110 songs found
క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా / క్షణికమైన సుఖమురా ఇది (2) / ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా యోచించుమా / సృష్టికర్తను స్మరణ చేయుమా / దైవ ప్రేమను మదిని నిలుపుమా / ఆ యేసు ప్రేమను నీ మదిని నిలుపుమా ||క్షణికమైన|| / ఎంత బ్రతికినా ఈ లోకమును విడిచిపెట్టి పోవలెను తెలుసా నీకు (2) / ఊరికి పోవు త్రోవ యెరుగుమయ్యా (2) / ఆ త్రొవే యేసని తెలుసుకొనుమయ్యా (2) ||ఓ స్నేహితుడా|| / గడ్డిపువ్వును పోలిన బ్రతుకు ఎండి పోయి వాడి పోవు తెలుసా నీకు (2) / ఆవిరివంటి బ్రతుకు ఎగిరిపోవును (2) / ప్రభు యేసుని నమ్మితే నిత్యజీవము (2) ||ఓ స్నేహితుడా||
క్షమాపణ దొరికేనా (2) / చిట్ట చివరి.. అవకాశం నాకు దొరికేనా (2) / యేసయ్యా… యేసయ్యా… / కక్కిన కూటికై – తిరిగిన కుక్కలా / ఎన్నో మారులు తిరిగితినయ్యా (2) / అయినా కూడా నీ కృప చూపి / ఆదరించిన అద్వితీయుడా (2) / ఆదరించిన అద్వితీయుడా ||యేసయ్యా|| / అడిగే అర్హత లేకపోయినా / నీ ప్రేమను బట్టి అడుగుతు ఉన్నా (2) / తల్లి మరచినా మరువని దేవుడా / నన్ను విడువని యేసునాథుడా (2) / నన్ను విడువని యేసునాథుడా ||యేసయ్యా||