తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:Swapna Edwards

మేం క్రైస్తవులం|Mem Kraisthavulam

ప్రేమ క్షమలను సమపాళ్లుగా / విశ్వాసమే లక్ష్యంగా / మా జీవితాలనే సాక్ష్యంగా / నిజదేవుని జనాంగంగా (2) / పిలువబడిన వారమే మేము / సిగ్గుపడని వారమే మేము (2) / మేం క్రైస్తవులం క్రీస్తనుచరులం / మేం క్రైస్తవులం ప్రేమకు జ్ఞాపికలం / మేం క్రైస్తవులం పరలోక దీపికలం / మేం క్రైస్తవులం బాధ్యత గల పౌరులం / మేం క్రైస్తవులం క్రైస్తవులం / మేం క్రైస్తవులం క్రైస్తవులం / మతానికి అతీతులం / జాతి వర్ణ వర్గాలనేకం / మేం యేసు రక్తంతో కొనబడిన వారం / మేం సత్యమార్గంలో నడిచే వారం (2) / యేసు నీ జీవితమే మాకు పాఠంగా / మా బ్రతుకులకే ఒక యాగంగా / చేసుకొన్న వారమే మేము / ఏక శరీరమై ఉన్నాము (2) ||ప్రేమ|| / మనుష్యులను ప్రేమిస్తాము / దైవ ప్రేమనే ప్రకటిస్తాము / ఏ శోధనకైనా తలవంచని వారం / దేవుని చెంత మోకరించే వారం (2) / లోకం మమ్ములను వేధిస్తున్నా / చులకనగా చూసి నిందిస్తున్నా / బాధను సహించే వారం / మేం శత్రువునైనా క్షమిస్తాము (2) / పాపం అంటే శరీరంతో చేసేదే కాదు / మనసులో తలంచేది అంటాం / ఎందుకంటే మేం క్రైస్తవులం / ఏ మనిషి దేవుని రూపాన్ని చూడలేదు / అందుకే విగ్రహారాధన మేం చెయ్యం / ఎందుకంటే మేం క్రైస్తవులం / దేవుడంటే సృష్టిని చేసిన వాడు / ఆ దేవునికి విదేశీ దేవుడనే మాటే లేదంటాం / ఎందుకంటే మేం క్రైస్తవులం / ఎన్ని బాధలు పెట్టి హింసించినా / ప్రేమతో క్షమిస్తాము / ఎందుకంటే మేం క్రైస్తవులం ||ప్రేమ||

అమ్మ కోసం|Amma Kosam

ఏ భాషకందని భావం నీవు / వెలకట్టలేని ముత్యం నీవు / దేవుడిచ్చిన వరమే నీవు – తీర్చలేని ఓ ఋణం / ఎదలో దాగిన పలుకే నీవు – నా ప్రేమకు తొలిరూపం / అమ్మా నిను మించిన బంధం ఏదియు లేదే / లోకంలో ఈ తియ్యని బంధం కానరాలేదే / నవ మాసాలు నీలో నన్ను దాచావు / నా ఊపిరికై నీ ప్రాణం పణంగా పెట్టావు / రేయి పగలంతా నాకై శ్రమపడినా / తీరని అనురాగం నీలో చూసానే / నీ సుఖ సంతోషం విడచిన నాకై / తరగని మమకారం నీలో దాచావే / యేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే / అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే / లోకంలో ఈ తియ్యని బంధం కానరానే లేదే / భయ భక్తులే ఉగ్గి పాలగ పోసావు / దేవుని మాటలే గోరు ముద్దగ చేసావు / తప్పటడుగులే నాలో సరి చేసి / ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగ నిలిపావు / ప్రతి వేకువలో నాకై నీవు / చేసే ప్రార్థనలే పెంచెను నా బలమే / నీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించెనే / అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే / లోకంలో ఈ తియ్యని బంధం కానరానే లేదే

నువ్వెవరో యేసు|Nuvvevaro Yesu

ఈ లోకం కన్నా మిన్నగా / నా బంధం కన్నా అండగా / అన్నీ నీవై నిలిచి / నను వెదకి వచ్చితివే / నువ్వెవరో యేసు నువ్వెవరో… / నా తల్లి కన్నా నీవే / నా తండ్రి కన్నా నీవే / నా అండ దండ తోడు నీడ నీవై / నన్ను కాచితివే / ఈ లోకం కన్నా మిన్నగా / నా బంధం కన్నా అండగా / అన్నీ నీవై నిలిచి / నను వెదకి వచ్చితివే / నా తల్లి నను మరచే / నేనెన్నో సార్లు ఏడ్చే / నీవు నన్ను మరువక / నా ప్రక్కన ఉంటివే / నా కన్నుల్లోని నీళ్లు నిను మసక చేసెనే / నా కంటి నీరు తుడిచి నేనున్నానంటివే ||ఈ లోకం|| / నా తండ్రి నను విడచే / నేనొంటరినై నడచే / నీవు నన్ను విడువక / నా చెంత నడచితివే / ఎవరు లేరనే బాధలో నిన్నే కానకపోయే / తుళ్ళిపడిన వెంటనే నన్నాదుకొంటివే / (యేసు) నువ్వేలే నా సర్వం – (2) ||నా తల్లి||

నా తనువు నా మనసు|Naa Thanuvu Naa Manasu

నా తనువు నా మనసు / నా నైపుణ్యం నీ కొరకే / నా తలంపులు నా మాటలు / నా క్రియలు నీ కొరకే / నా ప్రయాసే కాదు / నీ కరుణతో నిలిచింది ఈ జీవితం / నీ నామం కీర్తించాలని / నీ బలం చూపించాలని / అందుకేగా నన్నిలలో నియమించితివి / నీ స్వరూపముగా / నీ శ్వాసతో నను సృజియించితివి / నీ మహిమగా నేనుండుటకు / నీతోనే జీవించుటకు (2) / అందుకేగా నన్నిలలో సృజియించితివి / అందుకేగా నన్నిలలో నియమించితివి ||నా తనువు|| / గర్భ వాసమున లేనప్పుడే / నన్ను ప్రతిష్టించితివి / నీ వెలుగునే ప్రకాశించుటకు / నీ ప్రేమనే పంచుటకు (2) / అందుకేగా నన్నిలలో ప్రతిష్టించితివి / అందుకేగా నన్నిలలో నియమించితివి ||నా తనువు||

నెమ్మది లేదా|Nemmadi Ledaa

నెమ్మది లేదా నెమ్మది లేదా – ఒంటరివైనావా / చీకటి బ్రతుకులో వెలుగు లేక – తిరుగుచున్నావా / ఆశలు ఆవిరై పోయినా / నీ కలలన్ని చెదరిన / అలసిపోక సాగిపోవుమా (2) ||నెమ్మది|| / నీ వారు నిన్ను హేళన చేసినా / నీ ప్రేమ బంధు నిన్ను విడచిననూ / గాఢాంధ కారం నిన్ను చుట్టిననూ / అవమానం నింద కలచి వేస్తున్నా / నిను విడువని దేవుడే నీ తోడుగా ఉందును / నీదు వేదనలలోనే నీకు ధైర్యము నిచ్చును / నీ కోసమే తను నిలిచెను / నీ బాధను తొలగించును ||నెమ్మది|| / నీ కన్నీరంతా తుడిచి వేయును / నీ గాయాన్నంతా మాన్పి వేయును / విలువైన పాత్రగ నిన్ను మార్చును / నీ వారికే నిన్ను దీవెనగా చేయును / కాపరి వలె నిన్ను తన కృపలతో నడుపును / నిత్య జీవ మార్గం నీకు ఆయనే చూపును / తన ప్రేమకు నువ్వు సాక్షిగా / జీవించుమా ఇల నిత్యము / నెమ్మది పొందు నెమ్మది పొందు – యేసే నీ తోడు / చీకటి బ్రతుకులో వెలుగు చూపే – యేసే నీ మార్గం