64 songs found
నా మనస్సా ఆయన మరచునా / దేవుడు నిన్ను మరచిపోవునా (2) / ఆయనే నీ బాధలన్ని కనుమరుగు చేయునే / ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2) / స్తుతింపజేయునే – నిన్ను అలంకరించునే / కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2) / నిట్టూర్పు శబ్దము విన్న – నీ హద్దులన్నిటిలో / సమృద్ధి గానాలెన్నో – ఇది మొదలు వినబడునే (2) / తరిగిపోను నేను – అణగార్చబడను నేను (2) ||స్తుతింపజేయునే|| / సరిచేయు వాడే – ఓ ….స్థిరపరచినాడే / బలపరచినాడే – పూర్ణుణ్ణి చేయునే / సరి చేసి నిన్ను – హెచ్చించిన ప్రభువు / ఈ నూతనవత్సరములో – అలంకరించునే… / విచారించే వారు లేక – ఒంటరైయున్న నీకు / ఆరోగ్యము దయచేసి – పరిపాలన నిచ్చునే (2) / కూలిన కోటను – రాజగృహముగా మార్చును (2) ||స్తుతింపజేయునే|| ||నా మనస్సా||
అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా / అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా (2) / రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా / ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా / నాతో స్నేహమై నా సౌఖ్యమై / నను నడిపించే నా యేసయ్యా (2) ||అల్ఫా|| / కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే / ఉన్నతముగా నిను ఆరాధించుటకు / అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి / నూతన వసంతములు చేర్చెను (2) / జీవించెద నీ కొరకే / హర్షించెద నీలోనే (2) ||అల్ఫా|| / తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే / ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు / ఆశ నిరాశల వలయాలు తప్పించి / అగ్ని జ్వాలగా నను చేసెను (2) / నా స్తుతి కీర్తన నీవే / స్తుతి ఆరాధన నీకే (2) ||అల్ఫా|| / నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమే / శుభ సూచనగా నను నిలుపుటకు / అంతులేని అగాధాలు దాటించి / అందని శిఖరాలు ఎక్కించెను (2) / నా చెలిమి నీతోనే / నా కలిమి నీలోనే (2) ||అల్ఫా||
అవధులే లేనిది దివ్యమైన నీ కృప / అనంతమైనది ఆశ్చర్యమైనది (2) / యేసయ్యా నాపై నీవు చూపిన కృప / అమూల్యమైనది వర్ణించలేనిది (2) ||అవధులే|| / ఊహించలేని హృదయానందమును / దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు (2) / భారమెక్కువైనా తీరం కడుదూరమైనా / నీపై ఆనుకొందును / నేను గమ్యం చేరుకొందును (2) ||అవధులే|| / సరిపోల్చలేని మధురమైన అనుభవం / వింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు (2) / సౌందర్యమైన అతిపరిశుద్ధమైన / నీ రూపము తలచుకొందును / నేను నీ కోసమే వేచియుందును (2) ||అవధులే|| / లెక్కించలేని అగ్ని శోధనలో / ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు (2) / వాడబారని కిరీటము నే పొందుటకు / వెనుకున్నవి మరచి / నేను లక్ష్యము వైపు సాగెద (2) ||అవధులే||
అసాధ్యమైనది లేనే లేదు / నన్ను బలపరచువాడు నాతో ఉండగా (2) / ఊహించలేని ఆశ్చర్యక్రియలలో / నా దేవుడు నన్ను నడిపించును (2) / సాధ్యమే అన్ని సాధ్యమే / నా యేసు తోడైయుండగా (2) / శోధన శ్రమలు వచ్చినను / ఏ మాత్రము నేను వెనుతిరిగినను (2) / సత్య స్వరూపి సర్వోన్నతుడైన / గొప్ప దేవుడు నన్ను బలపరచును (2) ||సాధ్యమే|| / సాతాను శక్తులు ఎదిరించిన / వాక్యమనే ఖడ్గముతో జయించెదను (2) / సర్వశక్తుడు తన శక్తితో నింపి / సాతానుపై నాకు జయమిచ్చును (2) ||సాధ్యమే||