తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

నీవే నా సర్వము|Neeve Naa Sarvamu

నీవే నా సర్వము నీవే నాకున్నావు / నీవే నా సర్వము అన్నిటిలో / నీ జీవం నా కొరకు ఇచ్చినందున / నీవే నా సర్వము అన్నిటిలో (2) / తేనె కంటే మధురము (2) / యేసయ్యే నాకు మాధుర్యము / రుచి చూచి ఎరిగితిని కృపా బాహుళ్యమును / యేసయ్యే నాకు మాధుర్యము ||తేనె|| / నీవే నా రక్షణ నీవే నిరీక్షణ / నీవే కదా నా ఆధారము / నీ పాదములకు మ్రొక్కెదను / నీ నామం పాడి స్తుతించెదను (2) ||తేనె|| / నీవే పరిహార నీవే పరమౌషధం / నీవే నా శక్తివి నా యేసయ్యా / కల్వరి సిలువపై బాలి అయితివే / నే బాగుపడితిని గాయములచే (2) ||తేనె|| / నీవే నా కీర్తివి నీవే నా అతిశయం / నీవే నా మేలులు నా యేసయ్యా / నీ పాద సేవయే చేయుటయే / నా హృదయములున్న వాంఛయేగా (2) ||తేనె||

కొండలతో చెప్పుము|Kondalatho Cheppumu

కొండలతో చెప్పుము కదిలిపోవాలని / బండలతో మాట్లాడుము కరిగిపోవాలని (2) / నమ్ముట నీ వలనైతే / సమస్తం సాధ్యమే – (3) / మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు / మనసులో సందేహించక మాట్లాడు / మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు / యేసుని నామములోనే మాట్లాడు ||కొండలతో|| / యేసయ్య ఉన్న దోనె పైన తుఫాను కొట్టెనే / యేసయ్య దోనె అమరమున నిద్రించుచుండెనే / గాలి పైకి లేచి – అలలు ఎంతో ఎగసి / దోనెలోనికొచ్చెను జలములు జోరున / శిష్యులేమో జడిసి – వానలోన తడిసి – బహుగా అలసిపోయే / ప్రభువా ప్రభువా – లేవవా త్వరగా / మేము నశించిపోతున్నామని / ప్రభువును లేపిరి – తమలో ఉంచిన – దైవ శక్తి మరచి / రక్షకుడు పైకి లేచాడు – శిష్యులకు చేసి చూపాడు / పరిస్థితుత్లతో మాటలాడాడు / ఆ గాలినేమో గద్దించి – తుఫాన్ని ఆపేసి – నిమ్మల పరిచాడు / శిష్యులను తేరి చూచాడు – విశ్వాసం ఎక్కడన్నాడు / అధికారం వాడమన్నాడు / ఇక మనమంత ప్రభు లాగ – చేసేసి గెలిచేసి / ప్రభునే స్తుతిద్దాము – జై / జై జై జై జై జై జై జై జై / ఈశు మసీహ్ కి జై / ఈశు కే జై జై జై / ప్రభు కే జై జై జై (2) ||మాట్లాడు|| / పరలోక రాజ్య తాళాలు మన చేతికిచ్చెనే / పాతాళ లోక ద్వారాలు నిలువనేరవనెనే / కన్నులెత్తి చూడు – తెల్లబారె పైరు / కోతకొచ్చి నిలిచెను మనకై నేడు / వాక్యముతో కది-లించిన చాలు – కోత పండగేలే / కాపరి లేని గొర్రెలు వారని – కనికరపడెను ప్రభువు నాడు / క్రీస్తుని కనులతో – చూద్దామా – తప్పిపోయిన ప్రజను / ప్రభు లాగా వారిని ప్రేమిద్దాం – సాతాను క్రియలు బందిద్దాం / విశ్వాస వాక్కు పలికేద్దాం / ఇక ఆ తండ్రి చిత్తాన్ని – యేసయ్యతో కలిసి – సంపూర్తి చేద్దాం / పరలోక రాజ్య ప్రతినిధులం – తాళాలు ఇంకా తెరిచేద్దాం / ఆత్మలను లోనికి నడిపిద్దాం / ఇక సంఘంగా ఏకంగా – పాడేద్దాం అందంగా / ఈశు మసీహ్ కి జై – జై / జై జై జై జై జై జై జై జై / ఈశు మసీహ్ కి జై / ఈశు కే జై జై జై / ప్రభు కే జై జై జై (2) ||మాట్లాడు||

ఆత్మీయ గానాలతో|Aathmeeya Gaanaalatho

ఆత్మీయ గానాలతో / నిన్నే ఆరాధన చేయనా / స్తుతి స్తోత్ర గీతాలతో / నీ నామము పూజించనా (2) / మహిమ ఘనత ప్రభావములు / నీకే చెల్లించుచున్నానయ్యా (2) / ఆరాధించనా నీ పాద సన్నిధి (2) / స్తుతి పాత్రుడా – స్తోత్రార్హుడా / ఆరాధనా నీకే ఆరాధనా (2) ||ఆత్మీయ|| / సమీపించరాని తేజస్సులో / వసియించుచున్న పరిశుద్ధుడా (2) / కెరూబులు సెరాపులు (2) / దీవా రాత్రులు నీ సన్నిధిలో (2) / స్తోత్రం చేసెనా నా ప్రాణ నాథుడా (2) ||స్తుతి పాత్రుడా|| / అందరిలోను అతి శ్రేష్టుడా / వేల్పులలోన మహనీయుడా (2) / పూజార్హుడా స్తోత్రార్హుడా (2) / అతి సుందరుడా మనోహరుడా (2) / చేతులెత్తనా నీ సన్నిధి కాంతిలో (2) ||స్తుతి పాత్రుడా|| / అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడా / అపరంజిని పోలిన పాదాలు గలవాడా (2) / (దేవా) విస్తార జల నదుల శబ్దము పోలిన (2) / స్వరమును కలిగిన ఘననీయుడా (2) / శిరము వంచనా సర్వోన్నతుడా (2) ||స్తుతి పాత్రుడా||

మాట్లాడే యేసయ్యా|Maatlaade Yesayyaa

మాట్లాడే యేసయ్యా / నాతో మాట్లాడుచున్నాడు (2) / (నన్ను) మోకాళ్ళ పైన ఆడించుచూ (2) / చంటి బిడ్డలాగ కాయుచున్నాడు (4) ||మాట్లాడే|| / వెన్నలాంటి కన్నులలో / కురిసే తన ప్రేమను పంచాలని (3) / వేకువనే తట్టుచున్నాడు / కునుకని నిద్రపోని నా యేసయ్యా (2) / తల్లిదండ్రి కన్న మిన్న అయిన దేవుడు / లోకాన నా యేసుకు సాటి లేరెవ్వరు (2) ||మాట్లాడే|| / అరుణోదయమున నేను లేచి / కృతజ్ఞతా స్తుతులను చెల్లించెదను (3) / ఉత్సాహగానముతో యేసయ్యను / సంగీత స్వరములతో ఘనపరచెదను (2) / ప్రతి క్షణము నన్ను నడిపించే దేవుడు / ప్రతి ఉదయం తన కృపతో నింపే నా దేవుడు (2) ||మాట్లాడే|| / లోకము నుండి నన్ను ప్రత్యేకించి / మైమరిపించాడు మహనీయుడు (3) / ఉపదేశముతో నన్ను నడుపుచున్నాడు / జీవముగల సంఘములో నిలిపియున్నాడు (2) / తన మాటతో నన్ను బలపరచాడు / కృప వెంబడి కృపతో నను నింపుచున్నాడు (2) ||మాట్లాడే||

ఆపత్కాలమున|Aapathkaalamuna

ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే / అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే (2) / తల్లి కన్నా తండ్రి కన్నా / కాచిన దేవా నీకే స్తోత్రం (2) ||ఆపత్కాలమున|| / నీవు నన్ను పరిశోధించి పరిశీలించావు / నేను లేచి కూర్చుండుటను సమస్తమెరిగితివి (2) / ఆకాశమునకు ఎక్కిననూ అక్కడ నీవే ఉన్నావు / భూదిగంతములు చుట్టిననూ అక్కడ నీవే ఉన్నావు / ఈ విశ్వమంత నీవే మమ్మేలుచున్నావు / నీ కన్న దైవమెవరు మా పూజ్యనీయుడా ||ఆపత్కాలమున|| / నేను నడచే మార్గమంతటిలో నీ దూతల చేత / రాయి తగులక ఎత్తుకొనుమని ఆజ్ఞ ఇచ్చితివి (2) / మరణముగుండా వెళ్లిననూ విష సర్పములను తొక్కిననూ / చేయి విడువక ఎప్పుడునూ విడనాడక నను ఎన్నడునూ / నడిపించుచున్న దేవా నీకెంత ప్రేమ నాపై – (2) ||ఆపత్కాలమున||

సృష్టికర్తవైన యెహోవా|Srushtikarthavaina Yehovaa

సృష్టికర్తవైన యెహోవా / నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ / మంటికి రూపమిచ్చినావు / మహిమలో స్థానమిచ్చినావు / నాలో నిన్ను చూసావు / నీలో నన్ను దాచావు / నిస్స్వార్ధ్యమైన నీ ప్రేమా / మరణము కంటె బలమైనది నీ ప్రేమ ||సృష్టికర్తవైన|| / ఏ కాంతి లేని నిశీధిలో / ఏ తోడు లేని విషాదపు వీధులలో / ఎన్నో అపాయపు అంచులలో / నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2) / యేసయ్యా నను అనాథగా విడువక / నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) ||సృష్టికర్తవైన|| / నిస్సారమైన నా జీవితములో / నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా / నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి / నన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2) / యేసయ్యా నను కృపతో బలపరచి / ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి (2) ||సృష్టికర్తవైన||

ప్రేమిస్తా నిన్నే|Premisthaa Ninne

ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా / పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా (2) / చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా / యేసయ్యా నీ సన్నిధి చాలయా (2) ||ప్రేమిస్తా|| / నను ప్రేమించి భువికొచ్చినది నీ ప్రేమ / సిలువలో మరణించి బలియైన ఆ ప్రేమ (2) / ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు / నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా|| / కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమ / కరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమ (2) / ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు / నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా|| / నా స్థితి మార్చి నను రక్షించెను నీ ప్రేమ / నను దీవించి హెచ్చించినది నీ ప్రేమ (2) / ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు / నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా||