110 songs found

కృపా క్షేమము|Krupaa Kshemamu

కృపా క్షేమము నీ శాశ్వత జీవము / నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2) / మహోన్నతమైన నీ ఉపకారములు / తలంచుచు అనుక్షణము పరవశించనా / నీ కృపలోనే పరవశించనా / నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే / లెక్కకు మించిన దీవెనలైనాయి (2) / అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే / కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను (2) / నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను / నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2) / ఆరాధన నీకే ||కృపా క్షేమము|| / నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే / పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి (2) / కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే / గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను (2) / ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే / నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2) / ఆరాధన నీకే ||కృపా క్షేమము|| / నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా / నా హృది నీ కొరకు పదిలపరచితిని (2) / బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా / అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2) / ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే / ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే (2) / ఆరాధన నీకే ||కృపా క్షేమము||

కృపా సత్య సంపూర్ణుడా|Krupaa Sathya Sampoornudaa

స స స ని స గ… స స స ని స గ / స స స ని స గ మ ప / మ మ మ గ ప మ… మ మ మ గ ప మ / మ మ మ గ ప మ గ స / కృపా సత్య సంపూర్ణుడా (2) / కృపామయుడా / కృప చూపుటే నీ సంకల్పమా ||కృపా|| / స ని స ని మ ప / ని ప ని ప గ మ / ప మ ప మ గ ని స / నీ కృప నను విడువక / శాశ్వతముగా కాచెనుగా (2) / మార్పులేని నీ మహా కృపలో (2) / మహిమ రాజ్యమున చేర్చుమా ||కృపా|| / నీ కృప అభిషేక తైలమై / నా తలపై ప్రోక్షించినావు (2) / నిత్యముండు నీ కృపతో (2) / నిరతము నను గావుము ప్రభువా ||కృపా|| / స గ స గ గ… స గ స మ మ… గ మ గ ప ప / మ ప మ ని ని… ప ని ప స స **(2) / **ప ని స గ స ని… మ ప ని స ని ప / గ మ ప ని ప మ… గ మ గ రి స (2) / నీ కృప రక్షణ దుర్గమై / నా ముందర నడచిన ప్రభువా (2) / అడ్డుగా వచ్చుఁ సాతాను బలమును (2) / హతమొందించెద నీ కృపతో ||కృపా||

కొండ కోన లోయలోతుల్లో|Konda Kona Loya Lothullo

కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ / వినబడుతుంది నా యేసుని స్వరమే / తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం / ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం || కొండ కోన || / నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు / హృదయమందు చేర్చుకో నేస్తమా (2) / ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య / నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2) / నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన || / ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు / నిన్ను రక్షించాలని (2) / కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య / తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2) / నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన ||

కొండల తట్టు నా కన్నులు|Kondala Thattu Naa Kannulu

కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను (2) / నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును (2) / యెహోవా వలనే – యెహోవా వలనే / నాకు సహాయం కలుగును – కలుగును (2) కలుగును / భూమ్యాకాశంబులను – సృజియించిన దేవా / నా పాదంబులను – తొట్రిల్లనీయడు (2) / నను కాపాడువాడు కునుకడు – నిదురపోడెన్నడు (2) / యెహోవా నను ప్రేమించి – కాపాడి రక్షించును (2) ||యెహోవా|| / నా కుడిప్రక్క నీడగా – యెహోవా ఉండును / పగటి ఎండ రాత్రి వెన్నెల – దెబ్బైన తగలక (2) / ఏ అపాయము నాకు రాకుండా – యెహోవా కాపాడును (2) / నా రాకపోకలయందును – కాపాడి రక్షించును (2) ||యెహోవా|| / వేటకాని ఉరిలోనుండి – విడిపించిన దేవా / నాశనకరమైన తెగులు రాకుండ – రక్షించిన దేవా (2) / నీ బలమైన రెక్కలతో కప్పుమయా – మా రక్షణ ఆధారమా (2) / నా కుడిప్రక్క పదివేలు కూలిననూ – నీ కృపచేత కాపాడుమా (2) ||యెహోవా||

కొండలతో చెప్పుము|Kondalatho Cheppumu

కొండలతో చెప్పుము కదిలిపోవాలని / బండలతో మాట్లాడుము కరిగిపోవాలని (2) / నమ్ముట నీ వలనైతే / సమస్తం సాధ్యమే – (3) / మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు / మనసులో సందేహించక మాట్లాడు / మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు / యేసుని నామములోనే మాట్లాడు ||కొండలతో|| / యేసయ్య ఉన్న దోనె పైన తుఫాను కొట్టెనే / యేసయ్య దోనె అమరమున నిద్రించుచుండెనే / గాలి పైకి లేచి – అలలు ఎంతో ఎగసి / దోనెలోనికొచ్చెను జలములు జోరున / శిష్యులేమో జడిసి – వానలోన తడిసి – బహుగా అలసిపోయే / ప్రభువా ప్రభువా – లేవవా త్వరగా / మేము నశించిపోతున్నామని / ప్రభువును లేపిరి – తమలో ఉంచిన – దైవ శక్తి మరచి / రక్షకుడు పైకి లేచాడు – శిష్యులకు చేసి చూపాడు / పరిస్థితుత్లతో మాటలాడాడు / ఆ గాలినేమో గద్దించి – తుఫాన్ని ఆపేసి – నిమ్మల పరిచాడు / శిష్యులను తేరి చూచాడు – విశ్వాసం ఎక్కడన్నాడు / అధికారం వాడమన్నాడు / ఇక మనమంత ప్రభు లాగ – చేసేసి గెలిచేసి / ప్రభునే స్తుతిద్దాము – జై / జై జై జై జై జై జై జై జై / ఈశు మసీహ్ కి జై / ఈశు కే జై జై జై / ప్రభు కే జై జై జై (2) ||మాట్లాడు|| / పరలోక రాజ్య తాళాలు మన చేతికిచ్చెనే / పాతాళ లోక ద్వారాలు నిలువనేరవనెనే / కన్నులెత్తి చూడు – తెల్లబారె పైరు / కోతకొచ్చి నిలిచెను మనకై నేడు / వాక్యముతో కది-లించిన చాలు – కోత పండగేలే / కాపరి లేని గొర్రెలు వారని – కనికరపడెను ప్రభువు నాడు / క్రీస్తుని కనులతో – చూద్దామా – తప్పిపోయిన ప్రజను / ప్రభు లాగా వారిని ప్రేమిద్దాం – సాతాను క్రియలు బందిద్దాం / విశ్వాస వాక్కు పలికేద్దాం / ఇక ఆ తండ్రి చిత్తాన్ని – యేసయ్యతో కలిసి – సంపూర్తి చేద్దాం / పరలోక రాజ్య ప్రతినిధులం – తాళాలు ఇంకా తెరిచేద్దాం / ఆత్మలను లోనికి నడిపిద్దాం / ఇక సంఘంగా ఏకంగా – పాడేద్దాం అందంగా / ఈశు మసీహ్ కి జై – జై / జై జై జై జై జై జై జై జై / ఈశు మసీహ్ కి జై / ఈశు కే జై జై జై / ప్రభు కే జై జై జై (2) ||మాట్లాడు||

కొంత యెడము నీవైనా|Kontha Yedamu Neevainaa

కొంత యెడము నీవైనా నే సాగలేను / నిమిషమైన నిన్ను విడిచి నే బ్రతుకలేను / కొంత యెడము నీవైనా / మరచిన వేళలో మది నీ పలుకులు / సడలి కట్టడలు మలినము తలపులు (2) / ప్రేమను పంచే ప్రేమ రూపుడా (2) / మరియొక్క మారు మన్నించు విభుడా (2) ||కొంత యెడము|| / కనులకు మోహము కమ్మిన క్షణము / వినుట మరచె నీ స్వరమును హృదయము (2) / కమ్మిన పొరలు కరిగించుటకు (2) / నడుపు నీ వైపుకు హృది వెలుగుటకు (2) ||కొంత యెడము|| / మదము, మత్సరములు సోకిన తరుణము / పాశము, ప్రేమకు విగతము ప్రాప్తము (2) / నిరతము స్థిరముగ నున్న అక్షయుడా (2) / నిలుపుము నీ కృపలో నన్ను రక్షకుడా (2) ||కొంత యెడము|| / మనుజ రూపమున మహిలో నిలిచి / మనిషి-కసాధ్యమౌ మరణము గెలిచి (2) / నను వరియించగ రానున్న ప్రియుడా (2) / నిన్నెదురుకొనగ మతి నియ్యు వరుడా (2) ||కొంత యెడము||

కొంతసేపు కనబడి|Konthasepu Kanabadi

కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే / ఆవిరి వంటిదిరా ఈ జీవితం / లోకాన కాదేది శాశ్వతం (2) / యేసే నిజ దేవుడు నిత్యజీవమిస్తాడు / మరణమైన జీవమైన నిన్ను విడువడు (2) ||కొంతసేపు|| / ఎదురౌతారెందరో నీ పయనంలో / నిలిచేది ఎందరు నీ అక్కరలో (2) / వచ్చేదెవరు నీతో మరణము వరకు (2) / ఇచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు ||యేసే|| / చెమటోడ్చి సుఖము విడిచి కష్టమునోర్చి / ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా (2) / ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే (2) / సంపాదన ఎవరిదగును యోచించితివా ||యేసే|| / నీ శాపం తాను మోసి పాపం తీసి / రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి (2) / విశ్రాంతినీయగ నిన్ను పిలువగా (2) / నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా ||యేసే||

కొనియాడ తరమే నిన్ను|Koniyaada Tharame Ninnu

కొనియాడ తరమే నిన్ను / కోమల హృదయ – కొనియాడ తరమే నిన్ను / తనరారు దినకరు – బెను తారలను మించు (2) / ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు ||కొనియాడ|| / కెరుబులు సెరుపులు – మరి దూత గణములు (2) / నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు ||కొనియాడ|| / సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు (2) / నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు ||కొనియాడ|| / విశ్వమంతయు నేలు – వీరాసనుడ వయ్యు (2) / పశ్వాళితో దొట్టి – పండియుంటివి వీవు ||కొనియాడ|| / దోసంబులను మడియు – దాసాళి కరుణించి (2) / యేసు పేరున జగతి – కేగుదెంచితి నీవు ||కొనియాడ|| / నరులయందున కరుణ – ధర సమాధానంబు (2) / చిరకాలమును మహిమ – పరగ జేయుదు వీవు ||కొనియాడ|| / ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేకొని (2) / శ్రేయముగ పవళించు – శ్రీకర వరసుత ||కొనియాడ||

Telugu Songs Starting with "క" — Page 7 | UEC Telugu Church