నేనుండగా... / ఆ పరలోక ప్రతిబింబమై / ఈ ధరలోన దీపంబునై (2) / ధరణి వెలిగించను కరుణ ప్రసరింపను (2) / కరము తోడుంచి నడిపించుము (2) / నీ మందిరమై నేనుండగా...

Telugu Songs Starting with "న" — Page 19 | UEC Telugu Church