తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

యేసయ్య మాట విలువైన మాట|Yesayya Maata Viluvaina Maata

యేసయ్య మాట విలువైన మాట / వినిపించుకోవా సోదరా / వినిపించుకోవా సోదరీ (2) / నీ గుండెలోన ముద్రించుకోవా / ఏ నాటికైనా గమనించలేవా / గమనించుము పాటించుము ప్రచురించుము / నిన్నూవలె నీ పొరుగువారిని / ప్రేమించమని ప్రేమించమని ||యేసయ్య|| / ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులని చెప్పిన మాట / నీతివిషయమై ఆకలిగొనువారు ధన్యులని చెప్పిన మాట / కనికరము గలవారు – హృదయశుద్ది గలవారు (2) / సమాధానపడువారు – సాత్వికులు ధన్యులని (2) / దుఃఖపడువారు ధన్యులని చెప్పిన మాట ||యేసయ్య|| / నరహంతకులు కోపపడువారు నరకాగ్నికి లోనగుదురని / అపహారకులు వ్యభిచరించువారు నరకములో పడిపోదురని / కుడిచెంప నిను కొడితే – ఎడమ చెంప చూపుమని (2) / అప్పడుగగోరువారికి నీ ముఖము త్రిప్పకుము (2) / నీ శత్రువులను ద్వేషించక ప్రేమించమని ||యేసయ్య||

నా ప్రాణమా ఏలనే|Naa Praanamaa Aelane

నా ప్రాణమా ఏలనే క్రుంగినావు – నిరీక్షణా నీవుంచుమా / సంతోషమూ కలిగీ స్తోత్రము – చెల్లించుమా స్తుతిపాడుమా / ఆ యేసు మహిమలు ఆశ్చర్యకార్యాలు (2) / నెమరేసుకుంటూ ప్రాణమా / స్తుతిపాడుమా – స్తుతిపాడుమా ||నా ప్రాణమా|| / నీ కొరకు బాధలెన్నో బహుగా భరించాడు / నీ కొరకు సిలువలోన తాను మరణించాడు (2) / నా ప్రాణమా ఈ సత్యం గమనించుమా / నీవు కూడా తన కార్యం పాటించుమా (2) / అలనాటి యేసు ప్రేమ మరువకు సుమా / మరువకు సుమా – మరువకు సుమా ||నా ప్రాణమా|| / నీ శత్రుసేననంతా మిత్రులుగ మార్చాడు / నీ వ్యాధి బాధలందు నిన్ను ఓదార్చాడు (2) / నా ప్రాణమా నాలో కరిగిపోకే / నీ గతం ఏమిటో మరచిపోకే (2) / దినమెల్ల దేవుని దయ కోరుమా / దయ కోరుమా – దయ కోరుమా ||నా ప్రాణమా|| / నీ చదువులోన నీకు విజయాన్ని ఇచ్చాడు / నీ వయసులో నీకు తోడుగా ఉన్నాడు (2) / నా ప్రాణమా నాలో కృంగిపోకే / నీ గతం ఏమిటో మరచిపోకే (2) / దినమెల్ల దేవుని కృప కోరుమా / కృప కోరుమా – కృప కోరుమా ||నా ప్రాణమా||

దేవుని స్తుతియించి ఆరాధింతుము|Devuni Sthuthiyinchi Aaraadhinthumu

దేవుని స్తుతియించి ఆరాధింతుము / మన దేవుని ఆరాధించి ఆనందింతుము (2) / రండీ ఓ జనులారా / సర్వలోక నివాసులారా (2) / సంతోషగీతము పాడెదము (2) / ఆహా.. ఆరాధనా.. – హల్లెలూయా ఆరాధనా… (2) ||దేవుని|| / వేటకాని ఉరిలో నుండి ఆయనే నిన్ను విడిపించును / భారమైన నీ బాధలను ఆయనే ఇక తొలగించును (2) / ఏ తెగులు నీ ఇల్లు దరిచేరదు (2) / ఆయనే రక్షించును ||రండీ ఓ|| / బండ చీల్చి నీళ్ళను ఇచ్చి ఇశ్రాయేలీయులను కాచెను / నింగి నుంచి మన్నాను పంపి వారి ప్రాణము రక్షించెను (2) / శత్రువుల చెర నుంచి విడిపించెను (2) / తోడుండి నడిపించెను ||రండీ ఓ|| / మన విరోధి చేతిలోనుండి ఆయనే మనను తప్పించును / కష్టకాల ఆపదలన్ని ఆయనే ఇక కడతేర్చును (2) / వేదనలు శోధనలు ఎదిరించగా (2) / శక్తిని మనకిచ్చునూ ||రండీ ఓ|| / కన్నవారు ఆప్తులకంటే ఓర్పుగా మనను ప్రేమించును / భూమికంటే విస్తారముగా ప్రేమతో మనను దీవించును (2) / ఆ ప్రభువు రక్షకుడు తోడుండగా (2) / దిగులే మనకెందుకు ||రండీ ఓ||

బ్రతికియున్నానంటే నీ కృప|Brathikiyunnaanante Nee Krupa

యేసయ్యా నా యేసయ్యా… / యేసయ్యా నా యేసయ్యా… / బ్రతికియున్నానంటే నీ కృప / జీవిస్తున్నానంటే నీ కృప (2) / ఏ యోగ్యత నాలో లేదు – ఎంత భాగ్యము నిచ్చావు / పరిశుద్ధత నాలో లేదు – నీ ప్రేమను చూపావు (2) / యేసయ్యా నా యేసయ్యా / యేసయ్యా నా యేసయ్యా (2) / నా జీవిత నావా సాగుచుండగా / తుఫానులు వరదలు విసిరి కొట్టగా / కదలలేక నా కథ ముగించబోగా / నువ్వు పదా అంటూ నన్ను నడిపినావు (2) / సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా / నీ పాదాల చెంతనే వాలిపోయేదా (2) ||యేసయ్యా|| / నా జీవితమంతా ప్రయాసలు పడగా / శోధనల సంద్రములో మునిగిపోగా / నా ఆశల తీరం అడుగంటిపోగా / ఆప్యాయత చూపి ఆదరించినావు (2) / నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది / నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా (2) ||బ్రతికి||

నీ సన్నిధిలో నేనున్న|Nee Sannidhilo Nenunna

నీ సన్నిధిలో నేనున్న చాలు – చాలు / నీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలు / శ్రమ కాలమైనా తోడుగ నీవుండ / నీ నామ ధ్యానం నే చేతునయ్యా / నీతోనే నేను ఉంటానయ్యా (2) / నా జీవితాన నీవున్న చాలు – చాలయ్యా / నీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలయ్యా ||నీ సన్నిధిలో|| / అర్పించినావు నా కొరకు నీ ప్రాణం / నా పాప భారం తొలగింప గోరి / నాతోనే నీవు ఉండాలని (2) / ఆశించినది నా రక్షణేగా – నీవు / నీతోనే నేను ఉంటాను ప్రభువా – యేసు ||నీ సన్నిధిలో|| / నను చంపబోయి సాతాను రాగా / నీ చేతి గాయం రక్షించునయ్యా / నీ ప్రేమయే నన్ను బ్రతికించునయ్యా (2) / నమ్మాను ప్రభువా నీదైన లోకం – లోకం / నీతోనే ఉన్నా అది నాకు సొంతం – సొంతం ||నీ సన్నిధిలో||

మన మధ్యనే ఉన్నది|Mana Madhyane Unnadi

మన మధ్యనే ఉన్నది పరలోక రాజ్యం / మన మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం (2) / పాపము లేదు పరలోకంలో / వ్యాధులు బాధలు లేనే లేదు / పాపము లేదు పరలోకంలో / వ్యాధులు బాధలు అసలే లేవు / నీ రాజ్యం మాకొచ్చును గాక / నీ చిత్తం భువిపై జరుగును గాక / పరలోక రాజ్యాన్ని ఈ భువిపై మేము / ఇప్పుడే అనుభవిస్తాము – (2) / ఇక్కడే అనుభవిస్తాము / సిలువలో మన శాపం తొలగిపోయెను / ఆశీర్వాదముకు మనము వారసులం / దారిద్య్రముతో లేదు మాకు సంబంధం / ఆత్మలో ఫలియించి వర్థిల్లెదం / అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము / కృప క్షేమములే మాకిక సొంతము / అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము / కృప క్షేమములే మా సొంతము ||నీ రాజ్యం|| / ఆలు మగలు ఒకరికి ఒకరు త్యాగ మూర్తులై / కలసి జీవించుటయే పరలోక రాజ్యం / కలతలు లేవు మాకు కన్నీరు తెలియదు / సంతోషముతో మేము సాగిపోతాము / ఈ తరానికి మాదిరిగా మేముంటాము / పరలోక ప్రేమతో కలిసి జీవిస్తాం (2) ||నీ రాజ్యం||