తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:Victor Rampogu

ఓ యాత్రికుడా|O Yaathrikudaa

ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడా / బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా.. / ఓ బాటసారి ఓహో బాటసారి / జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా / గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపొతుంది / నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది (2) / అంతా ఆ దైవ నిర్ణయం / మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| / పుట్టగానే తొట్టెలో వేస్తారు / గిట్టగానే పెట్టెలో మూస్తారు / జాగు చేయక కాటికి మోస్తారు / ఆరడుగుల గుంటలో తోస్తారు ఆ అ ఆ. ఆ.. (2) / బ్రతుకు మూల్యమింతే – మనిషికి ఉన్న విలువంతే (2) / అంతా ఆ దైవ నిర్ణయం / మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| / ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు / ఏడిపిస్తూ సమాధికి పోతావు / కూడబెట్టినవి మోసుకు పోలేవు / ఆశించినవేవి నీ వెంటారావు ఓ ఒ ఓ..ఓ.. (2) / జీవిత సారము ఇంతే – మనిషి బ్రతుకు భావము అంతే (2) / అంతా ఆ దైవ నిర్ణయం / మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| / మరణము ఒక నిద్ర యేసునందు / అంతము అది కాదు క్రీస్తునందు / మృతులు లేచుట స్థిరము యేసునందు / నిత్య జీవము వరము క్రీస్తునందు ఆ అ ఆ.. ఆ.. (2) / నేడే రక్షన సమయము – ఇక ఆలసించిన నరకము (2) / అంతా ఆ దైవ నిర్ణయం / మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా||

నీవు లేని చోటేది|Neevu Leni Chotedi

నీవు లేని చోటేది యేసయ్యా / నే దాగి క్షణముండలేనయ్యా / నీవు చూడని స్థలమేది యేసయ్యా / కనుమరుగై నేనుండలేనయ్యా (2) / నీవు వినని మనవేది యేసయ్యా / నీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2) / నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) ||నీవు లేని|| / కయీను కౄర పగకు బలియైన హేబేలు / రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు / అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు / మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2) / చెవి యొగ్గి నా మొరను / యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2) ||నీవుంటే|| / సౌలు ఈటె దాటికి గురియైన దావీదు / ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు / సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును / గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు (2) / నీ తోడు నీ నీడ / యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా (2) ||నీవుంటే||