తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

మాయాలోక ఛాయల్లోన|Maayaa Loka Chaayallona

మాయాలోక ఛాయల్లోన మోసం నాశనం ఉన్నాది (2) / నమ్మబోకు నమ్మబోకు సోదరా / ఈ మాయ లోకం నమ్మబోకు సోదరీ (2) / లోకమంతా తిరిగెదవా – లోకము నిన్నే ఏలునురా (2) / లోక రక్షకుడేసుని మాటకు లోబడుమిప్పుడే సోదరా / అక్కా మీరేమిట్లు – చక్కగ రండి మీరిట్లు / అన్నా మీరేమిట్లు – మనమే దేవుని పనిముట్లు / రొక్కాము లేకుండానే స్వర్గానికి పోదాం రండి / అక్కా మీరేమిట్లు – చక్కగ రండి మీరిట్లు / అన్నా మీరేమిట్లు – మనమే దేవుని పనిముట్లు / ప్రేమ గల దేవుడమ్మా – ప్రేమతో వచ్చాడమ్మా / రమ్మని పిలుచుచున్నాడు.. నిన్ను / అమ్మలా ఆదరిస్తాడు – అయ్యలా ఆదుకుంటాడు (2) / ఎంత ఘోర పాపివైన చింత లేదురా / సంతసమును నీకీయ స్వర్గము విడి యేసయ్యా / స్వర్గము విడి యేసయ్యా / చెంత చేరి ఈ క్షణమే సేదదీరుము / అంతు లేని ప్రేమలోనే మునిగి తేలుము / సమయమిదే కనుగొనుమా – త్వరపడు సుమ్మా – (2) ||ప్రేమ గల|| / చెప్పినాడు యేసయ్యా – చక్కనైన మాటలెన్నో / శత్రువును సైతము ప్రేమించమన్నాడు – (2) / నిక్కముగ నిన్ను వలే పక్కవాన్ని సూడమని / ఎక్కడున్న గాని వాడు యేసుకు వారసుడే – (2) / అన్నయ్యా యేసులోకి రావాలయ్యా / అక్కయ్యా యేసులోకి రావాలమ్మా (3)

యేసు నీకే జయం జయము|Yesu Neeke Jayam Jayamu

యేసు నీకే జయం జయము (2) / నీవే లోక పాలకుడవు (2) / సర్వ సృష్టికి సృష్టికర్తవు / సర్వలోక రక్షకుడవు (2) / జై జై అనుచు నీకే పాడెదం (2) / జన్మించె జగమున మానవ రూపములో / ప్రాయశ్చిత్తముకై తానే బలియాయె (2) / పాపియైన మాన-వుని రక్షింప / సిలువ నెక్కి తన ప్రాణము నిచ్చెన్ (2) / హల్లెలూయా భువిపైన (2) ||యేసు|| / మరణము ద్వారా – అంతమాయె బలులు / తన సమాధి సర్వం కప్పెన్ (2) / తిరిగి లేచుటచే సర్వం నూతనమాయె / సంపూర్ణముగ ఓడిపోయె మృత్యు సమాధి (2) / హల్లెలూయా భువిపైన (2) ||యేసు|| / స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతమొందెన్ / తండ్రి కుడిప్రక్కన ఆయన కూర్చుండెన్ (2) / రాజుల రాజై ప్రభువుల ప్రభువై / పొందె అధికారము – పరలోకముపై (2) / హల్లెలూయా భువిపైన (2) ||యేసు|| / తన రూపమునకు మార్పు నిష్ట-మాయె / సృష్టికంటె ముందు తానే సంకల్పించె (2) / లోక దుఃఖము నుండి – మనం తప్పించుకొని / తన రూపము నొంది – తనతో నుండెదం (2) / హల్లెలూయా భువిపైన (2) ||యేసు||

శరణం శరణం శరణం దేవా|Sharanam Sharanam Sharanam Devaa

శరణం శరణం శరణం దేవా – కరుణ నాథుడా (2) / కరుణ నాథుడా – ఈ తరుణమే ప్రభో (2) ||శరణం|| / పాపరహిత దేవకుమారా – శాపవాహకా (2) / శాపవాహకా – నిత్య కోప రహితుడా (2) ||శరణం|| / పరిపూర్ణ దేవుడా – నరావతారుడా (2) / నరావతారుడా – మా యేసు నాథుడా (2) ||శరణం|| / దయామయుండ క్రీస్తు యేసు – దాక్షిణ్య ప్రభువా (2) / దాక్షిణ్య ప్రభువా – బాహుళ్య దేవుడా (2) ||శరణం|| / నమ్మదగిన లోకరక్షకా – సర్వోపకారుడా (2) / సర్వోపకారుడా – సర్వశక్తిమంతుడా (2) ||శరణం|| / సాత్వికుండా – సర్వజనుల కాంక్షణీయుడా (2) / కాంక్షణీయుడా – వాత్సల్య దేవుడా (2) ||శరణం|| / రిక్తుడై తగ్గించుకొనిన – వినయపూర్ణుడా (2) / వినయపూర్ణుడా – మముగాచు దేవుడా (2) ||శరణం|| / సత్యవంతుడవు – మాదు నిత్యదేవుడా (2) / నిత్యదేవుడా – మా మంచి బోధకుడా (2) ||శరణం|| / సర్వలోక సృష్టికర్త – సత్యదేవుడా (2) / సత్యదేవుడా – మా నిత్యజీవమా (2) ||శరణం|| / ఎల్లరిలో శ్రేష్ఠుడా – మా వల్లభుండవు (2) / వల్లభుండవు హల్లెలూయ పాడెదం (2) ||శరణం||

పూజనీయుడేసు ప్రభు|Poojaneeyudesu Prabhu

పూజనీయుడేసు ప్రభు / పలునిందల నొందితివా నాకై (2) ||పూజనీయుడేసు|| / నీ స్వకీయులే నిందించినా / నిన్నంగీకరించక పోయినా (2) / ఎన్నో బాధ లొందితివా నాకై (2) / సన్నుతింతును నీ ప్రేమకై ||పూజనీయుడేసు|| / సత్యము మార్గము మరి జీవమై / నిత్యజీవమియ్యను వచ్చితివి (2) / వంచకుడవని నిన్ను నిందించిరా (2) / ఓ దయామయా నజరేయుడా ||పూజనీయుడేసు|| / యూదా గోత్రపు ఓ సింహమా / ఆద్యంతరహిత దైవమా (2) / అధములు నిను సమరయుడనిరా (2) / నాథుడా నిను బహు దూషించిరా ||పూజనీయుడేసు|| / మధురం నీ నామం అతి మధురం / మధుర గీతముతో నిన్నారాధింతును (2) / వధియించబడితివా యీ పాపికై (2) / వందితా ప్రభు నిన్ను పూజింతును ||పూజనీయుడేసు||

పాడెద దేవా నీ కృపలన్|Paadeda Devaa Nee Krupalan

పాడెద దేవా – నీ కృపలన్ / నూతన గీతములన్ / స్తోత్రము చెల్లింతున్ – స్తుతి స్తోత్రము చెల్లింతున్ (2) / భూమి పునాదులు వేయకముందే / యేసులో చేసితివి (2) / ప్రేమ పునాదులు వేసితివి / దీనుని బ్రోచితివి – ఈ దీనుని బ్రోచితివి (2) ||పాడెద|| / ప్రవిమల రక్తము కలువరి సిలువలో / కలునకు నిచ్చితివి (2) / ప్రేమ కృపా మహదైశ్వర్యములతో / పాపము తుడిచితివి – నా పాపము తుడిచితివి (2) ||పాడెద|| / పాపము శాపము నరకపు వేదన / మరి తొలగించితివి (2) / అపరాధములచే చచ్చిన నన్ను / ధర బ్రతికించితివి – నన్ను బ్రతికించితివి (2) ||పాడెద|| / దేవుని రాజ్యపు వారసుడనుగా / క్రీస్తులో చేసితివి (2) / చీకటి రాజ్యపు శక్తుల నుండి / నను విడిపించితివి – చెర నను విడిపించితివి (2) ||పాడెద|| / ముద్రించితివి శుద్ధాత్మతో నను / భద్రము చేసితివి (2) / సత్యస్వరూప నిత్యనివాసి / సొత్తుగా చేసితివి – నీ సొత్తుగా చేసితివి (2) ||పాడెద|| / అన్యుడనై నిను ఎరుగక యున్నను / ధన్యుని చేసితివి (2) / ప్రియ పట్టణ పౌరుల సేవింపను / వరముల నొసగితివి – కృప వరముల నొసగితివి (2) ||పాడెద||

నే స్తుతించెదను|Ne Sthuthinchedanu

నే స్తుతించెదను యేసు నామమును / భజించెదను క్రీస్తు నామమును / స్తుతికి యేసే యోగ్యుడని / నిత్యం నిత్యం నే స్తుతించెదను ||నే స్తుతించెదను|| / ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ / వర్ణింప నెవ్వరికి తరమౌనా? (2) / పాపిని నన్ను రక్షించుటకై / చూపెను ప్రేమనపారముగా (2) ||నే స్తుతించెదను|| / పాపములన్నియు బాపుటకై / శాపములన్నియు మాపుటకై (2) / ఏ పాపమెరుగని ఆ పావనుడు / శాపగ్రాహియై చావొందెను (2) ||నే స్తుతించెదను|| / శోధన కాలముల యందున / వేదన కాలముల యందున (2) / నాధుడు యేసు మనతోడనుండ / అంతమేగా మన చింతలకు (2) ||నే స్తుతించెదను|| / ఎనలేని ప్రేమతో కౌగిలించెను / ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను (2) / మహామహుండు మహిమ ప్రధానుడు / మహిమతో వచ్చును మేఘముపై (2) ||నే స్తుతించెదను|| / రాజాధిరాజు ప్రభు యేసే / దేవాదిదేవుడు మన యేసే (2) / పరమందు దూతలు యిహమందు నరులు / పాడుడి ప్రభునకు హల్లెలూయా (2) ||నే స్తుతించెదను||

దేవుడొక నగరము|Devudoka Nagaramu

దేవుడొక నగరము మన కొరకై / సిద్ధపరచుచుండె నుండుటకై (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా (2) ||దేవుడొక|| / మేలిమి బంగారము అద్భుత నగరం / విలువైన రాళ్ళతో పునాది వేసెను (2) / రక్తముచే శుద్ధులై క్షమించబడితిమి (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| / నగర ప్రాకారములు ఎత్తైనవి / సూర్య కాంతములచే కట్టబడెను (2) / ప్రభువే విమోచించి అధికారమిచ్చెను (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| / ముత్యాల గుమ్మములు పండ్రెండు గలవు / పన్నిద్దరు దూతలు అచ్చట నుండిరి (2) / పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| / ఆ నగర వీధులు మేలిమి బంగారం / ద్వారములు ఎప్పటికి మూయబడవు (2) / ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంబుతో (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| / గొర్రెపిల్ల సింహాసన మచ్చటుండును / ఆయనే దీపము నాలయమై యుండును (2) / జీవగ్రంథమందున పేరులున్నవనుచు (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| / జయవంతుల కొరకే ఆ నగరం / పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు (2) / విజయుల మౌదము క్రీస్తుని రక్తముచే (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక||

ఆదియంతము లేనివాడా|Aadiyanthamu Lenivaadaa

ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా / నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే / అబ్రాహామును పిలిచితివి – ఆ వంశమున బుట్టితివి / అనాధులకు దిక్కు నీవే – అనాధుడవై వచ్చితివి ||ఆదియంతము|| / ఇస్సాకును విడిపించి – యేసయ్యా బలియైనావా / యూదాచే నమ్మబడితివి – పాపులకై మరణించితివి ||ఆదియంతము|| / యోనావలె మూడు దినముల్ – భూగర్భమున నీవుండి / మానవులను రక్షింప – మహిమతోడ లేచితివి ||ఆదియంతము|| / పండ్రెండు గోత్రముల – జెంది – పండ్రెండు శిష్యుల జనకా / కన్యపుత్రుడవై సీయోను – కన్యను వరించితివి ||ఆదియంతము|| / దావీదు కుమారుడవు – దావీదుకు దేవుడవు / కాపాడుచు నున్నావు – పాపిని నన్ను ప్రేమించి ||ఆదియంతము||

నిరంతరం నీతోనే|Nirantharam Neethone

నిరంతరం నీతోనే జీవించాలనే / ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2) / నా ప్రాణేశ్వరా యేసయ్యా / నా సర్వస్వమా యేసయ్యా ||నిరంతరం|| / చీకటిలో నేనున్నప్పుడు / నీ వెలుగు నాపై ఉదయించెను (2) / నీలోనే నేను వెలగాలని / నీ మహిమ నాలో నిలవాలని (2) / పరిశుద్ధాత్మ అభిషేకముతో / నన్ను నింపుచున్నావు నీ రాకడకై ||నిరంతరం|| / నీ రూపము నేను కోల్పయినా / నీ రక్తముతో కడిగితివి (2) / నీతోనే నేను నడవాలని / నీ వలెనే నేను మారాలని (2) / పరిశుద్ధాత్మ వరములతో / అలంకరించుచున్నావు నీ రాకడకై ||నిరంతరం|| / తొలకరి వర్షపు జల్లులలో / నీ పొలములోని నాటితివి (2) / నీలోనే చిగురించాలని / నీలోనే పుష్పించాలని (2) / పరిశుద్ధాత్మ వర్షముతో / సిద్ధపరచుచున్నావు నీ రాకడకై ||నిరంతరం||