తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

నా యేసయ్యా నా స్తుతియాగము|Naa Yesayyaa Naa Sthuthiyaagamu

నా యేసయ్యా నా స్తుతియాగము / నైవేద్యమునై ధూపము వోలె / నీ సన్నిధానము చేరును నిత్యము / చేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే (2) / ఆత్మతోను మనసుతోను / నేను చేయు విన్నపములు (2) / ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై / విజ్ఞాపన చేయుచున్నావా (2) / విజ్ఞాపన చేయుచున్నావా ||నా యేసయ్యా|| / ప్రార్థన చేసి యాచించగానే / నీ బాహు బలము చూపించినావు (2) / మరణపు ముల్లును విరిచితివా నాకై / మరణ భయము తొలగించితివా (2) / మరణ భయము తొలగించితివా ||నా యేసయ్యా|| / మెలకువ కలిగి ప్రార్థన చేసిన / శోధనలన్నియు తప్పించెదవు (2) / నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై / రారాజుగా దిగి వచ్చెదవు (2) / రారాజుగా దిగి వచ్చెదవు ||నా యేసయ్యా||

నా ప్రియ దేశం|Naa Priya Desham

నా ప్రియ దేశం భారత దేశం / బైబిల్ లో రాయబడిన ధన్యమైన దేశం (2) / ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) / ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా (2) / నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను / భారతీయుడనైనందుకు గర్విస్తాను (2) / సంతోష సౌభాగ్యం – సమృద్ధి సంక్షేమం / దేశంలో ఉండాలని ప్రార్ధిస్తాను (2) / ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) / క్రైస్తవ్యం మతము కాదని మారుమనస్సని / జీవమునకు నడిపించునని వివరిస్తాను (2) / మతి మార్చు వాడు యేసని మత బోధకుండు కాదని / రక్షించే దేవుడని ప్రకటిస్తాను (2) / ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) / ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా (2) / మనుషులంతా ఒక్కటేనని మంచి భావన / అందరిలో కలిగించుటకు శ్రమియిస్తాను (2) / కేవలము మాటలు కాక క్రియలందు మేలు చేయుచు / యేసయ్య అడుగులలో పయనిస్తాను (2) / ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) ||నా ప్రియ||

సాగేటి ఈ జీవ యాత్రలో|Saageti Ee Jeeva Yaathralo

సాగేటి ఈ జీవ యాత్రలో / రేగేను పెను తుఫానులెన్నో (2) / ఆదరించవా నీ జీవ వాక్కుతో / సేదదీర్చవా నీ చేతి స్పర్శతో (2) / యేసయ్యా.. ఓ మెసయ్యా / హల్లెలూయా నీకే స్తోత్రమయా (2) ||సాగేటి|| / సుడి గాలులెన్నో లోక సాగరాన / వడిగా నను లాగి పడద్రోసే సమయాన (2) / నడిపించగలిగిన నా చుక్కాని నీవే (2) / విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే (2) ||యేసయ్యా|| / వడ గాటులెన్నో నా పయనములోన / నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన (2) / తడబాటును సరి చేసే ప్రేమ మూర్తి నీవే (2) / కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే (2) ||యేసయ్యా|| / అలల శ్రమలెన్నో బ్రతుకు నావపైన / చెలరేగి విలవిలలాడించే సమయాన (2) / నిలబెట్టి బలపరిచే బలవంతుడ నీవే (2) / కలవరమును తొలగించే కన్న తండ్రి నీవే (2) ||యేసయ్యా||

పేద నరుని రూపము|Pedha Naruni Roopamu

పేద నరుని రూపము ధరించి / యేసు రాజు నీ చెంత నిలచె / అంగీకరించు-మాయనను (2) ||పేద నరుని|| / కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడెన్ / ముళ్ల మకుటము శిరస్సున పెట్టబడెన్ (2) / నింద వేదన శ్రమలను సహించెనేసు / చిందే తనదు రక్తము నీ పాపముకై / దీనుడై నిన్ను పిలచుచుండె (2) ||పేద నరుని|| / తల వాల్చుటకు ఇల స్థలమే లేదు / దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు (2) / తన్ను ఆదరించు వారెవరు లేరు / ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే / పాట్లుపడే నిన్ను విడిపింపను (2) ||పేద నరుని|| / ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్ / పాప డాగులన్ రక్తముతో కడిగెన్ (2) / నీ వ్యాధిని వేదన తొలగించ / నీ శాపము నుండి విడిపింప / సిలువలో విజయము పొందే (2) ||పేద నరుని|| / మాయ లోకమును నీవు నమ్మకుము / మనుష్యుల మనస్సు మారిపోవునిల (2) / నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు / నిశ్చయముగా ప్రభువులో ఆనందింప / నేడే రమ్ము విశ్వాసముతో (2) ||పేద నరుని|| / తామసించెదవేల ఓ ప్రియుడా / ప్రియ యేసుని యొద్దకు లేచి రమ్ము (2) / ఈ లోకము నీకివ్వని శాంతిని / ఈ దినమే ప్రభువు నీకొసగ / ప్రేమతో నిన్ను పిలచుచుండె (2) ||పేద నరుని||

నీ నీడలోన|Nee Needalona

నీ నీడలోన నీ జాడలోన / బ్రతుకంత సాగాలని / దీవించు ప్రభువా – చూపించు త్రోవ / నీ ప్రేమ కురిపించుమా ప్రభు (2) ||నీ నీడలోన|| / పగలు రేయి నిలవాలి మనసే ప్రభువా నీ సేవలో / తోడు నీడై నీవున్న వేళ లోటుండునా దైవమా (2) / నీ ఆరాధనలో సుఖ శాంతులన్ని / ఇలానే కదా నీ సేవలోన (2) / కలకాలముండాలని ప్రభు ||నీ నీడలోన|| / నిన్నే మరచి తిరిగేటి వారి దరి చేర్చుమా ప్రాణమా / ప్రేమే నీవై వెలిగేటి దేవా చేయూతనందించుమా (2) / మా శ్వాస నీవే మా ధ్యాస నీవే / మా దేహం మా ప్రాణం మా సర్వం నీవే (2) / నీ చూపు సారించుమా ప్రభు ||నీ నీడలోన|| / హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా (4) / హల్లెలూయా… హల్లెలూయా…. (2) / హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా (4) / ఆ… హల్లెలూయా.. హల్లెలూయా హల్లెలూయా

యేసయ్య నామంలో|Yesayya Naamamlo

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా / శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా / నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2) ||యేసయ్య|| / పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం / పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| / రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం / మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| / దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామం / దుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| / సృష్టిని శాసించగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం / మృతులను లేపగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| / పాతాళాన్ని తప్పించే – శక్తి కలిగినది యేసయ్య నామం / పరలోకానికి చేర్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||

నా ప్రియమైన యేసు ప్రభు|Naa Priyamaina Yesu Prabhu

నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు / నీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు / నీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు ||నా ప్రియమైన|| / ఆపద దినములలో ఉపకారముకై – నా ప్రభుని తలచితిని (2) / దేవా నీ దయ తోడనే – నాథా – ఆశ్రయం పొందితిని (2) ||నా ప్రియమైన|| / ఒక క్షణ సమయములో – నశించు నా జీవితం (2) / నా హృదయం మార్చితివి – దేవా – కృపతోనే జీవించుటకై (2) ||నా ప్రియమైన|| / లోకపు పాపములో – నే పాపిగా జీవించితిని (2) / శుద్ధ హృదయమిచ్చావు – దేవా – నిన్ను నే దర్శించుటకై (2) ||నా ప్రియమైన|| / ఈ దినమునే పాడుట – నీ వలెనే యేసు ప్రభు (2) / ఎల్లప్పుడు నీ పాడెదన్ – దేవా – నాయందు వసియించుము (2) ||నా ప్రియమైన|| / మందిర సమృద్ధిని – నీ ప్రజల సహవాసమును (2) / నీ సన్నిధి ఆనందమును – దేవా – కృపతోనే నొసగితివి (2) ||నా ప్రియమైన||

నీ కృప లేని క్షణము|Nee Krupa Leni Kshanamu

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా / నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా / నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము / నేనూహించలేను యేసయ్యా (2) / యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా / నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప|| / మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి / మార్గముగా మారి మనిషిగా మార్చావు / మహిని నీవు మాధుర్యముగా మార్చి / మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2) / మహిమలో నేను మహిమను పొంద / మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా|| / ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి / ఆపత్కాలమున ఆదుకొన్నావు / ఆత్మీయులతో ఆనందింప చేసి / ఆనంద తైలముతో అభిషేకించావు (2) / ఆశ తీర ఆరాధన చేసే / అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా||

Telugu Songs — Page 71 | UEC Telugu Church