ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
27 songs found|By Alphabet|By Popularity
యేసు రాజ్యమునకు సైనికులం / పరమునకు మనమే వారసులం (2) / ప్రేమ పంచిన దేవుని శిష్యులం / ఎదురు బెదురూ ఎరుగని వారలం (2) / కారు చీకటి కమ్మిన లోకము / కాదు మన ప్రభువుకు సమ్మతము / ఆత్మలు నశియించుట ఘోరము / వారి రక్షణయే మన భారము (2) / వెలుగే మనమని సెలవిచ్ఛేనని / అప్పగించిన పని జరిగింతుము (2) ||ప్రేమ పంచిన|| / వలదు నీ మదిలో సందేహము / ప్రభువే పెంచునుగా నీ జ్ఞానము / తగిన రీతి తలాంతులు నొసగును / నిన్ను అద్భుత పాత్రగా మలచును (2) / నీకు భారము మదిలో మెదిలితే / ప్రభువే మార్గము చేయును సరళము (2) ||ప్రేమ పంచిన|| / నీవు పొందిన సువార్త ఫలము / ఇతరులకు పంచుటయే ఘనము / సాక్ష్యమును చాటించే ధైర్యము / లోకమునకు చూపించును నిజము (2) / కోత ఎంతగ ఉంది విరివిగా / కోయుదాము ప్రభు పనివారుగా (2) ||ప్రేమ పంచిన||
ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా / ప్రభువు నామములో సాగే అనుబంధమా / ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా / ఓ కంట కన్నీరు తగదు సహవాసమా / ప్రతి కష్టము మనము పంచుకుందాము / కలిసి అందరము వేడుకుందాము (2) ||ఓ క్రీస్తు|| / మనమంతా కలిసి ఆ దేవుని దేహము / తండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము (2) / ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదన / ఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ (2) ||ప్రతి కష్టము|| / సాటి సోదరులు శ్రమల పాలైనపుడు / సాతాను శక్తులచే శోధింపబడినపుడు (2) / ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలి / ఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి (2) ||ప్రతి కష్టము|| / శ్రమలు పొందేవారు అవిధేయులు కారు / విశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు (2) / శాంతమును పాటించి, దేవునిలో వీక్షించి / పంచాలి ఓదార్పు వదిలేసి మన తీర్పు (2) ||ప్రతి కష్టము||
ఎంతెంత భారమాయె ఆ సిలువ / లోక పాపములన్ని నువ్వు గెలువ (2) / కదిలినావు ఆ కల్వరికి / మరణముని దరి చేర్చుకొని (2) / యేసయ్యా… నా యేసయ్యా… / అలసిపోతివ నా యేసయ్యా… (2) / కొరడాలు నీ ఒళ్ళు చీల్చేను / పిడి గుద్దులతో కళ్ళు తిరిగెను (2) / వడి ముళ్ళు తలలోన నాటేను / నీ కళ్ళు రుధిరాన్ని కురిసెను (2) ||యేసయ్యా|| / బరువైన సిలువను మోయలేక / తడబడె నీ అడుగు అదిరిపడి (2) / వడివడిగా నిన్ను నడువుమని / పడి పడి తన్నిరి ఆ పాపులు (2) ||యేసయ్యా|| / చల్లని నీ దేహమల్లాడెను / ఏ చోటు లేకుండ గాయాలతో (2) / కాళ్ళు చేతులకు దిగి మేకులు / వ్రేళాడే సిలువకు నీ ప్రాణము (2) ||యేసయ్యా|| / వెలలేనిది తండ్రి నీ త్యాగము / నీ కష్టమంతయు నా పాపము (2) / మదిలోన కొలువుండు నా రక్షకా / వదిలేది లేదు నిన్ను నా పాలిక (2) ||యేసయ్యా||