ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
హోలీ హోలీ హోలీ / హి ఈస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ / హూ వాస్ అండ్ ఈస్ అండ్ ఈస్ టు కం (2) / ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహిం / బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు – (2) / శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారము / సృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం / అల్ఫా ఒమేగవు – నిత్యుడైన దేవుడవు – (2) / నిత్య నిబంధన చేసావు – నిబంధనని స్థిరపరచావు / నిన్నా నేడు రేపు – మారని దేవుడవు నీవు – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ / పోషించు దేవుడవు – ఆశ్రయ దుర్గము నీవు – (2) / రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా / నీ మాటున దాచే దేవా – మాటను నెరవేర్చే దేవా – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / అడోనై అడోనై అడోనై అడోనై / ప్రభువైన దేవుడవు – ప్రభువులకు ప్రభువు నీవు – (2) / సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు / నీవే నాకు ప్రభువు – నీవే నా యజమానుడవు – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / యావే యావే యావే యావే / యెహోవా దేవా – సైన్యములకు అధిపతివి – (2) / పరిశుద్ధ దేవుడవు నీవు – ఉన్నవాడనని అన్నావు / ప్రభు యేసును పంపిన దేవా – పాపము తొలగించిన దేవా – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)
మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు (2) / ఆదియంత మైనవాడవు – మానవుని రూపమెత్తావు (2) / పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి (2) / ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా / యేసు నీ ఋణము తీరునా (2) ||మంచే లేని|| / లోకాలన్నీ ఏలే రారాజు వైన నీవు / సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు (2) / నీదెంత దీన మనస్సు / నా కెంత ఘనత యేసు (2) ||ఎంతగా|| / నాశనమైన నన్ను రక్షించగోరి నీవు / వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు (2) / నీలోన జాలి పొంగె / నాలోన శాంతి నిండె (2) ||ఎంతగా|| / చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు / వేకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావు (2) / నీ సాటిలేని త్యాగం / నా పాలి గొప్ప భాగ్యం (2) ||ఎంతగా||
కృప వెంబడి కృపతో / నను ప్రేమించిన నా యేసయ్యా / నను ప్రేమించిన నా యేసయ్యా (2) / నను కరుణించిన నా యేసయ్యా (2) ||కృప|| / నా యెడల నీకున్న తలంపులు / బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా (2) / అవి వర్ణించలేను నా యేసయ్యా / అవి వివరింపలేను నా యేసయ్యా (2) / నా యెడల నీకున్న వాంఛలన్నియు ||కృప|| / ఎన్నో దినములు నిన్ను నే విడచితిని / ఎన్నో దినములు నిన్ను నే మరచితిని (2) / విడువని ఎడబాయని నా యేసయ్యా / మరువక ప్రేమించిన నా యేసయ్యా (2) / ఏమిచ్చి నీ ఋణము తీర్చెదనయ్యా ||కృప||
నా దేవుని గుడారములో – నా యేసుని నివాసములో (2) / ఎంతో సంతోషం – ఎంతో ఆనందం (2) / నా యేసుని నివాసములో (2) ||నా దేవుని|| / సీయోను మార్గములందు – సహాయకుడవు నీవే కదా / రాత్రి జాముల యందు- నా తోడు నీడవు నీవే కదా (2) / నా కొండ నీవేగా – నా కోట నీవేగా (2) / నా యేసు రక్షకా నీవే కదా (2) ||నా దేవుని|| / నా యేసు సన్నిధి యందు – నేను పరవశమొందెదను / నా యేసు స్వరమును వినుచు – నేను కాలము మరచెదను (2) / నా గానమాయెనే – నా ధ్యానమాయెనే (2) / నాదు స్వరము నా ప్రభువే (2) ||నా దేవుని|| / ఆనంద తైలము నందు – నన్ను అభిషేకించెనుగా / నాదు వస్త్రము నందు – అగరు వాసన నింపెనుగా (2) / నా ప్రాణ నాథుడా – నా ప్రేమ పాత్రుడా (2) / నా యేసు నాథుడా నీవే కదా (2) ||నా దేవుని||
ఆకాశం అమృత జల్లులు కురిపించింది / ఈ లోకం ఆనందమయమై మురిసింది (2) / అంతు లేని ఈ అనంత జగతిలో / శాంతి కొరవడి మసలుచుండగా (2) / రక్షణకై నిరీక్షణతో (2) / వీక్షించే ఈ అవనిలో (2) / శాంతి సమతల కధిపతి నేడు జన్మించినాడనీ ||ఆకాశం|| / పొంతన లేని వింత జగతిలో / పాపాంధకారం ప్రబలి యుండగా (2) / సమ్మతిని మమతలను (2) / పెంచుటకై ఈ పృథివిపై (2) / ఆది దేవుడే ఆదరంబున ఉదయించినాడనీ ||ఆకాశం||
లోకాన ఎదురు చూపులు / శోకాన ఎద గాయములు / యేసులోన ఎదురు చూపులు / ఫలియించును ప్రభు వాగ్ధానములు (2) / ఎదురు చూడాలి యేసుకై / నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన|| / నిండు నూరేళ్లు అబ్రహాము / ఎదురు చూసాడు విశ్వాసముతో (2) / కన్నాడు పండంటి కుమారుని / పొందాడు వాగ్ధాన పుత్రుని (2) / ఎదురు చూడాలి యేసుకై / నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన|| / ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని / ఎదురు చూసెను ఉపవాసముతో (2) / చూసింది పరిశుద్ధ తనయుని / సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు (2) / ఎదురు చూడాలి యేసుకై / నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన||
వెండి బంగారాల కన్న మిన్న అయినది / యేసు ప్రేమ – నా యేసు ప్రేమ (2) / లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2) / లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2) ||వెండి|| / లోకమునకు వెలుగైన ప్రేమ / లోకమును వెలిగించిన ప్రేమ (2) / లోకులకై కరిగిపోయిన ప్రేమ / లోకాన్ని జయించిన ప్రేమ (2) / యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2) / హల్లెలూయా మహదానందమే (2) ||వెండి|| / ఏ స్థితికైనా చాలిన ప్రేమ / నీ పరిస్థితిని మార్చగల ప్రేమ (2) / నీకు బదులు మరణించిన ప్రేమ / చిర జీవము నీకొసగిన ప్రేమ (2) / యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2) / హల్లెలూయా మహదానందమే (2) ||వెండి||
యేసువా.. యేసువా.. / యేసువా నా యేసువా (2) / మీ జ్ఞాపకార్థముగా భుజించుచున్నాము / మీ దివ్య దేహమును / తమ ఆజ్ఞానుసారముగా పానము చేసెదము / మీ తీరు రుధిరమును ||యేసువా|| / ఆనాడు మీ దేహమును హింసించి చంపితిమి (2) / ఈనాడు ఆ దేహమే మేము గాచుచుండెనుగా (2) / మేము గాచుచుండెనుగా ||యేసువా|| / ఆనాడు మీ రక్తమును చిందింప చేసితిమి (2) / ఈనాడు ఆ రక్తమే మేము శుద్ధి పరచెనుగా (2) / మేము శుద్ధి పరచెనుగా ||యేసువా|| / మా పాప భారమును సిలువగ మోసితివి (2) / మార్గము చూపితివి రక్షణ నొసగితివి (2) / రక్షణ నొసగితివి ||యేసువా||
మేఘాల పైన మన యేసు / త్వరలోనే మనకై వచ్చుచున్నాడు (2) / సిద్ధపడుమా ఉల్లసించుమా / నీ ప్రియుని రాకకై (2) ||మేఘాల|| / ఏ ఘడియో ఏ వేళయో – తెలియదు మనకు / బుద్ధి కలిగిన కన్యకలు వలె – సిద్ధపడియుండు (2) / బూర శబ్దం మ్రోగగా / ప్రభుని రాకడ వచ్చును / రెప్ప పాటున పరిశుద్ధులు / కొనిపోబడుదురు ప్రభువుతో ||మేఘాల|| / పాపం వలన వచ్ఛు జీతం – మరణమే కాదా / దేవుని కృపయే క్రీస్తు యేసులో – నిత్య జీవమే (2) / వినుట వలన విశ్వాసం / కలుగును సోదరా / దేవుని ఆజ్ఞకు లోబడితే / పొందెదవు పరలోకం ||మేఘాల|| / స్తుతియు మహిమ ఘనత ప్రభావం / యేసుకే చెల్లు గాక / తర తరములకు యుగయుగములు / యేసే మారని దైవం (2) / నిత్యము ఆనందమే ప్రభువా నీతో నుండుట / నూతన యెరూషలేము చేరుకోనుటే నిరీక్షణ ||మేఘాల||
నీతి సూర్యుడా యేసు / ప్రాణ నాథుడా.. రావయ్యా / నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా / హల్లెలూయా- ఎన్నడైన నన్ను మరచిపోయావా / హల్లెలూయా – నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా / యుగయుగములకు ప్రభువా / తరతరములకు రాజువా (2) / శరణటంచు నిన్ను వేడ / కరములెత్తి నిన్ను పిలువ (2) / పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న|| / వేల్పులలోనే ఘనుడా / పదివేలలో అతిప్రియుడా (2) / కృపా సత్య సంపూర్ణుడా / సర్వ శక్తి సంపన్నుడా (2) / పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న||
నా తండ్రి నన్ను మన్నించు / నీకన్నా ప్రేమించే వారెవరు (2) / లోకం నాదే అని నిన్ను విడిచాను / ఘోర పాపిని నేను యోగ్యతే లేదు / ఓ మోసపోయి తిరిగి వచ్చాను / నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను / నీదు బిడ్డగా పెరిగి – నీ ప్రేమనే చూడలేకపోయాను / నే చూచినా ఈ లోకం – నన్నెంతో మురిపించింది (2) / నీ బంధం తెంచుకొని – దూరానికే పరిగెత్తాను / నే నమ్మిన ఈ లోకం – శోకమునే చూపించింది ||లోకం|| / నీ కన్నులు నా కొరకు – ఎంతగ ఎదురు చూచినవో / నిన్ను మించిన ఈ ప్రేమ – ఎక్కడ కనరాలేదు (2) / నే చనిపోయి బ్రతికానని – తిరిగి నీకు దొరికానని / గుండెలకు హత్తుకొంటివే – నీ ప్రేమా ఎంతో చూపితివే ||నా తండ్రి||
మార్గము నీవని – గమ్యము నీవని – (2) / నమ్మితి గనుక ఓ యేసు నాథా / సుగమమాయెనే జీవ యాత్ర / ప్రాణము నీవని – దేహము నీదని – (2) / నమ్మితి గనుక ఓ యేసు నాథా / చైతన్యమొందెనే జీవ యాత్ర / బాధల బరువులో – నిత్య నిరాశలో / శోధన వేళలో సత్య సాక్ష్యమునీయగా (2) / శాంతము నీవని – స్వస్థత నీవని (2) / నమ్మితి గనుక ఓ యేసు నాథా / ఆనందమాయెనే జీవ యాత్ర ||మార్గము|| / ప్రార్థన వేళలో – ఆద్రత మీరగా / గొంతు మూగదై – భక్తి కన్నుల జాలగా (2) / ధాత్రము నీవని – స్తోత్రము నీవని (2) / నమ్మితి గనుక ఓ యేసు నాథా / సంగీతమాయెనే జీవ యాత్ర ||మార్గము||