తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:Sayaram Gattu

27 songs found|By Alphabet|By Popularity

సరిపోదు ఆరాధన|Saripodu Aaraadhana

నిరతము నిను స్తుతియించినా / దేవా – సరిపోదు ఆరాధన / ప్రతి క్షణము కీర్తించినా / ప్రభువా – నీ కృపలకు సరితూగునా (2) / ఆరాధన స్తుతి ఆరాధన / ఆరాధన నికే ఆరాధన (2) ||నిరతము|| / ప్రభువా యెహోవా రాఫా నీవే / నా స్వస్థతలు అన్ని నీవే నీవే / దేవా యెహోవా నిస్సి నీవే / నా విజయాల అధిపతి నీవే నీవే (2) ||ఆరాధన|| / ప్రేమించే శ్రీమంతుడవు నీవే దేవా / కోపానికి కాలయాపన నీదే ప్రభువా / నాకున్న ఈ విశ్వాసం నీదే కాదా / నీ తోడు ఉంటే నా దరి రాదు ఏ భాధ (2) ||ఆరాధన|| / నా గతము రద్దు చేసిన నాదు దేవా / నా రేపును నడిపించేది నీవే ప్రభువా / నీ స్తుతికి ఆలస్యం చేయను నా ప్రభువా / నా స్థితిని ఎన్నటికి మరువను నా దేవా (2) ||ఆరాధన||

తూరుపు దిక్కున|Thoorupu Dikkuna Chukka Butte

తూరుపు దిక్కున చుక్క బుట్టె / దూతలు పాటలు పాడ వచ్చె (2) / చలి మంట లేకుండా ఎలుగే పుట్టె (2) / చల్లని రాతిరి కబురే తెచ్చె (2) / పుట్టినాడంట యేసునాథుడు / పాపములు తీసే పరమాత్ముడు (2) ||తూరుపు|| / గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి / కొలిచినారు తనకు కానుకలిచ్చి / పశుల పాక మనము చేరుదాము / కాపరిని కలిసి వేడుదాము (2) ||పుట్టినాడంట|| / చిన్నా పెద్దా తనకు తేడా లేదు / పేదా ధనికా ఎప్పుడూ చూడబోడు / తానొక్కడే అందరికీ రక్షకుడు / మొదలు నుండి ఎప్పుడూ ఉన్నవాడు (2) ||పుట్టినాడంట|| / మంచి చెడ్డా ఎన్నడు ఎంచబోడు / చెడ్డ వాళ్లకు కూడా బహు మంచోడు / నమ్మి నీవు యేసును అడిగి చూడు / తన ప్రేమను నీకు అందిస్తాడు (2) ||పుట్టినాడంట||

అందాల బాలుడు|Andaala Baaludu

అందాల బాలుడు ఉదయించినాడు / లోకాలు వెలిగించు నీతి సూరీడు (2) / రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను / ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2) ||అందాల|| / భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి / ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2) / గొల్లలము మేము కల్లలు ఎరుగము (2) / కళ్లారా జూసాము తేజోమయుని మోము (2) ||రండయ్యో|| / తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి / లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము (2) / దారి చూపే తార రారాజునే జేర (2) / మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా (2) ||రండయ్యో|| / తనలోని వెలుగంత పంచేటి పావనుడు / మనలోని పాపమంత తీసేయు రక్షకుడు (2) / చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు (2) / నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు (2) ||రండయ్యో||

ఈ మరణము కాదు|Ee Maranamu Kaadu

ఈ మరణము కాదు శాశ్వతము / పరలోకమే మనకు నివాసము (2) / యేసు తెచ్చెను మనకు రక్షణ / ఎంత అద్బుతము ఆ నిరీక్షణ (2) ॥ఈ మరణము॥ / జగతు పునాది వేయక ముందే / మనమెవ్వరో ఎవరికి తెలియక ముందే (2) / మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు / తిరిగి తన దరికి మనల పిలిచే వేళ (2) / తిరిగి తన దరికి మనల పిలిచే వేళ ॥ఈ మరణము॥ / యేసు నామమును ఎరిగిన వారు / పాప శ్రమలకు అర్హులు కారు (2) / తిరిగి లేచెదరు యేసు నామములో / కొలువు తీరెదరు పరలోకంలో (2) / కొలువు తీరెదరు పరలోకంలో ॥ఈ మరణము॥ / కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును / మరణము మబ్బులను కరిగించును (2) / వేదనలు రోదనలు రద్దు చేయును / గతకాల సంగతులు గతించి పోవును (2) / గతకాల సంగతులు గతించి పోవును ॥ఈ మరణము॥

కొంత యెడము నీవైనా|Kontha Yedamu Neevainaa

కొంత యెడము నీవైనా నే సాగలేను / నిమిషమైన నిన్ను విడిచి నే బ్రతుకలేను / కొంత యెడము నీవైనా / మరచిన వేళలో మది నీ పలుకులు / సడలి కట్టడలు మలినము తలపులు (2) / ప్రేమను పంచే ప్రేమ రూపుడా (2) / మరియొక్క మారు మన్నించు విభుడా (2) ||కొంత యెడము|| / కనులకు మోహము కమ్మిన క్షణము / వినుట మరచె నీ స్వరమును హృదయము (2) / కమ్మిన పొరలు కరిగించుటకు (2) / నడుపు నీ వైపుకు హృది వెలుగుటకు (2) ||కొంత యెడము|| / మదము, మత్సరములు సోకిన తరుణము / పాశము, ప్రేమకు విగతము ప్రాప్తము (2) / నిరతము స్థిరముగ నున్న అక్షయుడా (2) / నిలుపుము నీ కృపలో నన్ను రక్షకుడా (2) ||కొంత యెడము|| / మనుజ రూపమున మహిలో నిలిచి / మనిషి-కసాధ్యమౌ మరణము గెలిచి (2) / నను వరియించగ రానున్న ప్రియుడా (2) / నిన్నెదురుకొనగ మతి నియ్యు వరుడా (2) ||కొంత యెడము||

దేవా ఇలలోన నీవు|Devaa Ilalona Neevu

దేవా ఇలలోన నీవు మాకిచ్చిన గృహము / మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము (2) / మా యజమానివి నీవై మమ్ములను నడిపించు / నీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు (2) / వందనములు అందుకో మా యేసయ్యా / కలకాలం నీ కాపుదలే కావాలయ్యా (2) ||దేవా|| / నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా / పరిచర్య చేయు సమయము ఏ గృహము నీకుందయ్యా (2) / ఆ ఒలీవల కొండలలోనే తల దాచిన యేసయ్యా / నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా ||వందనములు|| / నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయా / నీ నీడలో మే సాగుటకు మా గృహమును కట్టుమయా (2) / శోధన వేదనలెదిరించే బలమును అందించుమయ్యా / నీ కృపలను చాటించేటి సాక్ష్యములతో నింపుమయ్యా ||వందనములు|| / నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి / నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి (2) / సమాధాన కర్తవు నీవై మా తోడుగా నీవుండాలి / కలిమిలేమిలందు సైతం నీ మార్గములో సాగాలి ||వందనములు||

సుందరములు|Sundaramulu

సుందరములు అతి సుందరములు / సువార్త మోసిన పాదములు / అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు / ప్రభు ప్రేమను చాటిన పెదవులు (2) / ఏ లేమికి కలత చెందరు – ఏ నలతకు తలలు వంచరు / ప్రభు సేవలో ధీరులు వీరు – తన చిత్తము ఎరిగిన వారు (2) / యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు / జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు (2) / తమ సిలువను ఎత్తుకొని – ప్రభు బోధను పాటించారు / ప్రభు చిత్తము నెరవేర్చి – తన సన్నిధినే చేరారు (2) ||ఏ లేమికి|| / లోకము చీకటి బాపుటకు వెలుగులు వెదజల్లిన వారు / తమ పాదాలకు ప్రభు వాక్యము దీపముగా వెలిగించారు (2) / తమ దేహము యాగముగా – శోధనలు జయించినారు / తమ సాక్ష్యము పెంచుకొని – ప్రభు రక్షణను పంచారు (2) ||ఏ లేమికి||

మరువని నీదు ప్రేమతో|Maruvani Needu Prematho

మరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగా / విడువని స్నేహ బంధమై నడిచితివే నా తోడుగా (2) / ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా / పొందుకున్న మేలులన్ని నీదు ఎన్నిక ఫలితమేగా (2) ||మరువని|| / కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపె / వెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపె (2) / పాడెదను నూతన గీతములు ఎల్లవేళల స్తుతిగానములు / ఘనత మహిమ ఆరోపణము నాదు జీవితమే అర్పితము (2) ||మరువని|| / నిన్న నేడు ఎన్నడైనా మారిపోని మనసు నీది / తల్లి మరచినా మరచి పోక కాపు కాసే ప్రేమ నీది (2) / పొందుకున్న జన్మ దినము నీవు ఇచ్చే దయా కిరీటము / నీవు ఇచ్ఛే వాగ్ధానాలు చేయు అధికము బ్రతుకు దినములు (2) ||మరువని||

దేవుడే ఇల చేరేటందుకు|Devude Ila Cheretanduku

దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం / అమ్మా అంటూ పిలుచుకొని పొందుకొనెను జన్మం / నీకంటూ ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగం / కనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం (2) / అమ్మా నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలో / ఆ దైవము సైతము నేర్చె పాఠాలు చల్లని నీ ఒడిలో (2) ||దేవుడే|| / కన్న బిడ్డను పరాయి బిడ్డగా పెంచుకున్న మమకారం / తన ప్రజల విముక్తికి దేవుడు చేసిన కార్యంలో సహకారం (2) / మోషేగా మారిన పసివాడిని / దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం (2) / దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం ||అమ్మా|| / సంతతి లేక సవతి పోరుతో విసిగినట్టి దీనత్వం / దేవుని సన్నిధి హృదయము పరచి పొందుకొనెను మాతృత్వం (2) / హన్నా చేసిన ఆ త్యాగమే కాదా / సమూయేలు పొందిన న్యాయాధిపత్యము (2) / సమూయేలు పొందిన న్యాయాధిపత్యము ||అమ్మా|| / కొన ఊపిరితో సిలువపైన వేళాడుతున్న క్షణము / ఆ దేవ దేవుడు తీర్చుకొనెను తన మాతృమూర్తి ఋణము (2) / ప్రియ శిష్యుని దరికి తల్లిని చేర్చి / నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం (2) / నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం ||అమ్మా||

మోయలేని భారమంత|Moyaleni Bhaaramantha

మోయలేని భారమంత సిలువలో మోసావు / నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు (2) / అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు / మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు / నాదు గతిని మార్చావు – (2) / కడలి పై నడిచిన పాదాలు / సిలువ బరువుకు తడబడి పోయే / స్వస్థతలు చూపిన హస్తములు / సిలువలో శీలలతో వ్రేళాడే (2) / ఇంత ఘోరము మోపిన నేరము / నేను చేసిన పాప భారము (2) || మోయలేని || / జయము నీకని పలికిన జనము / మహిమ ఏదని నిను నిలదీసిరి / పాపములు క్షమియించిన నిన్ను / పాపివని పలుమారులు తెలిపిరి (2) / తాకినంతనే మహిమ నొసగిన / నీదు వస్త్రము చీట్ల పరము (2) || మోయలేని || / దైవ సుతుడవు అయినా గాని / దొంగలతో దోషిగా నిను చేర్చిరి / మధుర వాక్యము నేర్పిన నోటికి / చేదు చిరకతో దాహము తీర్చిరి (2) / ఇంత జరిగిన ఎంత కరుణ / వదలవేమయ నీ క్షమాపణ (2) || మోయలేని ||

కరుణ చూపించుమా|Karuna Choopinchumaa

కరుణ చూపించుమా – యేసయ్య కన్నీరు తుడవగా / మహిమ కురిపించుమా – యేసయ్య స్వస్థతలు చూపగా (2) / నీ ప్రజలము అయిన మేము – మృత్యువు కోరలో చిక్కాము / ఏ దారియు కానరాక – నశియించి పోతున్నాము (2) / కరుణగల దేవుడు నీవు / కరుణించి కాపాడుమా (2) ||కరుణ|| / ఐగుప్తులో పది తెగుల్లలో – నీ ప్రజలను కాపాడితివి / గొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి – మృత్యువాత తప్పించితివి (2) / నీ నామము మదిలో నిలిపి – ఈ ఆపదలో వేడాము / నీ మహిమను తిరిగి చూడగా – నీ సన్నిధిలో చేరాము (2) ||కరుణగల|| / ఇశ్రాయేలు వారిగ మేము – నీ ఉనికిని ప్రశ్నించాము / నీ ప్రేమను రుచి చూసిననూ – మారాను కురిపించాము (2) / చెలరేగే సర్పము కాటు – మములను కబళించే వేళ / మాకు దిక్కు నీవేనంటూ – మోకరించి నిను వేడితిమి (2) ||కరుణగల|| / మరణమునే జయించి నీవు – సజీవుడిగా నిలిచావు / నిన్ను నమ్మి వేడిన చాలు – మా తప్పులు మరిచావు (2) / నేను జీవించితి గనుక – మీరును జీవించెదరన్న / వాగ్దానము నమ్మితిమయ్యా – నెరవేర్చుము మా యేసయ్య (2) ||కరుణగల||