64 songs found
అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు / (యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు – (2) ||అబ్రాహాము|| / అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని / ఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి (2) / యాకోబును ఇశ్రాయేలని దీవించి / ఈ పాపిని నీవు విడువక ప్రేమించి / నా మంచి యేసయ్యా – నీవున్న చాలయ్యా / నీ చేతి నీడలో జీవింతునయ్యా (2) ||అబ్రాహాము|| / జీవాహారము నేనే అని పలికితివి / జీవ జలముల ఓరన నను నాటితివి (2) / నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసి / హృదయము నుండి జీవ జలములు పుట్టించి / నీ జీవాహారము – నీ జీవజలమును / నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును (2) ||అబ్రాహాము||
అమూల్య రక్తం – ప్రశస్త రక్తం / విలువైన రక్తం – శక్తి గల రక్తం (2) / యేసు రక్తమే జయము / క్రీస్తు రక్తమే విజయము (2) / పాప క్షమాపణ యేసు రక్తములోనే / శాప విమోచన క్రీస్తు రక్తములోనే ||అమూల్య|| / తండ్రి చిత్తము నెరవేర్చ / గెత్సేమనేలో ప్రార్ధింప (2) / చెమట రక్తము గొప్ప బిందువులై కారెనే / ఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే (2) ||యేసు|| / శాపానికి ప్రతిఫలము ముళ్ళు / ముండ్ల కిరీటముతో చెల్లు (2) / ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలు / ప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే (2) ||యేసు|| / నీ చేతుల పనిని ఆశీర్వదింప / ప్రభు చేతులలో మేకులు గొట్ట (2) / కాళ్లలో మేకులు సువార్తకు సుందరమే / బల్లెపు పోటు బాగు చేయును – గుండెలను (2) ||యేసు||
అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా / సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము / ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము / మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి (2) / చెడు మాటలను పలుకుచు – శాంతి లేక యుంటిమిగా (2) ||అమూల్య|| / చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము (2) / నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి (2) ||అమూల్య|| / నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక (2) / స్వంత నీతి తోడనే – దేవుని రాజ్యము కోరితిమి (2) ||అమూల్య|| / కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను (2) / ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను (2) ||అమూల్య|| / తన రక్త ధారలలో – మన పాపములను కడిగి (2) / మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో (2) ||అమూల్య|| / పాపులమైన మన మీద – తన యాశ్చర్య ఘన ప్రేమ (2) / కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము (2) ||అమూల్య|| / మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా (2) / మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములను (2) ||అమూల్య||
అమూల్యమైన ఆణిముత్యమా / యెహోవ దేవుని హస్తకృతమా (2) / అపురూప సౌందర్య రాశివి నీవు / ఆత్మీయ సుగుణశీలివి నీవు (2) ||అమూల్యమైన|| / జ్ఞానము కలిగి నోరు తెరచుదువు / కృపగల ఉపదేశమును చేయుదువు (2) / ఇంటివారిని బాగుగ నడుపుచూ / వారి మన్ననలను పొందుచుందువు (2) ||అమూల్యమైన|| / చేతులతో బలముగా పనిచేయుదువు / బలమును ఘనతను ధరించుకొందువు (2) / రాత్రివేళ నీ దీపము ఆరదు / కాంతికిరణమై మాదిరి చూపుదువు (2) ||అమూల్యమైన|| / దీనులకు నీ చేతులు పంచును / దరిద్రులను నీవు ఆదుకొందువు (2) / దూరము నుండి ఆహారము కొనుచు / మంచి భోజనముతో తృప్తిపరచుదువు (2) ||అమూల్యమైన||
అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యా / నాన్న కన్న మిన్న ఓ యేసయ్యా (2) / నీ ప్రేమ కొదువ లేనిది / ఆ.. ఆ.. నీ కృప అంతము కానిది (2) / ఓ తల్లి తన బిడ్డను మరచునా / వారైనా మరచినా నేను మరువను / అని వాగ్ధానమిచ్చిన నా యేసయ్యా – (2)
ఏ భాషకందని భావం నీవు / వెలకట్టలేని ముత్యం నీవు / దేవుడిచ్చిన వరమే నీవు – తీర్చలేని ఓ ఋణం / ఎదలో దాగిన పలుకే నీవు – నా ప్రేమకు తొలిరూపం / అమ్మా నిను మించిన బంధం ఏదియు లేదే / లోకంలో ఈ తియ్యని బంధం కానరాలేదే / నవ మాసాలు నీలో నన్ను దాచావు / నా ఊపిరికై నీ ప్రాణం పణంగా పెట్టావు / రేయి పగలంతా నాకై శ్రమపడినా / తీరని అనురాగం నీలో చూసానే / నీ సుఖ సంతోషం విడచిన నాకై / తరగని మమకారం నీలో దాచావే / యేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే / అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే / లోకంలో ఈ తియ్యని బంధం కానరానే లేదే / భయ భక్తులే ఉగ్గి పాలగ పోసావు / దేవుని మాటలే గోరు ముద్దగ చేసావు / తప్పటడుగులే నాలో సరి చేసి / ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగ నిలిపావు / ప్రతి వేకువలో నాకై నీవు / చేసే ప్రార్థనలే పెంచెను నా బలమే / నీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించెనే / అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే / లోకంలో ఈ తియ్యని బంధం కానరానే లేదే
అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) / ఈ వార్త వినరండే / యేసయ్యను నమ్ముకొండే (2) / మానవ జాతి పాపము కొరకై (2) / కన్నీరు విడుస్తుండు / ప్రభు రమ్మని పిలుస్తుండు (2) ||అమ్మల్లారా|| / లోకమంతటా యేసు రక్తము (2) / ఎరువుగ జల్లిండే / మరణపు ముల్లును విరిచిండే (2) / అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) / ఓ పల్లె చెల్లెల్లారా / ఓ పట్నం అక్కల్లారా (2) / బట్టలు మార్చితే బ్రతుకు మారదు / గుండు కొడితే నీ గుణం మారదు / బతుకు మారడం బట్టల్ల లేదు / గుణం మారడం గుండుల లేదు / నీ మనసు మారాలన్నా / నీ బుద్ది మారాలన్నా / నీ మనసు మారాలక్కా / నీ బుద్ది మారాలక్కా ||అమ్మల్లారా|| / పాపం లేని యేసు దేవుణ్ణి / నమ్ముకుందామమ్మా / దేవుడు మంచి దేవుడమ్మా (2) / అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) / ఈ సత్యమినరండే / ఇది కల్ల కాదు చెల్లె / ఇది కల్ల కాదు తమ్మి / ఇది కల్ల కాదు తాత / ఇది కల్ల కాదు అవ్వ / ఇది కల్ల కాదు అన్న / ఇది కల్ల కాదు అక్క
అమ్మా అని నిన్ను పిలువనా / యేసయ్యా.. నాన్నా అని నిన్ను తలువనా (2) / అమ్మా… నాన్నా… (2) / (నా) అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| / కన్నీరే నాకు మిగిలెను యేసయ్యా / ఓదార్చే వారు ఎవరూ లేరయ్యా (2) / అమ్మా… నాన్నా… (2) / అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| / ఎవరూ లేని ఒంటరి నేనయ్యా / ఎవరూ లేని అనాథను నేనయ్యా (2) / అమ్మా… నాన్నా… (2) / అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| / నేనున్నాను భయమేలను అని / నాకభయమిచ్చిన నా యేసు రాజా (2) / అమ్మా… నాన్నా… (2) / అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా||
అయ్యా నా కోసం కల్వరిలో / కన్నీరును కార్చితివా (2) / నశించిపోవు ఈ పాపి కొరకై / సిలువను మోసితివా / అయ్యా వందనమయ్యా / యేసు వందనమయ్యా (2) ||అయ్యా|| / పడిపోయి ఉన్న వేళలో / నా చేయి పట్టి లేపుటకు / గొల్గొతా కొండపై పడిపోయిన / యేసు నా కొరకు తిరిగి లేచితివి (2) ||అయ్యా వందనమయ్యా|| / అనాథ నేను కాదని / సిలువపై నాకు చెప్పుటకు / ఒంటరిగా ఉన్న మరియను / యేసు యోహానును అప్పగించితివి (2) ||అయ్యా వందనమయ్యా||
అయ్యా వందనాలు.. అయ్యా వందనాలు / అయ్యా వందనాలు నీకే (2) / మృతతుల్యమైన శారా గర్భమును – జీవింపచేసిన నీకే / నిరీక్షణే లేని నా జీవితానికి – ఆధారమైన నీకే (2) / ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు / అయినా నీవిస్తావయ్యా వాగ్ధాన ఫలములు (2) ||అయ్యా|| / అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో – ఆనందమిచ్చిన నీకే / నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు – నిరీక్షణనిచ్చిన నీకే (2) / కోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగా / జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా (2) ||అయ్యా||
అరుణ కాంతి కిరణమై / కరుణ చూప ధరణిపై / నరుని రూపు దాల్చెను / పరమ దేవ తనయుడు / అదే అదే క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ / ఇదే ఇదే క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్ ||అరుణ|| / యజ్ఞ యాగాదులు – బలి కర్మకాండలు (2) / దోషంబులు కడుగలేవు / దోషుల రక్షింప లేవు (2) / పరిశుద్ధుని రక్తమునందే / పాపులకిల ముక్తి కలుగును / అందుకే.. అందుకే ||అరుణ|| / పుణ్య కార్యములు – మరి తీర్థయాత్రలు (2) / దోషంబులు కడుగలేవు / దోషుల రక్షింప లేవు (2) / పరిశుద్ధుని రక్తమునందే / పాపులకిల ముక్తి కలుగును / అందుకే.. అందుకే ||అరుణ||
అర్పించుచుంటిని యేసయ్యా / నన్ను నీ చేతికి (2) / దీనుడను నన్ను నీ బిడ్డగా / ప్రేమతో స్వీకరించు (2) ||అర్పించుచుంటిని|| / ఈ లోక జీవితం అల్పకాలమే / నీవే నా గమ్యస్థానము (2) / నిజ సంతోషం నీవు నాకిచ్చి (2) / నా హృదయం వెలిగించు (2) / నా ప్రభువా యేసయ్యా ||అర్పించుచుంటిని|| / దప్పిగొన్న జింకవలెనే / ఆశతో చేరితి నీ దరి దేవా (2) / సేదతీర్చి జలము నిన్ను (2) / వాడిన బ్రతుకులో (2) / నింపుము జీవము ||అర్పించుచుంటిని||