110 songs found

కుమ్మరి ఓ కుమ్మరి|Kummari o kummari

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి / జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా / ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా / పనికిరాని పాత్రనని – పారవేయకుమా / పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా (2) / సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ / సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి / ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి|| / విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు / వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి (2) / ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా / పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా / ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి|| / లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్ / మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని (2) / పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి / ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్ / ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||

కూర్చుందును నీ సన్నిధిలో|Koorchundunu Nee Sannidhilo

కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం / ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం (2) / నిరంతరం నీ నామమునే గానము చేసెదను / ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును|| / ప్రతి విషయం నీకర్పించెదా / నీ చిత్తముకై నే వేచెదా (2) / నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా (2) / నీ నామమునే హెచ్చించెదా (2) / నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే / నా ఆనందము నీవే – నా ఆధారము నీవే / యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును|| / ప్రతి దినము నీ ముఖ కాంతితో / నా హృదయ దీపం వెలిగించెదా (2) / నీ వాక్యానుసారము జీవించెదా (2) / నీ ఘన కీర్తిని వివరించెదా (2) / నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే / నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే / యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||

కృప కృప నా యేసు కృపా|Krupa Krupa Naa Yesu Krupaa

కృప కృప నా యేసు కృపా / కృప కృప కృపా (2) / నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే / నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే / నేనేమైయుంటినో అందుకు కాదయ్యా / నా క్రియలను బట్టి అసలే కాదయ్యా / చూపావు ప్రేమ నాపై – పిలిచావు నన్ను కృపకై / జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా / నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప|| / నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా / కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా / రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా / నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా / నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై – నన్నాకర్షించావయ్యా / నువ్వులేని నన్ను ఊహించలేను – నా శిరస్సు నీవయ్యా / నా గుర్తింపంతా నీవే యేసయ్యా / నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమైయుంటినో|| / నా పాపము నను తరుమంగా నీలో దాచితివే / నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే / నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే / ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే / నీ మంచితనమే కలిగించె నాలో – మారు మనస్సేసయ్యా / నేనెంతగానో క్షమియించబడితిని – ఎక్కువగా ప్రేమించితివయ్యా / నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా / నా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమైయుంటినో|| / పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా / నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా / నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా / నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా / ఏముంది నాలో నీవింతగా నను – హెచ్చించుటకు యేసయ్యా / ఏమివ్వగలను నీ గొప్ప కృపకై – విరిగిన నా మనస్సేనయ్యా / నీ కొరకే నేను జీవిస్తానయ్యా / మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమైయుంటినో|| / పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా / అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా / నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా / విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా / నీలోన నేను నాలోన నీవు – ఏకాత్మ అయితిమయ్యా / జీవించువాడను ఇక నేను కాను – నా యందు నీవయ్యా / నీ మనసే నా దర్శనమేసయ్యా / నీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమైయుంటినో||

కృపగల దేవా|Krupagala Devaa

కృపగల దేవా దయగల రాజా / కృపగల దేవా దయగల రాజా / చేరితి నిన్నే బహు ఘనతేగా / నీ చరణములే నే కోరితిని / నీ వరములనే నే వేడితిని (2) / సర్వాధికారి నీవే దేవా – నా సహకారి నీవే ప్రభువా / నా కోరికలే సఫలము చేసి – ఆలోచనలే నెరవేర్చితివి / అర్పించెదను నా సర్వమును నీకే దేవా / ఆరాధించి ఆనందించెద నీలో దేవా (2) ||కృపగల|| / త్రోవను చూపే తారవు నీవే / గమ్యము చేర్చే సారథి నీవే (2) / జీవన యాత్రా శుభప్రదమాయే / నా ప్రతి ప్రార్థన పరిమళమాయె / నీ ఉదయకాంతిలో నను నడుపుము / నా హృదిని నీ శాంతితో నింపుము (2) ||కృపగల|| / కృప చూపి నన్ను అభిషేకించి / వాగ్ధానములు నెరవేర్చినావే (2) / బహు వింతగా నను ప్రేమించినావే / బలమైన జనముగా నను మార్చినావే / నీ కీర్తి జగమంత వివరింతును / నీ దివ్య మహిమలను ప్రకటింతును (2) ||కృపగల|| / నా యేసురాజా వరుడైన దేవా / మేఘాల మీద దిగి వచ్చు వేళ (2) / ఆకాశ వీధిలో కమనీయ కాంతిలో / ప్రియమైన సంఘమై నిను చేరెదను / నిలిచెదను నీతోనే సీయోనులో / జీవింతు నీలోనే యుగయుగములు (2) ||కృపగల||

కృపలను తలంచుచు|Krupalanu Thalanchuchu

కృపలను తలంచుచు (2) / ఆయుష్కాలమంతా ప్రభుని / కృతజ్ఞతతో స్తుతింతున్ (2) ||కృపలను|| / మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను (2) / ముట్టునని సెలవిచ్చిన దేవుడు / కాచెను గతకాలం – (నన్ను) (2) ||కృపలను|| / కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో (2) / నింగిని చీల్చి వర్షము పంపి / నింపెను నా హృదయం – (యేసు) (2) ||కృపలను|| / రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను (2) / నాకు విరోధమై వర్ధిల్లదు యని / చెప్పిన మాట సత్యం – (ప్రభువు) (2) ||కృపలను|| / సర్వోన్నతుడైన నా.. దేవునితో చేరి (2) / సతతము తన కృప వెల్లడిచేయ / శుద్దులతో నిలిపెను – (ఇలలో) (2) ||కృపలను|| / హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే (2) / సీయోను నివాసం నాకెంతో ఆనందం / ఆనందమానందమే – (ఆమెన్) (2) ||కృపలను||

Telugu Songs Starting with "క" — Page 6 | UEC Telugu Church