ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
మూడునాళ్ళ ముచ్చట కోసం / ఈ మనిషి పడే తపన చూడరా (2) / నీటిబుడగలాంటి జీవితం / ఏ నాడు సమసిపోవునో ఎరుగం (2) / మనిషికి తన మనసే చేరసాలరా / మమతలు మమకారాలే బంధాలురా (2) / వల్లకాటి వరకేరా భవబంధాలు / అవి కళ్లానికి చేరవురా అనుబంధాలు (2) / కల్లలైన కళలు మానుకో / ఎల్లవేళలా ప్రభువని వేడుకో (2) ||మూడునాళ్ళ|| / ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము / అది కనిపించీ మాయమయే రంగులవలయం (2) / గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం / అది పాపానికి జీతమురా మనిషికి మరణం (2) / నిత్యమైన సుఖము వెదకరా / నిరతము ఆ ప్రభుని వేడరా (2) ||మూడునాళ్ళ|| / తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు / అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా (2) / జిగటగల ఊభినుండి పైకి లేపి / నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు (2) / తీర్పు తీర్చబడకమునుపే / తప్పక ఆ ప్రభుని కోరరా (2) ||మూడునాళ్ళ||
మహోన్నతుడా / నీ కృపలో నేను నివసించుట / నా జీవిత ధన్యతై యున్నది / మహోన్నతుడా / నీ కృపలో నేను నివసించుట (2) ||మహోన్నతుడా|| / మోడుబారిన జీవితాలను / చిగురింప జేయగలవు నీవు (2) / మారా అనుభవం మధురముగా / మార్చగలవు నీవు (2) ||మహోన్నతుడా|| / ఆకు వాడక ఆత్మ ఫలములు / ఆనందముతో ఫలియించినా (2) / జీవ జలముల ఊట అయిన / నీ ఓరన నను నాటితివా (2) ||మహోన్నతుడా|| / వాడబారని స్వాస్థ్యము నాకై / పరమందు దాచి యుంచితివా (2) / వాగ్ధాన ఫలము అనుభవింప / నీ కృపలో నన్ను పిలచితివా (2) ||మహోన్నతుడా||
మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి / మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి (2) / పాప మమతల చేత – పారిపోయిన నాకు / ప్రాప్తించె క్షామము / పశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కోరుచు / పంపుము క్షేమము (2) / ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు / పుట్టించె ధైర్యము (2) ||మార్గము|| / ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు / తండ్రిని వీడితి / ధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయ / దేహీ నిను చేరితి (2) / దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు / దారిని జూపుము (2) ||మార్గము|| / దూర దేశములోన – బాగుందుననుకొనుచు / తప్పితి మార్గము / తరలిపోయిరి నేను – నమ్మిన హితులెల్ల / తరిమే దారిద్య్రము (2) / దాక్షిణ్య మూర్తి నీ – దయ నాపై కురిపించి / ధన్యుని చేయుము (2) ||మార్గము|| / అమ్ముకొంటిని నేను – అధముడొకనికి నాడు / ఆకలి బాధలో / అన్యాయమయిపోయే – పందులు సహ వెలివేయ / అలవడెను వేదన (2) / అడుగంటె అవినీతి – మేల్కొనియె మానవత / ఆశ్రయము గూర్చుము (2) ||మార్గము|| / కొడుకునే కాదనుచు – గృహమే చెరసాలనుచు / కోపించి వెళ్ళితి / కూలివానిగనైన – నీ యింట పని చేసి / కనికరమే కోరుదు (2) / కాదనకు నా తండ్రి – దిక్కెవ్వరును లేరు / క్షమియించి బ్రోవుము (2) ||మార్గము|| / నా తండ్రి నను జూచి – పరుగిడిచూ ఏతెంచి / నాపైబడి ఏడ్చెను / నవ జీవమును గూర్చి – ఇంటికి తోడ్కొని వెళ్లి / నన్నూ దీవించెను (2) / నా జీవిత కథయంత – యేసు ప్రేమకు ధరలో / సాక్ష్యమై యుండును (2) ||మార్గము||
లెక్కించలేని స్తోత్రముల్ / దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ / దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) / ఇంత వరకు నా బ్రతుకులో (2) / నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని|| / ఆకాశ మహాకాశముల్ / వాటియందున్న సర్వంబును (2) / భూమిలో కనబడునవన్ని (2) / ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| / అడవిలో నివసించువన్ని / సుడిగాలియు మంచును (2) / భూమిపైనున్నవన్ని (2) / దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని|| / నీటిలో నివసించు ప్రాణుల్ / ఈ భువిలో జీవ రాసులు (2) / ఆకాశమున ఎగురునవన్ని (2) / ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి / జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా / ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా / పనికిరాని పాత్రనని – పారవేయకుమా / పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా (2) / సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ / సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి / ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి|| / విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు / వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి (2) / ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా / పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా / ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి|| / లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్ / మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని (2) / పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి / ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్ / ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||
Kraisthavamoka Mathamu Kaadidi / Yesunandu Thirigi Janmamu / Kreesthunandu Thirigi Janmamu (2) / Dharala Thalli Daanamosagunu / Thana Rakthamu Prathijanalamulo (2) / Andariki Jeevamosagenu / Kaluvarilo Yesu Rakthamu (2) / Kaluvarilo Yesu Rakthamu ||Kraisthavamoka|| / Oka Janmaku Rendu Chaavulu / Iru Janamalakokka Maraname (2) / Siluvyande Narakapu Chaavu / Pondenesu Andarikoraku (2) / Pondenesu Andarikoraku ||Kraisthavamoka|| / Bhuviki Moolamee Shareeramu / Divini Chera Aathma Moolamu (2) / Mathamu Maarga Gnaanamu Veedi / Marana Vijayudesu Cherumaa (2) / Marana Vijayudesu Cherumaa ||Kraisthavamoka||
కలువరిగిరిలో సిలువధారియై / వ్రేలాడితివా నా యేసయ్యా (2) / అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను / ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా (2) / నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా / నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా (2) ||కలువరిగిరిలో|| / దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను / ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను (2) / ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి / నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా (2) ||కలువరిగిరిలో||
జుంటె తేనె ధారల కన్నా / యేసు నామమే మధురం / యేసయ్య సన్నిధినే మరువజాలను (2) / జీవితకాలమంతా ఆనందించెదా / యేసయ్యనే ఆరాధించెదా (2) ||జుంటె తేనె|| / యేసయ్య నామమే బహు పూజనీయము / నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2) / నన్నెంతగానో దీవించి / జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2) ||జుంటె తేనె|| / యేసయ్య నామమే బలమైన దుర్గము / నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2) / నన్నెంతగానో కరుణించి / పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2) ||జుంటె తేనె|| / యేసయ్య నామమే పరిమళ తైలము / నాలో నివసించే సువాసనగా నను మార్చి (2) / నన్నెంతగానో ప్రేమించి / విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే (2) ||జుంటె తేనె||
ఇదిగో దేవా నా జీవితం / ఆపాదమస్తకం నీకంకితం (2) / శరణం నీ చరణం (4) ||ఇదిగో|| / పలుమార్లు వైదొలగినాను / పరలోక దర్శనమునుండి / విలువైన నీ దివ్య పిలుపుకు / నే తగినట్లు జీవించనైతి (2) / అయినా నీ ప్రేమతో / నన్ను దరిచేర్చినావు / అందుకే గైకొనుము దేవా / ఈ నా శేష జీవితం ||ఇదిగో|| / నీ పాదముల చెంత చేరి / నీ చిత్తంబు నేనెరుగ నేర్పు / నీ హృదయ భారంబు నొసగి / ప్రార్థించి పనిచేయనిమ్ము (2) / ఆగిపోక సాగిపోవు / ప్రియసుతునిగా పనిచేయనిమ్ము / ప్రతి చోట నీ సాక్షిగా / ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో|| / విస్తార పంట పొలము నుండి / కష్టించి పని చేయ నేర్పు / కన్నీటితో విత్తు మనసు / కలకాలం మరి నాకు నొసగు (2) / క్షేమ క్షామ కాలమైనా / నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా / నశియించే ఆత్మలన్ / నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా ||ఇదిగో||
ఎన్ని తలచినా ఏది అడిగినా / జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా / నీ వాక్కుకై వేచియుంటిని / నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా / నీ తోడు లేక నీ ప్రేమ లేక / ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) / అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) / నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| / నా ఇంటి దీపం నీవే అని తెలసి / నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) / ఆరిపోయిన నా వెలుగు దీపము (2) / వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని|| / ఆపదలు నన్ను వెన్నంటియున్నా / నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) / లోకమంతయూ నన్ను విడచినా (2) / నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని|| / నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి / నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) / నీదు యాగమే నా మోక్ష మార్గము (2) / నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని||
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా / అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2) / నా పాపము బాప నరరూపివైనావు / నా శాపము మాప నలిగి వ్రేలాడితివి / నాకు చాలిన దేవుడవు నీవే / నా స్థానములో నీవే (2) ||ఎందుకో|| / నీ రూపము నాలో నిర్మించియున్నావు / నీ పోలికలోనే నివసించుమన్నావు / నీవు నన్ను ఎన్నుకొంటివి / నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో|| / నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు / నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు / నన్ను నీలో చూచుకున్నావు / నను దాచియున్నావు (2) ||ఎందుకో|| / నీ సన్నిధి నాలో నా సర్వము నీలో / నీ సంపద నాలో నా సర్వస్వము నీలో / నీవు నేను ఏకమగువరకు / నన్ను విడువనంటివే (2) ||ఎందుకో|| / నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే / నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే / ఏమి అద్భుత ప్రేమ సంకల్పం / నేనేమి చెల్లింతున్ (2) ||ఎందుకో||
దేవుని స్తుతియించుడి / ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని|| / ఆయన పరిశుద్ధ ఆలయమందు (2) / ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2) / ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2) / ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2) / స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / సన్న తంతుల సితారతోను (2) / చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / తంబురతోను నాట్యముతోను (2) / తంతి వాద్యములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / పిల్లనగ్రోవుల చల్లగనూది (2) / ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2) / గంభీర తాళముతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2) / హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||