తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:Songs of Zion

116 songs found|By Alphabet|By Popularity

ప్రభుని గృహము|Prabhuni Gruhamu

ప్రభుని గృహము ఆయన మహిమతో / పరిపూర్ణముగా నిండెను (2) / అపరాధములచే ప్రజలందరును / దేవుని మహిమను కోల్పోయిరి (2) / తన మహిమను మన కిచ్చుటకు (2) / యేసు ప్రభువే బలి యాయెన్ (2) ||ప్రభుని|| / కృపా సత్యములు సంపూర్ణముగా / మన మధ్యలో వసించెను (2) / తండ్రి మహిమను తన సుతునిలో (2) / మనమందరము చూచితిమి (2) ||ప్రభుని|| / ప్రభువు యింటిని నిర్మించు చుండె / సజీవమైన రాళ్ళతో (2) / ఆయన మహిమ దానియందుండ (2) / తన సంకల్పమై యున్నది (2) ||ప్రభుని|| / శాంతిరాజు యిల్లు కట్టుచున్నాడు / మానవ హస్తము అందుండదు (2) / క్రయమునిచ్చి స్థలముకొనెను (2) / తాను కోరిన స్థలమదే (2) ||ప్రభుని|| / ప్రత్యేకపరచిన ఆత్మీయ యింటికి / తన పునాదిని వేసెను (2) / రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా (2) / ప్రభువే సర్వము చేసెను (2) ||ప్రభుని|| / సింహాసనముపై కూర్చున్న ప్రభువే / అణగ ద్రొక్కెను శత్రువును (2) / సంపూర్ణ జయముతో ఆర్భాటముతో (2) / వెలిగించెను తన యింటిని (2) ||ప్రభుని|| / దేవుని యిల్లు ముగించబడగా / పైనుండి అగ్ని దిగివచ్చున్ (2) / దహించబడును సర్వ మలినము (2) / ఇంటిని మహిమతో నింపును (2) ||ప్రభుని||

మేము భయపడము|Memu Bhayapadamu

మేము భయపడము – ఇక మేము భయపడము / ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు (2) ||మేము|| / దైవ భ్రష్టులమైన మమ్ము / దివ్యంపుగా రక్షించే (2) / దీవారాత్రులు దేవుడే కాయును ||మేము|| / శత్రు కోటి మమ్ము జుట్టన్ / పాతాళము మ్రింగ జూడన్ (2) / నిత్యుడు యేసు నిత్యము కాయును ||మేము|| / అగ్ని పరీక్షల యందు / వాగ్ధానమిచ్చె మాతో నుండ (2) / ఏ ఘడియైనను విడువక కాయును ||మేము|| / బలమైన ప్రభు హస్తములు / వలయము వలె మమ్ము జుట్టి (2) / పలు విధములుగా కాపాడు మమ్ము ||మేము|| / కునుకడు మన దేవుడు / యెన్నడు నిద్రించడు (2) / కను పాపగా మము కాపాడునెప్పుడు ||మేము|| / జీవిత కష్ట నష్టములు / ఆవరించి దుఃఖపరచ (2) / దేవుడొసంగిన ఈవుల నెంచుచు ||మేము|| / ఇహమందు మన శ్రమలన్ని / మహిమకు మార్చెడు ప్రభున్ (2) / మహిమపరచి మ్రొక్కెదములలో ||మేము||

హల్లెలూయా యేసు ప్రభున్|Hallelooya Yesu Prabhun

హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి / వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి / బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి / ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి / రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ / హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి / తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి / పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి / బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి / నిరంతరము మారని యేసుని స్తుతియించుడి ||రాజుల|| / సూర్య చంద్రులారా ఇల దేవుని స్తుతియించుడి / హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి / అగ్నివడగండ్లార మీరు కర్తను స్తుతియించుడి / హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి ||రాజుల|| / యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి / జీవితమున్ ప్రభుపనికై సమర్పించి స్తుతియించుడి / పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి / ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి ||రాజుల|| / అగాథమైన జలములారా దేవుని స్తుతియించుడి / అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి / దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి / పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి ||రాజుల||

ప్రభువా నీ పరిపూర్ణత నుండి|Prabhuvaa Nee Paripoornatha Nundi

ప్రభువా నీ పరిపూర్ణత నుండి / పొందితిమి కృప వెంబడి కృపను / ప్రభువైన యేసు క్రీస్తు – పరలోక విషయములో / ప్రతి ఆశీర్వాదమును – ప్రసాదించితివి మాకు ||ప్రభువా|| / జనకా నీ-వెన్నుకొనిన – జనుల క్షేమము జూచి / సంతోషించునట్లు – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా|| / నీదు స్వాస్థ్యమైనట్టి – నీ ప్రజలతో కలిసి / కొనియాడునట్లుగా – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా|| / దేవా నీదు స్వరూప – దివ్య దర్శనమును / దినదినము నాకొసగి – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా|| / మీ మధ్యన నా ఆత్మ – ఉన్నది భయపడకు / డనిన మహోన్నతుడా – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా|| / ముదమారా నన్నెన్నుకొని – ముద్ర యుంగరముగను / చేతుననిన ప్రభువా – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా|| / కృపా సత్య సమ్మిళిత – సంపూర్ణ స్వరూప / హల్లెలూయా నీకే ప్రభో – ఎల్లప్పుడూ కలుగుగాక ||ప్రభువా||

యవ్వనులారా మీరు|Yavvanulaaraa Meeru

యవ్వనులారా మీరు – ప్రభు నొద్దకు రండి / సమృద్ధియైన జీవము నొందుటకు – (2) / ఆహాహా హల్లెలూయా – (6) / ప్రభు యేసు మన కొరకు / సిలువపై బలియాయెను (2) / మీ పాపమునొప్పుకొనిన (2) / క్షమియించి నూతన జీవమునిచ్చున్ (2) ||ఆహాహా|| / ప్రభు యేసుని స్వరమును వినుచు / ఆ ప్రభుని వెంబడించిన (2) / కాపాడును దుష్టుని నుండి (2) / నడిపించు నిన్ను అంతము వరకు (2) ||ఆహాహా|| / చేపట్టి జీవ వాక్యము / జ్యోతుల వలె ఇహమందున (2) / ప్రభు కొరకు ప్రకాశించుచు (2) / ప్రకటింతురు ప్రభు యేసుని సువార్తను (2) ||ఆహాహా|| / నిజ ఆహారా పానీయం / ప్రభు యేసు క్రీస్తే కాగా (2) / ఆయననే తిని త్రాగుచూ (2) / ఆ జీవముతో మనము జీవించెదము (2) ||ఆహాహా|| / మృతి నొందిన మనమందరము / పై వాటినే వెంటాడెదం (2) / మన జీవము వృద్ధి నొందుచూ (2) / ప్రభు యేసుని మహిమను పొందెదము (2) ||యవ్వనులారా||

స్వఛ్చంద సీయోను వాసి|Swachchandha Seeyonu Vaasi

స్వఛ్చంద సీయోను వాసి / సర్వాధికారి – కస్తూరి పూరాసి (2) / వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి (2) / అల్ఫా ఒమేగ తానే (2) / ఆద్యంతము మన యేసే (2) ||స్వఛ్చంద|| / ఇదిగో నేనొక నిబంధనను / అద్భుతముగ జేతున్ – నీ ప్రజలందరి యెదుట (2) / పరిశోధింపజాలని మహా – పనులెల్ల ప్రభువే (2) / లెక్క లేని యద్భుతముల్ (2) / మక్కువతో చేయువాడు (2) ||స్వఛ్చంద|| / సంగీతం నాదముల తోడ / సీయోను పురము – సొంపుగను చేరితిమి (2) / శాశ్వత సంతోషము మా – శిరములపై వెలసెన్ (2) / దుఃఖము నిట్టూర్పును పోయెన్ (2) / మిక్కిలి ఆనందము కల్గెన్ (2) ||స్వఛ్చంద|| / నీలముల పునాదులు వేసి / నీలాంజనములతో – మాణిక్య మణులతో (2) / సువర్ణ శునీయముల – సూర్య కాంతముతో (2) / ప్రశస్త రత్నములతో (2) / ప్రవిమలముగా నిను గట్టెదను (2) ||స్వఛ్చంద|| / సుమముల హారము / సంతోషానంద తైలము నీదే – స్తుతి వస్త్రమును నీదే (2) / ఉల్లాస వస్త్రంబు నీదే – విడుదలయి నీదే (2) / హిత వత్సరము విముక్తి (2) / ఆత్మాభిషేకము నీదే (2) ||స్వఛ్చంద|| / జలములలో బడి దాటునప్పుడు / బలమై యుండెదను – నీ తోడై యుండెదను (2) / నదులలో వెళ్లునప్పుడు – నీపై పారవు (2) / అగ్ని మధ్యను నడచినను (2) / జ్వాలలు నిను కాల్చగ లేవు (2) ||స్వఛ్చంద|| / ఇత్తడి తలుపుల బగుల గొట్టెద / నినుప ఘడియలను – విడగొట్టెదను నేను (2) / అంధకార స్థలములలో ను-న్నట్టి నిధులను (2) / రహస్యములో మరుగైన (2) / ధనమును నీ కొసంగెదను (2) ||స్వఛ్చంద|| / గర్భమున పుట్టినది మొదలు / తల్లి యొడిలోన – కూర్చుండినది మొదలు (2) / నేను చంక బెట్టుకొన్న – నాదు ప్రజలారా (2) / ముదిమి వచ్చుఁ వరకు నిన్ను (2) / ఎత్తుకొను వాడను నేనే (2) ||స్వఛ్చంద||

అంతా నా మేలుకే|Anthaa naa meluke

నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ / నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) / అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే / అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే / తన చిత్తమునకు తల వంచితే / ఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2) / స్తుతియించుట మానను / కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా / స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా (2) / మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2) / మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా|| / ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా / ఊపిరి భరువైనా – గుండెలే పగిలినా (2) / యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను (2) / ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక (2) ||అంతా|| / అవమానం ఎంతైనా – నా వారే కాదన్నా / నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2) / నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు (2) / నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు (2) ||అంతా|| / ఆశలే సమాధియైనా – వ్యాధి బాధ వెల్లువైనా / అధికారం కొప్పుకొని – రక్షణకై ఆనందింతును (2) / నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగా ఓ నాథా (2) / పూర్ణ శాంతి నే పొంది – నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా|| / చదువులే రాకున్నా – ఓటమి పాలైనా / ఉద్యోగం లేకున్నా – భూమికే భరువైనా (2) / నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు (2) / నీవుద్దేశించినది – నిశ్ఫలము కానేరదు (2) ||అంతా|| / సంకల్పన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు / సమస్తము సమకూడి – మేలుకై జరుగును (2) / యేసుని సారూప్యము – నేను పొందాలని (2) / అనుమతించిన ఈ – విలువైన సిలువకై (2) ||అంతా|| / నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు / ఇక మీదట నేను – తెలిసికొందును (2) / ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే (2) / అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే (2) ||అంతా||