ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
సర్వ చిత్తంబు నీదేనయ్యా / స్వరూపమిచ్చు కుమ్మరివే (2) / సారెపైనున్న మంటినయ్యా / సరియైన పాత్రన్ చేయుమయ్యా / సర్వేశ్వరా నే రిక్తుండను / సర్వదా నిన్నే సేవింతును ||సర్వ చిత్తంబు|| / ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే / ప్రార్ధించుచుంటి నీ సన్నిధి (2) / పరికింపు నన్నీ దివసంబున / పరిశుభ్రమైన హిమము కన్నా / పరిశుద్ధున్ జేసి పాలింపుమా / పాపంబు పోవ నను కడుగుమా ||సర్వ చిత్తంబు|| / నీ చిత్తమే సిద్ధించు ప్రభూ / నిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2) / నీఛమౌ గాయముల చేతను / నిత్యంబు కృంగి అలసియుండ / నిజమైన సర్వ శక్తుండవే / నీ చేత పట్టి నన్ రక్షింపుమా ||సర్వ చిత్తంబు|| / ఆత్మ స్వరూప నీ చిత్తమే / అనిశంబు చెల్లు ఇహ పరమున (2) / అధికంబుగా నన్ నీ ఆత్మతో / ఆవరింపుమో నా రక్షకా / అందరు నాలో క్రీస్తుని జూడ / ఆత్మతో నన్ను నింపుము దేవా ||సర్వ చిత్తంబు||
కృప… కృప… కృప… (2) / ఎంత అధ్బుతమైన కృప / ఎంతో మధురమైన స్వరం (2) / నా వంటి పాపిని ప్రేమించెను / నా వంటి నీచుని రక్షించెను (2) / కృప – కృప – కృప – కృప (2) ||ఎంత|| / నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే / నా కలవరములను తొలగించినది కృపయే (2) / కృప… కృప… కృప… (2) / నీ కృప, నీ కృప ||ఎంత|| / నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే / నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే (2) / కృప… కృప… కృప… (2) / నీ కృప, నీ కృప ||ఎంత|| / పరిపూర్ణ ఏర్పాటుకై పిలిచినది కృపయే / ఉన్నతమైన పరిచర్య నిచ్చినది కృపయే (2) / కృప… కృప… కృప… (2) / నీ కృప, నీ కృప ||ఎంత||
నీవే ఆశ నీవే శ్వాస / నీవే ధ్యాస యేసువా / నీవే ప్రాణం నీవే గానం / నీవే ధ్యానం నేస్తమా / తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను (2) / నీ రూపులోనే నీ చేతి పనిగా – నను నీవు మలచితివే / నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై – నను సృజియించితివే ||నీవే|| / ఇహమున నా కొసగిన – ఈ ధర ఎంత భాగ్యమని / తలచితి నే భ్రమచితి – అంతయు నాకు సొంతమని / ఆశతో నేను పరుగెడితి ఇలలో చెలిమికై / ప్రతి హృదయం స్వార్ధమాయే / ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన / ఒక ప్రేమైన కాన రాదే ||నీవే|| / హృదయము పులకించెను – నీ ప్రేమ ప్రచించగానే / దృఢమాయె నా మదిలో – ఇక అంతయు వ్యర్థమని / నా జీవన గమనాన్ని నీ వైపు మలచి / నీ అడుగులలో నే నడచి / నీ ప్రియమైన ప్రేమగ ఇలలో జీవించి / నీ కౌగిలిలో ఒదుగుదునే ||నీవే||
ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు / కానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు (2) / దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారు / ఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారు / ఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమే / కళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము ||ఊహించలేని|| / ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధం / ఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం (2) / కలవాలి హృదయాలు ఒకటై / పండాలి నూరేళ్లు ఇకపై (2) / వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ ||ఊహించలేని|| / దేవుని సముఖములో బ్రతకాలి మీరు / మీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో (2) / లోబడి ఉండాలి వధువు / ప్రేమను పంచాలి వరుడు (2) / దేవుడిచ్చే బహుమానం మీ కన్నుల పంట కావాలి ||ఊహించలేని||
క్షణమైన గడవదు తండ్రి / నీ కృప లేకుండా – (2) / ఏ ప్రాణం నిలువదు ప్రభువా / నీ దయ లేకుండా – (2) / నీవే నా ప్రాణం – నీవే నా ధ్యానం / నీవే నా సర్వం – యేసు (2) ||క్షణమైన|| / ఇంత కాలం లోకంలో బ్రతికా / జీవితం అంతా వ్యర్థం చేసా / తెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్థమని / అనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని (2) ||నీవే|| / పనిలో ఉన్నా ఎందరిలో ఉన్నా / ఎక్కడ ఉన్నా నేనేమై యున్నా / నీవు నా చెంత ఉంటేనే నాకు చాలయ్యా / నీ రెక్కలే నాకు ఆశ్రయం నా యేసయ్యా (2) ||నీవే|| / జ్ఞానమున్నా పదవులెన్నున్నా / ధనము ఉన్నా సర్వం నాకున్నా / నీవు నాతో లేకుంటే అంతా శూన్యమేగా / పరలోక స్వాస్థ్యం ఎల్లప్పుడు శ్రేష్ఠమేగా (2) ||నీవే||
పైనున్న ఆకాశమందునా / క్రిందున్న భూలోకమందునా (2) / లేదు రక్షణ ఏ నామమున / లేదు పాప విమోచన – (2) ||పైనున్న|| / అన్ని నామములకు పైని కలదు / ఉన్నతంబగు యేసుని నామము (2) / యేసు నామములో శక్తి కలదు (2) / దోషులకు శాశ్వత ముక్తి కలదు (2) ||పైనున్న|| / అలసి సొలసిన వారికి విశ్రం / జీవము లేని వారికి జీవము (2) / నాశనమునకు జోగేడి వారికి (2) / యేసు నామమే రక్షణ మార్గము (2) ||పైనున్న|| / యేసు నామము స్మరియించగానే / మనసు మారి నూతనమగును (2) / బేధమేమియు లేదెవ్వరికిని (2) / నాథుని స్మరియించి తరింప (2) ||పైనున్న||
కంట నీరేల? కలతలు ఏల? / యేసుతో నీవు సాగు వేళ / శోధన వేళ రోదన ఏల? / నీ విశ్వసము గెలిచే వేళ (2) / నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడు / నీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు ||కంట|| / వలదు చింతన దేనికైనా / విన్నవించుము నీ నివేదన (2) / పొందితినను నీదు నమ్మకము / దరికి చేర్చును తగిన విజయము (2) / తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలు / పొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు (2) ||కంట|| / రేపు గూర్చిన భయము వలదు / ప్రతి దినము తగు బాధ కలదు (2) / నీదు భారము మోయు ఆ దేవుడు / నీకు ముందుగా నడుచు ఎల్లప్పుడు (2) / నీలోని ఆ భయము – లోకానికి ప్రతిరూపం / స్థిరమైన నీ విశ్వాసం – దేవునికి సంతోషం (2) ||కంట||
కలవంటిది నీ జీవితము / కడు స్వల్ప కాలము / యువకా అది ఎంతో స్వల్పము (2) / విలువైనది నీ జీవితం / వ్యర్ధము చేయకుము / యువకా వ్యర్ధము చేయకుము / బహు విలువైనది నీ జీవితం / వ్యర్ధము చేయకుము / యువతీ వ్యర్ధము చేయకుము ||కలవంటిది|| / నిన్ను ఆకర్షించే ఈ లోకము / కాటు వేసే విష సర్పము / యువకా అది కాలు జారే స్థలము (2) / ఉన్నావు పాపపు పడగ నీడలో / నీ అంతము ఘోర నరకము / యువకా అదియే నిత్య మరణము (2) ||కలవంటిది|| / నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం / నూతన సృష్టిగా మార్చును / పాపం క్షమియించి రక్షించును (2) / ఆ మోక్షమందు నీవుందువు / యుగయుగములు జీవింతువు / నీవు నిత్యము ఆనందింతువు (2) ||కలవంటిది||
నేను తగ్గాలి యేసు – నీవే హెచ్చాలి (2) / నేను పూర్తిగా మరుగై – నీవే కనబడాలి (2) / ఇదియే నా ప్రార్థన – నీ చిత్తము (2) ||నేను|| / నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి (2) / నా స్వార్ధ్య జీవితమంతా లయమైపోవాలి (2) / యేసూ నీ స్వభావము నాలో అధికమౌతు ఉండాలి (2) / పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి (2) ||ఇదియే|| / ఆదాము పాపము నాలో వసియించియుండగా (2) / యేసూ నీ రక్తమే దాని నశియింప చేయును (2) / ఆటంకమేమియు లేక జీవధారలుండాలి (2) / యేసూ నీ జీవము నాలో నింపబడుతు పోవాలి (2) ||ఇదియే||
నీ మందిరమై నేనుండగా / నా యందుండి నడిపించవా (2) / నీవు తోడుండగా నాకు దిగులుండునా (2) / వెంబడిస్తాను నిను యేసువా (2) / నీవు కోరేటి దేవాలయం / నాదు దేహంబెగా నిశ్చయం (2) / నీదు ప్రత్యక్షత నాకు కలిగించవా (2) / నిత్యము నిన్ను స్తుతింతును (2) / నీ మందిరమై నేనుండగా... / నాడు నిర్మించే దేవాలయం / రాజు సొలొమోను బహుసుందరం (2) / అట్టి దేవాలయం నేను నిర్మించగా (2) / నీ కట్టడలో నను నిల్పుమా (2) / నీ మందిరమై నేనుండగా... / హన్న ప్రార్ధనను విన్నావుగా / నేనున్నానని అన్నావుగా (2) / నేడు సమూయెలుతో బహుగా మాట్లాడినా (2) / దేవా నాతోటి మాట్లాడవా (2) / నీ మందిరమై నేనుండగా... / ఆత్మసత్యముతో ఆరాధింప / ఆత్మదేవుండు నేర్పించుమా (2) / మహిమ రూపంబును నేను దర్సింపను (2) / నా నేత్రంబు వెలిగించుమా (2) / నీ మందిరమై నేనుండగా... / ఆ పరలోక ప్రతిబింబమై / ఈ ధరలోన దీపంబునై (2) / ధరణి వెలిగించను కరుణ ప్రసరింపను (2) / కరము తోడుంచి నడిపించుము (2) / నీ మందిరమై నేనుండగా...
పైలం కొడుకా పాపం చేయకురా / యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా / పైలం కొడుకా పైలం కొడుకా / పైలం కొడుకా పైలం కొడుకా / పైలం కొడుకా పాపం చేయకురా / యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా / నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా / ఉడుకు రక్తము ఉరుకలు పెడ్తది / పాపం చెయ్యమని ఒత్తిడి చేస్తది / పాపమన్నది పాములాంటిది / పగ పడ్తది ప్రాణం తీస్తది ||పైలం|| / మనిషి జీవితం విలువయ్యింది / మరువకు కొడుకా మరణమున్నదని / బ్రతికింది ఇది బ్రతుకు కాదురా / సచ్చినంక అసలాట ఉంటది ||పైలం|| / కత్తి కన్న పదునెక్కువ కొడుకా / మనిషి కోపము మంచిది కాదు / కాలు జారితే తీసుకోవచ్చురా / నోరు జారితే తీసుకోలేము ||పైలం|| / క్రైస్తవ జీవితం విలువయ్యింది / నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా / నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా / నిందలన్ని మొయ్యాలిరా కొడుకా ||పైలం|| / విచ్చలవిడిగా తిరుగుతున్నావు / ఎవరు చూడరని ఎగురుతున్నావు / చూసే దేవుడేసయ్య ఉన్నడు / తోలు తీస్తడు జాగ్రత్త కొడుకా ||పైలం|| / గుట్కలు తినకురా గుటుక్కున చస్తావు / పొగాకు తినకురా పోతవు నరకం / సినిమా చూడకు చింతలు తప్పవు / ఫోజులు కొట్టకు పోతవు నరకం ||పైలం|| / కుమ్మరి పురుగు గుణం చూడరా / బురదల ఉంటది బురదే అంటదు / తామెర పువ్వు బురుదల ఉంటది / వరదొస్తే తల వంచుకుంటది ||పైలం|| / ఎన్నో ఆశలు పెట్టుకున్నరా / సేవ చేస్తే నిను చూడాలని / నా కలలను కల్ల చెయ్యకు కొడుకా / కాళ్ళు మొక్కుతా మయ్యగానిరా ||పైలం|| / పొందుకున్నవు రక్షణ నీవు / పోగొట్టుకోకు పోతవు నరకం / నరకమంటే ఆషామాషీ కాదురో / అగ్ని ఆరదు పురుగు చావదు ||పైలం|| / ప్రపంచమంతటా పాపమున్నది / మందులేని మాయ రోగమున్నది / నీ పచ్చని జీవితం పాడు చేసుకోకు ఓ కొడకా / నీవు మంచిగా బ్రతికేసయ్యను మహిమపరచు నా కొడకా / నీవు సి ఎం అయితే సంతోషముండదు పి ఎం అయితే సంతోషముండదు / యాక్టర్ అయితే సంతోషముండదు డాక్టర్ అయితే సంతోషముండదు / నీవు సేవ చేస్తే నేను చూడాలి కొడుకా / నువ్వు శ్రమలు అనుభవించాలిరా నా కొడుకా ||పైలం||
హల్లెలూయా ఆరాధన / రాజాధి రాజు యేసునకే / మహిమయు ఘనతయు / సర్వాధికారి క్రీస్తునకే (2) / చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ / ఆ ప్రభుని కీర్తించెదం / నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో / స్తోత్రార్పణ చేసెదం / హల్లెలూయా ఆరాధన / రాజాధి రాజు యేసునకే / మహిమయు ఘనతయు / సర్వాధికారి క్రీస్తునకే / రూపింప బడక ముందే / నన్ను ఎరిగితివి / నా పాదములు జారకుండా / రక్షించి నడిపితివి (2) / చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ / ఆ ప్రభుని కీర్తించెదం / నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో / స్తోత్రార్పణ చేసెదం / హల్లెలూయా ఆరాధన / రాజాధి రాజు యేసునకే / మహిమయు ఘనతయు / సర్వాధికారి క్రీస్తునకే / అభిషేక వస్త్రము నిచ్చి / వీరులుగా చేసితివి / అపవాది క్రియలను జయించే / ప్రార్థన శక్తినిచ్చితివి (2) / చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ / ఆ ప్రభుని కీర్తించెదం / నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో / స్తోత్రార్పణ చేసెదం / హల్లెలూయా ఆరాధన / రాజాధి రాజు యేసునకే / మహిమయు ఘనతయు / సర్వాధికారి క్రీస్తునకే