ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
23 songs found|By Alphabet|By Popularity
ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన – విలువైన నీ మాటలు / ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు (2) / మోక్షమునకు చేర్చు బాటలు / పరిశుద్ధతలో పరిపూర్ణుడా – ఉన్నత గుణ సంపన్నుడా (2) / శ్రేష్టుడా… ||ధ్యానించుచుంటిమి|| / తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు / వీరిని దయతో క్షమించుము (2) / అని ప్రార్ధన చేసావా బాధించే వారికి (2) / శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2) ||పరిశుద్ధతలో|| / నేడే నాతోను పరదైసులో నీవుందువు / నిశ్చయముగ ప్రవేశింతువు (2) / అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి (2) / అధికారముతో పాపిని రక్షించి (2) ||పరిశుద్ధతలో|| / ఇదిగో నీ తల్లి ఇతడే నీ కుమారుడు / కష్టము రానీయకు ఎప్పుడు (2) / అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను (2) / తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను (2) ||పరిశుద్ధతలో|| / దేవా నా దేవా నను విడనాడితివెందుకు / చెవినీయవె నా ప్రార్థనకు (2) / అని కేక వేసావా శిక్షననుభవిస్తూ (2) / పరలోక మార్గం సిద్ధము చేస్తూ (2) ||పరిశుద్ధతలో|| / సర్వ సృష్టికర్తను నే దప్పిగొనుచుంటిని / వాక్యము నెరవేర్చుచుంటిని (2) / అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు (2) / జీవ జలమును అనుగ్రహించుటకు (2) ||పరిశుద్ధతలో|| / సమాప్తిమయ్యింది లోక విమోచన కార్యం / నెరవేరెను ఘన సంకల్పం (2) / అని ప్రకటన చేసావా కల్వరి గిరి నుంచి (2) / పని ముగించి నీ తండ్రిని ఘనపరచి (2) ||పరిశుద్ధతలో|| / నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని / నీ యొద్దకు వచ్చుచుంటిని (2) / అని విన్నవించావా విధేయత తోటి (2) / తల వంచి తృప్తిగ విజయము చాటి (2) ||పరిశుద్ధతలో||
ఆరాధనా ఆరాధనా – ఆత్మతో ఆరాధనా / ఆరాధనా ఆరాధనా – కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) / నీకే నా దేవా – తండ్రీ అందుకోవా (2) ||ఆరాధనా|| / అన్నిటికీ ఆధారమైనవాడా – నీకే ఆరాధనా (2) / ఎన్నటికీ మారని మంచివాడా / కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) ||నీకే|| / నోటను కపటము లేనివాడా – నీకే ఆరాధనా (2) / మాటతో మహిమలు చేయువాడా / కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) ||నీకే|| / అంతయు వ్యాపించియున్నవాడా – నీకే ఆరాధనా (2) / చింతలు తీర్చేటి గొప్పవాడా / కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) ||నీకే||
యేసు పుట్టుకలోని పరమార్ధాన్ని గ్రహించి / తిరిగి జన్మిస్తే / ఆయన కొరకు జీవించగలం / ఆయనను మనలో చూపించగలం / పరమ దైవమే మనుష్య రూపమై / ఉదయించెను నా కోసమే / అమర జీవమే నరుల కోసమై / దిగి వచ్చెను ఈ లోకమే / క్రీస్తు పుట్టెను – హల్లెలూయ / క్రీస్తు పుట్టెను – హల్లెలూయ / క్రీస్తు పుట్టెను – హల్లెలూయా (2) ||పరమ దైవమే|| / ఆకార రహితుడు ఆత్మ స్వరూపుడు / శరీరమును ధరించెను / సర్వాధికారుడు బలాఢ్య ధీరుడు / దీనత్వమును వరించెను / వైభవమును విడిచెను – దాసునిగను మారెను – (2) / దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా… ||పరమ దైవమే|| / అనాది వాక్యమే కృపా సమేతమై / ధరపై కాలు మోపెను / ఆ నీతి తేజమే నరావతారమై / శిశువై జననమాయెను / పాపి జతను కోరెను – రిక్తుడు తానాయెను (2) / భూలోకమును చేరెను – యేసు రాజుగా… ||పరమ దైవమే|| / నిత్యుడు తండ్రియే విమోచనార్ధమై / కుమారుడై జనించెను / సత్య స్వరూపియే రక్షణ ధ్యేయమై / రాజ్యమునే భరించెను / మధ్య గోడ కూల్చను – సంధిని సమకూర్చను – (2) / సఖ్యత నిలుప వచ్చెను – శాంతి దూతగా… ||పరమ దైవమే||
తీయని స్వరాలతో నా మనసే నిండెను / యేసుని వరాలతో నా బ్రతుకే మారెను / భావమధురిమ ఉప్పొంగెను / రాగసుధలతో భాసిల్లెను (2) / పరవశించి నిను స్తుతించి / ఘనపరచెద వైభవముగా ||తీయని|| / ఏదేమైనా ఏనాడైనా నీ దారిలో నేను / నీవే నాకు ఆప్తుడైన నిన్నాశ్రయించాను / సజీవుడా నీవే లేని నేనే వ్యర్ధము / ఏదేమైనా ఏనాడైనా నీ దారిలోనేను / యేసుతో రాజ్యము చేసే భాగ్యము / నాకు దొరికె కనికరము – తనువు పరవశము ||తీయని|| / ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను / నిన్నేనమ్మి జీవించేను నీలో ఫలించేను / సహాయుడా నీలోనేగా నా సాఫల్యము / ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను / యేసుని సన్నిధి చేరే భాగ్యము / నాకు కలిగె అనుగ్రహము – తనువు పరవశము ||తీయని||
కరుణించి కాపాడే యేసయ్యా.. / యేసయ్యా… యేసయ్యా.. / కూడుకొని మనమీవేళ / ఘనమగు వేడుకకు తెర తీయాలా (2) / గడచిన దినముల కలిగిన సుఖముకై / ప్రభు యేసు ఆశీర్వాదాలకై ||కూడుకొని|| / వేసవి వడగాలుల బాధ తీరిపోయే / యేసుని శుభ వాక్కుల హాయి ప్రాప్తమాయే / విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపొదాయే / విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే / గానమై గళమున పాడగా / ధ్యానమై మనసుని తాకగా / ప్రభవించె యేసు దివ్య నాద రూపాన ||కూడుకొని|| / పాతవి కడ తేరగ మనసు మారిపోయే / నూతన క్రియ చేయగ దారి సిధ్ధమాయే / ప్రబలమైన సిలువ నీడ సమసిపోదాయే / సమసిపోయే శ్రమల జాడ జయము నాదాయే / స్తోత్రమే నిలువుగ లేవగా / ధూపమై వరదుని చేరగా / తిరిగొచ్ఛే తండ్రి శ్రేష్ఠ రూపాన ||కూడుకొని||
అంబరానికి అంటేలా / సంబరాలతో చాటాలా (2) / యేసయ్య పుట్టాడని / రక్షింప వచ్చాడని (2) / ప్రవచనాలు నెరవేరాయి / శ్రమ దినాలు ఇక పోయాయి (2) / విడుదల ప్రకటించే / శిక్షను తప్పించే (2) ||యేసయ్య|| / దివిజానాలు సమకూరాయి / ఘనస్వరాలు వినిపించాయి (2) / పరముకు నడిపించే / మార్గము చూపించే (2) ||యేసయ్య|| / సుమ వనాలు పులకించాయి / పరిమళాలు వెదజల్లాయి (2) / ఇలలో నశియించే / జనులను ప్రేమించే (2) ||యేసయ్య||
దివిటీలు మండాలి – సిద్దెలలో నూనుండాలి / ఈనాటి ఓ సంఘమా – యేసయ్య సహవాసమా / ఇది నిదురించగా సమయమా / నీవు వెనుదిరిగితే న్యాయమా / ఉన్నతమైన స్థలములలో నిను పిలిచాడు / ఎన్నికలేని నీదు చెంత నిలిచాడు (2) / ఆ ప్రేమ నీడలో – ఆ యేసు బాటలో (2) / మొదటి ప్రేమను మరువకుమా / నిదురించగా సమయమా / వెనుదిరిగితే న్యాయమా ||దివిటీలు|| / రాకడ కాలపు సూచనలని చూచాయి / ఉన్నత కొంచెముగాను ప్రార్ధించాయి (2) / పరిశుద్ధత కావాలి – పరివర్తన రావాలి (2) / మొదటి ప్రేమను మరువకుమా / నిదురించగా సమయమా / వెనుదిరిగితే న్యాయమా ||దివిటీలు||
నేనున్నా నీతో అంటూ / నా చెంతకు చేరావు / యేసయ్యా.. యేసయ్యా… / కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ / ఎటు తోచక లోలోన నే కృంగియున్న వేళ / నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు / నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు (2) / మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా / బెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా (2) / పని పూర్తి చేయగ బలము లేని వేళ (2) / నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు / నా ఆటంకాలన్నిటిని యేసూ తొలగించావు (2) / శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా / చెదిరిపోయి ఆశల సౌధం నా గొంతు మూగబోగా (2) / స్తుతి పాట పాడగ స్వరము రాని వేళ (2) / నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు / నా నోటను నూతన గీతం యేసూ పలికించావు (2) / కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా / సడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా (2) / అడుగేసి సాగగ అనువుకాని వేళ (2) / నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు / నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసూ నడిపించావు (2) ||కనుచూపు||
ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు / ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2) / ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము / నిన్నే అనుసరింతుము జీవితాంతము (2) / ఘనులైన వారే గతియించగా / ధనమున్నవారే మరణించగా (2) / ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావు / మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2) ||ఇశ్రాయేలు|| / మా కంట కన్నీరు జారకుండగా / ఏ కీడు మా దరికి చేరకుండగా (2) / కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు / దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు (2) ||ఇశ్రాయేలు||
నమ్మకు ఇలలో ఎవరిని / సాయం చేస్తారనుకొని (2) / నమ్ముకో రక్షకుడేసుని (2) / కార్యం చూడు నిలుచొని (2) ||నమ్మకు|| / సహాయము చేస్తామని వస్తారు ఎందరో నీ చెంతకు / చేయూతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుర్లు నీకు / అక్కరలడ్డం పెట్టుకొని లాభం పొందుతుంటారు (2) / శవాలపై కాసులేరాలని కాచుకొని చూస్తుంటారు (2) ||నమ్మకు|| / నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమౌతారు వెనువెంటనే / మేముండగా నీకేమని వెన్నంటి ఉంటారు నీ ఇంటనే / నీకున్న అవసరతలన్ని వారిపై వేసుకుంటారు (2) / దోచుకొని నీ సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు (2) ||నమ్మకు|| / నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి / జవాబును చూపిస్తామని పేలుస్తు ఉంటారులే కుంపటి / సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు (2) / రహస్యాలను బయటేసి నిను అల్లరి చేస్తుంటారు (2) ||నమ్మకు||
మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా / చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా (2) / నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2) / నిత్యము నీ కీర్తి నా నోట నుండును (2) ||మేలైనా|| / కలిమి చేజారి నను ముంచినా / స్థితిని తలక్రిందులే చేసినా (2) / రెండింతలుగా దయచేసెదవని (2) / నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా|| / పరుల ఎగతాళి శృతి మించినా / కలవరము పొంది నే కృంగినా (2) / నా మొర విని కృప చూపెదవని (2) / నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా|| / శ్రమలు చెలరేగి బెదిరించినా / ఎముకలకు చేటునే తెచ్చినా (2) / ఆపదలలో విడిపించెదవని (2) / నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా||
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి (2) / చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో / దేవుని సంకల్పం ఇది సృష్టిలోని చిత్రం – (2) / ఒంటరి బ్రతుకును విడిచెదరు / ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు (2) / పెళ్లినాటి నుండి తల్లి దండ్రుల వదలి / భార్య భర్తలు హత్తుకొనుటేమిటో ||దేవుని|| / గత కాల కీడంతా మరచెదరు / వీనులతో సంతసించెదరు (2) / పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు / ఇష్టముతో పంచుకొనుటేమిటో ||దేవుని|| / ఫలియించి భూమిని నింపెదరు / విస్తరించి వృద్ధి పొందెదరు (2) / పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ / ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో ||దేవుని||