340 songs found
నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా / వేకువనే లేచి నా ప్రభునే కొనియాడెదా (2) / యేసయ్యా… యేసయ్యా… స్తుతులకు పాత్రుడవు నీవయ్యా / యేసయ్యా… యేసయ్యా… మాహిమ ఘనతలు నీకయ్యా (2) ||నిబ్బరముతో|| / కష్టకాలమందు నాకు – కనికరము చూపెను / కాలుజారుతున్నవేళ – కరుణతో నిలిపెను (2) / కడుపు కాలుతున్నవేళ – నా కడుపు నింపెను / కన్నిటి బ్రతుకును – నాట్యముగా మార్చెను / కఠినమైన కాలములో – నా చెంత నిలిచెను ||యేసయ్యా|| / దిక్కుదెసలేని నాకు – దర్శనము నిచ్చెను / ధనము ఘనము లేని నాకు ఘనతనెంతో నిచ్చెను (2) / దిక్కుతోచని వేళ – నా దిక్కై నిలిచెను / దుష్ట శక్తులన్నిటిని – నాకు దూరపరచెను / దీవెనలు కుమ్మరించి – ధన్యునిగా చేసెను ||యేసయ్యా||
నిరంతరం నీతోనే జీవించాలనే / ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2) / నా ప్రాణేశ్వరా యేసయ్యా / నా సర్వస్వమా యేసయ్యా ||నిరంతరం|| / చీకటిలో నేనున్నప్పుడు / నీ వెలుగు నాపై ఉదయించెను (2) / నీలోనే నేను వెలగాలని / నీ మహిమ నాలో నిలవాలని (2) / పరిశుద్ధాత్మ అభిషేకముతో / నన్ను నింపుచున్నావు నీ రాకడకై ||నిరంతరం|| / నీ రూపము నేను కోల్పయినా / నీ రక్తముతో కడిగితివి (2) / నీతోనే నేను నడవాలని / నీ వలెనే నేను మారాలని (2) / పరిశుద్ధాత్మ వరములతో / అలంకరించుచున్నావు నీ రాకడకై ||నిరంతరం|| / తొలకరి వర్షపు జల్లులలో / నీ పొలములోని నాటితివి (2) / నీలోనే చిగురించాలని / నీలోనే పుష్పించాలని (2) / పరిశుద్ధాత్మ వర్షముతో / సిద్ధపరచుచున్నావు నీ రాకడకై ||నిరంతరం||
నిరంతరమైన నీ కృపలో / నే పొందుచున్న ఆనందమే అది / అవధులు లేని ఆనందమే అది / శాశ్వతమైన ఆనందమే (2) ||నిరంతరమైన|| / అర్హతే లేని నాకు అందలము నిచ్చినావు / అపవాదినెదిరించుటకు అధికారమిచ్చినావు (2) / నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే / నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే (2) ||నిరంతరమైన|| / బలహీనుడైన నన్ను బలవంతుని చేసినావు / బలమైన కార్యములను బహుగా చేయించినావు (2) / నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే / నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే (2) ||నిరంతరమైన|| / మహిమా ప్రభావము నీకే చెల్లింతు మహిమోన్నతుడా / మరణమైన నిన్ను విడువను నా పరుగు ముగిసేదాకా (2) / నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే / చావైతే అది ఎంతో మేలే (2) ||నిరంతరమైన||
నిరతము స్తుతియించుము ఓ మనసా / క్రీస్తేసుని స్తుతించు (2) / బాధలను తీర్చేటి ఆ స్తోత్రార్హుని / కష్టాలు తొలగించే ఆ కరుణశీలుని (2) / మరువక స్తుతియించుము ఓ మనసా / జయగీతముతో స్తుతించు ||నిరతము|| / వేదనలో విడిపించే ఆ దేవ దేవుని స్తుతియించుము / ఆపదలో ఆదుకొనే ఆరాధ్య దైవమునే స్తుతియించుము (2) / నిన్నిలలో ఓదార్చి తన కృపలో బలపరచే (2) / ఆ నిజ స్నేహితుని / కృతజ్ఞత కలిగి స్తుతియించుము – (2) ||నిరతము|| / అన్ని సమయాలలో చాలిన దేవుని స్తుతియించుము / పేరు జీవ గ్రంథములో వ్రాసిన గొర్రెపిల్లని స్తుతియించుము (2) / నీ భారం తొలగించి / తన కృపలో ఆదరించే (2) / నీ ఆత్మ కాపరియైన / పరిశుద్ధాత్ముని స్తుతియించుము – (2) ||నిరతము||
నిశిరాత్రి సుడిగాలిలో చిక్కితిని / ఊపిరితో మిగిలెదనా ఉదయానికి / తడవు చేయక యేసు నను చేరుకో / నా ప్రక్కనే ఉండి నను పట్టుకో / భయముండగలదా నీవున్నచో / నా చేయి నీ చేతిలో ఉండగా ||నిశిరాత్రి|| / ఈ చీకటి సమయం నిలిచెను నా ఈ పయనం / కనిపించక దారులు మొదలాయెను కలవరము / వీచే ఈ గాలులలో నే కొట్టుకుపోకుండా / తప్పించెదవని దేవా ఆశతో నే వేచితిని / నీవు గాక నాకిపుడు దిక్కెవ్వరు ||నిశిరాత్రి|| / నే చేసిన వాగ్ధానము లెన్నో ఉన్నాయి / నెరవేర్చు బాధ్యతలు ఇంకా మిగిలాయి / ఈ రేయి ఈ చోటే నేనాగి పోవలదు / రాతిరి గడిచేవరకు నీ చాటున నను దాచి / ఉదయమును చూపించుము నా కంటికి / అల్పము ఈ జీవితమని నేనెరిగితిని / కనురెప్పపాటున ఆవిరికాగలదు / అనుదినమిక నీ కృపనే నే కోరుచు / పయనింతును నా గురివైపు నిను ఆనుకుని / భయముండగలదా నీవున్నచో / నీ కన్నులు నామీద నిలిచుండగా / నా చేయి నీ చేతిలో ఉండగా
నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా / నీ నీడలో దాచుకుంటివి నను దేవా (2) / నీ రెక్కల చాటున దాగుకొని నిను కీర్తించెదను / నీవు చేసిన మేల్లను తలచుచునే ఇల జీవించెదను / నాకన్ని నేవే దేవా / నా బ్రతుకు నీకే ప్రభువా (2) / దీపముగా నీ వాక్యాన్నిచ్చి / తిన్నని త్రోవలో నన్ను నడిపి / నాకు ముందుగా నీవే నడచి / జారిపడకుండా కాపాడితివి / కొండ తేనెతో నన్ను తృప్తి పరచి / అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి / ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి – (2) ||నాకన్ని|| / ఆత్మ శక్తితో నన్ను అభిషేకించి / అంధకార శక్తులపై విజయాన్నిచ్చి / ఆశ్చర్య కార్యములెన్నో చేసి / శత్రువుల యెదుట భోజనమిచ్చి / ఎక్కలేని కొండలు ఎక్కించితివి / నా గిన్నె నిండి పార్ల చేసియితివి / నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి – (2) ||నాకన్ని||
నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా (2) / తడిసెదను.. నీ జీవనదిలో (2) / తడిసి తడిసి ఆనందించెదా (2) ||నీ ఆనంద|| / వీడిపోయెను నా పాప సంకెళ్లు / నన్ను తొలగిపోయెను నా శాపపు కట్లు (2) / దైవమా.. నీవే ఇచ్చావు రక్షణ (2) / నే మరువగలనా నీ మంచి ప్రేమ (2) ||నీ ఆనంద|| / నీ ఆత్మ నాకు తోడుండగా / కానెన్నడు కాను ఒంటరిని (2) / ప్రేమా ప్రవాహం ఉంచావే నాలోన (2) / నే మరువగలనా నా హృదయములో (2) ||నీ ఆనంద|| / నే దాటిపోదును దేశ సరిహద్దులు / ప్రకాశించెద చీకటి లోకంలో (2) / జీవితం అంకితం చేస్తున్నా యేసయ్యా (2) / నన్ను వాడుకొనుమా నీ దివ్య సేవలో (2) ||నీ ఆనంద||
నీ కంటిపాపను – నా కంటనీరు చూడలేవు / నీ చల్లని చూపులో – నేనుందును నీ కృపలో (2) / యేసయ్యా.. యేసయ్య.. ఏ అడ్డూ వద్దయ్యా / నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా (2) / కన్నవారు నీ దారి నీదన్నారు / నమ్మినవారే నవ్విపోయారు / విరిగి నలిగి నీవైపు చూశాను / తల్లివై తండ్రివై నన్నాదుకున్నావు ||యేసయ్యా|| / ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు / ఎంతగానో ప్రేమించి లాలించావు / నా ఊపిరీ నా ప్రాణమూ / నీ దయలోనే నా జీవితం ||యేసయ్యా|| / నీ మాటలో నా బాటను / నీ ప్రేమలో నా పాటను / సాగిపోనీ నా యాత్రనూ / నీ దరి నేను చేరువరకు ||యేసయ్యా||
నీ కార్యములు ఆశ్చర్యములు దేవా (4) / నీవు సెలవియ్యగా – శూన్యము సృష్టిగా మారెనే / నీవు సెలవియ్యగా – మారా మధురం ఆయెనే / నీవు సెలవియ్యగా – దురాత్మలు పారిపోయెనే / నీవు సెలవియ్యగా – దరిద్రము తొలగిపోయెనే (2) / మోషే ప్రార్ధించగా – మన్నాను ఇచ్చితివే / ఆ మన్నా నీవే యేసయ్యా / ఏలియా ప్రార్ధించగా – ఆహారమిచ్చితివే / నా పోషకుడవు నీవే కదా (2) ||నీవు సెలవియ్యగా|| / లాజరు మరణించగా – మరణము నుండి లేపితివే / మోడైనను చిగురింపచేసెదవు / కానాన్ వివాహము ఆగిపోవుచుండగా / నీ కార్యముతో జరిగించితివే / నీ కార్యముతో (12) / సెలవిమ్మయ్యా సెలవిమ్మయ్యా / ఈ క్షణమే యేసయ్యా (8) ౹౹నీవు సెలవియ్యగా౹౹
నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా / నీ ప్రేమ సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా / నీ ప్రేమ నన్ను విడువదు ఎడబాయదు / ఎల్లకాలం తోడు నీవే / నమ్మదగిన యేసయ్యా – కృతజ్ఞతా స్తుతులు నీకే – (2) / కృతజ్ఞతా స్తుతులు నీకే / పరమ తండ్రి నీ ప్రేమ షరతులు లేనిది / పరమ తండ్రి నీ ప్రేమ నిస్స్వార్ధ్యమైనది ||నీ ప్రేమ|| / పరమ తండ్రి నీ ప్రేమ సంపూర్ణమైనది / పరమ తండ్రి నీ ప్రేమ సర్వము సమకూర్చును ||నీ ప్రేమ||
నీ కృప చాలునయా యేసయ్యా నా యేసయ్యా / నీ మేలునే కోరితి మెస్సయ్యా నను కాయువాడా / స్తుతి ఘనత మహిమ నిరతము నీకే చెల్లును / నన్నెంతగానో ప్రేమించి నీవు నీ చేతిలో నను చెక్కుకుంటివి / నా సహవాసం నీతో నుండను నీ రూపులో నను చేసుకొంటివి / ఇంతటి భాగ్యము పొందుటకు ఎంతటి వాడను నేను ప్రభు ||నీ కృప|| / పడియున్న నన్ను చెడనియ్యకా నీ జీవము నాలో నుంచినావు / పరిశుద్ధ రక్తం నాకై కార్చి నీ దివ్య రక్షణ నిచ్చినావు / నన్నాదరించిన నజరేయుడా నిన్నేన్నడు నేను మరువనయ ||నీ కృప|| / నలిగిన హృదయం విరిగిన మనసుతో నీ నామ గానం చేసెద (యేసయ్య) / నీ మధుర స్వరం ప్రతి దినం నే వినుచు ఆస్వాదించెద / చాలునయా నాకీ జీవితం నీ సేవకే అది అంకితం ||నీ కృప||
నీ కృప చాలును / నీ ప్రేమ చాలును / నీవు నాకు తోడుంటే చాలును యేసు (2) / నీవు లేని జీవితం అంధకార బంధురం (2) / నీవు నాకు తోడుంటే చాలును యేసు (2) / శోధనలు ఎన్నియో వేదనలు ఎన్నియో / నన్ను కృంగదీయు సంకటములెన్నియో (2) / నీ ప్రేమ వర్షం నా స్థితిని మార్చెగా (2) / నా జీవితాంతము నీలోనే నిలిచెదన్ / నా జీవితాంతము నీతోనే నడిచెదన్ / నీవు నాకు తోడుంటే చాలును యేసు (2) / నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన / నా హృదయ ఆలాపన అందుకో దేవా (2) / నిను పోలి నేను ఈ లోకమందు / నీ సాక్షిగాను నీ మహిమ చాటెదన్ (2) / నీ దివ్య వాక్యం ఈ జగాన చాటెదన్ / నీ ఆత్మ అభిషేకం నాకు నొసగు దేవా (2) / నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన / నా హృదయ ఆలాపన అందుకో దేవా (2)