తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

ఇదిగో నేనొక నూతన క్రియను|Idigo Nenoka Noothana Kriyanu

ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను (2) / ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా (2) ||ఇదిగో|| / అడవిలో త్రోవనుజేసి – ఎడారిలో నదులను నేను (2) / ఎల్లప్పుడు సమృద్ధిగా – ప్రవహింప జేసెదను (2) ||ఇదిగో|| / నాదు ప్రజలు త్రాగుటకు – నేనరణ్యములో నదులు (2) / సమృద్ధిగా పారునట్లు – సృష్టించెదను నేను (2) ||ఇదిగో|| / అరణ్యములో జంతువులు – క్రూరపక్షులు సర్పములు (2) / ఘనపరచును స్తుతియించును – దీని నాలోచించుడి (2) ||ఇదిగో|| / నూతన సృష్టిగ నినుజేసి – నీ శాంతిని నదివలెజేసి (2) / ననుజూచి మహిమపరచి – స్తుతిబాడ జేసెదను (2) ||ఇదిగో|| / నేనే దేవుడనని దెలసి – నా కార్యములను నెరవేర్చి (2) / ముందున్న వాటికన్న – ఘనకార్యములను జేతున్ (2) ||ఇదిగో|| / మరుగైన మన్నానిచ్చి – మరితెల్లని రాతినిచ్చి (2) / చెక్కెదనా రాతిమీద – నొక క్రొత్త నామమును (2) ||ఇదిగో|| / పరలోక భాగ్యంబులు – నరలోకములో మనకొసగెన్ (2) / కరుణాసంపన్నుడగు – మన ప్రభువునకు హల్లెలూయ (2) ||ఇదిగో||

దేవాది దేవా|Devaadhi Devaa

దేవాది దేవా ప్రభువుల ప్రభూ / రాజుల రాజా హల్లెలూయ (2) / నీ రక్తముతో విమోచించి / నీ రక్తముతో సంపాదించి (2) / పరలోక రాజ్య ప్రజలతో జేర్చి (2) / పరలోక పాటన్ నా కొసగితివి (2) ||దేవాది దేవా|| / జీవిత నావలో తుఫాను రేగ / భయపడకుడని అభయము నిచ్చి (2) / జయప్రదముగా నన్ను నడిపించి (2) / జయజీవితము నా కొసగుచున్న (2) ||దేవాది దేవా|| / పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి / కరుణతో నీ సొత్తుగా నన్ను జేసి (2) / అరమర లేక నన్నాదరించి (2) / పరలోక దర్శనంబిచ్చితివి (2) ||దేవాది దేవా|| / మరణ పాత్రులం యిద్ధరణిలోన / దురిత ఋణముల స్మరణను మాన్పి (2) / ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము (2) / నీ రాజ్యమందు రాజులన్ జేసి (2) ||దేవాది దేవా|| / శోధనగాధల కష్టములలో / నా దుఃఖములలో నే నేడ్వకుండా (2) / నీ దయ నాపై నిండార నింపి (2) / ఓదార్చి నన్ను నీ దారినడుపు (2) ||దేవాది దేవా|| / ప్రతి వత్సరము దయతోడ నింపున్ / ప్రభు జాడలు సారము జల్లున్ (2) / ప్రతి బీడునూ సారము చిలకన్ (2) / ప్రతి పర్వతము ఆనందించున్ (2) ||దేవాది దేవా|| / పరలోక పరిశుద్ధ సంఘంబు యెదుట / సర్వశక్తిగల క్రీస్తుని యెదుట (2) / పరలోక నూతన గీతము పాడ (2) / జేర్చితివి నన్ నీ జనమునందు (2) ||దేవాది దేవా||

క్రీస్తుని స్వరము విందును|Kreesthuni Swaramu Vindunu

క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు / మధుర స్వరమేయది మెల్లని స్వరమేయది – (2) / యెహోవా నీ స్వరము జలములపై వినబడెను (2) / మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించెను (2) ||క్రీస్తుని|| / బలమైన నీ స్వరము బహుప్రభావము గలది (2) / దేవదారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నిని (2) ||క్రీస్తుని|| / అద్భుత ప్రభు స్వరము అరణ్యము కదిలించును (2) / ఆకుల రాలజేయును లేళ్ళ నీనజేయును (2) ||క్రీస్తుని|| / ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్ (2) / ఆశీర్వాదము శాంతి నొసగునాయన స్వరమే (2) ||క్రీస్తుని|| / నీ మధుర స్వరము నీ వాక్యమును విందున్ (2) / ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు (2) ||క్రీస్తుని|| / నీ మధుర స్వరము నీ చిత్తము తెల్పును (2) / అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను (2) ||క్రీస్తుని|| / నీ మధుర స్వరము నీ మార్గము జూపును (2) / కుడి యెడమల తిరిగిన నీ స్వరమే వినబడును (2) ||క్రీస్తుని|| / తుఫానులు కలిగి భయభీతులలో నుండ (2) / భయపడకు మని పలికె ప్రేమగల నీ స్వరము (2) ||క్రీస్తుని|| / మరణాంధకార లోయలో నేనుండ (2) / నీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్ (2) ||క్రీస్తుని|| / ప్రభువా సెలవిమ్ము నీ దాసుడాలించున్ (2) / దీనుడనై నీ మాట అంగీకరించెదను (2) ||క్రీస్తుని||

నోవహు ఓడనే సంఘములో|Novahu Odane Sanghamulo

నోవహు ఓడనే సంఘములో రెండు పక్షులు / నీకు నాకు గురుతుగా ఉన్నాయి (2) / మాట వినిన పావురం – లోబడని కాకియు / ఆ సంఘములో విశ్వాసులైనాయి (2) ||నోవహు ఓడనే|| / గురుతు తెమ్మని నోవహు పంపాడు… తెలివైన కాకిని / దైవ జనుని మాటే మరచి… లోకమును ప్రేమించి… (2) / ఇటు అటు తిరుగుచుండెనా కాకి (2) / సంఘములో ఉన్న నీవు… పాపముపై ఆశతో (2) / ఇటు అటు తిరుగుచున్న భక్తి లేని కాకివా (2) / నీవు కాకివా… పావురానివా (2) ||నోవహు ఓడనే|| / గురుతు తెమ్మని నోవహు పంపాడు… నల్లని పావురమును / ఓడను మరచి పోక… కాలు నిలుప స్థలము లేక… / మరల తిరిగి వచ్చే ఆ పావురము (2) / సంఘములో ఉన్న నీవు… పరిశుద్ధత కాంక్షతో (2) / లోకమునకు వేరుగ ఉన్న భక్తి పావురానివా (2) / పావురానివా… నీవు కాకివా (2) ||నోవహు ఓడనే|| / గురుతు తెమ్మని నోవహు పంపాడు… మరలా ఆ పావురమును / ఆజ్ఞను మరచి పోక… ఒలీవాకు గురుతుగా తెచ్చె… / బాధ్యత కలిగిన ఆ పావురము (2) / సంఘములో ఉన్న నీవు… ఆత్మల భారముతో (2) / ఆత్మలను సంపాదించే భక్తి పావురానివా (2) / పావురానివా… నీవు కాకివా (2) / నోవహు ఓడనే సంఘములో రెండు పక్షులు / నీకు నాకు గురుతుగా ఉన్నాయి (2) / మాట వినిన పావురం – లోబడని కాకియు / ఆ సంఘములో విశ్వాసులైనాయి (2) / నీవు కాకివా… పావురానివా (4)

సువార్తే పరిష్కారం|Suvaarthe Parishkaaram

అపాయం అంత్యకాలం – చుట్టూరా అంధకారం / వికారం భ్రష్ఠలోకం – సమస్తం మోసకారం / సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం / సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం / సువార్త సారం తెలిసుండీ / నిస్సార సాక్ష్యం మనదేనా / పరలోక వెలుగును కలిగుండీ / మరుగైన దీపం మనమేనా / ఇకనైనా లేవరా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించరా / ఇప్పుడైనా కదలరా లోకాన్ని ఎదిరించి పోరాడరా / సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం / సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం / జాతివిద్వేషపు జాడ్యంలో / మతోన్మాద విషమౌఢ్యంలో / దేశం ఆరని జ్వాలాయె / సంఘం హింసలపాలాయె ||ఇకనైనా|| / అబద్ద బోధల మోసాలు / అణగారుతున్నవి సంఘాలు / వేలకువేల కుటుంబాలు / నశించిపోతున్నవి చూడు ||ఇకనైనా|| / జెండరు గందరగోళాలు / లింగద్రవత్వపు ఘోరాలు / సంధిగ్ధంలో నేటితరం / సంక్షోభంలో మనిషితనం ||ఇకనైనా|| / సాక్ష్యమై ప్రకాశమై – జీవించరా సువార్తకై / చీకట్లని చీల్చెడి – పోరాటం చేయరా… / బహుళ సవాళ్ళను ఎదురుకొని / ఐక్యత బంధం నిలుపుకుని / రేపటి తరాన్ని శిష్యులుగా / నిలిపే బాధ్యత మనదేరా ||ఇకనైనా||

కంటిపాపలా కాచినావయ్యా|Kantipaapalaa Kaachinaavayyaa

కంటిపాపలా కాచినావయ్యా – చంటిపాపను మోసినట్టు మోసినావయ్యా / చేతి నీడలో దాచినావయ్యా – తోడుగా మా ముందరే నడచినావయ్యా / పోషించినావయ్యా.. బలపరచినావయ్యా – భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యా / నడిపించినావయ్యా.. కాపాడినావయ్యా – ఓటమంచులో విజయమునిచ్చినావయ్యా / మా తలంపులు కావు.. నీ తలంపులే – మా జీవితాలలో జరిగించినావయ్యా / మా ఊహలే కాదు.. నీ ప్రణాళికే – మానక సమయానికి నెరవేర్చినావయ్యా ||కంటిపాపలా|| / ఎన్నో ఏళ్లుగా.. ఎదురు చూసాముగా – ఆశలే అడియాశలవ్వగా సోలిపోయాముగా / దారే కానక.. ఆగిపోయాముగా – అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా / అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించెగా / అణగారిన మా ఆశలన్ని చిగురింపజేసెగా / ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచెగా / చితికిన మా జీవితాలను వెలిగింపజేసెగా / కన్నీరు తుడిచినావు.. నాట్యముగ మార్చినావు / ఎనలేని ప్రేమ మా పైన చూపి ||కంటిపాపలా|| / ఊహించువాటికంటే ఎంతో అధికముగా – హెచ్చించినావు దేవా.. నీ ప్రేమ మధురము / ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై – దీవించినావు దేవా.. నీ ప్రేమ మరువము / హీనులం.. బలహీనులం.. నిలువలేక పడిపోయినా / లేవనెత్తి బండపైనే నిలబెట్టినావుగా / చీటికీ.. మాటి మాటికీ.. మా నమ్మకమే కోల్పోయినా / అడుగడుగున నీ నమ్మకత్వమును కనబరచినావుగా / పోగొట్టుకున్నదంతా.. రెట్టింపు చేసినావు / నీ గొప్ప ప్రేమ మా పైన చూపి ||కంటిపాపలా||

లివింగ్ హోప్ (తెలుగు)|Living Hope Telugu

మన మధ్యన దూరం ఎంతో ఎత్తైనది / మేమెక్కలేనంత ఎత్తైన పర్వతం / నిరాశలో మేము నీ వైపు చూచి / నీ నామములో విడుదలను ప్రకటించితిమి / అంధకారము తొలగించి / మా ఆత్మను రక్షించి / నీ ప్రేమతో మమ్ము నింపినావయ్యా / పరిపూర్ణమైనది నీవు రచియించిన అంతం / యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ / ఊహలకు అందనిది నీ కరుణ కటాక్షం / మాపై కురిపించితివి సమృద్ధిగను / యుగయుగములకు రాజా నీ మహిమను విడచి / మా శాప భారము నీవే భరియించితివి / నీ సిలువలో మేము పొందితిమి క్షమాపణ / మేము నీవారిగా మార్చబడితిమి / సుందరుడా యేసయ్యా మేము నీ వారము / యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ / హల్లెలూయా ప్రభువా నిన్నే స్తుతియింతున్ / హల్లెలూయా నీవు మరణము గెలిచితివి / నీ నామంలో రక్షణను / మాకు విజయమునిచ్చితివి / యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ (2) / నీవు లేచిన ఉదయాన నెరవేరెను వాగ్ధానం / నిర్జీవ శరీరం శ్వాసించెనుగా / నిశ్శబ్దములో నుండి నీవు పలికిన జయభేరి / "ఓ మరణమా నీ జయమెక్కడ?" (2) / యేషువా నీకే జయమెప్పుడు / హల్లెలూయా ప్రభువా నిన్నే స్తుతియింతున్ / హల్లెలూయా నీవు మరణము గెలిచితివి / నీ నామంలో రక్షణను / మాకు విజయమునిచ్చితివి / యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ (2) / యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ – (2)

నీవే నా ఆశ|Neeve Naa Aasha

ఎక్కలేనంత ఎత్తైన కొండ / ఎక్కించు వారు లేరెవ్వరు / కొండల తట్టు నా కన్నులెత్తి / నిరాశలో నిన్నే పిలిచాను / చీకటి తొలగించి నీ ప్రేమతోనే / నా హృదయమును నింపావు / లేఖనాలన్ని నెరవేర్చినావు / యేసు రాజా నీవే నా ఆశ / ఊహించలేని నీ గొప్ప కృపను / సమృద్ధిగానే పొందితిని / యుగముల రాజా మహిమను వీడి / అవమానమునే భరియించావు / సిలువలో నేను క్షమనే పొందాను / నీ సొత్తుగా నన్నే మార్చావు / నా రక్షకా నీ వాడను నేను / యేసు రాజా నీవే నా ఆశ / హల్లెలూయా నిన్నే ఆరాధింతును / హల్లెలూయా మరణమునే గెలిచావు / బంధకాలను తెంచావు / నీ నామములో రక్షణ / యేసు రాజా నీవే నా ఆశ (2) / వచ్చింది ఉదయం నెరవేరే వాగ్ధానం / సమాధిలో దేహం ఊపిరి పీల్చెన్ / మరణముకు నాపై అధికారం లేదని / మౌనమునే వీడి చాటించావు (2) / యేసు.. నీదే విజయము / హల్లెలూయా నిన్నే ఆరాధింతును / హల్లెలూయా మరణమునే గెలిచావు / బంధకాలను తెంచావు / నీ నామములో రక్షణ / యేసు రాజా నీవే నా ఆశ (2) / యేసు రాజా నీవే నా ఆశ / దేవా నీవే నా ఆశ

ఈస్టర్ మెడ్లీ|Easter Medley

యూదా రాజ సింహం తిరిగి లేచెను / తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను (2) / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) / హల్లెలూయా హల్లెలూయా / ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ (2) / మరణము జయించి లేచెన్ / మరణపు ముల్లును విరచెన్ (2) / మధురం యేసుని నామం / మరువకు యేసుని ధ్యానం (2) / హే ప్రభు యేసు – హే ప్రభు యేసు / హే ప్రభు దేవా సుతా / సిల్వ ధరా, పాప హరా, శాంతి కరా / హే ప్రభు యేసు – హే ప్రభు యేసు / ఖాళీ సమాధిలో మరణమును / ఖైదీగా జేసిన నీవే గదా (2) / ఖాలమయుడగు సాతానుని గర్వము (2) / ఖండనమాయె గదా / సిల్వధరా పాపహరా శాంతికరా / హే ప్రభు యేసు – హే ప్రభు యేసు / గీతం గీతం జయ జయ గీతం / చెయ్యి తట్టి పాడెదము (2) / యేసు రాజు లేచెను హల్లెలూయా / జయ మార్భటించెదము (2) / చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను / అందు వేసిన ముద్ర కావలి నిల్చెను / దైవ సుతుని ముందు / జయ జయ యేసు – జయ యేసు / జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2) / జయ జయ రాజా – జయ రాజా (2) / జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం / సమాధి గెల్చిన జయ యేసు / సమాధి ఓడెను జయ క్రీస్తు (2) / సమరము గెల్చిన జయ యేసు (2) / అమరముర్తివి జయ యేసు / జయ జయ యేసు – జయ యేసు / జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు / పరమ జీవము నాకు నివ్వ / తిరిగి లేచెను నాతో నుండ (2) / నిరంతరము నన్ను నడిపించును / మరల వచ్చి యేసు కొనిపోవును (2) / యేసు చాలును – యేసు చాలును / యే సమయమైన యే స్థితికైన / నా జీవితములో యేసు చాలును / ముక్తినిచ్చె యేసు నామం / శాంతినిచ్చె యేసు నామం (2) / జై జై ప్రభు యేసుకు / జై జై క్రీస్తు రాజుకే / మరణమును గెల్చి మము రక్షించి / విజయము నిచ్చెనుగా / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా / ప్రాణము పెట్టిన దేవుడు / రక్షణనిచ్చిన దేవుడు / మరణము గెల్చిన దేవుడు / మృతులను లేపిన దేవుడు / దేవుడు దేవుడు యేసే దేవుడు / మన దేవుడు దేవుడు యేసే దేవుడు / సిలువలో ప్రాణం పెట్టాడన్నా / మరణం గెలిచి లేచాడన్నా (2) / మహిమ ప్రభు మృత్యుంజయుడు / క్షమియించును జయమిచ్చును (2) / ఓరన్న… ఓరన్న / యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న / యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా / యేసే ఆ దైవం చూడన్నా (2) / యేసే ఆ దైవం చూడన్నా – (2)

పాపిగ నను చూడలేక|Paapiga Nanu Choodaleka

పాపిగ నను చూడలేక – పాపముగా మారినావా / దోషిగ నను చూడలేక – నా శిక్ష నీవు పొందినావా (2) / నా తల యెత్తుటకు – నీవు తల వంచితివే / అర్హత నాకిచ్చుటకు – అవమాన-మొందితివే / తండ్రితో నను చేర్చుటకు – విడనాడబడితివే / జీవము నాకిచ్చుటకు – మరణము-నొందితివే / నీవే నీవే – నీవే దేవా / నీవే నీవే – నా యేసయ్యా (2) / పరమును వీడి ఈ భువికి / దిగి వచ్చిన రక్షకుడా / మహిమను వీడి నా వెలని / చెల్లించిన ప్రేమామయుడా / నే వెదకి రాలేనని సత్యమునెరిగి / నీవే నా దరికి పరుగెత్తితివి / దాసత్వము నుండి నను విడిపించి / తండ్రి అని పిలిచే భాగ్యము నిచ్చితివి ||నీవే|| / నా స్థానములో నీవే నిలిచి / నీ స్థానమే నాకిచ్చితివి / సౌందర్యవంతునిగా నన్నే చేసి / సొగసంతా కోల్పోయితివి / నీ బలమంతా నాకే ఇచ్చి / బలియాగముగా నీవు మారితివి / ఐశ్వర్యవంతునిగా నన్నే చేసి / దీనతనే హత్తుకొంటివి ||నీవే|| / నా బలమంతా నీవే – నా సౌందర్యము నీవే / నా ఐశ్వర్యము నీవే – నీవే నీవే / నా అతిశయము నీవే – నా ఆనందం నీవే / నా ఆధారం నీవే – నీవే నీవే (2) / యేసయ్యా యేసయ్యా యేసయ్యా / యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) ||పాపిగ||