ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
116 songs found|By Alphabet|By Popularity
ఆనందముగా యెహోవా నీ కృపలన్ని / అన్ని కాలంబులందు కీర్తించెదన్ (2) / చావు గోతినుండి లెవనెత్తి నాకు – జీవమిచ్చిన జీవ దాత / వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో / సవ్యంబుగా ఈ భువియందున ||ఆనందముగా|| / సింహపు పిల్లలు – ఆకలిగొనిన- యెహొవ సహాయుడందరికి / ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు / అహా\! ఏమందు నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా|| / ఎన్నెన్నో శోధన బాధలు రేగి – నన్ను కృంగదీయ పోరాడినన్ / ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన / కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ ||ఆనందముగా|| / పర్వతంబులు – పారిపోయినను- ఉర్విలోమార్పు కలిగిననూ / తరుణములు విరోధముగపై లేచినా – / స్మరియించెద నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా||
స్తుతియు మహిమ ఘనత నీకే / యుగయుగముల వరకు / ఎంతో నమ్మదగిన దేవా (2) ||స్తుతియు|| / మా దేవుడవై మాకిచ్చితివి / ఎంతో గొప్ప శుభ దినము (2) / మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2) / కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2) ||స్తుతియు|| / నీవొక్కడవే గొప్ప దేవుడవు / ఘనకార్యములు చేయుదువు (2) / నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2) / నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2) ||స్తుతియు|| / నీవే మాకు పరమ ప్రభుడవై / నీ చిత్తము నెరవేర్చితివి (2) / జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా (2) / నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను (2) ||స్తుతియు|| / భరియించితివి శ్రమలు నిందలు / ఓర్చితివన్ని మా కొరకు (2) / మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ (2) / పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము (2) ||స్తుతియు||
ప్రియ యేసు రాజును నే చూచిన చాలు / మహిమలో నేనాయనతో ఉంటే చాలు (2) / నిత్యమైన మోక్షగృహము నందు చేరి / భక్తుల గుంపులో హర్షించిన చాలు (2) ||ప్రియ యేసు|| / యేసుని రక్తమందు కడుగబడి / వాక్యంచే నిత్యం భద్రపరచబడి (2) / నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను (2) / బంగారు వీదులలో తిరిగెదను (2) ||ప్రియ యేసు|| / ముండ్ల మకుటంబైన తలను జూచి / స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ (2) / కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి (2) / ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ (2) ||ప్రియ యేసు|| / హృదయము స్తుతులతో నింపబడెను / నా భాగ్య గృహమును స్మరించుచు (2) / హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (2) / వర్ణింప నా నాలుక చాలదయ్యా (2) ||ప్రియ యేసు|| / ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో / ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో (2) / తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో (2) / ఆశతో వేచియుండే నా హృదయం (2) ||ప్రియ యేసు||
ప్రియ యేసు నిర్మించితివి / ప్రియమార నా హృదయం / ముదమార వసియించునా / హృదయాంతరంగమున / నీ రక్త ప్రభావమున / నా రోత హృదయంబును (2) / పవిత్రపరచుము తండ్రి / ప్రతి పాపమును కడిగి (2) ||ప్రియ యేసు|| / అజాగరూకుడనైతి / నిజాశ్రయమును విడచి (2) / కరుణారసముతో నాకై / కనిపెట్టితివి తండ్రి (2) ||ప్రియ యేసు|| / వికసించె విశ్వాసంబు / వాక్యంబును చదువగనే (2) / చేరితి నీదు దారి / కోరి నడిపించుము (2) ||ప్రియ యేసు|| / ప్రతి చోట నీ సాక్షిగా / ప్రభువా నేనుండునట్లు (2) / ఆత్మాభిషేకమునిమ్ము / ఆత్మీయ రూపుండా (2) ||ప్రియ యేసు||
పొందితిని నేను ప్రభువా నీ నుండి / ప్రతి శ్రేష్ట ఈవులన్ ఈ భువియందు (2) / జీవిత యాత్రలో సాగి వచ్చితిని (2) / ఇంత వరకు నాకు తోడై యుండి (2) / ఎబినేజరువై యున్న ఓ యేసు ప్రభువా (2) / నా రక్షణ కర్తవు నీవైతివి (2) ||పొందితిని|| / గాలి తుఫానులలోనుండి వచ్చితిని (2) / అంధకార శక్తుల ప్రభావమునుండి (2) / నీ రెక్కల చాటున నను దాచితివయ్యా (2) / నీవే ఆశ్రయ దుర్గంబైతివి (2) ||పొందితిని|| / కష్ట దుఖంబులు నాకు కలుగగా (2) / నను చేరదీసి ఓదార్చితివే (2) / భయ భీతి నిరాశల యందున ప్రభువా (2) / బహుగా ధైర్యంబు నాకొసగితివి (2) ||పొందితిని|| / నా దేహమందున ముళ్ళు నుంచితివి (2) / సాతానుని దూతగా నలుగ గొట్టన్ (2) / వ్యాధి బాధలు బలహీనతలందు (2) / నీ కృపను నాకు దయచేసితివి (2) ||పొందితిని|| / నీ ప్రేమ చేత ధన్యుడనైతిని (2) / కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను (2) / కష్ట పరీక్షలయందు నా ప్రభువా (2) / జయజీవితము నాకు నేర్పించితివి (2) ||పొందితిని||
నా ప్రాణప్రియుడా యేసురాజా / అర్పింతును నా హృదయార్పణ / విరిగి నలిగిన ఆత్మతోను / హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా / అద్భుతకరుడా ఆలోచన / ఆశ్చర్య సమాధాన ప్రభువా / బలవంతుడా బహుప్రియుడా / మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ ||నా ప్రాణ|| / విమోచన గానములతో / సౌందర్య ప్రేమ స్తుతులతో / నమస్కరించి ఆరాధింతున్ / హర్షింతును నే పాడెదను నా ప్రభువా ||నా ప్రాణ|| / గర్భమున పుట్టిన బిడ్డలన్ / కరుణింపక తల్లి మరచునా / మరచినగాని నీవెన్నడు / మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా ||నా ప్రాణ|| / రక్షణాలంకారములను / అక్షయమగు నీ యాహారమున్ / రక్షకుడా నాకొసగితివి / దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును ||నా ప్రాణ|| / నీ నీతిని నీ రక్షణను / నా పెదవులు ప్రకటించును / కృతజ్ఞతా స్తుతులతోడ / నీ ప్రేమను నే వివరింతును విమోచకా ||నా ప్రాణ|| / వాగ్ధానముల్ నాలో నెరవేరెను / విమోచించి నాకిచ్చితివే / పాడెదను ప్రహర్షింతును / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||నా ప్రాణ||
నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్ / నీ రక్తమే నా బలము (2) / నీ రక్త ధారలే ఇల / పాపికాశ్రయంబిచ్చును (2) / పరిశుద్ధ తండ్రి పాపిని / కడిగి పవిత్ర పరచుము (2) ||నీ రక్తమే|| / నశించు వారికి నీ సిలువ / వెర్రితనముగ నున్నది (2) / రక్షింపబడుచున్న పాపికి / దేవుని శక్తియై యున్నది (2) ||నీ రక్తమే|| / నీ సిల్వలో కార్చినట్టి / విలువైన రక్తముచే (2) / పాప విముక్తి చేసితివి / పరిశుద్ధ దేవ తనయుడా (2) ||నీ రక్తమే|| / పంది వలె పొర్లిన నన్ను / కుక్క వలె తిరిగిన నన్ను (2) / ప్రేమతో చేర్చుకొంటివి / ప్రేమార్హ నీకే స్తోత్రము (2) ||నీ రక్తమే|| / నన్ను వెంబడించు సైతానున్ / నన్ను బెదరించు సైతానున్ (2) / దునుమాడేది నీ రక్తమే / దహించేది నీ రక్తమే (2) ||నీ రక్తమే|| / స్తుతి మహిమ ఘనతయు / యుగయుగంబులకును (2) / స్తుతి పాత్ర నీకే చెల్లును / స్తోత్రార్హుడా నీకే తగును (2) ||నీ రక్తమే||
హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2) / అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2) / ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| / వాగ్ధానములనిచ్చి / నెరవేర్చువాడవు నీవే (2) / నమ్మకమైన దేవా / నన్ను కాపాడువాడవు నీవే (2) / ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| / ఎందరు నిను చూచిరో / వారికి వెలుగు కల్గెన్ (2) / ప్రభువా నీ వెలుగొందితిన్ / నా జీవంపు జ్యోతివి నీవే (2) / ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| / కష్టములన్నింటిని / ప్రియముగా భరియింతును (2) / నీ కొరకే జీవింతును / నా జీవంపు దాతవు నీవే (2) / ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||