తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

నిన్నే నిన్నే నే కొలుతునయ్యా|Ninne Ninne Ne Koluthunayyaa

యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. / నిన్నే నిన్నే నే కొలుతునయ్యా / నీవే నీవే నా రాజువయ్యా (2) / యేసయ్య యేసయ్య యేసయ్యా… / కొండలలో లోయలలో / అడవులలో ఎడారులలో (2) / నన్ను గమనించినావా / నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా|| / ఆత్మీయులే నన్ను అవమానించగా / అన్యులు నన్ను అపహసించగా (2) / అండ నీవైతివయ్యా / నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా|| / మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ / నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2) / నన్ను బలపరచెనయ్యా / నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా|| / వంచెన వంతెన ఒదిగిన భారాన / ఒసగక విసిగిన విసిరె కెరటాన (2) / కలలా కడతేర్చినావా / నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||

దివినేలు స్తోత్రార్హుడా|Divinelu Sthothraarhudaa

దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా / దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా / మొదటివాడవు – కడపటివాడవు / యుగయుగములలో ఉన్నవాడవు (2) / మానక నా యెడల కృప చూపుచున్నావు / మారదు నీ ప్రేమ తరతరములకు (2) / మాట తప్పని మహనీయుడవు – మార్పులేని వాడవు / నీవు చెప్పిన మంచి మాటలు – నెరవేర్చువాడవు / నీ మాటలు జీవపు ఊటలు / నీ కృపలే బలమైన కోటలు (2) ||దివినేలు|| / దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు / దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు (2) / దాటి వెళ్లని కరుణామూర్తివై – మనవి ఆలకించావు / దీర్ఘ శాంతముగలవాడవై – దీవించువాడవు / నీ దీవెన పరిమళ సువాసన / నీ ఘనతే స్థిరమైన సంపద (2) ||దివినేలు|| / సీయోను శిఖరముపై నను నిలుపుటకే / జ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే (2) / దివ్యమైన ప్రత్యక్షతతో – నన్ను నింపియున్నావు / సుందరమైన నీ పోలికగా – రూపు దిద్దుచున్నావు / నీ రాజ్యము పరిశుద్ధ నగరము / ఆ రాజ్యమే నిత్య సంతోషము (2) ||దివినేలు||

నిబ్బరముతో నా యేసుకే|Nibbaramutho Naa Yesuke

నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా / వేకువనే లేచి నా ప్రభునే కొనియాడెదా (2) / యేసయ్యా… యేసయ్యా… స్తుతులకు పాత్రుడవు నీవయ్యా / యేసయ్యా… యేసయ్యా… మాహిమ ఘనతలు నీకయ్యా (2) ||నిబ్బరముతో|| / కష్టకాలమందు నాకు – కనికరము చూపెను / కాలుజారుతున్నవేళ – కరుణతో నిలిపెను (2) / కడుపు కాలుతున్నవేళ – నా కడుపు నింపెను / కన్నిటి బ్రతుకును – నాట్యముగా మార్చెను / కఠినమైన కాలములో – నా చెంత నిలిచెను ||యేసయ్యా|| / దిక్కుదెసలేని నాకు – దర్శనము నిచ్చెను / ధనము ఘనము లేని నాకు ఘనతనెంతో నిచ్చెను (2) / దిక్కుతోచని వేళ – నా దిక్కై నిలిచెను / దుష్ట శక్తులన్నిటిని – నాకు దూరపరచెను / దీవెనలు కుమ్మరించి – ధన్యునిగా చేసెను ||యేసయ్యా||

నీవే నా సంతోషగానము|Neeve Naa Santhosha Gaanamu

నీవే నా సంతోషగానము / రక్షణశృంగము మహాశైలము (2) / బలశూరుడా యేసయ్యా నా తోడై / ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా|| / ఓ లార్డ్! యు బి ద సేవియర్ / షో మి సం మెర్సీ / బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్ / సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్ / ఐ విల్ సరెండర్ / యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్ / త్యాగము ఎరుగని స్నేహమందు / క్షేమము కరువై యుండగా / నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి / నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2) / నిరంతరం నిలుచును నాపై నీ కనికరం / శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవే నా|| / వేదన కలిగిన దేశమందు / వేకువ వెలుగై నిలిచినావు / విడువక తోడై అభివృద్ధిపరచి / ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2) / మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం / అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవే నా|| / నిర్జీవమైన ఈ లోయయందు / జీవాధిపతివై వెలసినావు / హీనశరీరం మహిమ శరీరముగ / నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2) / హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు / హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2) ||నీవే నా||