ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
వాక్యమే శరీర ధారియై – లోక రక్షకుడు ఉదయించె / పాపాన్ని శాపాన్ని తొలగింపను – రక్షకుడు భువికేతెంచెను / ఊరు వాడా వీధులలో – లోకమంతా సందడంటా / ఆడెదము కొనియాడెదము – అరే పూజించి ఘనపరచెదం / చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో / రాజు పుట్టినాడు ఏలో ఏలేలో – కొలవబోదామా ఏలో / గొర్రెల విడచి మందల మరచి / గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మా / గానములతో గంతులు వేస్తూ / గగనాన్నంటేలా ఘనపరచెదం (2) / చీకట్లో కూర్చున్న వారి కోసం – నీతి సూర్యుడేసు ఉదయించే / పాపాన్ని శాపాన్ని తొలగింపను – పరమును చేర్చను అరుదించే / ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు / ఇహం పరం అందరము / జగమంతా సందడి చేద్దాం / చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో / పొలమును విడచి ఏలో ఏలేలో – పూజ చేద్దామా ఏలో / తారను చూచి తరలి వచ్చాము / తూర్పు దేశపు జ్ఞానులము / తన భుజముల మీద రాజ్య భారమున్న / తనయుడెవరో చూడ వచ్చామమ్మా (2) / బంగారు సాంబ్రాణి బోళములు – బాలునికి మేము అర్పించాము / మా గుండెల్లో నీకేనయ్యా ఆలయం – మా మదిలో నీకేనయ్యా సింహాసనం / ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు / ఇహం పరం అందరము / జగమంతా సందడి చేద్దాం / చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో / జ్ఞాన దీప్తుడమ్మా ఏలో ఏలేలో – భువికేతెంచెనమ్మా ఏలో / నీవేలే మా రాజు – రాజులకు రాజు / నిన్నే మేము కొలిచెదము – హోసన్న పాటలతో / మా హృదయములర్పించి – హృదిలో నిను కొలిచి / క్రిస్మస్ నిజ ఆనందం – అందరము పొందెదము
రారే చూతము రాజసుతుని / రేయి జనన మాయెను (2) / రాజులకు రారాజు మెస్సయ్యా (2) / రాజితంబగు తేజమదిగో (2) ||రారే|| / దూత గణములన్ దేరి చూడరే / దైవ వాక్కులన్ దెల్పగా (2) / దేవుడే మన దీనరూపున (2) / ధరణి కరిగె-నీ దినమున (2) ||రారే|| / కల్లగాదిది కలయు గాదిది / గొల్ల బోయుల దర్శనం (2) / తెల్లగానదే తేజరిల్లెడి (2) / తార గాంచరే త్వరగ రారే (2) ||రారే|| / బాలు-డడుగో వేల సూర్యుల / బోలు సద్గుణ శీలుడు (2) / బాల బాలిక బాలవృద్ధుల (2) / నేల గల్గిన నాథుడు (2) ||రారే|| / యూదవంశము నుద్ధరింప / దావీదుపురమున నుద్భవించె (2) / సదమలంబగు మదిని గొల్చిన (2) / సర్వ జనులకు సార్వభౌముడు (2) ||రారే||
అంబరాన్ని దాటే సంబరాలు నేడు / నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు (2) / రండయ్యో రండి రండి దావీదు పురముకు (2) / రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు (2) ||అంబరాన్ని|| / దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము / ఏకైక తనయుని పంపెను ఈ దినము (2) / పశువుల పాకలో ఒదిగేను శిశువుగా (2) / అవతరించే నేడు లోక రక్షకునిగా (2) ||రండయ్యో|| / దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ / శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ (2) / లోకాల కారకుడు లోకమున పుట్టెను (2) / మనిషి మరణము ఆయువు తీరెను (2) ||రండయ్యో||
ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా . / నూతన బలముతో నను నింపినావు (2) / బలహీనులను బలపరచువాడా / కృంగిన వారిని లేవనెత్తువాడా (2) / యేసయ్యా నా ఆశ్రయమా / యేసయ్యా నీకే ఆరాధన (2) ||ఆశతో|| / సొమ్మసిల్లక అడుగులు తడబడక / నడిచెద నీ వెంట జీవితమంతా (2) / లోకము నన్ను ఆకర్షించినా / వెనుదిరుగక నేను సాగెద నీ వెంట (2) ||యేసయ్యా|| / అలయక నేను పరుగెత్తెదను / అంతము వరకు ఆత్మల రక్షణకై (2) / సిద్ధము చేసిన బహుమానముకై / గురియొద్దకే నేను సాగెదనయ్యా (2) ||యేసయ్యా|| / రెక్కలు చాపి పక్షి రాజువలెనే / పైకెగెరెద నీ పరిశుద్ధులతో (2) / పరవశించెదను నీ ముఖమును చూచి / ప్రణమిల్లెద నీ పాదముల చెంత (2) ||యేసయ్యా||
ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము / దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము (2) / వివాహమన్నది అన్నింట ఘనమైనది / ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి (2) / ఒంటరైన ఆదామును చూసి / జంట కావాలని మది తలచి (2) / హవ్వను చేసి జతపరచి – ఫలించమని దీవించెను / సృష్టిపైన అధికారముతో – పాలించుమని నియమించెను (2) ||వివాహమన్నది|| / ఏక మనసుతో ముందుకు సాగి / జీవ వృక్షముకు మార్గము ఎరిగి (2) / సొంత తెలివిని మానుకొని – దైవ వాక్కుపై ఆనుకొని / సాగిపోవాలి ఆ పయనం – దేవుని కొరకై ప్రతి క్షణం (2) ||వివాహమన్నది|| / భార్య భర్తలు సమానమంటూ / ఒకరి కోసము ఒకరనుకుంటూ (2) / క్రీస్తు ప్రేమను పంచాలి – సాక్ష్యములను చాటించాలి / సంతానమును పొందుకొని – తండ్రి రాజ్యముకు చేర్చాలి (2) ||వివాహమన్నది||
నా ఆశల పల్లకి నీవే / నా ఊహల ఊట నీవే / నాలో ప్రతిధ్వనించే ప్రతి పదము నీవే (2) / యేసయ్యా యేసయ్యా / యేసయ్యా నా ఆశ నీవయ్యా (2) / ఎడారిలో నీటి కొరకు – ఆశపడు బాటసారిలా / నీ కొరకు నా ప్రాణం – ఆశపడుచున్నది (2) / నా ఆశ నీవైపే – నా ధ్యాస నీవైపే / దాహము తీర్చావని (2) / దాహము తీర్చావని ||యేసయ్యా|| / దిక్కులేని పక్షిగా నేను – నిరాశతో ఉండగా / నా ఆశ తీర్చావే – నీ దరి చేర్చావే (2) / నా గమ్యం నీవైపే – నా గానం నీ కొరకే / తోడుగ ఉన్నావని (2) / తోడుగ ఉన్నావని ||యేసయ్యా|| / స్నేహితులు లేరని – తోడెవరు రారని / నా మనసు నాలోన – దుఃఖించు సమయాన (2) / నా స్నేహం నీవయ్యావు – దుఃఖము తీర్చావు / ఆదరించావయ్యా (2) / ఆదరించావయ్యా ||యేసయ్యా||
వేసారిన మనసే ఊగెనే / చేజారిన స్ధితికి చేరెనే / యే గాయమైన మానదే / నాకున్న బలము చాలదే (2) / వినిపించు యేసు నీ స్వరం / నడిపించు నీతో అనుక్షణం ||వేసారిన|| / కోరినాను శ్రేయమైన నీ ప్రేమనే / తాళలేను లేసమైన నీ కోపమే / భారము మోపకే లోపమూ చూడకే / ఎన్నడు నీ కృప దూరము చేయకే ||వేసారిన|| / వాడిపోదు శ్రేష్టమైన ఈ బంధమే / వీడిపోదు ఆదరించే నీ స్నేహమే / తోడుగా ఉండునే – త్రోవను చూపునే / చెకటి కమ్మినా క్షేమము పంపునే ||వేసారిన||
ఏపాటి దాననయా నన్నింతగ హెచ్చించుటకు / నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు (2) / నా దోషము భరియించి నా పాపము క్షమియించి / నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి (2) / ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి / కృప చూపు కృపగల దేవా – నీ కృపకు సాటి ఏది ||ఏపాటి|| / కష్టాల కడలిలో కన్నీటి లోయలలో / నా తోడు నిలిచావు నన్నాదరించావు (2) / అందరు నను విడచినా నను విడువని యేసయ్యా / విడువను యెడబాయనని నా తోడై నిలచితివా ||ప్రేమించే|| / నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా / నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా (2) / నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా / నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ||ప్రేమించే||
యేషు మసీహ్ / తేరే జైసా హై కోయి నహీ / తేరే చరణో మే ఝుకే ఆస్మాన్ / ఔర్ మహిమా గాయే జమీన్ (2) / హమ్ గాయే హో-స్సనా / తూ రాజావో కా హై రాజా / తేరీ మహిమా హోవే సదా / తూ హై ప్రభు, హమారా ఖుదా (2) / ప్యారే పితా / తూనే హమ్ సే కిత్నా ప్యార్ కియా / హమే పాపోన్ సే చుడానే కో / అప్నే బేటే కో కుర్బాన్ కియా (2) / హమ్ గాయే హో-స్సనా / తూ రాజావో కా హై రాజా / తేరీ మహిమా హోవే సదా / తూ హై ప్రభు, హమారా ఖుదా (4)
నీతి సూర్యుడవై వెలుగుతున్న యేసయ్య / నీ ఏర్పాటులోన నీ దేహము మేమయ్య (2) / నీదు రక్షణతో మమ్ము కాచినందుకు / నీదు సంఘముగా మమ్ము నిలిపినందుకు (2) / నీకే వందనం – నీకే వందనం / నీకే వందనం – యేసు రాజ వందనం (2) ||నీతి|| / త్వరలో రానై ఉన్నావయ్యా మా ప్రభువా / నీదు విందులోన చేరాలని మా దేవా (2) / సిద్ధపాటుకై కృపలను చూపుమని / నిన్నే వేడితిమి నీవే మా బలమని (2) ||నీకే|| / నీ నామము రుచిని ఎరిగిన వారము మేము / నిరతము నీ మంచి మన్నాతో బ్రతికెదము (2) / నీ ఆశ్రయములో కురిసెను దీవెనలు / నీలో నిలిచెదము చాటగా నీ తేజము (2) ||నీకే||
నీ కృపను గూర్చి నే పాడెదా / నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా (2) / నిత్యము నే పాడెదా / నా ప్రభుని కొనియాడెదా (2) / మహిమా ఘనతా / ప్రభావము చెల్లించెదా (2) ||నీ కృపను|| / ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా / నిందలో అపనిందలో నాకు తోడు నీడగా (2) / నా యేసు నాకుండగా / నా క్రీస్తే నా అండగా / భయమా దిగులా / మనసా నీకేలా (2) ||నీ కృపను|| / వాక్యమై వాగ్ధానమై నా కొరకై ఉదయించినా / మరణమే బాలియాగమై నన్ను విడిపించినా (2) / నా యేసు నాకుండగా / నా క్రీస్తే నా అండగా / భయమా దిగులా / మనసా నీకేలా (2) ||నీ కృపను||
నా చిన్ని హృదయముతో / నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్ / పగిలిన నా కుండను / నా కుమ్మరి యొద్దకు తెచ్చి / బాగుచేయమని కోరెదన్ (2) / హోసన్న హోసన్నా యూదుల రాజుకే / హోసన్న హోసన్నా రానున్న రారాజుకే / మట్టి నుండి తీయబడితిని / మరలా మట్టికే చేరుదును (2) / మన్నైన నేను మహిమగ మారుటకు / నీ మహిమను విడచితివే (2) / హోసన్న హోసన్నా యూదుల రాజుకే / హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2) / అడుగులు తడబడిన వేళలో / నీ కృపతో సరి చేసితివే (2) / నా అడుగులు స్థిరపరచి నీ సేవకై / నడిచే కృప నాకిచ్చితివే (2) / హోసన్న హోసన్నా యూదుల రాజుకే / హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2) / ఈ లోక యాత్రలో / నాకున్న ఆశంతయూ (2) / నా తుది శ్వాస విడచే వరకు / నీ పేరే ప్రకటించాలని (2) / హోసన్న హోసన్నా యూదుల రాజుకే / హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2)