ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
మహిమ ఘనతకు అర్హుడవు / నీవే నా దైవము / సృష్టికర్త ముక్తి దాత (2) / మా స్తుతులకు పాత్రుడా / ఆరాధనా నీకే ఆరాధనా నీకే / ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే (2) / ఆరాధనా నీకే ఆరాధనా నీకే / మన్నాను కురిపించినావు / బండనుండి నీల్లిచ్చినావు (2) / యెహోవా ఈరే చూచుకొనును / సర్వము సమకూర్చును ||ఆరాధనా|| / వ్యాధులను తొలగించినావు / మృతులను మరి లేపినావు (2) / యెహోవా రాఫా స్వస్థపరచును / నను స్వస్థపరచును ||ఆరాధనా||
కలములతో రాయగలమా / కవితలతో వర్ణించగలమా / కలలతో వివరించగలమా / నీ మహోన్నతమైన ప్రేమా (2) / ఆరాధింతును (4) / రారాజువు నీవే / నా తండ్రివి నీవే / నిను విడువను ఎడబాయను (2) / ఆకాశములు నీ మహిమను / వివరించుచున్నవి / అంతరిక్షము నీ చేతి పనిని / వర్ణించుచున్నది (2) / దేవా నా ప్రాణము / నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును|| / సెరాపులు కెరూబులు / నిత్యము నిను స్తుతియించుచున్నవి / మహా దూతలు ప్రధాన దూతలు / నీ నామము కీర్తించుచున్నవి (2) / దేవా నా ప్రాణము / నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును||
దినమెల్ల నే పాడినా కీర్తించినా / నీ ఋణము నే తీర్చగలనా / కొనియాడి పాడి నీ సాక్షిగానే / ఇలలో జీవించనా ||దినమెల్ల|| / గాయపడిన సమయాన మంచి సమరయునిలా / నా గాయాలు కడిగిన దేవా / ఆకలైన వేళలో ఆహారమిచ్చి / నన్ను పోషించినావు దేవా (2) / నిను విడువనూ ఎడబాయననినా (2) / నా యేసయ్య ||దినమెల్ల|| / నా బలహీనతయందు నా సిలువను మోస్తూ / నిన్ను పోలి నేను నడిచెదన్ / వెనుకున్నవి మరచి ముందున్న వాటికై / సహనముతో పరుగెత్తెదన్ (2) / ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2) / నేను పొందాలని ||దినమెల్ల||
యెహోవాను స్తుతియించు – ప్రభువును ఘనపరచు / మహా దేవుని సేవించు – యేసుని పూజించు (2) / ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త / బలవంతుడైన నిత్యుడగు తండ్రి (2) / సమాధానకర్త అయిన రారాజును / ఆత్మతోను సత్యముతోను – బలముతోను మనసుతోను / కరములు తట్టి కేకలు వేసి – గంతులు వేసి నాట్యము చేసి / కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతియించు ||యెహోవాను|| / ఆకాశ మహిమలు ఆయనను స్తుతియించు / భూలోక సంపూర్ణత ఆయనను స్తుతియించు / తన చేతి క్రియలన్ని ఆయనను స్తుతియించు / పిల్లనగ్రోవితో ఆయనను స్తుతియించు / నీ చేతులెత్తి పరిశుద్ధ సన్నిధిలో ||ఆత్మతోను|| / స్వరమండలముతో ఆయనను స్తుతియించు / సితార స్వరములతో ఆయనను స్తుతియించు / గంభీర ధ్వనితో మ్రోగెడి తాళముతో / తంబుర నాట్యముతో తంతి వాద్యముతో / జీవమున్న ప్రతి ప్రాణి ఆయనను స్తుతియించు ||ఆత్మతోను||
తేనెకన్న తీయనైనది / నా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది (2) / నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను / కష్టకాలమందు నాకు తోడైయుండెను (2) ||తేనెకన్న|| / ఆగకనే సాగిపోదును / నా ప్రభువు చూపించు బాటలో (2) / అడ్డంకులన్ని నన్ను చుట్టినా / నా దేవుని నే విడువకుందును (2) ||తేనెకన్న|| / నా వాళ్ళే నన్ను విడిచినా / నా బంధువులే దూరమైనా (2) / ఏ తోడు లేక ఒంటరినైననూ / నా తోడు క్రీస్తని ఆనందింతును (2) ||తేనెకన్న||
నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా / నిను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా (2) / నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా (2) / నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా ||నిను చూసే|| / కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా / ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా (2) / నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా / నాలోనే నిను చూపే మదిరినివ్వయ్యా ||నిను చూసే|| / అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా / మృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా (2) / కోపతాపములు దూరపరచయ్యా / అందరిని క్షమియించే మనస్సునివ్వయ్యా ||నిను చూసే||
నిన్న నేడు నిరంతరం మారనే మారవు / నా జ్ఞాపకాలలో చెరగని వాడవు (2) / నీవే నీవే నమ్మదగినా దేవుడవు / నీవు నా పక్షమై నిలిచేయున్నావు (2) / యేసయ్యా నీ ప్రత్యక్షతలో / బయలుపడెనే శాశ్వతా కృప నాకై (2) / విడువదే నన్నెల్లప్పుడూ కృప / విజయపథమున నడిపించెనే కృప (2) / విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు ||నిన్న|| / యేసయ్యా నీ కృపాతిశయము / ఆదరించెనే శాశ్వత జీవముకై (2) / మరువదే నన్నెల్లప్పుడూ కృప / మాణిక్య మణులను మరిపించేనే కృప (2) / మైమరచితినే నీ కృప తలంచినప్పుడు ||నిన్న|| / యేసయ్యా నీ మహిమైశ్వర్యము / చూపెనే నీ దీర్ఘశాంతము నాపై (2) / ఆదుకునే నన్నెల్లప్పుడూ కృప / శాంతి సమరము చేసెనే కృప (2) / మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే ||నిన్న||
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా / నిలవాలని ఉన్నా నిలవలేకున్నా (2) / చూడాలని ఉన్నా చూడలేకున్నా / చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా / బ్రతికించుమో యేసయ్యా / దరి చేర్చుమో నన్నయ్యా (2) ||బ్రతకాలని|| / కాపరి లేని గొర్రెనైతి / కాటికి నే చేరువైతి / కావలి లేని తోటనైతి / కారడవిగా నే మారితి / గూడు చెదరిన గువ్వనైతి / గుండె పగిలిన ఎకాకినైతి / గుండె దిగులుగా ఉందయ్యా / గూడు చేర్చుమో యేసయ్యా (2) ||బ్రతకాలని|| / నా ఆశలే అడియాశలై / అడుగంటెనే నా జీవితం / శోధనల సుడివడిలో / తొట్రిల్లెనే నా పయనం / చుక్కాని లేని నావనైతి / గమ్యం తెలియక అల్లాడుచుంటి / గురి చేర్చుమో యేసయ్యా / గుండె గుడిలో నీవుండయ్యా (2) ||బ్రతకాలని||
భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే / ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ|| / మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెను / ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము || భీకరుండౌ || / ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను / ధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము || భీకరుండౌ || / పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తిని / బట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని || భీకరుండౌ || / మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను / జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను || భీకరుండౌ || / మిక్కిలి కష్టంబులతో – మిత్తికిని బాల్పొందను / దిక్కు లేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను || భీకరుండౌ ||
ఇదే నా కోరిక / నవ జీవన రాగమాలిక (2) ||ఇదే నా కోరిక|| / యేసు లాగ ఉండాలని / యేసుతోనే నడవాలని (2) / నిలవాలని గెలవాలని / యేసునందే ఆనందించాలని (2) ||ఇదే నా కోరిక|| / ఈ లోకంలో పరలోకము / నాలోనే నివసించాలని (2) / ఇంటా బయట యేసునాథునికే / కంటిపాపనై వెలిగిపోవాలని (2) ||ఇదే నా కోరిక|| / యాత్రను ముగించిన వేళ / ఆరోహనమై పోవాలని (2) / క్రీస్తు యేసుతో సింహాసనము / పైకెగసి కూర్చోవాలని (2) ||ఇదే నా కోరిక||
అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా / అత్యంత ప్రేమా స్వరూపివి నీవే / ఆరాధింతును నిన్నే (2) / ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (3) / ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్ / ఆశ్చర్యకరుడా స్తోత్రం / ఆలోచనకర్త స్తోత్రం / బలమైన దేవా నిత్యుడవగు తండ్రి / సమాధాన అధిపతి స్తోత్రం (2) ||ఆహాహా|| / కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం / కృపతో రక్షించితివే స్తోత్రం / నీ రక్తమిచ్చి విమోచించినావు / నా రక్షణకర్త స్తోత్రం (2) ||ఆహాహా|| / స్తుతులపై ఆసీనుడా స్తోత్రం / సంపూర్ణుడా నీకు స్తోత్రం / మా ప్రార్థనలు ఆలకించువాడా / మా ప్రధాన యాజకుడా స్తోత్రం (2) ||ఆహాహా|| / మృత్యుంజయుడా స్తోత్రం / మహాఘనుడా స్తోత్రం / మమ్మును కొనిపోవ త్వరలో రానున్న / మేఘ వాహనుడా స్తోత్రం (2) ||ఆహాహా|| / ఆమెన్ అనువాడా స్తోత్రం / అల్ఫా ఒమేగా స్తోత్రం / అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా / అత్యున్నతుడా స్తోత్రం (2) ||ఆహాహా||
ఆకాశమందున్న ఆసీనుడా / నీ తట్టు కనులెత్తుచున్నాను / నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ||ఆకాశ|| / దారి తప్పిన గొర్రెను నేను / దారి కానక తిరుగుచున్నాను (2) / కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| / గాయపడిన గొర్రెను నేను / బాగు చేయుమా పరమ వైద్యుడా (2) / కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| / పాప ఊభిలో పడియున్నాను / లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2) / కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||