40 songs found
చీకటిలో కాంతివి / వేదనలో శాంతివి (2) / స్థితి గతులన్నిటిని మార్చువాడా / జీవితాలన్నిటిని కట్టువాడా (2) / యేసూ.. నీ సన్నిధిలో సాధ్యం / యేసూ.. నీ సన్నిధే నీ సన్నిధే (2) / సమస్తము సాధ్యం / నీ యందే నా విశ్వాసం (2) / స్థితి గతులన్నిటిని మార్చువాడా / జీవితాలన్నిటిని కట్టువాడా (2) / యేసూ.. నీ సన్నిధిలో సాధ్యం / యేసూ.. నీ సన్నిధే నీ సన్నిధే (2) / అతిక్రమమంతా తుడచువాడా / ఎల్లప్పుడూ కరుణించువాడా / మంచితనము కనపరచువాడా / ఎల్లప్పుడూ దీవించువాడా (2) / యేసూ.. నీ రక్తములో సాధ్యం / యేసూ.. నీ రక్తమే నీ రక్తమే (2) / యేసూ.. నీ రక్తములో సాధ్యం / యేసూ..
చీకటులే నన్ను కమ్ముకొనంగా / దుఃఖంబు నాకాహారంబు కాగా / ఏకాకినై లోకంబులోన / కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2) / మేఘములు నన్ను ముసుగుకొనంగా / ఉరుములు నాపై దొరలుచుండంగా / వడగండ్ల వాన కురియుచుండంగా / కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2) / అన్యాయ క్రియలు అధికంబు కాగా / మోసంబులే నాకు వ్యసనంబు కలుగ / ఆకాశ శక్తులు కదలించబడగా / కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2) / త్వరలోనే రమ్ము పరలోక వరుడా / వరమేని తనయా ఓ గొర్రెపిల్లా (2) / కడబూర మ్రోగన్ తడవేల ప్రభువా (2) / కనిపెట్టుకొనియుందు నీ రాక కొరకు – (2)
వాక్యమే శరీర ధారియై – లోక రక్షకుడు ఉదయించె / పాపాన్ని శాపాన్ని తొలగింపను – రక్షకుడు భువికేతెంచెను / ఊరు వాడా వీధులలో – లోకమంతా సందడంటా / ఆడెదము కొనియాడెదము – అరే పూజించి ఘనపరచెదం / చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో / రాజు పుట్టినాడు ఏలో ఏలేలో – కొలవబోదామా ఏలో / గొర్రెల విడచి మందల మరచి / గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మా / గానములతో గంతులు వేస్తూ / గగనాన్నంటేలా ఘనపరచెదం (2) / చీకట్లో కూర్చున్న వారి కోసం – నీతి సూర్యుడేసు ఉదయించే / పాపాన్ని శాపాన్ని తొలగింపను – పరమును చేర్చను అరుదించే / ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు / ఇహం పరం అందరము / జగమంతా సందడి చేద్దాం / చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో / పొలమును విడచి ఏలో ఏలేలో – పూజ చేద్దామా ఏలో / తారను చూచి తరలి వచ్చాము / తూర్పు దేశపు జ్ఞానులము / తన భుజముల మీద రాజ్య భారమున్న / తనయుడెవరో చూడ వచ్చామమ్మా (2) / బంగారు సాంబ్రాణి బోళములు – బాలునికి మేము అర్పించాము / మా గుండెల్లో నీకేనయ్యా ఆలయం – మా మదిలో నీకేనయ్యా సింహాసనం / ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు / ఇహం పరం అందరము / జగమంతా సందడి చేద్దాం / చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో / జ్ఞాన దీప్తుడమ్మా ఏలో ఏలేలో – భువికేతెంచెనమ్మా ఏలో / నీవేలే మా రాజు – రాజులకు రాజు / నిన్నే మేము కొలిచెదము – హోసన్న పాటలతో / మా హృదయములర్పించి – హృదిలో నిను కొలిచి / క్రిస్మస్ నిజ ఆనందం – అందరము పొందెదము
చూచితి నీ మోముపై – చిందిన రక్తము / తలచితి నీ ప్రేమను – మదికి అందనిదాయె / రాజ మకుటము మారిపోయే – ముళ్ల మకుటముగా / సింహాసనమే సిలువగ మారి – శిక్షకు గురియాయేగా / పరిమితి లేని కలువరి ప్రేమను – పరిహాసము చేసిరే / ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే – చాలని నీ చెంత చేరితిని / యేసు.. ||చూచితి|| / నేలపై ఒలికిన నీ రక్తధారలే – ప్రతి పాపిని కడిగెను / ఆ రక్తధారలే పాపికి మార్గమై – పరముకు ప్రవహించెను (2) / మట్టి దేహమును – మహిమగ మార్చుటకు (2) / మాపై నీకున్న సంకల్ప ప్రేమను – పరిహాసము చేసిరే (2) / యేసు.. ||చూచితి|| / సిలువలో చిందిన రక్తపు జల్లులు – ప్రతి రోగిని తాకెను / చితికిన దేహమున ఒలికిన రుధిరము – పరమౌషధమాయెను (2) / మా రోగములను – భరియించుటకు (2) / మాపై నీకున్న ఎనలేని ప్రేమను – అవహేళన చేసిరే (2) / యేసు.. ||చూచితి||
చూచితివే నా కన్నీటిని / తుడచితివే నా యేసయ్యా (2) / లొంగిపోయిన నా జీవితం / కృంగిపోయిన నా ఆత్మను (2) / చేరదీసెనే నీ ప్రేమ / నన్ను… చేరదీసెనే నీ ప్రేమ ||చూచితివే|| / లోకమంతయూ నన్ను ద్వేషించినా / సొంత బంధువులంతా నన్ను వెలివేసినా (2) / చేరదీసెనే నీ ప్రేమ / నన్ను… చేరదీసెనే నీ ప్రేమ ||చూచితివే|| / ఒంటరితనం నన్ను వేధించినా / దీన దరిద్రురాలై నన్ను అవమానించినా (2) / చేరదీసెనే నీ ప్రేమ / నన్ను… చేరదీసెనే నీ ప్రేమ ||చూచితివే|| / ప్రేమతో నన్ను పిలిచావయ్యా / నీ వాక్కునిచ్చి స్వస్థపరచావయ్యా (2) / మరువలేనయ్యా నీ ప్రేమ / నేను… మరువలేనయ్యా నీ ప్రేమ (3)
చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు (2) / నీ పేరు మిటో ఎరుగనయ్యా (2) / నా పేరుతో నన్ను పిలిచావయ్యా (2) ||చూచుచున్న|| / శారాయి మాటలే విన్నాను / అబ్రహాము భార్యనై య్యాను (2) / ఈ అరణ్య దారిలో ఒంటరినై (2) / దిక్కులేక తిరుగుతున్న హాగరును / నేను హాగరును ||చూచుచున్న|| / ఇష్మాయేలుకు తల్లినైతిని / అయినవారితో త్రోసివేయబడితిని (2) / కన్నకొడుకు మరణము చూడలేక (2) / తల్లడిల్లిపోతున్న తల్లిని నేను / అనాథ తల్లిని నేను ||చూచుచున్న|| / పసివాడి మొరను ఆలకించావు / జీవజలములనిచ్చి బ్రతికించావు (2) / నీ సంతతిని దీవింతునని (2) / వాగ్దానమిచ్చిన దేవుడవు / గొప్ప దేవుడవు ||చూచుచున్న||
చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా / చూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైన / నీ నేత్రాలంకృతము (2) / పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో / క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో (2) / ఆప్యాయతకు నోచుకొనని / నను చేరదీసిన కృపా సాగరా (2) ||చూచుచున్న|| / అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు / తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా (2) / అగ్ని వంటి శోధనలను / తప్పించితివే దయా సాగరా (2) ||చూచుచున్న||
చూచుచున్నాము నీ వైపు / మా ప్రియ జనక – చూచుచున్నాము నీ వైపు / చూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తను / జాచుచు గరములు – చక్కగా నీవైపు ||చూచు|| / మేమరులమై యుంటిమి / మార్గము వీడి – మేమందరము పోతిమి / ప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించి / క్షేమ మార్గము మాకు – బ్రేమను జూపితివి ||చూచు|| / నిను నమ్ము పాపులకు / వారెవరైనా – నీ శరము జొచ్చువారలకు / ఇనుడవు కేడెంబు – నీ జగతిలో నగుచు / గనుపరచుచుందువు – ఘనమైన నీ కృప ||చూచు|| / నీ భయము మాయెదలను / నిలుపుము నీదు – ప్రాభవ మొనరంగను / నీ భయముచే మేము – వైభవ మొందుచు / నే భయము లేకుండ – నీ భువిని గొన్నాళ్ళు ||చూచు|| / దయ జూచి మము నెప్పుడు / మంచివి యన్ని – దయచేయు మెల్లప్పుడు / దయచేయరానివి – దయచేయుమని కోర / దయ జూపి మన్నించు – దయగల మా తండ్రి ||చూచు||
చూడరే సిలువను వ్రే-లాడు యేసయ్యను / పాడు లోకంబునకై – గోడు జెందె గదా ||చూడరే|| / నా చేతులు చేసినట్టు – దోషంబులే గదా / నా రాజు చేతులలో ఘోరంపు జీలలు ||చూడరే|| / దురితంపు దలఁపులే – పరమ గురిని శిరముపై / నెనరు లేక మొత్తెనయ్యొ – ముండ్ల కిరీటమై ||చూడరే|| / పరుగెత్తి పాదములు – చేసిన పాపంబులు / పరమ రక్షకుని – పాదములలో మేకులు ||చూడరే|| / పాపేఛ్చ తోడ గూడు – నాడు చెడ్డ పడకలే / పరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోటులు ||చూడరే||
చూడాలని ఉన్నది / నా యేసుని చూడాలని ఉన్నది (2) / కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని / కొనియాడుచుండగా చూడాలని (2) / పగలు ఎగురు బాణమైనను / రాత్రి కలుగు భయముకైనను (2) / కదలక నను కాపాడే నా నాథుడే నీవే / ఉన్నవాడవు అను వాడవు రానున్న వాడవు (2) / నా పాదములకు దీపమై / నా త్రోవలకు వెలుగువై (2) / నను వీడని ఎడబాయని నా తోడువు నీవే / కంటికి రెప్పలా కాపాడే నాథుడ నీవే (2)
చూపుల వలన కలిగేది ప్రేమ కాదమ్మా / ఆకర్షణకు లొంగిపోయి బానిస కాకమ్మా / చూపుల వలన కలిగేది ప్రేమ కాదురా / ఆకర్షణకు లొంగిపోయి బానిస కాకురా / స్వార్ధ్యంతోనే నిండియున్నది లోక ప్రేమరా / సత్యమైనది పవిత్రమైనది యేసు ప్రేమరా (2) / తల్లిదండ్రులు నిన్ను గొప్ప చేయాలని / కష్టించి చెమటోడ్చి డబ్బంతా నీకే పెడితే (2) / కన్నందుకు కన్నీరేనా ప్రతిఫలం / పద్దు గీసుకోవటమా నీ జీవితం (2) / వ్యర్ధమైనవాటిని విడిచి / పరమార్ధంలోకి నడిచి / దైవ యేసు వాక్యం స్వీకరించుమా (2) ||చూపుల||
చెట్టు చూస్తే పచ్చగుంది / పూత లేదు కాత లేదు (2) / వేసినెరువు వ్యర్ధమాయెనా నా యేసయ్యా / రెక్కల కష్టం వృథా ఆయేనా నా యేసయ్యా (2) / కాపు గాసి కలుపు తీసి నీరు కట్టి పెంచితే (2) / కండ్లెర్రికి చెట్టు పెరిగెనా నా యేసయ్యా / కాత లేదు పూత లేదుగా నా యేసయ్యా (2) ||చెట్టు|| / కాపెంతో గాస్తదని కలలెన్నో కన్నాను (2) / ఫలములెన్నో ఇస్తదని పరవశించి పాడినాను (2) / పూతకంత పురుగు తగిలెనా నా యేసయ్యా / కలలన్ని కల్లలాయెనా నా యేసయ్యా (2) ||చెట్టు|| / పందిరెలుపు తీగ ఉంది కాయ లేదు పండు లేదు (2) / ప్రేమతోని పెంచుకుంటిని నా యేసయ్యా / నరకనీకి ప్రాణమొప్పదు నా యేసయ్యా (2) ||చెట్టు|| / కొత్త కొత్త ఎరువులేసి కొన్ని నాళ్ళు మళ్ళి జూస్తి (2) / పనికిరాని తీగలొచ్చెనా నా యేసయ్యా / పరికి కంపకు పాకిపాయెనా నా యేసయ్యా (2) ||చెట్టు|| / పనికిరాని తీగలన్ని పట్టి కత్తిరించేస్తి (2) / పాడు నాటి పందిరేసి ప్రభుకు అంటు కట్టినాను (2) / కాత పూత ఇవ్వమని కన్నీళ్ళతో ప్రభునడిగితి (2) / పూత కాత బలముగాయెనా నా యేసయ్యా / ఫలాలన్నీ పంచబట్టెనా నా యేసయ్యా (2) ||చెట్టు||