110 songs found

క్రీస్తు పుట్టెను హల్లెలూయా|Kreesthu Puttenu Hallelooyaa

క్రీస్తు పుట్టెను హల్లెలూయా (2) / జగమంతా పండుగాయెను – సర్వలోకానికి సందడాయెను (2) / చీకు చింత వీడిపోయె – చీకటంత తొలగిపోయె (2) / నవ్యకాంతులెగసె ఇలలో – దివ్యకాంతుడేసు రాకతో… / ఉల్లాసమే ఉత్సాహమే – జగమంతా జయోత్సాహమే (2) / చెట్టెక్కిన లంచగొండి జక్కయ్య / పాప శాపముతో నిండియుండగా / యేసు అడుగు పెట్టెను / ఆ ఇంటిలో – రక్షణకాంతులే విరజిల్లెను (2) ||చీకు చింత|| / గెరాసేను జనములలో కొందరు / రోగాలు దయ్యాలతో బాధనొందగా / యేసు అడుగుపెట్టెను / ఆ ఊరిలో – విడుదలకాంతులే ప్రకాశించెను (2) ||చీకు చింత|| / మరణమాయె యాయీరు కూతురు / వేదన రోదన కన్నీటిలో / యేసు అడుగుపెట్టెను / ఆ ఇంటిలో – జీవపుకాంతులే ప్రజ్వలిల్లెను (2) ||చీకు చింత|| / వేదనతో నలిగిపోవుచున్నావా / యేసు నీ కొరకై ఉదయించెను / లెమ్ము తేజరిల్లుమ్ము / నీ ఇంటికి – వెలుగు వచ్చియున్నది (2) ||క్రీస్తు పుట్టెను||

క్రీస్తుని స్వరము విందును|Kreesthuni Swaramu Vindunu

క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు / మధుర స్వరమేయది మెల్లని స్వరమేయది – (2) / యెహోవా నీ స్వరము జలములపై వినబడెను (2) / మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించెను (2) ||క్రీస్తుని|| / బలమైన నీ స్వరము బహుప్రభావము గలది (2) / దేవదారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నిని (2) ||క్రీస్తుని|| / అద్భుత ప్రభు స్వరము అరణ్యము కదిలించును (2) / ఆకుల రాలజేయును లేళ్ళ నీనజేయును (2) ||క్రీస్తుని|| / ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్ (2) / ఆశీర్వాదము శాంతి నొసగునాయన స్వరమే (2) ||క్రీస్తుని|| / నీ మధుర స్వరము నీ వాక్యమును విందున్ (2) / ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు (2) ||క్రీస్తుని|| / నీ మధుర స్వరము నీ చిత్తము తెల్పును (2) / అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను (2) ||క్రీస్తుని|| / నీ మధుర స్వరము నీ మార్గము జూపును (2) / కుడి యెడమల తిరిగిన నీ స్వరమే వినబడును (2) ||క్రీస్తుని|| / తుఫానులు కలిగి భయభీతులలో నుండ (2) / భయపడకు మని పలికె ప్రేమగల నీ స్వరము (2) ||క్రీస్తుని|| / మరణాంధకార లోయలో నేనుండ (2) / నీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్ (2) ||క్రీస్తుని|| / ప్రభువా సెలవిమ్ము నీ దాసుడాలించున్ (2) / దీనుడనై నీ మాట అంగీకరించెదను (2) ||క్రీస్తుని||

క్రీస్తే సర్వాధికారి|Kreesthe Sarvaadhikaari

క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారి / క్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిల్వధారి ||క్రీస్తే|| / ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాత / భక్తి విలాప శ్రోత – పరమంబు వీడె గాన ||క్రీస్తే|| / దివ్య పథంబురోసి – దైవంబు తోడు బాసి / దాసుని రూపు దాల్చి – ధరణి కేతెంచె గాన ||క్రీస్తే|| / శాశ్వత లోకవాసి – సత్యామృతంపు రాశి / శాప భారంబు మోసి – శ్రమల సహించె గాన ||క్రీస్తే|| / సైతాను జనము గూల్పన్ – పాతాళమునకు బంపన్ / నీతి పథంబు బెంప – రుధిరంబు గార్చె గాన ||క్రీస్తే|| / మృత్యువు ముళ్ళు తృపన్ – నిత్య జీవంబు బెంపన్ / మర్త్యాళి భయము దీర్పన్ – మరణంబు గెలిచె గాన ||క్రీస్తే|| / పరమందు దివిజులైన – ధరయందు మనుజులైన / ప్రతి నాలుక మోకాలు – ప్రభునే భజించు గాన ||క్రీస్తే|| / ఈ నామమునకు మించు – నామంబు లేదటంచు / యెహోవా తండ్రి యేసున్ – హెచ్చించినాడు గాన ||క్రీస్తే||

క్రీస్తేసు పుట్టెను|Kreesthesu Puttenu

క్రీస్తేసు పుట్టెను.. లోక రక్షకునిగా.. / పశులపాక పావనమై.. పరవశించెనుగా… / పరవశించెనుగా… / క్రీస్తేసు పుట్టెను లోక రక్షకునిగా / పశులపాక పావనమై పరవశించెనుగా / గొర్రెల కాపరులు సంతోషముతో / గంతులు వేసెను ఆనందముతో (2) / తూర్పు దిక్కున చుక్క వెలిసెను / లోక రక్షకుడు భువికి వచ్చెను (2) ||క్రీస్తేసు|| / హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ / మెర్రి మెర్రి క్రిస్మస్ / ఆదివాక్యము శరీరధారియై లోకమందు సంచరించెను / చీకటిని చీల్చి జనులందరికి వెలుగును ప్రసాదించెను (2) / పాపములు తీసి పరిశుద్ధపరచి రక్షణ వరమందించే / ఆ యేసు రాజును స్తుతియించి ఘనపరచ రారండి (2) ||తూర్పు దిక్కున|| / సంతోషము సమాధానము కృపా కనికరము / మన జీవితములో ప్రవేశించెను బహుదీవెనకరము (2) / సంబరాలతో సంతోషాలతో వేడుకొన రారండి / బంగారము సాంబ్రాణి బోళము సమర్పించ రారండి (2) ||తూర్పు దిక్కున||

క్రీస్తేసు ప్రభువు|Kreesthesu Prabhuvu

క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి / కొన్నట్టి సంఘమున / ఎవరు చేరెదరో వారే ధన్యులు / పరలోకము వారిది (2) ||క్రీస్తేసు|| / అపొస్తలుల బోధను నమ్మి / స్థిరపరచబడిన వారే (2) / ఆత్మ శక్తితో వారు ఎల్లప్పుడు / సంఘములో నిలిచెదరు (2) ||క్రీస్తేసు|| / పరిశుద్ధులతో సహవాసమును / ఎవరు కలిగియుందురో (2) / వారే పొందెదరు క్షేమాభివృద్ధి / క్రీస్తేసు ప్రభువు నందు (2) ||క్రీస్తేసు|| / ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారే / తన యందు నిలిచెదరు (2) / ప్రకటించెదరు ఆయన మరణ / పునరుత్తానమును వారు (2) ||క్రీస్తేసు|| / పట్టు వదలక సంఘముతో కూడి / ఎవరు ప్రార్ధించెదరో (2) / ప్రార్ధన ద్వారా సాతాను క్రియలు / బంధించెదరు వారే (2) ||క్రీస్తేసు|| / క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు / ఎవరెదురు చూచెదరో (2) / నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు / సర్వ లోకము నందు (2) ||క్రీస్తేసు||

క్రైస్తవుడా సైనికుడా|Kraisthavudaa Sainikudaa

క్రైస్తవుడా సైనికుడా / బలవంతుడా పరిశుద్ధుడా / కదలిరావోయ్ నీవు కదలిరా (4) / జాలరీ మనుషులు పట్టు జాలరి / ఆత్మలు పట్టు కాపరి / అమృతమందించే ఆచారి / యేసుకై జీవించే పూజారి ||క్రైస్తవుడా|| / సిలువే నీ స్థావరము / శ్రమలే నీ సైన్యము (2) / సహనమే నీ ధైర్యము / వాక్యమే నీ విజయము (2) ||క్రైస్తవుడా|| / సత్యమే నీ గమ్యము / సమర్పణే నీ శీలము (2) / యేసే నీ కార్యక్రమం / ప్రేమే నీ పరాక్రమం (2) ||క్రైస్తవుడా|| / దేశంలో విదేశంలో / గ్రామంలో కుగ్రామంలో (2) / అడవులలో కొండలలో / పని ఎంతో ఫలమెంతో (2) ||క్రైస్తవుడా|| / సిద్ధాంతపు గట్టు దుమికి రా / వాగులనే మెట్టును దిగిరా (2) / దీనుడా ధన్యుడా / విజేయుడా అజేయుడా (2) ||క్రైస్తవుడా|| / వాగ్ధాన భూమి స్వతంత్రించుకో / అద్వానపు అడవి దాటి ముందుకుపో (2) / నీ ఇల్లు పెనూయేలు / నీ పేరే ఇశ్రాయేలు (2) ||క్రైస్తవుడా||

క్రొత్త యేడు మొదలు బెట్టెను|Krotha yedu modalu bettenu

క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకు నందు / క్రొత్త యేడు మొదలు బెట్టెను / క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవ / తత్తర పడకుండ జేయు టుత్తమొత్తమంబు జూడ ||క్రొత్త|| / పొందియున్న మేలులన్నియు బొంకంబు మీర / డెందమందు స్మరణ జేయుడి / ఇందు మీరు మొదలుపెట్టు పందెమందు గెల్వ వలయు / అందముగను రవిని బోలి అలయకుండా మెలయకుండా ||క్రొత్త|| / బలము లేని వారమయ్యీను బలమొందవచ్చు / కలిమి మీర గర్త వాక్కున / అలయకుండా అడుగుచుండ నలగకుండా మోదమొంది / బలమొసంగు సర్వ విధుల నెలమి మీర నొచ్చుచుండ ||క్రొత్త|| / పాప పంకమంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు / ప్రాపు జేరి మీరు వేడగా / సేపు మీర తనదు కరుణ పాపమంతా కడిగివేసి / పాప రోగ చిహ్నలన్ని బాపి వేసి శుద్ది చేయు ||క్రొత్త||

క్షణమైన గడవదు|Kshanamaina Gaduvadu

క్షణమైన గడవదు తండ్రి / నీ కృప లేకుండా – (2) / ఏ ప్రాణం నిలువదు ప్రభువా / నీ దయ లేకుండా – (2) / నీవే నా ప్రాణం – నీవే నా ధ్యానం / నీవే నా సర్వం – యేసు (2) ||క్షణమైన|| / ఇంత కాలం లోకంలో బ్రతికా / జీవితం అంతా వ్యర్థం చేసా / తెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్థమని / అనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని (2) ||నీవే|| / పనిలో ఉన్నా ఎందరిలో ఉన్నా / ఎక్కడ ఉన్నా నేనేమై యున్నా / నీవు నా చెంత ఉంటేనే నాకు చాలయ్యా / నీ రెక్కలే నాకు ఆశ్రయం నా యేసయ్యా (2) ||నీవే|| / జ్ఞానమున్నా పదవులెన్నున్నా / ధనము ఉన్నా సర్వం నాకున్నా / నీవు నాతో లేకుంటే అంతా శూన్యమేగా / పరలోక స్వాస్థ్యం ఎల్లప్పుడు శ్రేష్ఠమేగా (2) ||నీవే||

Telugu Songs Starting with "క" — Page 9 | UEC Telugu Church