ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
3 songs found|By Alphabet|By Popularity
ఏమి ఉన్నా లేకున్నా / ఎవరు నాకు లేకున్నా (2) / యేసు నందే ఆనందింతును / యేసయ్యనే ఆరాధింతును (2) / ఆనందింతును ఆరాధింతును (2) / యేసు నందే ఆనందింతును / యేసయ్యనే ఆరాధింతును (2) / మందలో గొర్రెలు లేకున్ననూ / శాలలో పశువులు లేకున్ననూ (2) / ఏమి నాకు లేకున్నా / కష్ట కాలమందైనా (2) ||యేసునందే|| / ద్రాక్షా చెట్లు ఫలించుకున్ననూ / అంజూరపు చెట్లు పూయకున్ననూ (2) / ఏమి నాకు లేకున్నా / నష్ట సమయమందైనా (2) ||యేసునందే||
నీవే నీవే / నా తోడున్న దేవుడవు (2) / నీ వెంటే వస్తానయ్యా (2) ||నీవే|| / కష్టాల కడలిలోనైనా / కన్నీటి బాధలోనైనా (2) / యెహోవా షాలోమ్ సమాధానం ఇచ్చును (3) ||నీవే|| / ఏ ఘోర పాపము అయినా / మరణకర వ్యాధి అయినా (2) / యెహోవా రాఫా స్వస్థపరచును (3) ||నీవే||
నీవున్నావని ఒకే ఆశ / నడిపిస్తావని ఒకే ఆశ / ఎవరున్నారు నాకిలలో (2) / నీవు తప్ప ఎవరున్నారు నాకు ఇలలో / ఎవరున్నారు నాకు యేసయ్యా / ఎవరున్నారయ్యా / నీవున్నావని ఒకే ఆశతో / నడిపిస్తావని ఒకే ఆశలో (2) / ఆదరిస్తావని ఆదుకుంటావని (2) / అద్దరికి చేరుస్తావని నీ జీవిస్తున్నా / ఆశలే అడి ఆశలై / బ్రతుకెంతో భారమై (2) / కలలన్ని కన్నీటి వ్యధలై / గుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని|| / ఆప్తులే దూరమై / బంధు మిత్రులకు భారమై (2) / నా అన్న వారే నాకు కరువై / గుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని|| / యాత్రలో తుఫానులే / నా నావనే ముంచేసినా (2) / అద్దరి చేరే ఆశలే అనగారినా / గుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని||