ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో / దేవుడు దేవుడు యేసే దేవుడు / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా / భూమిని పుట్టించకమునుపు / లోకము పునాది లేనపుడు ||దేవుడు|| / సృష్టికి శిల్పకారుడు / జగతికి ఆదిసంభూతుడు ||దేవుడు|| / తండ్రి కుమార ఆత్మయు / ఒకడైయున్న రూపము ||దేవుడు||
స్తుతియు మహిమ ఘనత నీకే / యుగయుగముల వరకు / ఎంతో నమ్మదగిన దేవా (2) ||స్తుతియు|| / మా దేవుడవై మాకిచ్చితివి / ఎంతో గొప్ప శుభ దినము (2) / మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2) / కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2) ||స్తుతియు|| / నీవొక్కడవే గొప్ప దేవుడవు / ఘనకార్యములు చేయుదువు (2) / నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2) / నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2) ||స్తుతియు|| / నీవే మాకు పరమ ప్రభుడవై / నీ చిత్తము నెరవేర్చితివి (2) / జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా (2) / నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను (2) ||స్తుతియు|| / భరియించితివి శ్రమలు నిందలు / ఓర్చితివన్ని మా కొరకు (2) / మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ (2) / పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము (2) ||స్తుతియు||
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు / నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2) ||సోలిపోవలదు|| / ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను / చుట్టుముట్టినా (2) / ప్రియుడు నిన్ను చేరదీసిన / ఆనందం కాదా (2) ||సోలిపోవలదు|| / శోధనలను జయించినచో / భాగ్యవంతుడవు (2) / జీవ కిరీటం మోయువేళ / ఎంతో సంతోషము (2) ||సోలిపోవలదు|| / వాక్కు ఇచ్చిన దేవుని నీవు / పాడి కొనియాడు (2) / తీర్చి దిద్దే ఆత్మ నిన్ను / చేరే ప్రార్ధించు (2) ||సోలిపోవలదు||
సిలువలో సాగింది యాత్ర / కరుణామయుని దయగల పాత్ర (2) / ఇది ఎవరి కోసమో / ఈ జగతి కోసమే / ఈ జనుల కోసమే ||సిలువలో|| / పాలు కారు దేహము పైన / పాపాత్ముల కొరడాలెన్నో (2) / నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2) / నోరు తెరువ లేదాయే ప్రేమ / బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి|| / వెనుక నుండి తన్నింది ఒకరు / తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2) / గేలి చేసినారు పరిహాసమాడినారు (2) / నోరు తెరువ లేదాయే ప్రేమ / బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల / విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు (2) / ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి (2) / కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే (2) ||సిలువలో|| / నా అతిక్రయములకై నలుగ గొట్టబడి (2) / నా దోషముల నీవు ప్రియముగను మోసితివి (2) ||సిలువలో|| / మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత (2) / సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడా (2) ||సిలువలో||
సిలువ చెంత చేరిననాడు / కలుషములను కడిగివేయున్ / పౌలువలెను సీలవలెను / సిద్ధపడిన భక్తులజూచి / కొండలాంటి బండలాంటి / మొండి హృదయంబు మండించు / పండియున్న పాపులనైన / పిలచుచుండే పరము చేర ||సిలువ|| / వంద గొర్రెల మందలోనుండి / ఒకటి తప్పి ఒంటరియాయే / తొంబది తొమ్మిది గొర్రెల విడిచి / ఒంటరియైన గొర్రెను వెదకెన్ ||సిలువ|| / తప్పిపోయిన కుమారుండు / తండ్రిని విడచి తరలిపోయే / తప్పు తెలిసి తిరిగిరాగా / తండ్రియతని జేర్చుకొనియే ||సిలువ|| / పాపి రావా పాపము విడచి / పరిశుద్ధుల విందుల జేర / పాపుల గతిని పరికించితివా / పాతాళంబే వారి యంతము ||సిలువ||
సర్వకృపానిధియగు ప్రభువా / సకల చరాచర సంతోషమా (2) / స్తోత్రము చేసి స్తుతించెదను / సంతసముగ నిను పొగడెదను (2) / హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను / నేను… ఆనందముతో సాగెదను / ప్రేమించి నన్ను వెదకితివి / ప్రీతితో నను రక్షించితివి (2) / పరిశుద్ధముగా జీవించుటకై / పాపిని నను కరుణించితివి (2) ||హల్లెలూయా|| / అల్పకాల శ్రమలనుభవింప / అనుదినము కృపనిచ్చితివి (2) / నాథుని అడుగుజాడలలో / నడుచుటకు నను పిలిచితివి (2) ||హల్లెలూయా|| / మరణ శరీరము మర్పునొంది / మహిమ శరీరము పొందుటకై (2) / మహిమాత్మతో నను నింపితివి / మరణ భయములను తీర్చితివి (2) ||హల్లెలూయా|| / భువినుండి శ్రేష్ట ఫలముగను / దేవునికి నిత్య స్వాస్థ్యముగా (2) / భూజనములలోనుండి నన్ను / ప్రేమించి క్రయ ధనమిచ్చితివి (2) ||హల్లెలూయా|| / ఎవరూ పాడని గీతములు / యేసుతో నేను పాడుటకై (2) / హేతువు లేకయే ప్రేమించెన్ / యేసుకు నేనేమివ్వగలన్ (2) ||హల్లెలూయా||
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య / యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||సదాకాలము|| / పాపాల ఊభిలో పడియున్న నన్ను / నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2) / ఏ తోడులేని నాకు నా తోడుగా / నా అండగా నీవు నిలిచావయ్యా (2) ||యేసయ్యా|| / నీ వాత్సల్యమును నాపై చూపించి / నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2) / ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి / నీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2) ||యేసయ్యా||
సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు / సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే (2) / సాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు ||సాక్ష్య|| / దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి (2) / మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో ||సాక్ష్య|| / పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు (2) / పిల్లలకును బెద్దలకును బ్రేమతో నా స్వానుభవము ||సాక్ష్య|| / బోధ చేయలేను వాద ములకు బోను నాక దేల (2) / నాధు డేసు ప్రభుని గూర్చి నాకు దెలసినంత వరకు ||సాక్ష్య|| / పాపులకును మిత్రుడంచు బ్రాణ మొసగి లేచెనంచు (2) / బాపముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించు డంచు ||సాక్ష్య|| / చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన (2) / ఘోరపాపు లైన క్రీస్తు కూర్మితో రక్షించు నంచు ||సాక్ష్య|| / పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల (2) / ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవు డంచు ||సాక్ష్య|| / ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక (2) / తల్లడిల్లు వారలకును తండ్రి కుమా రాత్మ పేర ||సాక్ష్య||
రండి ఉత్సాహించి పాడుదము / రక్షణ దుర్గము మన ప్రభువే (2) / రండి కృతజ్ఞత స్తోత్రముతో / రారాజు సన్నిధికేగుదము (2) / సత్ప్రభు నామము కీర్తనలన్ / సంతోష గానము చేయుదము ||రండి|| / మన ప్రభువే మహా దేవుండు / ఘన మహాత్యము గల రాజు (2) / భూమ్యాగాధపు లోయలును / భూధర శిఖరములాయనవే ||రండి|| / సముద్రము సృష్టించెనాయనదే / సత్యుని హస్తమే భువిజేసెన్ (2) / ఆయన దైవము పాలితుల / ఆయన మేపెడి గొర్రెలము ||రండి|| / ఆ ప్రభు సన్నిధి మోకరించి / ఆయన ముందర మ్రొక్కుదము (2) / ఆయన మాటలు గైకొనిన / అయ్యవి మనకెంతో మేలగును ||రండి|| / తండ్రి కుమార శుద్దాత్మకును / తగు స్తుతి మహిమలు కల్గు గాక (2) / ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ / అయినట్లు యుగములనౌను ఆమెన్ ||రండి||
రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు / వాంఛతో తన కరము చాపి / రమ్మనుచున్నాడు (2) / ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని (2) / గ్రహించి నీవు యేసుని చూచిన / హద్దు లేని ఇంపు పొందెదవు (2) ||రమ్మను|| / కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ (2) / కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ / కనికరించి నిన్ను కాపాడును (2) ||రమ్మను|| / సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును (2) / ఆయన నీ వెలుగు రక్షణనై యుండును / ఆలసింపక త్వరపడి రమ్ము (2) ||రమ్మను|| / సకల వ్యాధులను స్వస్థత పరచుటకు (2) / శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో / అందరికి తన కృపలనిచ్చున్ (2) ||రమ్మను||
ప్రియ యేసు రాజును నే చూచిన చాలు / మహిమలో నేనాయనతో ఉంటే చాలు (2) / నిత్యమైన మోక్షగృహము నందు చేరి / భక్తుల గుంపులో హర్షించిన చాలు (2) ||ప్రియ యేసు|| / యేసుని రక్తమందు కడుగబడి / వాక్యంచే నిత్యం భద్రపరచబడి (2) / నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను (2) / బంగారు వీదులలో తిరిగెదను (2) ||ప్రియ యేసు|| / ముండ్ల మకుటంబైన తలను జూచి / స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ (2) / కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి (2) / ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ (2) ||ప్రియ యేసు|| / హృదయము స్తుతులతో నింపబడెను / నా భాగ్య గృహమును స్మరించుచు (2) / హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (2) / వర్ణింప నా నాలుక చాలదయ్యా (2) ||ప్రియ యేసు|| / ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో / ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో (2) / తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో (2) / ఆశతో వేచియుండే నా హృదయం (2) ||ప్రియ యేసు||