ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
తొలకరి వాన దీవెనలు కురిపించు వాన / పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) / అది నూతన పరచును ఫలియింపచేయును / సమృద్ధినిచ్చును సంతోషపరచును (2) ||తొలకరి|| / ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును / జీవజలముతో నింపి జీవింపచేయును (2) / ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును (2) ||అది నూతన|| / సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించును / పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును (2) / యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును (2) ||అది నూతన||
నీవే నా ప్రాణం సర్వం / నీవే నా ధ్యానం గానం / యేసయ్యా నీవే ఆధారం (2) / నీవేగా నా ప్రాణం – యేసయ్యా నీవే జీవితం / యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా.. / హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2) ||నీవే|| / నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినది / నీ రాకకే కదా నేనెదురు చూచునది (2) / నీవలె ఉందును నీలో వసించెదను (2) / అండా దండా కొండా నీవయ్యా / నాకున్న లోకం అంతా నీవయ్యా / అండా దండా కొండా నీవయ్యా / నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా ||నీవేగా|| / నా కాపరి నీవే నా ఊపిరి నీవే / నా దారివి నీవే నా మాదిరి నీవే (2) / నీవలె ఉందును నీ వెంట సాగెదను (2) / అండా దండా కొండా నీవయ్యా / నాకున్న లోకం అంతా నీవయ్యా / అండా దండా కొండా నీవయ్యా / నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా ||నీవేగా||
యెహోవా మహిమ నీ మీద ఉదయించెను / తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును (2) / ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది / అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది (2) / లెమ్ము నీవు తేజరిల్లుము / ప్రభువు కొరకు ప్రకాశించుము (2) / చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది / జీవ వాక్యము చేబూని జ్యోతివలే లెమ్ము (2) / జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు / రాజులు నీ ఉదయకాంతికి త్వరపడి వచ్చెదరు (2) ||లెమ్ము|| / ఒంటరియైన వాడు వేయి మంది అగును / ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును (2) / ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును / నీ దుఃఖదినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను (2) ||లెమ్ము||
నూతన పరచుము దేవా / నీ కార్యములు నా యెడల (2) / సంవత్సరాలెన్నో జరుగుచున్నను / నూతనపరచుము నా సమస్తము (2) / పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగును / నీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును ||నూతన|| / శాశ్వతమైనది నీదు ప్రేమ / ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2) / దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా / నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2) ||పాతవి|| / ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో / నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2) / తరములలో ఇలా సంతోషకారణముగా / నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2) ||పాతవి||
యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో (3) / రక్షణకు విడుదలకు స్వస్థతకు (2) ||యేసుని|| / ఎనలేని ప్రేమ నాపై చూపించితివే / నీ బలియాగం నన్ను రక్షించెనే (3) / రక్షణ విడుదల స్వస్థత (2) / కుమ్మరించుము నీ ఆత్మను / వేచియున్నాము నీ రాకకై (3) ||రక్షణకు||
నను చేరిన నీ ప్రేమ / తొలగించని నీ ప్రేమ / జీవితానికి చాలిన – యేసు నీ ప్రేమ / నిను నేను విసిగించినా / నిను విడచి పారిపోయినా / నిను నేను హింసించినా – వీడని ప్రేమ / నన్ను ఓర్చి దరికి చేర్చి / స్నేహించి నను ప్రేమించి / జీవమునిచ్చి నను దీవించి / నీ పాత్రగ మలిచావు (2) ||నను చేరిన|| / నీ ప్రేమ నన్ను మార్చింది / నీ రక్తం నన్ను కడిగింది / నీ వాక్యం నన్ను నిలిపింది / నీ మరణం జీవమునిచ్చింది (2) ||నన్ను ఓర్చి|| / నీ మాట నాకు ధైర్యంగా / నీ స్పర్శ నాకు నెమ్మదిగా / నీ ప్రేమ నాకు ఊపిరిగా / నీ స్వరము నాకు శాంతిగా (2) ||నన్ను ఓర్చి||
పాతాళంలో ఆత్మల ఆర్తనాదం / భూలోకంలో సువార్తల సునాదము (2) / మించుతుంది సమయం – పొంచి ఉంది ప్రమాదం / ఎంచుకో స్వర్గం – నరకం (2) / గమనించుకో ఎటు నీ పయనం ||పాతాళంలో|| / ఆరని అగ్ని తీరని బాధ పాతాళమందున్నది / విందు వినోదం బంధువు బలగం ఈ లోకమందున్నది (2) / రక్షణను పొందమంటే పొందుకోరు ఇక్కడ / రక్షించే వారులేక రోధిస్తారక్కడ (2) ||పాతాళంలో|| / ఇది రంగుల లోకం హంగులు చూపి రమ్మని పిలుస్తున్నది / వాక్యము ద్వారా దేవుడు పిలచినా ఈ లోకం వినకున్నది (2) / ప్రజల కొరకు పాతాళం నోరు తెరుచుకున్నది / ఎంత చెప్పినా లోకం కళ్ళు తెరవకున్నది (2) ||పాతాళంలో||
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా (2) / నా కన్నుల కన్నీరు తుడిచినా యేసయ్యకే / ఆరాధన – ఆరాధన (2) / ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా / తన రక్తముతో నను కడిగిన యేసయ్యకే / ఆరాధన – ఆరాధన (2) / ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా / తన వాక్యముతో నను నింపిన యేసయ్యకే / ఆరాధన – ఆరాధన (2) / ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా / పాదాలతో మరణాన్ని త్రొక్కిన యేసయ్యకే / ఆరాధన – ఆరాధన (2) / ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా (2) / అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం (2) / సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం (2) ||లాల|| / దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు / దీనులను రక్షించే దేవ తనయుడు (2) / దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె / విజయ వీరుడై ఉద్భవించెనే (2) / పశుల పాకలో పరుండియుండెనే ||లాల|| / ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే / లోకానికి రక్షకుడు వెలిసెనని (2) / తార వెంబడి వెళ్లి వారు / కానుకలర్పించి ఆరాధించారు (2) / ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి ||లాల|| / ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త / సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే (2) / పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు / దూత గణములే జోల పాడగా (2) / సృష్టికి బహు సంబరమాయెగా ||లాల||
లెమ్ము తేజరిల్లుము అని / నను ఉత్తేజ పరచిన నా యేసయ్య (2) / నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు / రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని / నిను వేనోళ్ళ ప్రకటించెద (2) / ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక / నీతో నడుచుటే నా భాగ్యము (2) / శాశ్వత ప్రేమతో నను ప్రేమించి / నీ కృప చూపితివి (2) / ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ… / ఇదియే నా భాగ్యమూ ||లెమ్ము|| / శ్రమలలో నేను ఇంతవరకును / నీతో నిలుచుటే నా ధన్యత (2) / జీవకిరీటము నే పొందుటకే / నను చేరదీసితివి (2) / ఇదియే ధన్యత…. ఇదియే ధన్యత…. / ఇదియే నా ధన్యత ||లెమ్ము|| / తేజోవాసుల స్వాస్థ్యము నేను / అనుభవించుటే నా దర్శనము (2) / తేజోమయమైన షాలోము నగరులో / నిను చూసి తరింతునే (2) / ఇదియే దర్శనము… ఇదియే దర్శనము… / ఇదియే నా దర్శనము ||లెమ్ము||
రండి రండి రండయో రక్షకుడు పుట్టెను (2) / రక్షకుని చూడను రక్షణాలు పొందను (2) ||రండి|| / యూదుల యూదట రాజుల రాజట (2) / రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2) / యూదుల యూదట రాజుల రాజట (2) / రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2) ||రండి|| / బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2) / పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2) / బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2) / పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2) ||రండి|| / సాతాను సంతలో సంతోషమేదిరా (2) / సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో (2) / సాతాను సంతలో సంతోషమేదిరా (2) / సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో (2) ||రండి||
బ్రతుకుట నీ కోసమే / మరణమైతే నాకిక మేలు (2) / సిలువ వేయబడినానయ్యా (2) / నీవే నాలో జీవించుమయ్యా (2) / యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) / ఏ క్షణమైనా ఏ దినమైనా / నీ కొరకే నే జీవించెద (2) / శ్రమలైనా శోధనలైనా / ఇరుకులైనా ఇబ్బందులైనా (2) / ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగెదనయ్యా (2) / సేవలో సాగెదనయ్యా.. ||యేసయ్యా|| / లోకములోని నిందలు నాపై / రాళ్ళై రువ్విన రంపాలై కోసిన (2) / రాజులైనా అధిపతులైనా / ఉన్నవి అయినా రాబోవువైనా (2) / నీదు ప్రేమ నుండి ఏవి ఎడబాపవయ్యా (2) / ఏవి ఎడబాపవయ్యా.. ||యేసయ్య||