ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
2 songs found|By Alphabet|By Popularity
మాకు తోడుగ నీవుంటివి / జీవిత యాత్రలో (2) / మమ్ము విడువని మా దేవా / నిండు మనస్సుతో వెంబడించెదం (2) ||మాకు|| / మాతో కూడా ఉందునంటివి / మారని మా దేవా (2) / పరము చేరు వరకు దేవా / మమ్ము నడిపెదవు (2) ||మమ్ము విడువని|| / శత్రువు మాపై చెలరేగగా / కృంగదీయ జూడగా (2) / యెహోవా నిస్సిగా మాకుండి / విజయమిచ్చితివే (2) ||మమ్ము విడువని|| / కష్టములెన్నెన్నో ఎదురైనా / నిన్నే వెంబడింతుము (2) / మాకు తోడుగా నీవుండగా / మేము భయపడము (2) ||మమ్ము విడువని||
దొరకును సమస్తము యేసు పాదాల చెంత / వెదకినా దొరుకును యేసు పాదాల చెంత (2) / యేసయ్యా యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా / యేసయ్యా యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా ||దొరకును|| / మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి / కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి (2) / పాదాలను ముద్దు పెట్టుకొని / పూసెను విలువైన అత్తరు (2) / చేసెను శ్రేష్టారాధన / దొరికెను పాప క్షమాపణ (2) ||దొరకును|| / యాయేరు అను అధికారి యేసు పాదాలను చేరి / బ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి (2) / చిన్నదాన లెమ్మని చెప్పి / బ్రతికించెను యేసు దేవుడు (2) / కలిగెను మహదానందం / దొరికెను రక్షణ భాగ్యము (2) ||దొరకును|| / పత్మాసు దీపమున యోహాను యేసుని చూచి / పాదాలపై పడెను పరవశుడై యుండెను (2) / పరలోక దర్శనం / చూచెను తానే స్వయముగా (2) / దొరికెను ప్రభు ముఖ దర్శనం / దొరికెను ఇల మహా భాగ్యం (2) ||దొరకును||