340 songs found
నీ కృప నాకు చాలును / నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2) / నీ కృప లేనిదే నే బ్రతుకలేను / జల రాసులన్ని ఏక రాసిగా / నిలిచిపోయెనే నీ జనుల ఎదుట (2) / అవి భూకంపాలే అయినా / పెను తుఫానులే అయినా (2) / నీ కృపయే శాశించునా / అవి అణగిపోవునా (2) ||నీ కృప|| / జగదుద్పత్తికి ముందుగానే / ఏర్పరచుకొని నన్ను పిలచితివా (2) / నీ పిలుపే స్థిరపరచెనే / నీ కృపయే బలపరచెనే (2) / నీ కృపయే ఈ పరిచర్యను / నాకు అనుగ్రహించెను (2) ||నీ కృప||
నీ కృప నిత్యముండును / నీ కృప నిత్య జీవము / నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2) / నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది / రక్షణ సంగీత సునాదము (2) ||నీ కృప|| / శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె / కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2) / కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2) ||నీ కృప|| / ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె / ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2) / ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2) ||నీ కృప|| / అనుభవ అనురాగం కలకాలమున్నట్లె / నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2) / రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా (2) ||నీ కృప||
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా / నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా / నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము / నేనూహించలేను యేసయ్యా (2) / యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా / నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప|| / మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి / మార్గముగా మారి మనిషిగా మార్చావు / మహిని నీవు మాధుర్యముగా మార్చి / మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2) / మహిమలో నేను మహిమను పొంద / మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా|| / ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి / ఆపత్కాలమున ఆదుకొన్నావు / ఆత్మీయులతో ఆనందింప చేసి / ఆనంద తైలముతో అభిషేకించావు (2) / ఆశ తీర ఆరాధన చేసే / అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా||
నీ కృప లేనిచో ఒక క్షణమైననూ / నే నిలువజాలనో ప్రభు (2) / నీ కృప లేనిచో ఒక క్షణమైననూ / నే నిలువజాలనో ప్రభు (2) / ప్రతి క్షణం కనుపాపలా / నను కాయుచున్న దేవుడా (2) ||నీ కృప|| / ఈ ఊపిరి నీదేనయ్యా / నీవిచ్చిన దానం నాకై / నా ఆశ నీవేనయ్యా / నా జీవితమంతా నీకై (2) / నిను నే మరతునా మరువనో ప్రభు / నిను నే విడతునా విడువనో ప్రభు (2) ||నీ కృప|| / నా ఐశ్వర్యమంతా నీవే / ఉంచినావు నీ దయ నాపై / నీ దయ లేనిచో నాపై / ఉందునా ఈ క్షణమునకై (2) / కాచి ఉంచినావయ్యా – ఇంత వరకును / నను వీడిపోదయ్యా – నాకున్న నీ కృప (2) ||నీ కృప||
నీ కృపను గూర్చి నే పాడెదా / నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా (2) / నిత్యము నే పాడెదా / నా ప్రభుని కొనియాడెదా (2) / మహిమా ఘనతా / ప్రభావము చెల్లించెదా (2) ||నీ కృపను|| / ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా / నిందలో అపనిందలో నాకు తోడు నీడగా (2) / నా యేసు నాకుండగా / నా క్రీస్తే నా అండగా / భయమా దిగులా / మనసా నీకేలా (2) ||నీ కృపను|| / వాక్యమై వాగ్ధానమై నా కొరకై ఉదయించినా / మరణమే బాలియాగమై నన్ను విడిపించినా (2) / నా యేసు నాకుండగా / నా క్రీస్తే నా అండగా / భయమా దిగులా / మనసా నీకేలా (2) ||నీ కృపను||
నన్ను పిలిచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా / నీవు లేనిదే నేను లేనయ్యా (2) / నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప / హెచ్చుంచునది నీ కృప మాత్రమే (2) / నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును / నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా (2) యేసయ్యా… / ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు / తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు (2) / బిగ్గరిగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచే కృప (2) / నీ కృప లేకుంటేనే నేను లేను / నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే|| / నేనని చెప్పుటకు నాకేమి లేదు / సామర్ధ్యము అనుటకు నాకని ఏమి లేదు (2) / అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప (2) / నీ కృప లేకుంటేనే నేను లేను / నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||
నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది / నీ కొరకు నా కనులు ఎదురు చూచుచున్నవి (2) / హృదయమంత వేదనతో నిండియున్నది / ఆదరణే లేక ఒంటరైనది (2) / దేవా నా కన్నీరు తుడువుము / హత్తుకొని నన్ను ముద్దాడుము (2) / పాపం చేసి నీకు దూరమయ్యాను / నన్ను గన్న ప్రేమని విడిచి నేను వెళ్లాను (2) / నీ మాటలను మీరి లోకాన్ని చేరాను / పాపాన్ని ప్రేమించి హీనుడనయ్యాను (2) ||దేవా|| / నీ హృదయ వేదనకు కారణమైనాను / దోషిగా నీ యెదుట నే నిలిచియున్నాను (2) / నను మన్నించుమా నా తండ్రి (2)
నీ చరణములే నమ్మితి నమ్మితి / నీ పాదములే పట్టితి (2) ||నీ చరణములే|| / దిక్కిక నీవే చక్కగ రావే (2) / మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీ చరణములే|| / ఐహిక సుఖము – నరసితి నిత్యము (2) / ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని ||నీ చరణములే|| / న్యాయము గాని – నా క్రియలన్ని (2) / రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు ||నీ చరణములే|| / భావము మార్చి – నావెత దీర్చి (2) / దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే ||నీ చరణములే|| / చంచల బుద్ధి – వంచన యెద్ది (2) / ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే ||నీ చరణములే|| / చుర్రుకొని యున్న – శోధనలున్న (2) / పట్టు విడ గొట్టవే కొట్టవే కొట్టవే ||నీ చరణములే|| / నాచు పిశాచి – నరుకుట గాచి (2) / కాచుకో దాచవే దాచవే దాచవే ||నీ చరణములే|| / యేసుని తోడ – నెవ్వరు సాటి (2) / దోసము బాపును బాపును బాపును ||నీ చరణములే||
నీ చల్లని నీడలో / నీ చక్కని సేవలో (2) / నా బ్రతుకు సాగనిమ్మయ్యా / యేసయ్యా – నా బ్రతుకు సాగనిమ్మయ్యా (2) ||నీ చల్లని|| / కష్టాలు ఎన్ని వచ్చినా / వేదనలు ఎదురైనా (2) / నీ కృప నాకు చాలు నీ కాపుదల మేలు / నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా (2) ||నీ చల్లని|| / ఏర్పరచబడిన వంశములో / రాజులైన యాజకులుగా చేసితివి (2) / పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా / నీ కొరకే జీవించుట నాకు భాగ్యము (2) ||నీ చల్లని||
నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభు / నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీ ప్రభు (2) / నీ ప్రేమా నా లోనా (2) / ప్రతిక్షణం అనుభవించనీ (2) ||నీ చల్లనైన|| / మట్టి వంటిది నా జీవితం / గాలి పొట్టు వంటిది నా ఆయుషు (2) / పదిలముగా నను పట్టుకొని (2) / మార్చుకుంటివా నీ పోలికలో (2) / మరణ భయమిక లేదంటివి (2) ||నీ చల్లనైన|| / మారా వంటిది నా జీవితం / ఎంతో మదురమైనది నీ వాక్యం (2) / హృదయములో నీ ప్రేమా (2) / కుమ్మరించుమా జుంటి తేనెలా (2) / (ఆహా) మధురం మధురం నా జీవితం (2) ||నీ చల్లనైన|| / అల్పమైనది నా జీవితం / ఎంతో ఘనమైది నీ పిలుపు (2) / నీ సేవలో నే సాగుటకు (2) / నను నింపుమా నీ ఆత్మ శక్తి తో (2) / నే ఆగక సాగెద నీ సేవలో (2) ||నీ చల్లనైన||
నీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని / నీ కృపావరమునే దానముగా దయచేసి (2) / నీ ప్రేమలో పరవశించి / నీ సన్నిధిలో నే చేరి / నీ నామమును నీ ప్రేమను నేను ఘనపరచెదను / దేవా… నా దేవా… / నా యేసయ్యా నా రక్షకుడా (2) ||నీ చిత్తమునే|| / హృదయము బద్దలై ఏడ్చిన వేళ / కన్నీటి ప్రార్దన చేసిన వేళ (2) / నీ చిత్తముకై నే ఎదురు చూసి / నీ బలము పొంద సహియింప చేసి / నా ప్రాణమును తృప్తి పరచితివే ||దేవా|| / నాలోని ప్రాణం తల్లడిల్లిపోగా / భూదిగంతములనుండి మొర్ర పెట్టుచున్నాను (2) / నా శత్రువుపైనే జయమునిచ్చి / నా ఆశ్రయమై ధైర్యమును నింపి / నా కోట నీవైతివే ||దేవా||
నీ చేతి కార్యములు సత్యమైనవి / నీ నీతి న్యాయములు ఉన్నతమైనవి (2) / నీ ఆజ్ఞలు కృపతో నిండియున్నవి / నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి (2) / బల సౌందర్యములు / పరిశుద్ధ స్థలములో ఉన్నవి / ఘనతా ప్రభావములు / ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి (2) / మాపై నీ ముఖ కాంతిని / ప్రకాశింపజేయుము యేసయ్యా / నీ ఆలోచనలు గంభీరములు / నీ శాసనములు హృదయానందకరములు (2) / నీ మహిమ ఆకాశమంత వ్యాపించియున్నవి / నీ ప్రభావం సర్వ భూమిని కమ్ముచున్నవి (2) ||బల సౌందర్యములు|| / ఎవర్లాస్టింగ్ ఫాదర్ / యువర్ గ్రేస్ ఎండ్యూర్స్ ఫరెవర్ / ఎవర్లాస్టింగ్ ఫాదర్ – మై జీసస్ / నిత్యుడైన తండ్రి / నీ కృప నిరతము నిలచును / నిత్యుడైన తండ్రి – నా యేసయ్య / నీ రూపము ఎంతో మనోహరము / నీ అనురాగము మధురాతి మధురము (2) / నీ నామము నిత్యము పూజింపతగినది / నీ విశ్వాస్యత నిరతము నిలచునది (2) ||బల సౌందర్యములు||