ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
116 songs found|By Alphabet|By Popularity
క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం / ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం (2) / కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా / యేసు ప్రభువే నా సహకారి (2) ||క్రైస్తవ|| / ఈ లోక ఘనత నన్ను విడిచినన్ / లోకస్థులెల్లరు నన్ను విడిచినన్ (2) / నా సహోదరులు నన్ను విడిచినన్ / యోసేపు దేవుడే నా సహకారి (2) ||క్రైస్తవ|| / నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు / శాశ్వత రాజు నా సహాయకుడు (2) / భారం నాకెందుకు వ్యాకులమెందుకు / ప్రభు ప్రజలతో నే కీర్తించెదన్ (2) ||క్రైస్తవ|| / బూర శబ్దంబు మ్రోగెడి వేళ / శ్రమ నొందిన నా ప్రభుని చూచెదన్ (2) / ఏనాడు ఎప్పుడు నీవు వచ్చెదవు / ఆనాటి వరకు నే కనిపెట్టెదన్ (2) ||క్రైస్తవ||
యేసు ప్రభువా నీవే / మహిమా నిరీక్షణా (2) / హల్లెలూయా హల్లెలూయా / మహిమా నిరీక్షణా నీవే (2) ||యేసు|| / గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకొసగితివి (2) / మహిమా నిరీక్షణా నీవే / నిశ్చయముగా నిన్ను చూతును (2) / యేసు ప్రభో జయహో (4) ||యేసు|| / నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి (2) / ఎనలేని ధనము నీవేగా / నిశ్చయముగా నే పొందుదును (2) / యేసు ప్రభో జయహో (4) ||యేసు|| / ప్రభువా మహిమతో మరలా వత్తు నన్ను కొనిపోవ (2) / పరలోకమే నా దేశము / మహిమలోనచ్చట నుందును (2) / యేసు నీతో సదా / యేసు ప్రభో జయహో (2) ||యేసు||
ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది / యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు – (2) ||ఓ ఇశ్రాయేలు|| / భయపడకు నేను నీ / కేడెమును బహుమానమున్ (2) / అత్యధికముగా చేతునని (2) / యెహోవా దేవుడే పల్కెన్ (2) ||ఓ ఇశ్రాయేలు|| / సర్వోన్నతుని రాజ్యము / శాశ్వతంబు నిక్కము (2) / తొలగిపోదు ఎన్నడూ (2) / లయము కాదు ఎన్నడూ (2) ||ఓ ఇశ్రాయేలు|| / నీవు భయపడకుము / బాధించువారు రాకుండను (2) / దూరముగా నుంచి యున్నాను (2) / నీకు తోడైయున్నాను (2) ||ఓ ఇశ్రాయేలు||
సిలువ చెంతకు రా (4) / సహోదరా సిలువ చెంతకు రా / సహోదరీ సిలువ చెంతకు రా / యవ్వన కాల పాపములో / మరణ మార్గాన వెళ్లెదవా (2) / యేసుని పొందని బ్రతుకుతో / పాపములో మరణించెదవా (2) ||సిలువ|| / సమస్తము నష్టపరచుకొని / హృదయము బ్రద్దలై ఏడ్చెదవా (2) / యేసుని పొందని బ్రతుకుతో / పాపములో మరణించెదవా (2) ||సిలువ|| / సిలువలో వ్రేలాడే యేసుని / నీవు వీక్షించినా చాలును (2) / రక్షకుడు చిందిన రక్తముతో / నీ పాపములన్ని కడుగబడున్ (2) ||సిలువ||
కృప కనికరముల / మా దేవా – కృతజ్ఞత నర్పింతు (2) / యెహోవా చేసిన ఉపకారములకై / ఆయనకేమి చెల్లింతును (2) / యెహోవా నామమున – ప్రార్ధన చేసెదను (2) / రక్షణ పాత్ర చేబూని ||కృప|| / నీదు కృపతో నాదు యేసు / నన్ను నీవు రక్షించితివి (2) / కాదు నాదు – క్రియల వలన (2) / ఇది దేవుని వరమే ||కృప|| / చెప్ప నశక్యము మహిమ యుక్తము / నీవొసంగిన సంతోషము (2) / తప్పకుండా – హల్లెలూయా (2) / పాట పాడెదన్ ||కృప||
ఆహా ఆనందమే పరమానందమే / ప్రియ యేసు నొసగె నాకు / కొలత లేనిది బుద్ధికందనిది / ప్రేమన్ వివరింప వీలగునా ||ఆహా|| / నీచ ద్రోహినైన నన్ / ప్రేమతో చేర్చుకొనే (2) / పాప ఊభి నుండి నన్ / పైకి లేవనెత్తెను (2) ||ఆహా|| / నిత్య నాశన పురమునకు / నే పరుగిడి వెళ్ళుచుండ (2) / నిత్య జీవ మార్గములో / నన్ను నడిపితివి (2) ||ఆహా|| / నీ ప్రేమ స్వరమున్ విని / నేను మేలుకొంటిని (2) / ప్రియుని రొమ్మును చేరను / నాలో వాంఛ ఉప్పొంగుచుండె (2) ||ఆహా|| / మధ్యాకాశము నందున / ప్రభుని చేరెడు వేళలో (2) / ఆనందమానందమే / ఎల్లప్పుడానందమే (2) ||ఆహా||
కొండల తట్టు కన్నులెత్తుచున్నాను / నాకు సాయమెచ్చట నుండి వచ్చును / భూమి యాకాశముల సృజించిన / యెహోవా వలన సాయము కల్గున్ ||కొండల|| / నీ పాదము తొట్రిల్ల నీయడు / నిన్ను కాపాడువాడు కునుకడు ||కొండల|| / ఇశ్రాయేలును కాచు దేవుడు / కునుకడు నిద్రపోడు యెన్నడు ||కొండల|| / యెహోవాయే నిన్ను కాపాడును / కుడి ప్రక్క నీడగా నుండును ||కొండల|| / పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ / నీకు తగులకుండ కాపాడును ||కొండల|| / ఎట్టి అపాయమైన రాకుండ / ఆయన నీ ప్రాణము కాపాడున్ ||కొండల|| / ఇది మొదలుకొని నిత్యము నీ / రాకపోకలందు నిను కాపాడున్ ||కొండల||
జయించువారిని కొనిపోవ / ప్రభు యేసు వచ్చుఁను (2) / స్వతంత్రించుకొనెదరుగా / వారే సమస్తమును (2) ||జయించు|| / ఎవరు ఎదురు చూతురో / సంసిద్ధులవుదురు (2) / ప్రభు రాకనేవరాశింతురో / కొనిపోవ క్రీస్తు వచ్చుఁను (2) ||జయించు|| / తన సన్నిధిలో మనలా నిలుపు / నిర్దోషులుగా (2) / బహుమానముల్ పొందెదము / ప్రభుని కోరిక ఇదే (2) ||జయించు|| / సదా ప్రభుని తోడ నుండి / స్తుతి చెల్లింతుము (2) / అద్భుతము ఆ దినములు / ఎవారు వర్ణింపలేరుగా (2) ||జయించు||
భక్తులారా స్మరియించెదము / ప్రభు చేసిన మేలులన్నిటిని (2) / అడిగి ఊహించు వాటి కన్నా మరి (2) / సర్వము చక్కగ చేసె (2) ||భక్తులారా|| / గాలి తుఫానులను గద్దించి / బాధలను తొలగించే (2) / శ్రమలలో మనకు తోడైయుండి / శ్రమలలో మనకు తోడైయుండి / బయలు పరచె తన జయమున్ (2) ||భక్తులారా|| / ఈ భువియందు జీవించు కాలం / బ్రతికెదము ప్రభు కొరకే (2) / మనమాయనకర్పించుకొనెదము / మనమాయనకర్పించుకొనెదము / ఆయన ఆశయమదియే (2) ||భక్తులారా|| / కొంచెము కాలమే మిగిలియున్నది / ప్రభువును సంధించుటకై (2) / గనుక మనము నడచుకొనెదము / గనుక మనము నడచుకొనెదము / ప్రభు మార్గముల యందు (2) ||భక్తులారా||
ఉదయించె దివ్య రక్షకుడు / ఘోరాంధకార లోకమున / మహిమ క్రీస్తు ఉదయించెను / రక్షణ వెలుగు నీయను – (2) ||ఉదయించె|| / ఘోరాంధకారమున దీపంబు లేక / పలు మారు పడుచుండగా (2) / దుఃఖ నిరాశ యాత్రికులంతా / దారి తప్పియుండగా (2) / మార్గదర్శియై నడిపించువారు (2) / ప్రభు పాద సన్నిధికి / దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు / ఉదయించె ఈ ధరలో – (3) ||ఉదయించె|| / చింత విచారముతో నిండియున్న / లోక రోదన విని (2) / పాపంబునుండి నశించిపోగా / ఆత్మ విమోచకుడు (2) / మానవాళికై మరణంబునొంది (2) / నిత్య జీవము నివ్వన్ / దివ్యరక్షకుడు ప్రకాశతార / ఉదయించె రక్షింపను – (3) ||ఉదయించె|| / పరలోక తండ్రి కరుణించి మనల / పంపేను క్రీస్తు ప్రభున్ (2) / లోకాంధులకు దృష్టినివ్వ / అరుదెంచె క్రీస్తు ప్రభువు (2) / చీకటి నుండి దైవ వెలుగునకు (2) / తెచ్చె క్రీస్తు ప్రభువు / సాతాను శృంగలములను తెంప / ఉదయించె రక్షకుడు – (3) ||ఉదయించె||
నోరారగా చేతును / దైవారాధనను (2) / ధారాళముగా పాడెదను / స్తోత్ర గీతమును (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హాల్లేలూయా (2) ||నోరారగా|| / భరియించితివి నా పాపపు శిక్షన్ / జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో (2) ||హల్లెలూయా|| / విడిపించితివి పాప శిక్ష నుండి / నడిపించితివి జీవ మార్గము నందు (2) ||హల్లెలూయా|| / దయచేసితివి మోక్ష భాగ్యము నాకు / క్రయమిచ్చితివి నా విమోచనకై (2) ||హల్లెలూయా|| / వెలిగించితివి నా మనోనేత్రములు / తొలగించితివి నా పాప చీకటి బ్రతుకు (2) ||హల్లెలూయా||
ఎల్లవేళలందు – కష్టకాలమందు / వల్లభుండా యేసున్ స్తుతింతున్ / ఎల్లను నీవే నా కెల్లెడల / వల్లపడదే వివరింపన్ (2) / విమోచకుడా – విమోచన నీవే / రక్షకుడవు – నా రక్షణ నీవే (2) ||ఎల్లవేళలందు|| / సృష్టికర్తవు – సహాయము నీవే / ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే (2) ||ఎల్లవేళలందు|| / జ్ఞానము నీవే – నా పానము నీవే / దానము నీవే – నా గానము నీవే (2) ||ఎల్లవేళలందు|| / జ్యోతివి నీవే – నా నీతివి నీవే / ఆదియు నీవే – నా అంతము నీవే (2) ||ఎల్లవేళలందు|| / నిత్యుడ నీవే – నా సత్యుండ నీవే / స్తోత్రము నీవే – నా నేత్రము నీవే (2) ||ఎల్లవేళలందు|| / జీవము నీవే – నా దేవుడవు నీవే / పావన నీవే – నా కావలి నీవే (2) ||ఎల్లవేళలందు|| / కాంతియు నీవే – నా శాంతియు నీవే / సంతస నీవే – నాకంతయు నీవే (2) ||ఎల్లవేళలందు||