ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
పాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగం / క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరు చేయవలసినది సజీవ యాగం – ఇది శరీర యాగం / దేవా నా జీవితమిదిగో నీ సొంతం / ప్రతి క్షణం నీ పనికై అర్పితం (2) / నా వరకైతే బ్రతుకుట నీ కోసం / చావైతే ఎంత గొప్ప లాభం (2) / నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం / సజీవయాగముగా నీకు సమర్పితం (2) ||దేవా|| / నా కరములు నా పదములు నీ పనిలో / అరిగి నలిగి పోవాలి ఇలలో / సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో / అలసి సొలసి పోవాలి నాలో (2) ||నా శరీరము|| / నా కాలము అనుకూలము నీ చిత్తముకై / ధనము ఘనము సమస్తము నీ పనికి / నా మరణము నీ చరణముల చెంతకై / నిన్ను మహిమపరిచి నేలకొరుగుటకై (2) ||నా శరీరము||